విజిల్ - బి.రాజ్యలక్ష్మి

Whistle

తెల్లవారు ఝామున లేచి కాసిని మంచినీళ్లు తాగి కిటికీ దగ్గర కూచుని రాసుకోడం నాదినచర్య !చల్లని గాలి ,వీధిలో సందడి ,వాకింగుల వాళ్ళు ,పక్షుల మధురమైన స్వరాలూ యివన్నీ నన్ను మైమరపిస్తాయి ! సరిగా అదేసమయానికి పాల వాను డబిడబ్ శబ్దం చేస్తూ పోతుంది .బూత్ దగ్గర పాలప్యాకెట్లు దింపేసి వాన్ వెళ్తుంది ! అక్కడికి ఒక కుర్రాడు టైట్ ప్యాంటు ఒక T-షర్ట్ ,చెంపలమీద పడుతున్న జుట్టు ,కాళ్లకు చెప్పులు హుషారు చూపులు ,నాకెందుకో పదిరోజులనించి వాణ్ణి చూడ్డం అనుకోకుండా అలవాటయ్యింది !వాడు ప్లాస్టిక్ బాగ్ లో కొన్నిపాలప్యాకెట్లు పెట్టుకుని బూత్ నించి బయల్దేరతాడు .వాడు విజిల్ వేసుకుంటూ మా ఎదురిల్లు రాగానే అడుగులో అడుగు వేస్తూ పదేపదే ఆ ఇల్లు చూస్తూ సాగిపోతాడు ! రోజూ పాల వాన్ ఆ కుర్రాడు చూస్తున్నాను !వాడి చూపుల్ని కూడా ఫాలో అవుతున్నాను హైదరాబాద్ లో అలాంటి కుర్రాళ్ళు చెత్తసంచి భుజాన వేసుకుని క్రాఫ్ యెగరేసుకుంటూ కాలితో తన్నుకుంటూ వెళ్లడం మాములే !ఇవాళ కూడా కుర్రాడు పాలప్యాకెట్ల బాగ్ తో ఎదిరింటి ముందు చాల నెమ్మదిగా అడుగేస్తూ విజిల్ వేస్తుపోతున్నాడు .ఠక్కున ఎదిరింట్లో లైట్ వెలిగింది ! వాడి విజిల్ సౌండ్ పెద్దదయ్యింది !హుషారుగా వుంది !ఎదురింటి తలుపు తీస్తున్నట్టున్నారు ఆ కుర్రాడు కాంపౌండ్ గేట్ దగ్గర ఆగాడు!ఇంట్లో నించి ఒక నడివయస్సు ఆవిడబయటకు వచ్చింది , విజిల్ ఆపాడు ! “ఏం నాయనా విజిల్ ఆగిపోయింది ?మా మేనకోడలు వూరికెళ్ళిపోయిందయ్యా !!అయినా పర్వాలేదులే ,నీ వేణునాదం విని గోపాల కృషుని గోపిక లాగా నెబు వస్తానులే “అంటూ గేట్ బయటకు వచ్చింది ! కుర్రాడు పరార్ !!!

మరిన్ని కథలు

Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్
Mrugaraju manasu
మృగరాజు మనసు
- - బోగా పురుషోత్తం
Amma Koyila
అమ్మ కోయిల
- విజయ వాణి. జన్నాభట్ల
Kanuvippu
“కనువిప్పు”
- ప్రభావతి పూసపాటి
Aasha Peraasha
ఆశా -పేరాశా .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు