మల్లి విరిసింది(ఒక వేశ్య కథ) - రంగనాధ్ సుదర్శనం

she like jasmine

బెరుకుగా భయం భయంగా ఆ ఇంటిముందు తచ్చాడుతున్నాను.

చలి కాలమైనా వళ్లంతా చెమటలు పడుతున్నాయి.

అక్కడక్కడ వెలిగే వీధి దీపాలు తప్ప వీధంతా నిర్మానుష్యఒగా ఉంది.

పక్క నుండి ఒక కుక్క నన్ను  వాసన చూస్తూ  వెళ్లి పోయింది.

ఇంటి లోపల నుండి అప్పుడప్పుడు మత్తైన మూలుగు లాంటి శబ్దాలు సన్నగా వినిపిస్తున్నాయి.

మెల్లగా గుండె చిక్కబట్టుకొని..తడబడే అడుగులను అదుపులో ఉంచుకొని పట్టి పట్టి  వేస్తూ..తలుపు దగ్గర నిలబడి పిలిచాను.

ఏవండి .....

గొంతు పెగలటం లేదు..

నా మాటలు నాకే  వినిపించడం లేదు.

గొంతు తడి ఆరిపోయింది,

నాలుక పిడుచ కట్టినట్లుంది...

ఆరిపోతున్న పెదవులను  నాలుకతో తడుపుకొని..
మళ్ళీ పిలుద్దామనుకున్నాను...

కానీ గొంతు పెగలటం లేదు.

గుండె వేగంగా కొట్టుకుంటున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది.

చెట్టుపై ఉన్న పిట్టలు చలికి  ముడుచుకుంటు  టప టప లాడిస్తూ సరిచేసుకుంటున్న రెక్కల శబ్దం కూడా చాలా పెద్దగా వినిపిస్తుంది.

ఆకాశంలో  చందమామను త్వరగా పట్టి బంధించాలన్నట్లు  ఆతృతగా మేఘమాలికలు పరుగులు పెడుతున్నాయి.
అప్పుడప్పుడు ముసుగేసిన మబ్బులను విదిలించుకుంటూ బైటికి వస్తున్న చంద్రుణ్ణి ...మళ్ళీ ముసుగులు కప్పి మబ్బులు దాచేస్తున్నాయి....
బైటికి వస్తున్న చంద్రుడు..
చంద్రుణ్ణి కప్పేస్తున్న మబ్బులు ...

దోబూచులాడుతూ.. సయ్యాటలాడుతూ.. చెలియ చుక్కలకు  కనువిందు చేస్తున్నాయి.

తలుపు పై చేయి వేసే లోపే... తలుపులు తెరుచుకున్నాయి...

ఒక పురుషాకారం నన్ను ఎగాదిగా చూస్తూ నన్ను దాటి  గబ గబా... వెళ్ళిపోయింది.

నేను కలవాలనుకున్న ఆమె పెదవుల మధ్య  జడ క్లిప్పు పట్టుకొని  రెండు చేతులతో జడ అల్లుకుంటూ బైటికి వచ్చింది.

సగం వూడిన జాకెట్ హుక్స్ నుండి..బైటికి వస్తున్న అందాలను మధ్యలో వేలాడుతున్నట్లున్న పవిట దాచలేక పోతుంది.

అప్రయత్నంగా నా చూపులు ఆవైపు వెళ్లాయి..నా గుండె లయ తప్పింది..ఒంట్లో ఆవిర్లు పొంగుతున్నట్లుంది.

ఏయ్..ఏంగావలె..ఎందుకొచ్చినవ్, ధమాక్ గిట్ల  పాడైందా.. ఏంది అంది.

చూసిన కాడికి సాలుగాని... ఇగ నడువు అంది నన్ను  గంజి లో ఈగను తీసినట్లు చులకన చేసి...

అది...నాకు పెళ్లి.....అన్నాను
నా మాట పూర్తి కాకముందే...

చుప్ బె...ఆఫీసుల జూసినప్పుడు మంచి పోరనివని పలకరించిన..
నువ్వు అందరిలెక్కనేనా...
చల్ నడువ్ అంది గట్టిగా.

నా ఒళ్లంతా.. చల్లబడింది..కళ్లు తిరుగుతున్నట్లు, కాళ్ళు లాగుతున్నట్లు..మెదడు మొద్దు బారినట్లనిపించింది...

అది..అది... పెళ్లికి ముందు.. ఒకసారి అనుభవం ఉంటే మంచిదని ఫ్రెండ్స్ అంటే...
తడబడుతూ సగం సగం మింగుతూ ఏం మాట్లాడుతున్నానో..నాకే అర్ధం కాకుండా మాట్లాడుతున్నాను.

ముయ్యవయా...నీ సోది నువ్వు..అంది...కసురుకుంటూ...

ఈ లోగా పోలీస్ విజిల్ వినిపించింది.

ఏయ్..పోరగా నేను చెప్పేదాక బైటికి రాకు ఆగమై పోతావ్ అంటూ నన్ను గదిలో దండెం మీద వేలాడే బట్టల వెనుకగా నెట్టి నిలబెట్టింది.

నాకు వాళ్ళు కనిపిస్తున్నారు..కానీ నేను వారికి కనిపించను.

ఓ బట్టతల పోలీస్ " ఏఒదే... మల్లి మస్తు ఉషారుగున్నావ్ మంచి గిరాకీ తగిలినట్లుంది.." అంటూ..కూర్చొని చేతిలో ఉన్న మందు బాటిల్ విప్పి మందు.. నీళ్లు కలుపుకొని తాగిండు.

ఏయ్...ఇట్రావే.. అంటూ మల్లి చెయ్యి పట్టి గుంజి పక్కన కూసోబెట్టుకుండు..
చేయి ఎక్కడెక్కడో తడుముతుంది.

ఆమె అడ్డు చెప్పలేదు కాని... అయిష్టత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది...తప్పదన్నట్లు అతనికి లోబడిపోయింది.

ఏం సార్...మస్తు ఉషారుగున్నావ్..
పస్తుల కాపురమా..అంది.

"ఆ... ఏం చెప్పమంటావ్...ఇంటిదాన్ని ఎంతో  ప్రేమగా రావే అంటే...కాళ్ళనొప్పులు, నడుం నొప్పి, చేతకావట్లేదనే రొటీన్ గా చెప్పే మాటలు తప్ప ..ఇంకేముంటుందే.. 

అందుకే అప్పుడప్పుడు  నీదగ్గర ఇలా  కక్కుర్తి పడటం " అన్నాడు..

ఏం.. సార్ బిళ్ళలు ఒకటా రెండా.. జోరుపెరిగింది అంటూ బట్టతలపై కారుతున్న చెమటను అరచేతితో తుడిచింది.

ఏయ్..అదేం లేదే..నీ మీద మోజు పెరిగింది అన్నాడు అయాస పడుతూ..

అబ్బో...లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర నిజం చెపితేనే తెలుసుకుంటారు..
మా దగ్గర కాదు సారు..
బట్టతల మీద చెమటలు, కాలిపోతున్న వళ్ళు, అల్లాడిపోతున్న గుండె చప్పుడు నాకు తెల్వదా సార్ అంది.

ఓర్నియమ్మా...డాక్టర్ కంటే ఎక్కువ చెపుతున్నావేంటే...

గంతే కదా సార్...
సేత గాక పోతే మా ఆడొల్లమ్ మూసుకొని కూసుంటం...
మీరేమో సేతగాకపోయినా ...
బిల్లలు ఏసుకొని మొగోళ్లమనుకుంటరు...
ఎందుకు సార్ లేనిది కొనుక్కొని..
గింత ఆరాట పడటం...అవసరమా .
వూకుంటే ఎవ్వరడుగుతారు సారు అంది.

ఏయ్..వూకోవే దొంగ.....డా,
నేనేమైన సన్యాసం తీసుకున్ననా..వూకోడానికి
మందులున్నయి ఎందుకే..ఏసుకోడానికి కాదా...నీకు తెలుసా..అసలు ప్రపంచంలో ఎక్కువ అమ్ముడు పోయే మందులు ఇవ్వేనే అన్నాడు.

అవును గాని  మల్లీ.. ఎప్పుడు ముడుసుక పోయేదానివి..లైట్ తీయమనే దానివి...ఎందే ఇయ్యాలా ఫుల్లు కోపరేషన్ చేస్తున్నావ్ లవ్వు పేరిగినట్లుందే... నా మీద అన్నాడు.

ఏం చేస్తాం సార్...నవ్వు రాకున్నా నవ్వాలి, ప్రేమ లేకున్నా..సూపెట్టాలి..వచ్చినోడు మళ్ళీ రావాలి గదా సార్..అంది.

మల్లి...నీ దగ్గర ఎదో మాయుందే.... ఆకలేస్తే బిర్యానీ తినాలనిపించినట్లు,,ఈ ఆకలైతే నువ్వే గుర్తొస్తావే.. నీ మీద ఒట్టు అన్నాడు..రొప్పుతూ..

సార్ గీ బిర్యానీ రేండ్రోజులు తింటే మోఖం కొడ్తది..గదే అన్నమైతే ఎప్పుడు తిన్నా ఇంకా   కావాలనిపిస్తది..ఇంట్లో పెళ్ళాం కూడా అన్నంలాంటిదే సారు అంది.

అబ్బో... వేదాంతం బాగానే చెప్తున్నావే.. అంటూ పైకి లేచి బట్టలు వేసుకొని ఇగో వే ఇయ్యాలా ఖుషీలో...మొట్టమొదటి సారి నీదగ్గర తీసుకోకుండా నీకే...ఇస్తున్నా అంటూ..డబ్బులు చేతిలో పెట్టి బైటికి నడిచాడు.

ఏయ్..పొరగా బైటికి రా..అంది.

నీ పేరు వేణు కదా..అంది

అవునన్నట్లు కిందికి మీదికి తలా వూపాను.

చూసినవా....
నువ్వు చూడాలనే ఇయ్యాలా వానికి మనసు చంపుకొని  ఒళ్ళు వదిలిన...

ఎంత చెడిపోయినా.. మాకు మనసుంటదయ్యా...

శరీరం అమ్ముకుంటాము గాని మనసు కాదుగా..

దేవుడు ఆకలిని ఎందుకిచ్చాడో గాని, జానెడు పొట్టకోసం... ఈ పాపపు పని చేసినప్పుడల్లా మనసు పడే రఒపపు కోత..మీకేం తెలుసయ్యా..

మేము ఆకలి కోసం..
పిల్లల కోసం..
గుండెలు మండుతున్నా..కడుపు మంట సల్లార్చుకోటానికి రోజు సస్తూ.. బతుకుతున్నాము...

వద్దయ్య నువ్వెట్ల నీ భార్య నీకే మొదటి సుఖం ఇవ్వాలనుకుంటావో..

నీ భార్య గుడా గట్లనే అనుకుంటది.

జీవితంలో జీవితాంతం గుర్తుండేది మొదటి రాత్రేనయ్యా...అది చాలా  పవిత్రంగా వుండాలయ్యా...అది శరీరాల  సుఖం కాదయ్య..మనసుల పవిత్ర కలయిక..ఈ రోజు కోసమే కన్నెపిల్ల కలలు కంటుంది..ఈ రోజు తరువాత ఆమెను   కన్నెపిల్ల అనరయ్యా అంది.

చాపకు..ఈత .. కోయిలకు పాట..పసి పాపకు పాలు తాగడం ఎవరు నేర్పరయ్యా...ఆ దేవుడే నేర్పిస్తాడు.. ఇది అంతేనయ్యా..

ఇంకా నీకు ఈ నీచమైన సుఖ అనుభవం కావాలంటే రా... ఈ శవాన్ని..అనుభవించిన వారిలో నువ్వు చేరిపోతావు అంది.. కారుతున్న కన్నీళ్లు తుడ్చుకుంటూ..కానీ దీని తరువాత నువ్వు నీ భార్యకు ఎప్పటికీ సెకండ్ హ్యాఅండ్ వి మాత్రమే...ఈ మొదటి అనుభవం గుర్తిచ్చినప్పుడల్లా నేనే గుర్తొస్తాను ...నీ భార్య గుర్తుకు రాదు...కోటి ఆశలతో వచ్చే ఆ పిల్లకు ఎంగిలి కూడు పెట్టకయ్యా..అంది దారలా..కారుతున్న కన్నీటిని పవిటతో తూడ్చు కుంటూ..

నేను చెడిపోయిన దానిని కావొచ్చయ్యా  కానీ ఎవరిని చెడగొట్టలేదయ్యా...అంది..కుప్పగా కూలిపోతూ..

అంతే... నా మనసులోని అపోహలన్ని  తొలగిపోయాయి నిజంగా ఆ సమయంలో..తాను ఓ మూర్తీభవించిన..పవిత్ర మూర్తిలా..అర్జునునికి గీతోపాదేశం చేస్తున్న శ్రీ కృష్ణుని రూపంలా కనిపించింది.

క్షమించమని...అక్కడి నుండి బైటికి నడిచాను.

చాలా ప్రశాంతంగా అనిపించింది..
మనసు కాస్తా నెమ్మది పడింది..
శరీరం నా అధీనంలోకి వచ్చింది..
గట్టిగా శ్వాస తీసుకున్నాను..
శరీరానికి పట్టిన చెమటలు తగ్గిపోయాయి..
ఇప్పుడు నాకు చలి వేస్తుంది..

ఆ తరువాత...

నా పెళ్లి, శోభనం అన్ని బాగా జరిగాయి.

ఆమె చెప్పింది అక్షరాలా నిజమనిపిఒచింది.
ఎవరూ ప్రత్యేకంగా ఏదీ నేర్చుకోవాల్సిన  అవసరం లేదు...అదో ప్రకృతి సృష్టించిన యజ్ఞం...ఆ సమయంలో అన్ని తెలిసిపోతాయి అంతే..అదే సృష్టికార్యం.

ఆ తరువాత ఆమెను కలిసినప్పుడు,
అక్కా.. అని నోరారా పిలిచాను..
ఆమె పరవశించి పోయింది..పాప ప్రక్షాళన జరుగుతున్నట్లు...ఆమె కళ్ళు వెంట గంగ ఉప్పొంగింది.

ఆమెను ఆ పాప కూపంలోనుండి బైటికి రమ్ముని అడిగాను.

తమ్ముడిగా ఆజ్ఞాపిస్తే...ఇప్పటికిప్పుడు చచ్చిపోవడానికి కూడా సిద్ధమేనని చెప్పింది.

నాకు కావాల్సింది అదే...నీ పాత జీవితాన్ని ఈరోజే చంపేయి.. నేను చెప్పినట్లు  కొత్త జీవితంలోకి అడుగు వేయమన్నాను.

సరే తప్పకుండా అంది..

ఒక హాస్టల్లో ఉద్యోగంలో చేర్పించాను..

ఆమె ఇప్పుడు.. అన్నీ మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది..
ఆ తరువాత తన కాళ్లపై తాను నిలబడింది... కష్టపడి... చదివి,ప్రభుత్వ ఉద్యోగంలో స్థిర పడింది.

ఆ తరువాత...
రాయిని ఆడది చేసిన రాముడు కాకున్నా..
గంగను తలా పై మోసే శివుడు కాకున్నా..

విషయం అంతా తెలిసిన..

ఒక మనసున్న మంచి మనిషి చేయి అందించాడు.
తమ్ముడిగా దగ్గరుండి...అక్క పెళ్లి చేసాను..

ఆమె చీకటి జీవితంలో... దీపం వెలిగింది

వాడిన మల్లి.. మళ్ళీ విరిసింది.

 

 

 

మరిన్ని కథలు

Honesty in corruption
అవినీతిలో నిజాయితి
- పద్మావతి దివాకర్ల
forever
పదికాలాల పాటు
- శింగరాజు శ్రీనివాసరావు
good vibes
శుభ పరిణామం
- మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ
bad or good
శాపమా! వరమా!!
- పద్మావతి దివాకర్ల
role village
ఆదర్శ గ్రామం
- చెన్నూరి సుదర్శన్