గెలుపు - కొడాలి సీతారామా రావు

Gelupu

ఆర్టీసీ కథలు 9

ఒక్కోసారి ఓటమి కూడా గెలుపే ! @ @ @ ‘మనం కూడా క్రెడిట్ సొసైటీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయకూడదు?’ అన్నాడు విశ్వం.అతను జూనియర్ క్లర్కుగా పర్శన ల్ డిపార్టుమెంట్ లో పనిచేస్తున్నాడు. ఆర్టీసీలో పాలకొండ డిపో . ఆ డిపో ఆఫీసులో ఎక్కౌంట్స్,పర్శనల్ డిపార్టు మెంట్లు వుంటాయి.అందులో పది మంది పనిచేస్తున్నారు. ఆఫీసు టైం అయిపోయినా కాసేపు పిచ్చా పాటీ మాట్లాడుకుంటుంటారు రోజూ.కొందరు వెళ్ళి పోతారు. రమణ అన్నాడు ‘మన సంఘానికి ఇక్కడ బలం ఏదీ. వున్న పది మందిలో ముగ్గురు ‘ఎ’ సంఘం.మిగతా వారిలో సుందరం మనకి ఓటు వేస్తాడో లేదో అనుమానమే.ఇక మిగిలింది ఆరుగురం.మన ఎకౌంటెంటుగారు,హెడ్ క్లర్కు గారు వచ్చినప్పటి నించీ మన సం ఘం పిలుపు మేరకు ధర్నాలు,నల్ల బేడ్జీల తో నిరసన చేస్తున్నాం.అఫ్ కోర్స్ అదే అం దరికీ ఆశ్ఛర్యంగా వుందనుకో.’ ‘మంది తక్కువైనా మనం పోటీ చేస్తే మన సంఘం ఉనికి తెలుస్తుందని నా అ భిప్రాయం.’ ‘నీ ఆలోచన బాగుంది విశ్వం.పోటీ చేద్దాం.ఉనికి కోసమే.గెలుపు కోసం కా దు.ఐతే మన సెక్రటరీ గారికి తెలిస్తే మంద లిస్తారు. బలం లేని చోట ఎందుకు నిలబ డ్డారని.’ అన్నాడు ఎకౌంటెంట్. ‘ఐతే ఆయనకి చెప్పద్దు.తప్పే కానీ ముందుకే వెళదాం.అసలు కార్మికులలో ఎందరు మన సంఘం పట్ల అభిమానులు ఉన్నారో తెలుస్తుంది.’ అన్నాడు హెడ్ క్ల ర్కు. ‘నా వల్లే నిలబడ్డాం అని మన సెక్రటరీ గారికి నేను చెప్తాలే.ఐతే ఎవరు నిలబడతారు.’ ఎకౌంటెంట్ అన్నాడు. కొంత తర్జన భర్జనల తరువాత రమణనే నిలబడమన్నారు.అతను ఎస్టాబ్లిష్ మెం టు చూస్తాడు. కార్మికుల ఇంక్రిమెంట్లు అ తనే చూస్తాడు .అదీ కాక అతను అందరితో సౌమ్యంగా మాట్లాడతాడు.ఇంకో విషయం కార్మికుల కి రావలసిన ఏదైనా ఆలస్యం చేయకుండా అందేలా చేస్తాడు.

### ఆర్టీసీలో కార్మికులంతా కలిసి ఓ పరపతి సంఘం ఏర్పరుచుకున్నారు.ప్రతి ఉద్యోగి నించీ మొదటి నెల సభ్యత్వ రుసుముతో పాటు నిర్ణయించిన శాతం అతని మూల వే తనం ఆధారంగా వసూలు చేస్తారు జీతాల నుంచే.దానికి మంచి వడ్డీ వస్తుంది ఆ మొ త్తం నుంచీ అతను ఏడాది కోసారి అప్పు తీ సుకోవచ్చు. నిర్ణీత వాయిదాలలో జీతం నించే వసూలు చేయబడుతుంది.ప్రతి ఏడాది ఏప్రిల్ లో ఎవరి ఎకౌంటులో ఎంత వుందో వివరాలు అందచేస్తారు. ఆ సంఘానికి ఓ పాలక కమిటీ వుంటుం ది.దానికి కార్మికుల నుంచీ సభ్యులని ఎ న్నుకుంటారు. ఆర్టీసీలో ప్రధానంగా నాలుగు కార్మిక సంఘాలు వున్నాయి. ’ఎ’ సంఘం చాలా కాలం నించీ వుంది.అన్ని డిపోలు,యూని ట్లలో వుంది.ఆ సంఘం ఓ రాజకీయ పార్టీ కి అనుబంధంగా వుంది.’బి’ సంఘం దాని కి పోటీగా వచ్చి అనతి కాలంలోనే కార్మికు ల ఆదరణ పొందింది.ఇదీ అన్ని చోట్లా వుం ది. ఈ ‘బీ’ సంఘాన్నించీ బహిష్కరించ బడిన కార్మిక ఆభిమాన నాయకుడు ‘డి’ సంఘాన్ని స్థాపించాడు.చాలా మంది కార్మికులు,ఆఫీసు ఉద్యోగులు ఆ సంఘానికి సభ్యులయ్యారు.ఇంకో సంఘం ‘సి’ . ఇదీ రాజకీయ పార్టీ అనుబంధంగానే వుంటుంది.ఇది చాలా తక్కువ అంటే సు మారు ఓ నాలుగు జిల్లాలలోనే బలం కలిగి వుంది.చాలా సార్లు ‘ఎ’ సంఘంతో కలిసి పోటీ చేస్తుంది.ఈ అన్ని యూనియన్లకీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల సంఘాలు అనుబంధంగా వున్నాయి.ఐతే ఎక్కువ మంది ‘డి’ సంఘానికి అనుబంధంగా వున్నారు. ### ఈ డిపోలో ‘ఎ’ సంఘం బలం ఎక్కువ. ’బి’ బలం తక్కువ.మిగతా రెండు సంఘా ల ఉనికే లేదు.ఐతే ఆఫీసులో పనిచేసే ఓ ఏడుగురు ‘డి’ సంఘ మద్దతు అసోసియే షన్ సభ్యులు. సుందరం అనే అతను ఎకౌంట్స్లో జూని యర్ క్లర్కు.అతనికి పక్క డిపోకి బదిలీ కా వాలి.అతని వూరు అది.ఐతే అక్కడ ఖాళీ లేకపోవటం వల్ల అతనికి బదిలీ అవటం లే దు.ఆ విషయం అతనికీ తెలుసు. ఐతే ‘ఎ’ సంఘం జిల్లా సెక్రటరీ తను బదిలీ చేయిస్తా నని తమ సంఘానికి చందా కట్టమన్నా డు. అతను ఊగిసలాడుతున్నాడు.అదే రమణ అన్నది అతని ఓటు అనుమానం అని. ### రెండు సంఘాల అభ్యర్ధులు నామినేష న్లు వేసాక స్వతంత్ర అభ్యర్థిగా ఆఫీసు నించీ రమణ నామినేషన్ వేయించారు.త మ సంఘం తరఫున పోటీ చేయాలంటే సంఘ అనుమతి కావాలి. అందుకే స్వతం త్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. .ఒక్కసారి కలకలం చెలరేగింది రెండు సంఘాలలో.ఏ మిటి వీళ్ళ ధైర్యం అని చర్చ జరుగుతోంది నాయకులలో. సాయంత్రం ప్రచారం ఎలా చేయాలి అనే దాని గురించి ఎకౌంటెంట్ ఇంట్లో చర్చ జరి గింది.తలా వంద రూపాయలు వేసుకుని కరపత్రాలు మాత్రమే పంచాలి.బేనర్లు అవ సరం లేదు.అందరం కలిసి తెల్లవారి మొద టి బస్సు బయలు దేరే సమయం నించీ ప్ర చారం ప్రారంభించాలి.సాయంత్రం నుంచీ రా త్రి పదికి చివరి బస్సు వచ్చే వరకూ ప్రచా రం చేయాలి.మథ్యలో గేరేజిలో కార్మికుల ని కూడా కలవాలి. ఓడిపోతామని కాక గె లుపే ధ్యేయంగా తీవ్రంగానే ప్రచారం చేయా లి.డిపో ఎదురుగా ఎన్నికకి రెండు రోజుల ముందు ఒక మీటింగ్ పెట్టాలి. రేపు అంద రూ డబ్బులు తలా వంద రూపాయలు ఇ వ్వాలి.సాయంత్రం కరపత్రాలు ప్రింటింగ్ కి ఇద్దామనుకున్నారు.సుందరం రాలేదు రెండు రోజుల తరువాత సుందరం కూడా డబ్బులు ఇచ్చాడు. ఇంకో రెండు రోజులలో నామినేషన్ డేట్ ముగుస్తుందనగా ఆ రోజు సాయంత్రం ‘ఎ’ సంఘం డిపో కార్యదర్శి వచ్చాడు. ముం దు హెడ్ క్లర్కుని తరువాత ఎకౌంటెంట్ ని, రమణని కలిసాడు.పోటీ చేయద్దని నచ్చచె ప్పాడు.ఆరుగురు సభ్యులతో ఎందుకు పో టీ చేసి పరువు పోగొట్టుకుంటారు అన్నా డు.తమకి మద్దతు ఇవ్వమన్నాడు.చాలా చాలా చెప్పాడు. గమ్మత్తుగా అందరూ ఒకే సమాధానం చెప్పారు.మా పట్ల కార్మికుల అభిమానం ఎంతుందో తెలుసుకోవాలనే పోటీ చేస్తు న్నాం.మాకు గెలుస్తామనే నమ్మకం వుం ది. మరుసటి రోజు ఉదయం ‘బి’ సంఘం జిల్లా కార్యదర్శి వచ్చాడు.అతనికీ శూన్య హస్తం చూపించారు.అతను వారి సంఘం తరఫున పోటీ చేయమన్నాడు. కుదరద న్నారు. ### మరుసటి రోజు ఓ గమ్మత్తు జరిగింది. ఆ రోజు నామినేషన్లు వేయటానికి చివరి రోజు.’ఎ’ సంఘ డిపో సెక్రటరీయే నామినేష న్ వేసాడు. అంతకు ముందు వేసినతని నామినేషన్ ఉపసంహరించి. కారణం మే ము అప్పటికి మూడు రోజులుగా ప్రచా రం చేస్తున్నాం.కార్మికులలో కూడా చర్చ జరు గుతోంది. రమణని గెలిపిస్తే చదువుకున్న వాడు. మంచి సలహాలు ఇవ్వగలడు.పైగా కార్మి కులతో కలుపుగోలుగా వుంటాడు.అన్ని విధాల మనకి మంచి చేస్తున్నాడు అని. ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ప్ర చార తీవ్రత ఎక్కువైంది. అన్ని వర్గాల నిం చీ రమణ పట్ల కార్మికులలో సానుకూలత పెరుగుతున్నట్టు గమనించారు. ‘ఎ’ సంఘం వాళ్ళు కార్మికుల ఇళ్ళకి వెళ్ళి మరీ కుటుంబ సభ్యులని బెదిరిస్తు న్నారు.అది వారి పట్ల చాలా వ్యతిరేకత ఏర్పడుతోంది అని వారు గమనించలేకపో తున్నారు.ఆఫీసుకి పని మీద వచ్చిన కా ర్మికులు వారంతట వారే చెప్తున్నారు ఆఫీ సులో ఆ యూనియన్ సభ్యులు ఆఫీసులో వింటున్నా.పైగా మీరన్నా చెప్పండి అలా ఇళ్ళకి వెళ్ళి బెదిరించద్దని అని ఆ సభ్యులకి చెబుతున్నారు.ఆ విష యం వారు సీరియస్ గా తీసుకోలేదని త రువాత పరిణామాలు తెలియచేసాయి. పోటీ రమణ, ‘ఎ’ సంఘ సెక్రటరీ మథ్యే అని తేలిపోయింది.దాంతో ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఒకసారి,రీజనల్ కార్యదర్శి మూ డు సార్లు వచ్చారు ప్రచారానికి.వారు ఆఫీ సు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు చేసారు – లంచగొండులనీ,సామాన్య కార్మికులను పట్టించుకోరనీ. ఈ ప్రచారం రీజియన్ లోని ఆఫీసులో వారి మద్దతు సభ్యులలో కూడా అసంతృప్తి కలిగించింది. ఆ ప్రభావం ఎన్ని కలలో చాలా చోట్ల కనపడింది. పోలింగ్ కి మూడు రోజుల ముందు డిపో ముందు మీటింగ్ పెట్టాం.ఆఫీసు వాళ్ళంద రం వరుసగా నించున్నాం.షామియానా లేదు.ఒక మైకు వుంది.అందరం మాట్లా డాం. హఠాత్తుగా ‘బి’ సంఘ జిల్లా కార్యద ర్శి మా దగ్గరకి వచ్చి తనూ మాట్లాడతాన న్నాడు.మేము అంగీకరించలేదు.మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడని.మద్దతు ప్రక టించటానికే అంటే సరే అన్నాం. అతను తన సంఘ సభ్యులకి విఙ్నప్తి చేసాడు తమ ఓట్లు రమణకే వేయాలని. మన అభ్యర్ధి పోటీలో లేడనీ.ఆ అభ్యర్ధి కూ డా పక్కనే వున్నాడు.అతనూ విఙ్నప్తి చే సాడు. #### ‘బి’ సంఘం రమణకి మద్దతు తెలప టంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగె డుతున్నాయి.నిజానికి వారు అంత భ యపడవలసిన అవసరం లేదు. ఎందు కంటే ‘బి’ సంఘానికి వంద మంది సభ్యు లు కూడా లేరు. సరిగ్గా రేపు పోలింగ్ అనగా రాత్రి పదింటికి రమణ హెడ్ క్లర్కు గారి దగ్గరకి వచ్చాడు. ’సార్, కొందరు మా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళని బెదిరించారు.మన కార్మికులు కాదు.ఈ వూరి వాళ్ళు కూడా కాదు. భ యంతో మీ దగ్గరికి వచ్చా.’ ఇద్దరూ కలిసి ఎకౌంటెంటుని కలుసుకుని విశ్వంతో కలిసి రమణ ఇంటికి వచ్చి ఆ రాత్రి అక్కడే వున్నారు. ఉదయం నాలుగు నించే పోలింగ్ మొద లైంది.పోలింగ్ ఏజెంటుగా విశ్వం వున్నా డు.అతనికి డిపోలోని ఉద్యోగులందరూ తెలుసు.స్థానికుడు కూడా. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.’ఎ’ సంఘం వాళ్ళు గేటు బయట ప్రతి వారికి ఙ్నాపకం చేస్తున్నారు వారి గుర్తు మీదే ఓటు వేయాలని. ఎకౌంటెంటు,రమణ, సుందరం గేటు దగ్గరే వున్నారు.వాళ్ళూ తమ గుర్తును చూపిస్తున్నారు ఓ పేపరు మీద బొమ్మ వేసి. ### ఎన్నిక సాయంత్రం ఐదుకి ముగిసిం ది. ఆరు గంటలకి కౌంటింగ్ మొదలౌతుం ది.విశ్వం బైటికి వచ్చాడు.అందరం కలిసి సెంటరుకి వెళ్ళి టీ తాగాం.గెలుపు ‘ఎ’ సం ఘంకే కావచ్చు.అనుమానం లేదు. లే దు.రమణకి ఎన్ని ఓట్లు పడతాయన్నదే కావాలి. సుందరం అన్నాడు ‘ మనం గెలవం అని ఎందుకు అనుకుంటున్నారు.మొద టిసారి కార్పొరేషన్ చరిత్రలో ఒక ఇండిపెం డెంట్ గెలవడం చూస్తాం.అసలు ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగింది.మనం కూ డా తీవ్రతని బట్టి ప్రతి ఉద్యోగిని పదే పదే కలిసాం కదా.మనకి సానుకూలంగానే మాట్లాడారు కదా అందరూ.’ సుందరం అలా అనటం ఆశ్ఛర్యం కలిగించినా ఆశా జనకంగా వుండటంతో అతన్ని అందరూ కౌగిలించుకుని ‘బాలవాక్కు బ్రహ్మ వాక్కు’ అన్నారు. ఆఫీసులో అందరిలో చిన్నవాడు మరి! పావు తక్కువ ఆరుకి విశ్వం లోపలికి వెళ్ళాడు.ప్రతి పావు గంటకి బయటికి ఫలితాలు తెలుస్తున్నాయి.మొదట ‘ఎ’ సంఘానికి అనుకూలం అనిపించినా త రువాతి ఫలితాలు రమణకే అనుకూలంగా వున్నాయి. విశ్వం బేలట్ పేపర్లని జాగ్రత్తగా గమ నిస్తున్నాడు మొదటి నించీ.చెల్లని ఓట్లు కొన్ని పక్కన పెట్టారు. చివరి రౌండ్ పూర్తి అయ్యే వరకూ ఉ త్ఖంఠగా సాగింది గెలుపు ఇటు అటు. చి వరి రౌండు పూర్తయ్యేసరికి ఒక ఓటు మెజారిటీతో ‘ఎ’ సంఘ సెక్రటరీ గెలిచాడు! ఎన్నికల అధికారులు మరోసారి కౌంటింగ్ అంటారేమోనని విశ్వం వంక చూసారు.వి శ్వం అవసరం లేదన్నాడు. కానీ, ‘ఎ’ సంఘం సెక్రటరీ మరో రౌండు కోరాడు. మరో గంట తరువాత కూడా అదే ఫలితం వచ్చింది.విశ్వం లేచి నుంచున్నాడు సంబంధిత కాగితాల మీద సంతకాలు పెట్టటానికి. నిబంధనల ప్రకారం ‘బి’ సంఘ ఏజెం టు కూడా వున్నాడు.అతను అడిగాడు మరోసారి కౌంటింగ్ కావాలని.మరో అర గంట తరువాతా ఫలితం అదే. ‘ఎ’ సంఘ సెక్రటరీ లేచి విశ్వాన్ని గా ఢంగా కౌగిలించుకుని ‘సార్.మీరే గెలిచా రు.ఆషామాషిగా అనుకున్నాం రమణ గా రిని.కానీ మీకు కార్మికులలో ఎంత అభి అభిమానంవుందో అర్థమైంది.ముందు మే ము మా విధానాలు మార్చుకోవాలి.ఇదో మంచి గుణపాఠం.’ బయటికి చివరి ఫలితం ప్రకటించగానే ఆఫీసు వాళ్ళంతా కలిసి రమణని భుజా జాల మీద ఎక్కించుకుని చాలా సేపు గే టు ముందు అటూ ఇటూ తిప్పారు.’బి’ సంఘ సభ్యులు కూడా కలిసారు.వాళ్ళు తెచ్చిన బాణసంచా కాల్చారు. ఇంతలో ’ఎ’ సంఘ సెక్రటరీ బయటికి వచ్చాడు విశ్వంతో.రమణని కౌగిలించుకు ని ‘నాది గెలుపు కాదు సార్.మీదే గెలు పు.’అన్నాడు ! ఒక్కోసారి ఓటమి కూడా గెలుపే !! @

మరిన్ని కథలు

Nayakudu
నాయకుడు
- కొడాలి సీతారామా రావు
Nippuki cheda pattadu
నిప్పుకి చెద పట్టదు
- కొడాలి సీతారామా రావు
Ediri soottaandu
ఎదురి సూత్తాండు..!
- చెన్నూరి సుదర్శన్,
Swapnam chedirina ratri
స్వప్నం చెదిరిన రాత్రి
- సి.హెచ్.ప్రతాప్
Manavatwame nijamaina laabham
మానవత్వమే నిజమైన లాభం
- సి.హెచ్.ప్రతాప్
Mosali /kanneeru
ముసలి కన్నీరు!
- - బోగా పురుషోత్తం.
Sharanagathi
శరణాగతి
- సి.హెచ్.ప్రతాప్
Manninchu priyatamaa
మన్నించుమా ప్రియతమా!
- టి. వి. యెల్. గాయత్రి