కాకి కుతూహలం - కృష్ణ చైతన్య ధర్మాన

crow interest

అనగనగా దేవాది అనే గ్రామంలో ఒక చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన రెండు కాకులు కొత్తగా జీవితాన్ని ఆరంభించాయి. ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంది. రోజూ సాయంత్రం ఆరుగంటల సమయానికి ఆ తొర్రలోనికి ఒక పాము దూరుతుంది. ఒక అరగంట తరువాత అదే తొర్రలోనికి ఒక ఎలుక దూరుతుంది. మరుసటి రోజు పొద్దున్నే, ముందుగా ఎలుక ఆ తొర్రలోనుంచి బయటకు వస్తుంది. కాసేపటి తరువాత పాము బయటకు వస్తుంది. ఇది ఆ చెట్టు వద్ద రోజూ జరిగే బాగోతమే! కానీ చెట్టుపైకి కొత్తగా వచ్చిన రెండు కాకులకు ఆ సంగతి తెలీదు. ఆ కాకులు మొదటిసారి చూసినపుడు ఎలుకను ఆపబోయాయి. కానీ ఎలుక తొర్రలోనికి పరిగెత్తింది. మరుసటి రోజు ఉదయం నవ్వుతూ బయటకు వచ్చిన ఎలుకను చూసి కాకులు రెండూ ఆశ్చర్యపోయాయి. రెండు రోజులు ఇదే జరగడంతో అసలు లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహులం ఆ కాకులలో బాగా పెరిగింది. "ఇవాళ రాత్రి ఆ తొర్రలోనికి దూరి ఎలాగైనా ఆ గుట్టుని కనిపెట్టాలి!" అని అరిచింది ఆడకాకి. "అవును నేను కూడా నీతోవస్తా!" అని అరిచింది మగకాకి. చెట్టు పైన ఆడే మాటలు తొర్రలోనికి చక్కగా వినిపిస్తాయి. అందువలన ఆ కాకుల మాటలను ఎలుక, పాములు విని ఎప్పటిలాగానే సిద్ధపడ్డాయి. ఆ రోజు రాత్రి రెండు కాకులు తొర్రలోనికి దూరాయి. చాటుగా దాక్కున్న పాము ఒక కాకి మెడను కొరికింది. మరో చాటుగా దాక్కున్న ఎలుక ఇంకొక కాకి మెడను కొరికింది. వాటికి చక్కటి విందు లభించింది. నీతి: మన ముందు వింతలు జరిగినప్పుడు, వాటి వెనుక ఉన్న మోసం గ్రహించకుండా అనవసరమైన కుతూహలం, ఆవేశం ప్రదర్శించరాదు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి