ఆర్టీసీ కథలు 3 - పొరపాటే - Kodali sitarama rao

RTC Kathalu.3 Porapate

ఆర్టీసీ కధలు 3 పొరబాటే -కొడాలి సీతారామా రావు ఆర్టీసీ కండక్టర్లు తమ డ్యూటీలో ప్రయాణీకుల నించి,ఇతరత్రా వసూలు చేసిన డబ్బులు డిపోలో జమ చేస్తారు తమ డ్యూటీ ముగిసాక. వసూలు అయిన సొమ్ములోంచి టోల్ గేట్లుకి చెల్లించిన సొమ్ము, పోలీసులు ప్రయాణించిన వారంట్ల ( ఆర్టీసీ బస్సులలో పోలీసులు వారంట్ల సాయంతో ప్రయాణిస్తారు. వాటికి టికెట్లు ఇస్తారు. కానీ డబ్బులు నెలకోసారి పోలీసు శాఖవారు చెల్లిస్తారు.) విలువ తగ్గించి జమ చేస్తారు.ఆ వివరాలన్నీ తన వే బిల్లులో చూపిస్తారు. అసిస్టెంట్ డిపో క్లర్క్ ఆ వివరాలు సరిచూసుకుని ఆ డబ్బులు తీసుకుని తన దగ్గిర ఒక స్టేట్ మెంటులో రాసి డిపో క్లర్కుకి జమ చేస్తాడు. అతను మరునాడు అందరు కండక్టర్ల నించీ వచ్చిన సొమ్ము బేంకులో జమ చేస్తాడు తన దగ్గిర వివరాలు రాసుకుని. ప్రతి రోజూ వే బిల్ల్సుని డిపోలోని అక్కౌంట్స్ సెక్షన్ కి పంపుతాడు. వారు కూడా వాటిలోని ఆదాయ,వ్యయాలని వేరు వేరుగా రాసుకుని వే బిల్లులని ఆడిట్ ఆఫీసుకు పంపుతారు. అలా అందుకున్న వే బిల్లులని ఒకరోజు డిపో అక్కౌంటెంట్ రఘుపతి తనిఖీ చేస్తున్నాడు.

ఒక కండక్టర్ టోల్ గేట్ రసీదుని రెండుసార్లు తగ్గించి చూపాడు. అంటే అతను ఆ విలువని వాడుకున్నాడు. రఘుపతి ఆ కండక్టర్ అంతకు ముందు వారం రోజులుగా డ్యూటీ చేసిన వే బిల్స్ తెప్పించి చూశాడు. అన్నీ సరిగానే వున్నాయి. అతని పర్సనల్ రికార్డు చూస్తే అతను మరో ఆరు నెలలలో రిటైర్ అవుతాడు. అతనికి సంబంధించి ఎటువంటి రెడ్ రిమార్కు లేదు. అంటే ఇది పొరబాటున జరిగింది అని నిర్ధారించుకున్నాడు రఘుపతి. ఆ ఏ డీ సీని, ఆ కండక్టర్ కృష్ణని పిలిచి అడిగాడు. కంగారు పడ్డారు. పొరబాటు జరిగింది అన్నారు. కండక్టరుని డబ్బులు కట్టేయమని చెప్పాడు జరిగింది వివరంగా రాస్తూ. తరువాత తనో రిపోర్ట్ రాసాడు జరిగింది. డిపో మేనేజరు గారికి ఇచ్చాడు. ఆయన ఆడిట్ ఆఫీసు వారికి తెలియచేస్తూ అతన్ని స్పేరులో వుంచారు. అంటే అతనికి కండక్టర్ డ్యూటీ ఇవ్వరు. డిపోలో వుంటూ చెప్పిన పని చేయాలి. రీజినల్ మేనేజరు గారు డిపో మేనేజరుకి చెప్పారు అతన్ని సస్పెండ్ చేసి రిమూవ్ చేయమని.తప్పని పరిస్థితుల్లో అతన్ని సస్పెండు చేశారు. రెండు రోజుల్లో ఆడిట్ రిపోర్ట్ కూడా వచ్చింది. అతను డ్యూటీ చేసిన ఆరునెలల వే బిల్స్ తనికీ చేసి ఏ పొరబాటు లేదని వచ్చింది. కృష్ణని సస్పెండు చేసి ఎంక్వైరీకి ఇచ్చారు. నెల రోజుల తరువాత ఆ రిపోర్ట్ వచ్చింది. అతను పొరబాటునే తక్కువ డబ్బులు కట్టాడు అని. అతని విషయంలో ఎందువల్లో రీజినల్ మేనేజరుగారు విముఖంగా వున్నారు. ఎలాగైనా అతన్ని రిమూవ్ చేయమని డి ఏం గారిని బలవంత పెడుతున్నారు. నిజానికి ఎటువంటి నిర్ణయమైనా డి ఏం తీసుకోవాలి. కొన్ని కేసుల్లో రిమూవ్ చేయవచ్చు తీవ్రతని బట్టి . కొన్ని సార్లు సస్పెన్షన్ తీసేసి వేరే డిపోకి బదిలీ చేయమనవచ్చు. లేదా అతని ఇంక్రిమెంటు వాయిదా వేయవచ్చు. ఏదైనా డిపో మేనేజరు నిర్ణయమే. ఆ రోజు ఆ కేసు విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు ఉదయం కూడా ఆరెం గారు ఫోన్ చేసి చెప్పారుట రిమూవ్ చేయమని. కానీ డిపో మేనేజరుగారికి సస్పెన్షన్ లిఫ్ట్ చేసి ఆ డిపోలోనే వుద్యోగం ఇవ్వాలని. కారణం అతనికి ఎటువంటి చెడు రిమార్కు లేకపోవటం, ఆరు నెలలో రిటైర్ కాబోవటం. ఆ ఫైల్ ముందు పెట్టుకుని అక్కౌంటెంట్ రఘుపతిని పిలిచి చెప్పారు విషయం. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అడిగారు. నిజానికి అలా చెప్పవలసిన పనిలేదు. తనకి నైతిక మద్దతు వుంటుందని మాత్రమే చెప్పారు. ఆయనే చెప్పారు ఆరెం గారి నిర్ణయానికి విరుధ్ధంగా చేస్తే ఇక ముందు తనని ఇబ్బందులు పెడతాడు అని. రఘుపతి చెప్పాడు ‘మీరు తీసుకోవలనుకున్నదే సరి అయినది.’ వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. కృష్ణని అదే డిపోలో వుంచుతూ, అతని ఇంక్రిమెంటు మూడు నెలలు వాయిదా వేస్తూ. ‘ఆరెం గారు నన్ను ఇబ్బంది పెట్టినా ఫరవాలేదు ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు వుంది.’ అనుకున్నారు డిపో మేనేజరుగారు. గమ్మత్తుగా మరో రెండు రోజులకి ఆరెం గారికి అతని పని తీరు బాగా లేదంటూ నిజామాబాద్ రీజియన్ కి బదిలీ వుత్తర్వులు వచ్చాయి.

మరిన్ని కథలు

Manavatwam parimalinche
మానవత్వం పరిమళించే ....
- డా:సి.హెచ్.ప్రతాప్
Civic sense
సివిక్స్ సెన్స్
- డా:సి.హెచ్.ప్రతాప్
Saraina Empika
సరైన ఎంపిక.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Marina gunde
మారిన గుండె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Mullunu mulluthone
ముల్లును ముల్లుతోనే
- డా:సి.హెచ్.ప్రతాప్