ముసలి కన్నీరు! - - బోగా పురుషోత్తం.

Mosali /kanneeru

పూర్వం కార్వేటినగరంలో ఓ పెద్ద కొలను వుండేది. అందులో నాల్గు జంతువులు కప్ప, చేప, తాబేలు, మొ సలి నివసిస్తున్నాయి.
కప్ప, చేప, తాబేలు, మొ సలి స్నేహంగా మెలిగేవి. ఒకరికొకరు తమ బాధలు చెప్పుకుని పరిష్కార మార్గం కనుగొనేవి.
మొసలి తన భారీ శరీరంతో ఆ కొలనులో తిరుగుతూ కొలను తనదేనని, తన తర్వాతే అందులో ఎవరైనా నివసించాలని గద్దించేది. మొసలి ఒత్తిడి భరించలేక దానికి కనపడకుండా కప్ప, చేప, తాబేలు ఓ పెద్ద కలుగులో నివసించేవి. వాటి మధ్య స్నేహం వుండటం వల్ల ఏ ఆపద రాలేదు. చేప తన పిల్లల్ని కలుగుదాటి రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకునేది.
ఓ రోజు మొసలికి ఆహారం దొరక్క కొలను అంతా వెతికింది. ఓ మూల పెద్ద కలుగు కనిపించింది. అందులో ఏవైనా కన్పిస్తాయోమోనని తన తొకతో నీటిని ఆడిరచింది. వాటి అలలకు మట్టితో వున్న కలుగు కరిగిపోయింది. లోపల దాక్కున్న చేప, దాని పిల్లలు, కప్ప, తాబేలు మొసలిని చూసి భయంతో వణికిపోయాయి.
చేప పిల్లల్ని నోటమింగింది మొసలి. కళ్ల ముందే మొసలి తన పిల్లల్ని తినేయడంతో కన్నీరు కార్చింది చేప, అది చూసిన కప్ప, తాబేలు గుండె చివుక్కుమంది. మిత్రుడికి పుత్రశోకం మిగిల్చిన మొసలిని ఎదిరించాయి.
మొసలి కోపంతో ఊగిపోతూ ‘‘నీ పిల్లలే కాదు.. ఇక్కడ వుంటే మిమ్మల్ని కూడా చంపేస్తా!’’ అని హూంకరించింది.
మొసలి బెదిరింపులకు చేప గజగజ వణికిపోయింది.
‘‘ మిత్రమా నువ్వేం భయపడకు.. ఆ మొ సలిని ఎలాగైనా తరిమేద్దాం..’’ అని అభయం ఇచ్చింది తాబేలు. అయినా తాబేలు వెన్నులో మొసలి భయం తగ్గలేదు.
రోజురోజుకూ తమ గూడు చెదిరిపోవడంతో ఓ చెట్టు కొమ్మచాటున చేప, తాబేలు, కప్ప దాక్కున్నాయి. కంటి మీద కునుకు లేకుండా గడిపాయి.
ఓ రోజు ఆ దారిలో వెళుతున్న ఏనుగుపిల్ల కొలను వద్దకు వచ్చింది. తొండంతో నీటిని తాగుతుంటే మొసలి వెళ్లి పట్టుకుంది. ఆ ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలా ఫీుంకరించింది,
ఆ అరుపులు విన్న తల్లి ఏనుగు అక్కడికి వచ్చి కొలనులోని నీటిని అంతా తొండంతో తోడి ఆ మొసలి మీదికి విసిరింది.
ఏనుగు దాటికి మొసలి విలవిలలాడింది. మిత్రులారా.. రక్షించండి ..రక్షించండి..’’ చచ్చిపోయేలా వున్నాను. మొసలి కన్నీరు కార్చింది. అప్పటికే మొసలి చేసిన ద్రోహానికి తగిన శాస్తి జరిగిందని ముగ్గురు మిత్రులు సంబరపడ్డాయి. అవి ఊహించినట్లే ఏనుగు కొలనులోని నీటిని అంతా తోడేసి బయటపడ్డ మొసలిని కాలుతో తొక్కిoది. అప్పటికే వెన్ను విరిగి దానికి మంచి శాస్తి జరిగిందిలే అని మిత్రులు సంబరపడ్డాయి.
విరోధం తో స్నేహానికి దూరమై ఎందరికో కన్నీటిని మిగిల్చిన మొసలి ఆర్తనాదాలు ఎవరూ ఆలకించలేదు. మొసలి కంట కన్నీరు మొసలి కన్నీరుగానే మిగిలిపోయింది.

మరిన్ని కథలు

Sharanagathi
శరణాగతి
- సి.హెచ్.ప్రతాప్
Manninchu priyatamaa
మన్నించుమా ప్రియతమా!
- టి. వి. యెల్. గాయత్రి
Sookshmam
సూక్ష్మం
- ఐసున్ ఫిన్
Pellipandiri
పెళ్ళీపందిరి
- సి.హెచ్.ప్రతాప్
Samudram lo Kakiretta
సముద్రంలో కాకిరెట్ట.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Manavatavadulu
మానవతావాదులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Photo teeyadam neramaa
ఫోటో తీయడం నేరమా! (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Paarina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.