ప్రకాష్ చౌదరి ది టార్చ్ బేరర్ - మణి

Prakash choudari the torch barer

అతని పేరు ప్రకాష్ చౌదరి .అతను ఒక చిన్న దేశానికి ప్రధాన మంత్రి. ఆ దేశం పేరు, మహీ.

అతను ప్రధాన మంత్రి అయినప్పటినుండీ , ఏదో ఒక కారణం తో, దేశాలు, తిరుగుతూనే , వున్నాడు. ఈసారి ఎన్నాళ్ళ నుంచో, వెళ్ళాలనుకున్న దేశం ,కాంటో, కి వెళ్ళుతున్నంత సేపూ, అతనికి , చాలా ఉత్సాహము గా, అనిపించింది. కాని అక్కడకి వెళ్ళాక, అతని ఉత్సాహం ఎంతో సేపు వుండ లేదు.

అక్కడ , ఎక్కడా , ఎవరూ ఉత్సాహం గా కనిపించలేదు. అందరూ ముసలివాళ్ళు . సగటు వయసు , ఎనభయి ఏళ్ళు వుంటుంది. వాళ్ళకి సాయంగా రాబొట్స్. ఎవరి మొహం లో నవ్వు లేదు. ఎవరి మొహం చూసినా, కళ్ళల్లో శూన్యం తప్ప ఏమీ , కనపడటం లేదు. 'ఆ వయసులో ఏమి భవిష్యత్ చూస్తారు కనుక ? ', అనుకున్నా , ప్రకాష్ కి వాళ్ళని అలా చూడడం, ఇబ్బందిగా, అనిపించ సాగింది.

సెక్రటరీ , ప్రభాకర్ ని పిలిచి అడిగాడు. " ఏమిటండీ ఇలావుంది ఇక్కడ "

" ఇక్కడ జనాభా లో అంతా ముసలివాళ్ళే అండి . " అన్నాడు సెక్రటరీ , లాబ్ టాప్ లో గూగుల్ చేసి.

" ఊ ! .." అని తల పంకించాడు.

"అవును , మనం ఎందుకు ఇక్కడకి వచ్చాము ? " అన్నాడు. ప్రకాష్.

" మనకీ, వీరికి , ఏమీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేవు . కాకపోతే మన సరిహద్దులలో , ఈ దేశం వుంది కాబట్టీ , స్నేహ సంబంధాలు , మన సందర్సన తో బలిష్టం చేసుకుందామని , మీరు ప్రతిపాదించారు . ఈ దేశం టెక్నాలజీ లో , ప్రొడక్టివిటిలో , మొదటి దేశం. ఇంకా బాగా భాగ్యవంతం కూడా . " క్లుప్తం గా చెప్పాడు సెక్రటరీ . అతని పేరు ప్రభాకర్.

మళ్ళీ అన్నాడు " మనకి , ఇంకో పది నిమిషాలులో, ఈదేశం ప్రధాన మంత్రి తో, సమావేశం వుంది సార్ ."

ఇంతలో , అక్కడకి రెండు రాబోట్స్ వచ్చాయి.

" నా పేరు. చెర్రీ "

" నా పేరు జెర్రీ " అంటూ పరిచయం చేసుకుని ప్రకాష్ తో ప్రభాకర్ తో కరచాలనం చేసాయి.

" మీకు , అన్ని సదుపాయాలు చేయడానికి , మమ్మల్ని నియమించారు. " అంటూ , వారిని వాళ్ళకి కేటాయించిన, గదులకి తిసుకు వెళ్ళారు .

మెను కార్డ్ వాళ్ళ చెతిల్లోపెట్టి " మీకు, కావాల్సింది చెపితే, అవి మేము ఏర్పాటు చేస్తాము " " అంది జెర్రి.

" ఇవి కాకుండా, ఏం కావాలన్నా , మీరు పేరు చెపితే, వాటిని కూడా తయారు చేస్తాం, అంది చెర్రీ.

ప్రకాష్ , ప్రభాకర్ పాటు వారితోపాటు వచ్చిన వారి సిబ్బంది కి అందరికీ కూడా ఆశ్చర్యం గానే వుంది.

" ఇదేమిటి ప్రభాకర్. అన్ని రాబట్సే చేస్తున్నాయి ? మనని రిసీవ్ చేసుకోడం దగ్గరనుంచి , ఆతిధ్యం ఇవ్వడం అన్నీ, రాబట్సే చేస్తున్నాయి. నిజంగానే ఈ దేశం, హై టెక్ లాగా వుంది "అన్నాడు ప్రకాష్.

" ఊ ! " అంటూ ఊ కొట్టాడు ప్రభాకర్.

ఇంతలొ అక్కడకి ఒక రాబోట్ వచ్చింది . " నా పేరు విల్సన్." అంటూ పరిచయం చేసుకొని ,కరచాలం చేసి

" మిమ్మల్ని ప్రధానమంత్రి సమావేశానికి తీసుకు రమ్మనారు " అంది .

ప్రకాష్ , ప్రభాకర్ ఆశ్చర్యం తో మొహ మొహాలు చూసుకున్నారు.

" మీకు , ఎటువంటి ఇబ్బందీ ,కలగకుండా చూడమని చెర్రీ కీ , జెర్రీ కి , చెప్పాము . మీకు, ఏమీ ఇబ్బంది కలగ లేదు కదా " అంది , ఆ రాబోట్ విల్సన్ .

ఇద్దరికీ ,ఏమి చెప్పాలో తెలియ క , నవ్వి ఊరుకున్నారు. సమాధానం, ఏమీ చెప్పకపోతే బాగుండదని " మాకేమీ ఇబ్బంది కలగ లేదు . అంతా బాగానే వుంది " అన్నాడు, ప్రభాకర్ చిరునవ్వుతో.

అలా, కుశల ప్రశ్నలు అడిగాక, ఆ రాబట్ తో ఇద్దరూ, ఆ దేశం ప్రధాన మంత్రి ని, కలవడానికి వెళ్ళారు.

ప్రధానమంత్రి ఆఫీసు గదిలో, ఆ దేశం ప్రధాన మంత్రి , షిగేరు ఇషబా, అతని కి, తలోపక్కా , రాబట్స్ కూర్చుని వున్నారు.

రాబో ట్స్ , ప్రకాష్ ని , ప్రభాకర్ ని , చూడగానే, కుర్చీ ల్లోంచి లేచి అభివాదం చేసి , ఎదురుగా వున్న కుర్చీలు ,వారికి చూపిస్తూ ,

" కూర్చోండి ! ..అన్నారు.

ఇద్దరూ కూర్చున్నారు.

"ఇతను నా సెక్రటరీ ఫ్యూమికో , ఇతను నా విదేశాంగ మంత్రి అకారీ " అన్నాడు , షిగేరు ఇషబా.

" ఇతను , నా సెక్రటరీ , పేరు ప్రభాకర్. నా పేరు .." ప్రకాష్ వాక్యం పూర్తి చేయకుండానే

" ప్రకాష్ చౌదరి. పదవిలోకి వచ్చి రెండు సంవత్సరాలు. అయింది. హా ! నా సెక్రటరీ చెప్పాడు .. "

అన్నాడు ఇషబా .

ఇషాబా కి ఎనభై అయిదు సంవత్సరాలు. అతని కళ్ళల్లో కూడా శూన్యం !.......చూస్తూంటే, భయం వేసింది , ప్రకాష్ కి.

" మీకు తెలిసే వుంటుంది. మా జనాభాలో అందరూ వృద్ధులే . అందుకే, మేము ఎక్కువ , ఏ ఐ , రాబాట్స్ మీద , ఆధార పడతాము. మీరు చూసే వుంటారు అన్ని చోట్లా రాబాట్స్ ని . వాటిల్లో ఎక్కువ , 'ఏ ఐ రాబోట్స్ ' . ఇంకొ. అయుదు ఆరు సంవత్సరాలు అవుతే , ఈ దేశం ప్రధాన మంత్రి కూడా , రాబోట్ వుంటాడు. ".. అంటూ, తల వంచి, వచ్చీ రాని నవ్వు నవ్వాడు.

ప్రకాష్ , ప్రభాకర్ కళ్ళు అప్పచెప్పి, ఇషాబా నే చూస్తున్నారు.

మాటలు వెతుక్కుంటూ, ప్రకాష్ అన్నాడు " ఎందుకు , వృద్ధులు తప్ప ఎవరూ లేకుండా పోయారు ? "

ఇంతలో, అక్కడకి ఒక రాబోట్ వచ్చి అందరికీ , టీ , స్నాక్స్ సర్వ్ చేసింది.

ఒక సారి పెద్దగ నిట్టూర్చి ఇషాబా అన్నాడు " అన్నిటినీ, మనీ టర్మ్స్ లో , కొలవడం మొదలు పెట్టాక, చాలా విలువైన వి , వెల కట్ట లేనివి , చాలా పోగొట్టుకున్నాం . అందులో , ఒకటి కుంటుంబ వ్యవస్థ . ఏదయినా వున్నపుడు, దాని విలువ తెలియదు. కోల్పోయినపుడు, తెలిసినా , తిరిగి పొందడం కష్టమవుతుంది . వెనకకి, తిరగ గలిగే అవకాశం కూడా వుండదు. "

ఆశ్చర్యం గా, చూస్తున్న వారి కేసి, చూస్తూ మళ్ళీ అన్నాడు. " కుటుంబ వ్యవస్థ, ప్రాముఖ్యత తెలిసినా , దానిని బలిష్టం చేయడానికి , ఎటువంటి ప్రయత్నం చేయలేదు , సరిగదా అది కూలిపోతుంటే, అంతా బాగున్నట్లే నటించాము . పట్టించుకోలేదు . కుటుంబ వ్యవస్థ కి , బలమంతా స్త్రీ నే . ఆ స్త్రీని ఎప్పుడూ గౌరవించిన , పాపాన పోలేదు. ఆమె కంట్రిబ్యూషన్, పూర్తిగా ఇగ్నోర్ చేసాము.

ఆడవాళ్ళు ,మగవాళ్ళు , ఉద్యొగాలు చేయాల్సిన, అవసరం కల్పించాం . ప్రొడక్టి విటీ , అంటూ ఉద్యోగులని, ఇంటికి వెళ్ళకుండా చేసాం . ఉద్యోగస్తులయిన , స్త్రీలకి ప్రసూతి శెలవులు, ఇవ్వడానికి గిలగిల లాడాము. ఇంక ఉద్యోగాల ఒత్తిడులు , పిల్లల సంరక్షణా భారాల మధ్య , ఉద్యోగులు నలిగి పోతుంటే, చీమ కుట్టినట్లు కూడా , అనిపించ లేదు, ఎవరికీ . కాస్ట్ రిడక్షన్ అంటూ , ఉద్యోగాల నుంచి , ఇష్టం వచ్చినట్లు తిసివేస్తూ, అందరికీ మతి స్థిమితం లేకుండా , చేసాం . అభద్రతా భావాన్ని పెంచి, పోషించాం. ఆ విధంగా, అందరూ, ఒకవిధంగా బానిసల్లా , పడి వుంటారని వుండాలనే, ఆకాంక్ష ని , దాచవలసిన అవసరం కూడా, కనిపించలేదు మనకి . ఈ బానిస బతుకులకి, పిల్లలు ఎందుకు ,అని ఇంక విసిగి పిల్ల ల ని , కనడం మానేసారు. నెమ్మదిగా పెళ్ళిళ్ళు మానేసారు . దాని ఫలితమే ఇది. "

కాస్సేపు మౌనం గా వుండి మళ్ళి అన్నాడు .

" మా దేశమే కాదు, అన్ని దేశాలు, ఇలానే వున్నాయి. మరొ, అయిదు , పది సంవత్సరాలలో, అందరికీ ఇదే పరిస్థితి . మనుషుల మనుగడకి, మనుషులే , ముప్పు తెచ్చుకుంటున్నారు . యంత్రాలకి , అదే రాబట్స్ కి, పట్టం కడుతున్నారు. ఇంక ముందు ముందు మనుషులు అంతరించిపోయి , మనిషి తయారు చేసిన, రాబట్స్ ప్రపంచాన్ని ఏలుతాయి. మీ దేశం, ఏమీ వేరుగా, వుండ బోదు. హహ హ హ !!! "

నవ్వాడు కాస్సేపు ఇషాబా, ప్రకాష్ కేసి , ప్రభాకర్ కేసి , చూసి. ఆ నవ్వు లో బాధ వుంది . కోపం వుంది. అసహాయత వుంది. అతనిని, ఆ సమయం లో చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే పిచ్చి వాడు అని అనుకోకుండా వుండ లేరు.

అంతా వింటూన్న, ప్రకాష్ , ప్రభాకర్ మొహాలు , భయం తో , అసహనం తో, నల్ల బడ్డాయి. ఇద్దరూ మౌనం గా వుండి పోయారు.

అంతలో ఇషబా సెక్రటరీ " ప్రైం మినిస్టర్ ! మీరు ,ఇంకో సమావేశానికి , వెళ్ళాల్సి వుంది ." అంటూ చెప్పాడం తో ఇషాబా వారి దగ్గర శెలవు తీసుకున్నాడు. "మీకు కావల్సిన ఏర్పాటులు అన్నీ , నా సెక్రటరీ చూసుకుంటాడు. ఇంక శెలవా మరి ?! " అంటూ కరచాలనం చేసి అక్కడ నుంచి, వెళ్ళి పోయాడు .

వారి ప్రోగ్రాం ప్రకారం, మరుసటి రోజు ప్రకాష్ చౌదరీ , ప్రభాకర్ , వారి సిబ్బంది తో . తిరుగు ప్రయాణం పట్టారు.

ప్రయాణం లో ప్రభాకర్ ని ప్రకాష్ అడిగాడు." ఈ దేశం ఈ విధం గా వుంటుందని నాకు ముందే ఎందుకు చెప్ప లేదు ప్రభాకర్? "

" జనాభాలో అందరూ వృద్ధులే అని చదివాను కానీ , మరీ , ఇటువంటి విధం గా, వుంటుందని నేనూ అనుకోలేదు. ఈ దేశం లో, మన కన్సులేట్ లేదు. అందుకే , మనకి ఎక్కువ సమాచారం లేదు . " అన్నాడు ప్రభాకర్.

" ఇషాబా చెప్పినది కరెక్టేనా , ప్రభాకర్ ? " అడిగాడు ప్రకాష్, బయటకి దృష్టి సారిస్తూ .

" అన్ని దేశాలలోనూ జనభా లెక్కలు చూస్తూంటే, వృద్ధులు ఎక్కువ అవుతున్నారు.మిగిలిన వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ", అన్నాడు ప్రభాకర్ నీళ్ళు నములుతూ.

ప్రకాష్ కి ఇషాబా మాటలు, శూన్యం నింపుకున్న , అతని కళ్ళు. మాట మాట కీ గుర్తు రాసాగాయి.

" మీ దేశం కూడా, ఏమీ వేరుగా , వుండ బోదు . " అంటూ నవ్విన ఇషాబా నవ్వు , ప్రకాష్ ని వెంటాడ సాగింది.

****

ఇంటికి వచ్చాడే కానీ, ప్రకాష్ మనసు అంతా , ఇషబా మాటలే , మారు మోగుతూ వున్నాయి. అతను ఎంత ప్రయత్నించినా , బయట పడ లేక పోయాడు. అన్య మనస్కం గా. పనులు చేసుకుంటున్న, అతనిని చూసి భార్య , భాగ్యం " ఎమిటి ఎప్పుడు బయట దేశాల కి వెళ్ళినా, అక్కడ కబుర్లు చెప్పే వారు . ఏవేవో , కొని తెచ్చే వారు. ఈ సారి ఏమిటి ? ఏమీ తీసుకు రాలేదు సరి గదా , మిమ్మల్ని కూడా , అక్కడే వదిలేసి, వచ్చారు లా వుంది. ఏమిటి విషయం ? " అంటూ అడిగింది .

" భాగ్యం ! నాకు. అరవై ఏళ్ళు పై బడ్డాయి . వెధవ అనుమానాలు పెట్టుకోకు . " అంటూ నవ్వాడు ప్రకాష్.

" వచ్చినప్పటినుండీ చూస్తున్నా. అన్య మనస్కం గా వున్నారు ?? ... మీరు, ఏమీ తిసుకు రాలేదు సరే , నేను కొన్న చీరలు , నగలు చూపిస్తే కూడా, ఏమీ కామెంట్ చేయలేదు ? " చీరలు చూపిస్తూ అంటూన్న భార్యని, చెయి పట్టుకుని పక్కన కూర్చొ బెట్టుకున్నాడు.

" భాగ్యం ! ఇంక కొన్ని ఏళ్ళకి, మానవ జాతి , తుడిచి పెట్టుకు పోతుంది అంటే, నీకెలా వుంటుంది ? " గంభీరం గా ఆమె కేసి చూస్తూ , అన్నాడు

భాగ్యం అతని కేసి ఆశ్చర్యం గా చూసింది.

"అప్పుడు , నీకు వీటన్ని టి మీదా , ఆసక్తి వుంటుందా ? ఎందుకు, అలా జరుగుతుంది ?ఎలా ఆపాలి అని అనిపిస్తుందా ? "

కాస్సేపు , ఆమె కళ్ళ ల్లోకి చూస్తూ, మౌనం గా వుండి పోయాడు.

తర్వత నెమ్మదిగా , అక్కడ పరిస్తితి , ఇషాబా మాటలు గురించి చెప్పాడు.

" మర్చి పోలేక పోతున్నాను, ఆయన మాటలు . ఎందుకంటే , ఆ పరిస్థితికి , అందరమూ బాధ్యులే . ముఖ్యంగా పాలకులు . పాలకులు , సమాజం గురించి ఆలొచించడం మానేసి ,స్వార్ధ ప్రయోజనా ల గురించే ,ఆలోచిస్తే , వాటికోసమే, పని చేస్తే , వచ్చే పరిణామాల గురించి గానీ , ప్రమాదాల గురించి గానీ , కాస్త కూడా ఆలోచించం.

ఎంతసేపూ , ఎంత కూడ పెట్టాము , అనే ఆలోచిస్తున్నాము కానీ , ఎటువంటి సమాజాన్ని, మన పిల్లలకి, మనవలకి , ఇస్తున్నాము, అన్నది , ఎవరమయినా , ఎప్పుడయినా ఆలోచించిన, పాపాన పోతే కదా ? " అంటూ పెద్దగా నిట్టూర్చాడు.

సెక్రటరీ ని పిలిచి, " ఈ రోజు నా కార్యక్రమాలన్నీ, రద్దు చేయండి ! కాస్త అస్వస్థత గా వుందని చెప్పండి . " అంటూ తన గది లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ప్రకాష్.

****

కాంటో నుంచి , తిరిగి వచ్చినప్పటినుంచి , ప్రకాష్ మనసు మనసు లో లేదు. లోపలనుంచి ఏదో ఒక బాధ. ' గొంతు చించుకుని , ఏదో చెప్పాలని , ఎవరో ప్రయత్నం చేస్తున్నట్లు . సినిమా లో చూపించినట్లు, లోపల , ఎక్కడో మరుగున పడిన, ఆత్మ తాలుకు ఘోష ఏమో అది ', నవ్వుకున్నాడు మనసులో.

ఎప్పుడూ, బయటకి వచ్చే ప్రయత్నం కూడా , చేయ డానికి వీలు లేకుండా , ఎక్కడికో నెట్టేసాడు . కానీ ఇప్పుడు, ఎందుకో బయటకి వచ్చే , ప్రయత్నం చేస్తోంది. ఏమి చెప్పాలను కుంటోందో ?

ఆ ఆలోచన రాగానే లోపల్నుంచి గట్టిగా ఎవరో చెపుతున్న భావన " ఎంత ఆస్థి కూడ పెడితే మాత్రం , ఏముంది ? నీ మనవలు , ముని మనవలు, యంత్రాల తో బతకాల్సి వస్తుంది. ఎటువంటి భావోద్రేకాలు వుండవు. మొహాల మీద నవ్వువుండదు. యంత్రాల తో , యంత్రం లాగ బతకాలి. నీకన్న, మేము మెరుగైన యంత్రాలం అని యంత్రాలు , అదే రాబట్స్ , వెక్కిరిస్తే , తలవంచు కుని, బతకాలి . కళ్ళల్లో శూన్యం నింపుకుని ,బతికి వున్నారో , లేదో అనే అర్ధం లేని బతుకు..". మాటలు వినిపిస్తున్నట్లే అనిపిస్తోంది .

దానితో , " ఆపు ! ఆపు ! .." అంటూ తల విదిలించు కున్నాడు. " ఈ పరిస్థితి ని మనమే తెచ్చుకున్నాము ." ఇషాబా జీవం లేని నవ్వు .

బరువుగా కళ్ళు మూసుకున్నాడు. బాధ ఏదో తన్నుకు వస్తోంది . "ఏదో, ఒకటి చెయ్ !" అంటూ అతనిని ప్రేరిపిస్తూ వుంది.

"అవును ఏదో ఒకటి చేయాలి " అనుకున్నాడు ..చేస్తాను ! ఇంతవరకూ, పదవి, స్వార్ధ ప్రయోజనల కోసమే, అనుకుంటూ వస్తున్న , నాకు ఏదయినా చేయడం , కష్టమే అవుతుంది. . అయినా ప్రయత్నిస్తాను. ... ఇది కూడా నా స్వార్ధం కోసమే ... నా మనవలు, ముని మనవలకి , యంత్రాలతో, యంత్రాల్లా , బతికే పరిస్థితి రాకూడదు. ఊహించు కోడానికి కూడా, భయం గా వుంది. ఏదో ఒకటి చేస్తాను ....చేస్తాను .. ..." అను కుంటూ, నిద్ర లోకి జారాడు

మర్నాడు ఆఫీసుకు వెళ్ళగానే. ప్రభాకర్ ని పిలిపించాడు. పిఏ ని , పిలిచి , తను చెప్పేవరకూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు.

ఇద్దరికి , టీ స్నాక్స్ ఇచ్చి, పిఎ , వెళ్ళిపోయాడు.

" ప్రభాకర్ గారు ! రాత్రి నిద్ర పట్టలేదు నాకు . మీకు ?.. " అన్నాడు ప్రకాష్.

ఏమి చెప్పాలో , తెలియక ఇబ్బందిగా , మొహం పెట్టాడు ప్రభాకర్.

" నన్ను , ఇషాబా, ఆయన కళ్ళు , ఆయన మాటలు వదిలిపెట్టటం లేదు . నా కన్నా , ఎక్కువ చదువు కున్నారు కదా మిమ్మల్ని , ఎక్కువ డిస్టర్బ్ చేయాలి కదా ! ... .. ఊ ! .... అంటూ తల పంకించి ... అదే లెండి! ఎక్కువ చదివే కొలదీ, ఎక్కువ, ఇన్సెన్సిటివ్ అవుతారేమొ !... " అంటూ నవ్వాడు ప్రకాష్.

" రాజకీయాలు కూడా, వ్యాపారం లాగే మారాయి. ఎలెక్షన్ కి , ఎంత ఖర్చు పెట్టాను.... ఎంత రాబట్టు కోగలను .. ఇటువంటి లెక్కలే ! ... . .". అంటూ ఒకసారి ప్రభాకర్ కేసి చూసి , మళ్ళీ అన్నాడు " ఊ !.... ఇలా అంటున్నా, అని , ఆశ్చర్య పోకండి . " కరప్షన్ వే ఆఫ్ లైఫ్! " , అంటూ, అనుకుంటూ , జీవన విధానం గా , మార్చు కున్నాము. ... ఇందులో , అశ్చర్య పోవడానికి , ఏమీ లేదు . అది మీకూ తెలుసు.. కాక బొతే , ఇలా ఒపెన్ గా, మాట్లాడడం మీకు, ఇబ్బందిగా వుండొచ్చు , కదా . " అంటూ నవ్వాడు.

" ఇప్పుడు అసలు సంగతి కి వద్దాం. ఇషాబా చెప్పినట్లు , అన్ని దేశాలలోనూ, యువకులు తగ్గి, వృద్ధులు ఎక్కువ అవు తున్నారని , మీరూ ఒప్పు కున్నారు . దీనిని , రివెర్స్ చేయడానికి, ఏదయినా మార్గాలు వున్నాయా ? కాంటో దేశం, ఇప్పుడు వున్న పరిస్థితి కి , మనం ఎప్పుడూ వెళ్ళ కుండా, ఏమి మార్గాలు వున్నాయి ??.....చెప్పండి ప్రభాకర్ !..... వారి దేశం , ఏ దేశం అయినా సరే , ఆ పరిస్థితి కి , రావడానికి కారణాలు కూడా , చెప్పారు ఇషాబా.... వాటి గురించి , నాకూ విశ్లేషణ కావాలి . " , అంటూ ఆశక్తి గా చూసాడు, ప్రకాష్ ప్రభాకర్ వైపు.

బ్లాంక్ గా, తన వైపు చూస్తున్న , ప్రభాకర్ తో మళ్ళీ అన్నాడు. " ఇది మీ ఏరియ కాదని తెలుసు. కాని నాతో పాటు, ఇషాబా మాటలు మీరూ విన్నారు. అందుకే మీతో, ఈ విషయం , సాధ్యం అయినంత వరకూ కూలం కుషం గా చర్చించి, ఆ పైన, ఏటువంటి కార్యా చరణ ని అనుసరించాలి, అనే దాని మీద , ఒక నిర్దిష్టమయిన అభి ప్రాయానికి వస్తే , సంబంధించిన వ్యక్తులతో, మాట్లాడి ముందుకు వెళ్ళడం సాధ్యం , అని నాకు అనిపించింది. అందుకే మిమ్మల్ని పిలిపించా . ఈ విషయం గురించి, మీ అభిప్రాయాలు , ఎటివంటి సంకోచాలు లేకుండా చెప్పండి ప్లీజ్ ! " అన్నాడు ప్రకాష్.

ప్రభాకర్ మౌనం గా వుండడం తో మళ్ళి అన్నాడు " అంతరాత్మ అంటారు చూశారా ? ...అదే నా అంతరాత్మ. ఘోషిస్తోంది . ఎదోఒకటి చేసి, మనుషులని రక్షించమని ...... " కాస్సేపు మౌనం గా తలవంచుకుని ... గొంతు సరి చేసుకుని , మళ్ళీ అన్నాడు. " ముందుగా కుటుంబ వ్యవస్థ గురుంచి చెప్పండి , ఎలా దానిని. రక్షించుకోగలం ? .."..

" సార్ ! మీరు ప్రధాన మంత్రి . ఇటువంటి , సామాజిక వ్యవహారాలు , సంస్కర్తల , పని . " అన్నాడు ప్రభాకర్.

నవ్వాడు ప్రకాష్ ." ఇది ఎలా వుందంటే . నేరం జరిగిన ఏరియా, తమది కాదని పోలీసులు , పక్కనుంచి వెళ్ళిపోయినట్లు వుంది.

సమాజం బాగోగులు , మంచి చెడులు , పదవిలో వున్న వాళ్ళే కదా , పట్టించుకోవాలి . ప్రభుత్వం, ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే కదా , పని చేయల్సింది ! మానవ మనుగడకే ప్రమాదం వస్తుందంటే , ప్రభుత్వమే కదా తగిన చర్యలు తీసుకోవల్సింది.

పదవిలో వున్నన్నాళ్ళూ , పదవిని కాపాడు కోవడమే ధ్యేయం గా, పని చేయడం , అల వాటు అయిపోయింది . అందుకే ఇది, మన పని కాదన్నట్లు అనిపిస్తుంది. " నవ్వాడు, ప్రకాష్

ప్రభాకర్ కి , ప్రకాష్ మాటకు కొత్తగా వున్నాయి . పదవిలో వున్నన్నాళ్ళూ, పాత ప్రభుత్వాన్ని తిట్టి పోయడమే , పనిగా పెట్టు కోవడం అలవాటయి పోయింది. ప్రజా శ్రేయస్సు అనేది , రాజకీయ నిఘంటివు లోంచి ఎప్పుడో తొలగి పోయింది . అందుకే , ఎవరైనా, దాని గురించి మాట్లాడితే , అయోమయం గా వుంటుంది. ప్రభాకర్ ది , అదే పరిస్థితి.

" ఉద్యోగుల, పని నిబద్ధీకరణం లో , మార్పులు రావాలి .. ఉద్యోగపు, ఒత్తిళ్ళు తగ్గించాలి . కుంటుంబ వ్యవస్థ ని బలోపేతం చేయగలిగే , మార్పులు చేబట్టాలి. " ఆలొచిస్తూ అన్నాడు ప్రకాష్. " ఆరోగ్య కరమయిన సమాజ నిర్మాణానికి, బలమయిన కుటుంబ వ్యవస్థ , చాలా దోహదం చేస్తుంది. " మనసులో అనుకుంటున్నట్లు బయటకే అంటున్నాడు ప్రకాష్.

పిఏ ని , పిలిచి అన్ని విభాగాల మంత్రులని, సెక్రటరీ లతో , ఒక గంటలో సమావేశానికి ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చాడు. అందరూ కాన్ఫెరెన్స్ హాల్ లో, సమా వేశం అయ్యారు.

అందరిని ఉద్దేశిస్తూ, ప్రకాష్ మాట్లాడడం మొదలు పెట్టాడు,

" నేను కాంటో దేశం వెళ్ళి , నిన్ననే వచ్చానని మీకందరికీ తెలుసు, అక్కడ పరిస్థితి గురించి మీకందరికీ తెలియ చేయడానికే , మిమ్మల్ని అందరిని , సమావేశ పరిచాను. "

" ప్రభాకర్ ! మనం అక్కడ చూసినది, అక్కడ , ప్రధాన మంత్రి , మనకి చెప్పినది , చెప్తారా అందరికి ?! " అంటూ ప్రభాకర్ కి చెప్పి , కూర్చున్నాడు.

ప్రభాకర్ , అక్కడ పరిస్థితి , ఇషాబా మాటలు , అందరి కీ , చెప్పాడు.

ప్రభాకర్ అంతా చెప్పాక , ఒకసారి ప్రకాష్ కేసి చూసి , కూర్చున్నాడు.

ప్రకాష్ అన్నాడు

" అక్కడ ప్రధాన మంత్రి ఒకమాట అన్నాడు. "ఆయన తర్వాత , ఒక రాబాట్ , ప్రధాన మంత్రి , అవుతాడు అని. " ఎందుకంటే , అక్కడ వున్నవాళ్ళు , అందరూ వృద్ధులే . ఇప్పటికే , వారి మంత్రి మండలి లో , సగం పైగా, రాబాట్స్ వున్నాయి. అదే ఏఐ రాబోట్స్ అంటారు . ఏఐ , రాబోట్స్ కి ఆలోచించి, నిర్ణయాలు తీసుకుకోగలిగే తెలివి

వుంటుంది . అవి ఆని రకాలుగా మనుషులలానే ప్రవర్తిస్తాయి . ఈ విషయం నాకు ప్రభాకర్ చెప్పారు . " ఒక సారి నవ్వి గొంతు సరి చేసుకుని మళ్ళీ అన్నాడు ,

" ఆ పరిస్థితి కి , వారు చెప్పిన కారణాలు , మనం అందరమూ తెలుసుకోవాలి . ఎందుకంటే , మనమంతా, ఒకరకంగా దానికి , దోహదం చేసినట్లే . చేస్తున్నాము కూడా!. ...

అన్ని దేశాల లోనూ , జనాభాలో , వృద్ధులు ఎక్కువ అవడం , యువకులు తగ్గడం , మీకందరికీ తెలి సే వుంటుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతే , అన్ని దేశాలలో నూ, ఈ రోజు కాకపోయినా , రేపయినా , అదే పరిస్థితి . కొన్నాళ్ళకి , మానవ జాతే, అంతరించి పోయే లా వుంది.

'ఆ పరిస్థి తి , రాకుండా వుండాలంటే, ఏమి చెయ్యాలి ? ' అనేదే , నేను , అక్కడ నుంచి , వచ్చినప్పటినుండీ , ఆలోచిస్తున్నా .

బలమైన కుటుంబ వ్యవస్థ , ఉద్యోగ వ్యవస్థ లో , ఉద్యోగుల పని గంటల లో, మార్పులు , కొంతవరకూ దోహదం చేస్తాయని , అనుకుంటున్నాను.

మీరు , ఈ విషయం గురించి ఆలోచించి , తగిన సలహల తో , నిర్దేశించిన రోజున , సమా వేశానికి వస్తే , అందరమూ ఈ విషయం గురించి చర్చించి , ఎటువంటి, చర్యలు తీసుకోవాలి ? , అనే విషయం మీద , ఒక నిర్ణయానికి రావచ్చు .. ఆ దిశలో , ఒక కార్యా చరణ ప్రణాలికని, రూపొందించుకొని , ముందుకు వెళ్ళదాం , ఏమంటారు ? .." అంటూన్న ప్రకాష్ మాటలకి , అందరూ అంగీకారం తో , తలలు ఊపారు.

సమావేశం అయ్యాక, సెక్రటరీ ని పిలిచి , తను సమావేశం లో చెప్పిన, విషయాల గురించి , అన్ని విభాగాలకీ , తగిన ఆదేశాలు ఉత్తరువు చేస్తూ, దానితో బాటు , మరలా సమావేశానికి, ఒక తేదీ కూడా, నిర్ణయించి , అందరికీ తెలియజేయ మన్నాడు.

ఆందరూ, నిర్దేశించిన రోజు , సమావేశమయ్యారు . " జనాభాలో యువకుల సంఖ్య పెరగడం వల్ల, మానవ జాతి అంతరించే పోయే , ప్రమాదం నుంచి, తప్పించుకోవచ్చు ." అని అందరూ చెప్పడం, అవుతే , చెప్పారు .

"ఎక్కువ మంది పిల్లలు వున్న వాళ్ళకి, ఇన్సెంటివ్స్ ఇస్తే ఉపయోగ పడుతుంది. " అని కొందరు అన్నారు

ప్రకాష్ చర్చని ముందుకు తీసుకు వెళ్తూ అన్నాడు " మీరు చెప్పినట్లు , ఇన్సింటివ్స్ మూలాన పిల్లలు కంటారు, అనుకోవడం, కొంత వరకే ఉపయోగ పడుతుంది అని నా కు అనిపిస్తోంది. అసలు పిల్లలు ఎందుకు వద్దను కుంటున్నారు అనేదే, మనం ఆలోచించాల్సిన విషయం. "

" భార్యా, భర్తలు, ఇద్దరూ, ఉద్యోగాలు చేయడం తో , పిల్లల మంచి చెడులు చూసే టైం లేక పోవడం. ఒక కారణం ."

" ఎక్కువమంది విడాకులు అంటూ వెళ్ళడం తో కుటుంబ వ్యవస్థ బలహిన పడింది . దానితో, నిస్పృహ కి లోనయి , పిల్లలే కాదు , పెళ్ళిళ్ళు కూడా , వద్దనుకుంటున్నారు ". అన్నాడు ఒక మంత్రి .

" ఇషాబా గారు చెప్పిందీ , అదే ! ... కుటుంబ వ్యవస్థ , బల పర్చే విధం గా మార్పులు తీసుకు రావాలి. ఉద్యోగపు ఒత్తిళ్ళు తగ్గించాలి. అందరూ కుటుంబం తో, ఎక్కువసేపు గడిపే, ఏర్పాటు చేయాలి. ఉద్యోగస్తుల పని వేళల్లో మార్పులు రావాలి. ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించాలి . ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాలలోంచి తీయకూడదు . "

ప్రకాష్ ఇంకా , ముగించకుండానే, ఒక అధికారి అన్నాడు. " ప్రభత్వ రంగం లో వున్న ఉద్యోగాలు , తక్కువే. అన్నీ , ప్రైవేట్ రంగాలకి అప్ప చెప్పాం . వారి మీద , మన కంట్రోల్ ఎక్కువ వుండదు, సార్! "

" వారితో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఈ విష యం. లో వాళ్ళ సహకారం కూడా అడుగుదాం . ."

ఇంకొక అధికారి అందుకున్నాడు ," ప్రైవేట్ రంగాలన్నీ , లాభాలనే , దృష్టి లో పెట్టుకుని పని చెస్తాయి .. కాస్తా లాభం తగ్గినా వాళ్ళు ఒప్పుకోక పోవచ్చు.."

" ముందుగా, అందరి సహకారం , అర్ధిద్దాం. పార్లమెంట్ లో , నేను ప్రతిపాదించిన మార్పులు ల, గురించి చర్చ ని , ప్రవేశపెట్టి వాటికి ఆమోదం వచ్చాక, తగిన విధం గా అందరికీ , ఆదేశాలు ఇద్దాం. ఉద్యోగు లకి భద్రత కల్పించడం , వారి పని వేళలు నియంత్రించడం , మంచి పనులే కదా . కార్పొరేట్ కల్చర్ లో , ఉద్యోగులని యంత్రాలు లా, చేసేస్తున్నారు. వాళ్ళు మనుషులని , క్రమేణా మర్చిపోతున్నారు . మనుషులని , ఒకసారి యంత్రాలు లా చూడడం అలవాటు చేసుకున్నాక , మానవ యంత్రాల కన్న , ఇనుప యంత్రాలు మేలు , అనే పరిస్థితి కి , రావడానికి ఎక్కువ కాలం పట్టదు .. అందరికీ , నేను చేసే విన్నపం ఒకటే . తెలిసో, తెలియకో, మనం చేసిన తప్పుల వల్ల , మానవ మనుగడకే ,

ప్రమాదం వచ్చేలా , వుంది ....కాదు ! ...కాదు !... వస్తూ వుంది ! ...దాన్ని ఆపే, ప్రయత్నాలు, ఏమీ చేయకపోతే , మనని యంత్రాలు , కంట్రోల్ చేయడానికి , ఎక్కువ కాలం పట్టదు. "

ప్రకాష్ మాటలు, అందరూ ఆశ్చర్యం గా , వింటున్నారు .. . .. ఇన్నాళ్ళు , మళ్ళీ ఎలెక్షన్ లో , ఏ విధం గా పదవిలోకి రావాలి? దానికోసం ఏమి చేయాలి ? ...... ప్రస్తుత పదవిలని , ఎవిధం గా కాపాడుకోవాలి?..... ఇటువంటి చర్చలకి అలవాటు పడ్డారు . అటువంటిది, మానవ మనుగడ, అంటూ , మాట్లాడుతూంటే, ఆశ్చర్యం కన్నా , ఈయన, ఏమి ప్రణాలిక వేస్తున్నాడు , అనుకుంటూ, అందరూ, గుస గుస లు మొదలుపెట్టారు .

అందరూ, గుస గుసలాడుకోవడం గమనించి , ప్రకాష్ , మళ్ళీ , అన్నాడు.

" నేను, ఈ విధం గా, మాట్లాడడం, మీకు ఆశ్చర్యం కలిగిస్తోందని, నాకు అర్ధం అవుతోంది. కానీ నా మనవలో , ముని మనవలో, యంత్రాలతో , అదే రాబట్స్ తో , బతకాల్సి, వస్తుందంటే. నేను జీర్నించుకోలేక పోతున్నాను. మనుషులతో సహ జీవనం చేస్తున్ననాళ్ళు , మనుషుల , విలువ తెలియదు . మానవ దృక్పధం , పూర్తిగా పక్కన పెట్టి బతుకు తున్నాం .

శూన్యం నిండిన కళ్ళతో , రాబట్స్ చూస్తూంటే , నవ్వడానికి ,ఏడవడానికీ , ఎవరూ తోడు లేక , వున్న మనుషులు, కూడా అదే, మన మనవలు , ముని మనవలు , మనుషులు లాగ , బతక లేకపోతే.. ఊహించుకోవడానికి కూడా , నాకు భయం గా వుంది. ... బాధ గా వుంది ." ప్రకాష్ గొంతులో, బాధ ..అందరూ ఒకసారి నిశ్శబ్దం అయ్యారు .

గద్గదమయిన గొంతుని ఒకసారి సరి చేసుకుంటూ అన్నాడు .. " మానవ జాతిని కాపాడుకుందాం ..." అంటూ ముగించాడు ప్రకాష్.

బయటకి వచ్చిన అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడు కోవడం మొదలు పెట్టారు .

" ప్రధాన మంత్రి ఎక్కువ గా ఊహించుకుంటున్నారేమొ అనిపించటం లేదూ ? .." ఒకరు అన్నారు

" అవును ..అవును ... అన్ని సమస్యలకి , జనాభా ఎక్కువ కావడమే , అని అనుకుంటూంటే ..." ఇంకొకరు అన్నారు .

" లేదు లెండి , జనాభా సంఖ్యల లో మార్పులు వస్తున్నాయి ... వారు చెప్పినది రైటే . కొన్ని దేశాలలో వృద్ధుల సంఖ్య ఎక్కువగానూ , యువకులు, తక్కువ గానూ వున్నారు .. అదే పరిస్థితి , ప్రపంచమంతా , వ్యాపించే అవకాశం వుంది.. .."

అందరూ , చాలా సేపు , ప్రధాన మంత్రి చెప్పిన విషయాలగురించి, తలొరకం గానూ , కాసేపు మాట్లాడుకున్నారు .

సమావేశం అయిపోయాక , ఆఫీసుకి వెళ్తున్న ప్రకాష్ , ప్రభాకర్ తో అన్నాడు

" నాకు , అన్నిటికన్న , ఆశ్చర్యం వేసేది , ఈ కార్పొరేట్ కంపనీ లు. ఉద్యోగులని , ఎందుకు ప్రతీ సంవత్శరం తీసేస్తూన్నారని ! ఒక పది వెల మంది ని తీసేస్తారు . ఒక పది వేల మంది ని వేసుకుంటున్నారు . వాళ్ళ లాజిక్ నా కు అంతు బట్టదు . వున్న వాళ్ళని , కంటిన్యూ చేస్తూనే , కొత్త వాళ్ళని వేసుకోవచ్చు కదా ! ఈ విధం గా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగుల్ని తీసి వేయడం వలన , ఉద్యోగులకి , అభద్రతా భావన తో , ఎంత మనస్థాపానికి గురి అవుతారు ?! ఇటువంటి అభద్రతా భావన , వాళ్ళ లోనే కాకుండా , వాళ్ళ కుటుంబం అంతా వ్యాపిస్తుంది. తర్వాత , సమాజాన్నంతా, ప్రభావితం చేస్తుంది. అభద్రతా భావన , చెద పురుగులులా, లోపల నుంచి తినేస్తుంది . అందుకే , అ భద్రతా భావన, వ్యకికే కాదు , సమాజానికి , దేశానికి కూడా పనికి రాదు. ఈ విషయం , కార్పొరేట్ సమావేశం లో తప్పకుండా వారి దృష్టికి తీసుకు రావాలి . "

" యస్ సార్ ..." అంటూ తల పంకించాడు ప్రభాకర్ . కాంటో నుంచి వచ్చినప్పటినుంచి ప్రకాష్ మాటల్లో మార్పు చూస్తున్నాడు. అతని మాటల్లో , నిశితమయిన పరిశీలన, నిజాయితీ వుట్టి పడుతోంది.

****

ఇంక ప్రధాన మంత్రి కాంటో దేశ సందర్శన , గురించి రక రకాలుగా వార్తలు మీడియా అంతా మారు మోగుతున్నాయి.

ప్రకాష్ కూడా ఆ వార్తలు చూస్తున్నాడు ... " మనప్రధాన మంత్రి , దేశం లో కన్నా విదేశ పర్యటనల లోనే , ఎక్కువ సమయం గడుపుతున్నట్లు వుంది. ఎటువంటి సంబంధాలు లేని , కాంటో దేశానికి ప్రధాన మంత్రి ఎందుకు వెళ్ళినట్లు ?.....

కాంటో దేశం రాబోట్ రాజ్యమా.? మనదేశం, కూడా అదే పంధాలో నడుస్తోందా..అని ఆరాలు తీస్తున్న ప్రధానమంత్రి . దీనిని ఆపడానికి, మన ప్రధాని ఎటువంటి చర్యలు చేబట్టనున్నాడు ?...., " ఈ రకం గా

రక రకాల ఊహాగానాలతో, వార్తలు నడుస్తున్నాయి. 'ఈ మధ్య వార్తా ఛానెల్స్ ముందు సినిమాలు ఏమాత్రమూ పనికి రావటం లేదు.' అనుకుంటూ నవ్వుకున్నాడు ప్రకాష్.

****

రెండు రోజుల తరవాత , అనుకున్న విధం గా , కార్పొరేట్ కంపెనీ ల , సిఎఓ ల తో సమావేశం ఏర్పాటు చేసి , ప్రకాష్ , కాంటో దేశం లో పరిస్థితి వివరిస్తూ , మానవ మనుగడ గురించి, ఆందోళణ , తెలియ చేసారు. కాంటో దేశ పరిస్థితి , మనకి రాకుండా , వుండాలంటే , కార్పొరేట్స్ కూడా , సహకరించాలని చెపుతూ , కార్పొరేట్స్ నుంచి తను ఆశించే సహకారం , తను తీసుకురాదలిచిన మార్పులు గురించి చెప్పాడు.

సమావేశంలో, ఒక పెద్ద సంస్థ కి , సిఇ ఓ , అయిన రామారావు , వున్నట్లుండి అన్నాడు . " మేము వ్యాపార

సంస్థలు నడుపుతున్నాం . ఏ విధం గా , లాభాలు పెంచాలనే , విషయం మీదే , మా దృష్టి వుంటుంది. అయినా మా లాభాలలో , కొంత భాగం, సామాజిక సంక్షేమానికి ఖర్చు పెడుతూనే వున్నాం . ".

ప్రకాష్ ఒకసారి అతనికేసి అసహనం గా చూసాడు. " మీ కంపెనీ లో, పని ఒత్తిడికి తట్టుకోలేక , ఆత్మ హత్య కి పాల్పడిన సంఘటన లు, ఎక్కువ గా వుంటున్నాయని , వింటున్నాను . " అన్నాడు ప్రకాష్.

ఆ మాటలకి , రామారావు కాస్త ఇబ్బందిగా, ప్రకాష్ కేసి చూసి , మౌనం గా వుండిపోయాడు .

ప్రకాష్ మళ్ళి అన్నాడు. " మీరు , నేను సూచించే మార్పులు చేయడం వల్ల , లాభాలు తగ్గవచ్చు , కానీ , నష్టాలు అవుతే , కలగవు కదా ! మనుషులని, యాంత్రాలుగా మార్చకండి , మానవతా దృక్పధం తో చూడండి . అప్పుడే మనం మానవ

జాతి ని రక్షించుకోగలం . ఈ మార్పుల వల్ల , నష్టాలు కలిగేటట్లు వుంటే, వాటిని నడిపే ,బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుంది. " అతని గొంతులో , దృఢత్వానికి అందరూ నిశ్శబ్దం గా వుండి పోయారు.

సమావేశం , అయ్యాక , అందరూ వారిలో వారు, చర్చించుకుంటూ వెళ్ళిపోయారు.

ప్రకాష్ , అనుకున్న విధం గా , ప్రభుత్వ సంస్థలకి , ప్రైవేట్ సంస్థలకి , తగిన విధం గా ఆదేశాలు, జారీ చేసాడు.

నాలుగు రోజుల తర్వాత ఒక రోజు, సేక్రటరీ చెప్పాడు . " సార్! కార్పొరేట్ సంస్థలు , కోర్ట్ లో , ప్రభుత్వ ఉత్తరవులకి , వ్యతిరేకం గా , కేసు వేసారు. ప్రభుత్వ ఆదేశాలపై , స్టే అడుగుతున్నారు . "

"చెడ్డ పనులకి, ఎవరూ అడ్డుపడరు కానీ, మంచి పనులు , చేయదలుచుకుంటే మాత్రం , అన్ని రకాలా, అందరూ అడ్డుపడతారు . అవాంతరాలు కలిగిస్తారు . " అనుకుంటూ నిట్టూర్చాడు .

" ఒక్క సారి , ఇన్ని సంస్కరణలు తీసుకు రావాలంటే, అంత సులభం కాదు సార్ . మొత్తం అంతా , మార్చాలంటే కొద్దో గొప్పో , వ్యతిరేకత వస్తూనే , వుంటుంది . .." వోదారు స్తున్నట్లు , మాట్లాడుతున్న సెక్రటరీ ని , చూసి నవ్వాడు ప్రకాష్.

"నిజమే .. కానీ, ఈ పనులు, నెమ్మదిగా చేయగలిగేటంత సమయం, మనకి లేదే మో , అనిపిస్తోంది. జనాభాలో , యువత సంఖ్య తగ్గడం , మొదలు పెడితే , దానిని రివర్స్ చేయడం , కష్టమవుతుంది. ఆపరిస్థితి రాకుండానే , జాగ్రర్త పడాలి. " అన్నాడు. ప్రకాష్ .

సెక్రటరీ మౌనం గా వుండి పోయాడు .

ఆలోచిస్తూ , కుర్చీలో ఒకసారి వెనక్కి వాలి , కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చినట్లు కళ్ళు తెరిచి సెక్రటరీ తో అన్నాడు .. " ఈ రోజు, నేను మీడియా ద్వారా , ప్రజల దగ్గరకి , ఈవిషయం , తీసుకు వెళ్ళ దలుచుకున్నాను . ఈ విషయం లో ప్రజల సహకారం కూడా అవసరమే . అరేంజ్ చేయండి. . నా అపాయింట్ మెంట్స్ వీలవుతే. రద్దు చేయండి లేకపోతే, సమయం అడ్జస్ట్ చేయండి ." అన్నాడు.

" ఈ రోజు చాలా ముఖ్యమయిన అపాయింట్ మెంట్స్ వున్నాయి సార్ ....." అంటూ నీళ్ళు నములుతున్న

సెక్రటరీ తో , " ఇప్పుడు , నాకు ఇంతకన్న ముఖ్యంగా , ఏదీ కనిపించటం లేదు రావుగారూ ! .." అన్నాడు ప్రకాష్ గంభీరం గా ..

దానితో " ఓకె, సార్ ! మీడియాకి, టివి ఛానెల్స్ కి తెలియ చేస్తాను .. .." అంటూ, సెక్రటరీ లేచి, హడావిడిగా బయటకి వెళ్ళాడు .

ప్రధాన మంత్రి అప్పాయింట్ మెంట్స్ ని, అన్నిటిని పక్కకి జరిపి సాయంత్రం నాలుగు గంటలకి , ప్రజలని ఉద్దేశించి

చేసే, ప్రధాన మంత్రి ప్రసంగానికి, ఏర్పాటు చేసాడు., ప్రకాష్ సెక్రటరీ " ప్రధాన మంత్రి మనసులో మాట " శీర్షిక తో ప్రధానమంత్రి, చెప్పదలుచుకున్న విషయాలని , అంశాల వారీగా , ఒక పత్రం తయారు చేసాడు . ప్రధాన మంత్రి ఆమోదం తీసుకుని , సమావేశానికి ముందుగా నే , ఆ పత్రం మీడియా కి అందరికీ తలో ఒకటి , అందరికీ ఇచ్చాడు . ప్రధాన మంత్రి ప్రజల ని సంబోధిస్తున్నారు కాబట్టి , ప్రశ్నలకి తావు వుండదని మీడియాకి , అందరికీ అర్ధమయింది.

......

ప్రకాష్ సమావేశం లో అందరూ సద్దుకున్నాక మాట్లాడడం మొదలు పెట్టాడు.

ప్రపంచంలో ఎక్కడ చూసినా అసంతృప్తి, అశాంతి , అసహనం ..కనిపిస్తున్నాయి . అందరూ, రక రకాల మానసిక ఒత్తిళ్ళకి , లోనవుతునారు. ఆ ప్రభావం , మానవ సంబంధాల మీద పడకుండా, ఏలా వుంటుంది. ఎండిన నేలనుంచి, పచ్చని మొక్కలు, ఎలా ఆశిస్తాం ? అశాంతి లోంచి, స్నేహం ,ప్రేమ , కరుణ, సహనం , నమ్మకం ఎలా పుడతాయి. ? ..ఇవి లేని , ఏ బంధం అయినా ఎలా నిలబడుతుంది ? అందుకే మానవ సంబంధాలు , బలహీన మవుతున్నాయి. దీనికి అతీతం గా, భార్య భర్త ల సంబంధం మాత్రం , ఎలా వుండగలుగుతుంది. ? ఈ పరిస్థితి ఈ విధం గానే, కొనసాగితే , కుటుంబ వ్యవస్థ , కూలిపోవడానికి ఎన్నో సంవత్శరాలు పట్టదు. పిల్లలని, పెంచడం పెద్ద చాలెంజ్ గా , మారుతుంది... క్రమేణా , పిల్లలని కనడానికి ఇష్టపడరు . పెళ్ళి చేసు కోదానికి కూడా , ఇష్టపడరు ... ... దాని ఫలితం గా, జనాభా లో , యువత తగ్గుతారు .. .. కొన్నాళ్ళకి , ఆ సమాజం లో , వృద్ధులే మిగులుతారు. .... ఇదే, కొన్ని దేశాలలో , జరుగు తోంది.... యువత లేకపోవడం , వృద్ధులు ఎక్కువ అవడం తో , ఆ దేశాలు రాబొట్స్ మీద ఆధార పడి వుంటున్నాయి.. అక్కడ , పాలనా యంత్రాంగం లోకూడా రాబట్సే , ఏఐ రాబోట్స్ ... మంత్రులు కూడా రాబట్సే ... కొన్నాళ్ళకి, రాబోట్స్ తప్ప , మనుషులు వుండరు .. మీరు , నమ్మినా నమ్మకపోయినా, ఇది వాస్తవం . .. ఈ పరిస్థితి, ప్రపంచం అంతా వ్యాపిస్తోంది. ...మానవ జాతి , అంతరించీ పోతుందేమో ! . ....మనమూ ఆ ప్రవాహం లో కొట్టుకు పోదలుచు కుంటే, ఏ బాధా వుండదు. కానీ , మనము ఎవ్వరమూ , ఆ పరిస్థితి ని , కోరుకుంటామని కానీ , కోరుకుని తెచ్చుకున్నదని కానీ , నేను అనుకోను. .. ... అవకాశం వుంటే , అందరమూ , పరిస్థితి ని , చక్క పడదామనే అనుకుంటాము. .. సమయం దాటి పొతే , చక్కపెట్టడానికి ఏమి వుండదు. అదృష్టం ఏమిటంటే , మనకి పరిస్థితి చక్కపెట్టుకునే , అవకాశం ఇంకా వుంది.

యువత సంఖ్య ని పెంచే విధం గా మార్పులు తీసుకు రావల్సి వుంది. యువత , మానసికంగా , భౌతికంగా , ఆరోగ్యకరం గా వుండే విధంగా, విద్య , ఆరోగ్య రంగాలని , సంస్కరించుకోవాలి . ఒత్తిళ్ళని , సాధ్య మయినంత వరకూ తగ్గించే దిశలో , ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుని , అమలు చేసే విధంగా ఉత్తర్వులు, ఆ ఆ శాఖలకి , సంస్థ లకి జారీ చేయడం అయింది. ఉద్యోగుల పని వేళల , నిబద్ధీకరణ ,ఉద్యోగ అవకాశాల పెంపు , ఉద్యోగ భద్రత , స్త్రీలకి సంవత్శర కాలం ప్రసూతి శెలవు , ఉద్యోగుల సంఖ్య పది కన్నా ఎక్కువ వున్న సంస్థలు , వాటికి అనుబంధం గా ఉద్యోగుల పిల్లల సంరక్షణా కేంద్రాల ఏర్పాటు, ...ఉద్యోగ వాతావరణం , మానవతా దృక్పధం తో , ఆరోగ్య కరం గా వుండే, విధం గా యాజమాన్యం, శ్రద్ధ , తీసుకుకోవాలి . తగిన ఏర్పాటులు చేయాలి. ఈ మార్పులు తీసుకు రావడానికి , పార్లమెంట్ లో చర్చ జరిగి , ఆమోదించబడింది . తగిన విధం గా ఉత్తరవులు కూడా జారీ చేయ పడ్డాయి.

ప్రభుత్వం ఎటువంటి శాసనాలు చేసినా ప్రజల మద్దతు లేకుండా ఎటువంటి మార్పునీ ఆశించలేము . అందుకే అందరమూ ఈ దిశగా పని చేద్దాం . మానవ జాతిని రక్షించు కుందాం.

ప్రకాష్ ప్రసంగం, వైరల్ అయింది. ప్రపంచమంతా, ఆశక్తి గా వింది.

మర్నాడు సెక్రటరీ చెప్పాడు. " సార్ ! మీ ప్రసంగం వైరల్ అయింది. ప్రపంచ దేశాలనుంచి , ఒకటే ఫోన్ లు , మెస్సేజెస్ వస్తున్నాయి. ఇటువంటి ప్రధాన మంత్రి , అన్ని దేశాలలో వుండాలంటున్నారు ..అన్ని దేశాలలోనూ ఈ మార్పులు అవసరము అని , మిమ్మల్ని టార్చ్ బేరర్ అని , అందరూ మెస్సేజె స్, ఇస్తున్నారు . ....... ఇంక , కోర్టు, కార్పొరేట్స్ వేసిన కేసుని స్టే ఆర్డర్ అప్పీల్ ని ,అంగీకరించలేదు . "

సెక్రటరీ సంతోషంగా హడావిడి గా మాట్లాడు తున్నాడు.

ప్రకాష్ మొహం లో చిరు నవ్వు వెలిగింది. పరిస్థితి తెలిస్తె , ఎవరయినా రాబోట్ రాజ్యాన్ని , మానవ జాతి అంతరించపోవడాన్ని, ఎందుకు కోరుకుంటారు , అనుకున్నాడు . ...

" కాస్తయినా చేయగలిగాను ..." అన్నాడు, అంత రాత్మ తో .. ఎక్కడనుంచో, కాస్త సంతోషం వెలుగు లా వెలిగింది.

పేపర్లు అన్నిటిలోనూ , ప్రధానమంత్రి ప్రకాష్ చౌదరి, టార్చ్ బేరర్ అంటూ హెడ్ లైన్స్ తో అతని ప్రసంగం ప్రచురింపబడింది.

"దేశం అంతా ఒకసారి రీలీఫ్ తో నిట్టూర్చింది " అందరిలోనూ ఒక ఆశ మెరిసింది ", .... ఈ విధం గా , ప్రకాష్ అమలు జరుపునున్న సంస్కరణల గురించి, ఎవరికి తోచిన విధం గా వారు, నాటకీయ ధోరణిలో వర్ణించారు.

*****

కాంటో దేశంలో, ప్రకాష్ ప్రసంగాన్ని , టి వి లో , వింటూన్న ఇషాబా మొహలో, చిరునవ్వి మెరిసింది. శూన్యం నిండిన కళ్ళు, దీపాలులా, వెలుగులు , చిమ్మాయి . అతనిలో , మార్పు చూసి , రాబోట్ సెక్రటరీ , ఫ్యూమికో అడిగింది " ప్రైం మినిస్టర్ . మీ మొహం లో , సంతోషం , మీ కళ్ళళ్ళో వెలుగు , ఇంతవరకూ చూడలేదు.. "

ఇషాబా నవ్వుతూ తల ఊపాడు. .... " ఉ !!!......ఊ !!!..... " అంటూ.....మళ్ళీ , అన్నాడు. " ఐ లైక్ దిస్ మేన్ ... మనం , మహీ కి ఒకసారి వెళ్దాం . ఏర్పాటు చేయ్ సెక్రటరీ ! "

"యస్, ప్రైం మినిష్టర్ ! ..." అంది రాబోట్ సెక్రటరీ, ఫ్యూమికో .

****

మరిన్ని కథలు

Chivari pareeksha
చివరి పరిక్ష.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Teliviki pareeksha
తెలివికి పరిక్ష .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Krutagjnata
కృతజ్ఞత
- సి.హెచ్.ప్రతాప్
Manavatwam parimalinche
మానవత్వం పరిమళించే ....
- డా:సి.హెచ్.ప్రతాప్
Civic sense
సివిక్స్ సెన్స్
- డా:సి.హెచ్.ప్రతాప్