అవంతి రాజ్యంలో న్యాయాధికారి పదవికి ఎంపికలో చివరి పరిక్షగా తన ఎదరుగాఉన్న యువకుని చూస్తూ రాజు గారు " మూడుప్రశ్నలు వేస్తాను తగిన సమాధానం చెప్పగలిగితే న్యాయమూర్తి పదవి నీకే దక్కుతుంది. " మొదటిప్రశ్న నాశరీరమంతా వెంట్రుకలుఉండి నాఅరచేతులలో వెంట్రుకలు ఎందుకులేవో చెప్పగలవా ? "అన్నాడు." ప్రభూ తమరు బాల్యంనుండి అంటే యువరాజుగా దానధర్మాలు విపరీతంగా రెండుచేతులతో చేయడం వలన ఆఒరిపిడికి తమఅరచేతుల్లొని వెంట్రుకలు పూర్తిగారాలిపొయ్యాయి " అన్నాడు ఆయువకుడు. "భేష్ తెలివైనవాడవే నాకు దానంచేయడం వలన అరచేతిలో వెంట్రుకలు రాలిపోయ్యాయి. మరినీఅరచేతుల్లోని వెంట్రుకలు ఏమయ్యాయి ? " అన్నాడు రాజు. "ప్రభు తమ తండ్రిగారితో పాటు తమరి దానాలు అందుకుని అవిలెక్కించి మూటలు కట్టడంవలన ఆరాపిడికి నాఅరచేతి వెంట్రుకలు రాలిపొయినవి "అన్నాడు ఆయువకుడు.
"చివరిగా మూడవప్రశ్న దానం ఇవ్వడంవలన నాకు దానం పొందడంవలన నీకు అరచేతిలో వెంట్రుకలు రాలిపోయాయి సరే,మనసభలోనివారికి అందరికి తమఅరచేతిలో వెంట్రుకలు ఎందుకురాలిపోయినవో తెలియజేయి "అన్నాడు రాజు. " ప్రభు తమ తాతగారు,తమ తండ్రిగారు,తమరు చేస్తు వచ్చిన దానాలను చూసినవీరంతా తమకు ఆఅదృష్టం ఎప్పుడు వస్తుందో కదా! అని చేతులు నలుపుకోవడంతో వారి అరచేతుల్లో వెంట్రుకలు రాలిపొయ్యాయి "అన్నాడు ఆయువకుడు.
"భేష్ నీ సమయస్పూర్ధి, తెలివితేటలు అభినందనీయం .న్యాయమూర్తి పదవికి నీవు అర్హుడవే " అన్నాడు మహరాజు.

