మలి వయసు చివరి మజిలీ.. - వరలక్ష్మి నున్న

Mali vayasu chivari majili

ఆకాశంలో సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. 65 ఏళ్ల రాఘవరావు పార్కులో తనకిష్టమైన బెంచీ మీద కూర్చుని పాత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. భార్య చనిపోయి ఐదేళ్లు కావస్తోంది, ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూ గడపడమే ఆయన దినచర్య. కానీ, గత నెల రోజులుగా సుమతి గారు పరిచయం కావడంతో ఆయన జీవితంలో మళ్ళీ చిన్నపాటి వెలుగు మొదలైంది. ఒకరోజు రాఘవరావుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. పార్కుకి రాలేదు. సుమతి గారు ఆందోళనతో ఆయన ఇంటికి వెళ్లారు. మంచం మీద నీరసంగా ఉన్న ఆయన చేయి పట్టుకుని, "మీరు ఒంటరి వారు కాదు, నేనున్నాను" అని భరోసా ఇచ్చారు. ఆ క్షణంలో వారికి ఒక గొప్ప నిజం అర్థమైంది. ప్రేమ అంటే కేవలం కలిసి తిరగడం, కామ వాంఛలు తీర్చుకోవడం అనే ఆలోచన నుండి బయట పడితే గాని తెలియదు... మలివయసులో మనిషికి, మనసుకు "నేను ఉన్నాను" అని ఇచ్చే చల్లని స్పర్శే అసలైన ప్రేమని. ఆ స్పర్శలో ఒక మందు బిళ్ల ఇవ్వలేని ఉపశమనం ఉంది. ఆ మాటలో కోటి ధైర్యాలు ఉన్నాయి. లోకం ఏమనుకుంటుందో అన్న భయం లేదు, కేవలం మిగిలిన జీవితాన్ని ఒకరికొకరు ఆసరాగా గడపాలన్నదే వారి ఆశ. ఆ సాయంత్రం ఒకరి చేయి ఒకరు పట్టుకుని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ వారు మౌనంగా ఉండిపోయారు..... వాళ్ళ ని కన్నవాళ్లు లేరు... తమ సంతానం ఎలాగు అవును అనరు, కాదు అనరు... వాళ్ళు కి చెప్పారు... ఆమోదం కోసం కాదు, అనుమతి అసలు కాదు, అనుమాన బీజాలకి, అనూహ్య ధోరణి లకి తావు ఇవ్వకూడదు అని...

మరిన్ని కథలు

Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్