హెడ్కానిస్టేబుల్ సుబ్బారావు తెల్లవారు ఆరింటికి, ఓ నలుగురు కానిస్టేబుల్స్ తో ఒక ఇంటి ముందు నుంచున్నాడు. " అవును...అవును ఇదే వాడి ఇల్లు' అని ఒక కానిస్టేబుల్ అంటే.. ఇంతలో మరో ఆఫీసర్ "సందేహమే లేదు వాడు ఇంట్లోనే ఉన్నాడు' అన్నాడు. 'మనం ఇలాగె ఇక్కడ చెప్పుకుంటూ నుంచుంటే వాడు ఏదో ఒక ఆయుధం తీస్కొని మనపై దాడి చేసిన చేస్తాడు..."అంటూ క్రిమినల్స్ అంటే భయపడే ఒక పోలీస్ ఆయన అన్నాడు. "కామాన్ ఆఫీసర్స్ ఇక మన ఆపరేషన్ "టీ" మొదలు పెడదాం' అన్నాడు ఎప్పటికైనా ధైర్యశాలి అన్న బిరుదు పొందాలనుకుంటున్న హెడ్కానిస్టేబుల్ సుబ్బారావు. ఇప్పుడేం "టీ" సార్, మనం టీ తాగి వచ్చేలోపు వాడు తపించుకుంటాడేమో' అన్నాడు కానిస్టేబుల్ మోహన్. టీ అంటే తాగే టీ కాదయ్యా....టీ అంటే ఆపరేషన్ థీఫ్! అని' అంటూ కసురుకున్నాడు సుబ్బారావు. చిన్న సింగల్ రూమ్ రేకుల ఇల్లు అది.గుమ్మం ముందు ఊడిపోతే పిన్ పెట్టిన పాత చెప్పులు. సుబ్బారావు హీరోల ధడేలుమని తలుపును తోసాడు, కానీ కమెడియన్ ల వెన్నకి బౌన్స్ అయ్యి పడబోతే తృటిలో మోహన్ పట్టుకున్నాడు. మొత్తానికి తలుపు తెరుచుకొని సుబ్బారావు బృందం లోపలికి వెళ్లి, హాయిగా పాడుకుంటున్న అంజి నిద్ర చెడగొట్టి, అంజి పై దండయాత్ర చేసి, అతన్ని అతలాకుతలం చేసి....ఒక హంతకుడని తీసుకెళ్లినట్టు జీప్ ఏకించి స్టేషన్ కి తీసుకెళ్లారు. సుబ్బారావు అంత పోదున్నే ఆపరేషన్ 'టీ' చేయడంతో అలసిపోయి, మిగితా కానిస్టేబుల్లను అంజి సంగతి చూసుకోమని అతడు విశ్రాంతి తిస్కోడానికే వెళ్ళాడు. అసలు అంజిని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే. అంజి ఒక మొబైల్ షాపులో పని చేస్తున్నాడు, అతనికి ఇంకా పెళ్లి కాకపోవడంతో తనకి వచ్చే జీతం తన తల్లితండ్రులకు పంపగా అతని ఖర్చులకు సరిపోయేవి. కాలం గడిచేకొద్దీ మనిషికన్నా, మానవత్వంకన్నా, బంధాలు - బంధుత్వాలకన్నా డబ్బు వెంట పరిగెడుతున్న మనుషుల్ని చూసి మనిషి జన్మపై విరక్తిపుట్టింది అంజికి. ఒక రోజు ఓనర్... షాప్ కాసేపు అంజికి అప్పజెప్పి పనిమీద బయటికి వెళ్ళాడు. ఓనర్ తిరిగి వచ్చి కౌంటర్ వద్ద డబ్బు లెక్కబెట్టగా ఇరవై వేలు తగ్గాయి. అంజిని శతవిధాలుగా అడిగిన నాకు తెలీదు సార్ అనే బదులిస్తున్నాడు. చేసేది లేక ఓనర్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సుబ్బారావు వచ్చి చూసేసరికి స్టేషన్ లో అందరూ అంజికేసి చూస్తూ నవ్వుకుంటున్నారు. నిజం కక్కించమని వెళ్తే వీళ్లేంతబ్బా నవ్వుకుంటున్నారు అని బుర్రగోక్కుంటు వచ్చి...ఏంటి మోహన్ ఏమైంది!! ఎందుకు అలా నవ్వుతున్నారు మోహన్ ని అడిగాడు. సార్ ఇరవైవేలు దొంగిలించింది వీడే సార్. అ...హహహ... అని పళ్ళికిలించాడు. డబ్బేమ్ చేసాడో అడగకుండా ఆ వెక్కిలి నవ్వు ఏంటయ్యా అన్నాడు సుబ్బారావు కొంచం విసుగు ప్రదర్శిస్తూ. అదికాదు సార్ ఒకసారి మీరు అడగండి అన్నాడు మోహన్. మన సుబ్బి సర సర వెళ్లి, లాఠీ పుచ్చుకొని.' చెప్పారా!! నిజం చెప్పు....ఆ డబ్బు ఎం చేసావో చెప్పు!! లేకపోతే ఈ లాఠీ చూసావ్గ దింతో ని వీపు పగలగొడ్తా' అన్నాడు ఆవేశంతో. సుబ్బి హడావిడి చూసి నిజమే అని భయపడిన అంజి ' చెప్తా సార్...చెప్పేస్తా' అన్నాడు. ఉఉమ్మ్.... ఆలారా దారికి చెప్పు అని గర్జించాడు. అంజి ఇక మొదలుపెట్టాడు... మొన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే ఫుట్-పాత్ మీద బిచ్చగాళ్ళు, పేదవాళ్ళు పాపం అంత చిలీలో కప్పుకోడానికే దుప్పటికూడా లేక వణుకుతున్నారు సార్.వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలనిపించింది. నా దెగ్గర డబ్బులు లేకపోవడంతో షాప్ లో డబ్బులు తీస్కొని ఓ ఇరవై రగ్గులు కొని రోడ్డు మీద పడుకునే వారికీ పంచిపెట్ట సార్. నా దెగ్గర డబ్బులు ఉన్నపుడు మళ్ళి షాపులో పెట్టేదం అనుకున్న. అయినా నేను చేసింది మంచిపనే కాబట్టి మా షాప్ ఓనర్ కి కూడా పుణ్యం వస్తుంది సార్" అన్నాడు భయంతో బయటికి రావాలనుకుంటున్న కన్నీళ్లను ఆపుకుంటూ. అంజి మాటలకు విస్తుపోయిన సుబ్బి " ఓరిని దుంపతెగా ఎంతపని చేసావ్... సరే నువ్వన్నట్టు ఇరవై రగ్గులు తీసుకున్న ఇంకా ఐదువేలు మిగులుతాయిగా!! అవేం చేసావో చెప్పి తగలడు...." అది..అది..సార్.. మనమంటే ఎం అవసరం ఉన్న మాట్లాడగలం.కానీ మూగజీవాలు ఆలా కాదు కదా సార్. అందుకే మిగిలిన డబ్బుతో రోడ్ల మీద ఉండే మూగజీవాలకు పచ్చగడ్డి కొని వేసా సార్ ....." అన్నాడు అంజి తాను చేసింది అసలు తప్పుకాదు అన్న గర్వంతో. నీకడుపు చల్లగుండా....మామంచి దొంగవేరా!! దానం చేయాలంటే ని సొంత డబ్బుతో చేయాలి కానీ ఇలా ఇతరుల డబ్బుతో వారికీ ఇబంది పెట్టు చేయకూడదురా. ఇది తెలియక చేసినతప్పు కాబట్టి కేసు లేకుండా వదిలేస్తున్న ఇంకోసారి ఇలా చేయకు. అంటూ... అంజి మంచి మనసుకి ముచ్చటేసి. దారిఖర్చులకు,తినడానికి కొంత డబ్బులిచ్చి పంపించాడు సుబ్బారావు. ఇది మా ఊర్లు నిజంగా జరిగిన సంఘటన 😌🙂 *కథ సమాప్తం*

