మనసున్న పెద్దాయన - రాము కోలా

మనసున్న పెద్దాయన

సారూ!ఓ సారు! "కొండాపురం యెల్లె బస్సులు ఎటు వస్తదో కాస్త సెపుతారా! మీకు పుణ్యముంటది" అన్న మాట వినిపించడంతో మొబైల్ గేమ్ ఆడుతున్న వసంత్ తల ఎత్తి చూసాడు. ఎదురుగా ఉన్న అరవై సంవత్సరాల పల్లెటూరు ఆసామిని.

అలసట నిండిన కంటి చూపులు,ఎదో తెలియని ఆందోళన కలగలిపిన చూపులతో ఎదురుగా కనిపించడంతో. తన సంతోషాల సామ్రాజ్యం లోనికి ఏ గజదొంగో వచ్చి తన ఆనందాలను దోచుకుంటునట్లుగా బాధపడి పోయాడు వసంత్. ఆడుతున్న మొబైల్ గేమ్ కు అంతరాయం కలిగినందుకు. సమాధానం చెప్పడం ఇష్టం లేనట్లుగా చేతితోనే చూపించాడు వసంత్.ముఖం నిండుగా అసహనం నింపుకుంటూ.

"ఏం తెలియకుండా ఎందుకు వస్తారో" అనుకుంటూ . తిరిగి తాను ఆడుకుంటున్న మొబైల్ గేమ్ లోకి తొలి దూర్చేసాడు వసంత్. ఒక్కటొక్కటిగా బస్సులు వస్తున్నాయ్ . వెళుతున్నాయి.. ఏ బుస్సు ఎటు వెళుతుందో అర్దం కాకున్నా! ప్రతి బుస్సు దగ్గరకు పరుగు తీసి , ఎటు వెళుతుందో తెలుసుకుని తిరిగి వచ్చి కూర్చుంటున్నాడు పల్లెటూరి పెద్దాయన. అది చూసి నవ్వుకుంటున్న వసంత్ దగ్గరకు పల్లెటూరు ఆసామి మరో సారి రావడంతో

"ఏమిటి "అన్నట్లుగా చూపులు విసిరేసాడు వసంత్. "బాబు తమరు ఏటి అనుకోనంటే,రెండు వేల రూపాయలకు చిల్లర ఉంటే ఇస్తారా." "వారం మొత్తం పని చేయించుకుని షావుకారు ఇచ్చిన డబ్బులు". "ఇంటి దగ్గర మా అడోల్లకు సుస్థి చేసిందని కబురొస్తే బయలెల్లినా."

"దారిలో యాదికి రాలే" "తీరా ఇక్కడ‌ కొచ్చినాక సూస్తే చిల్లర లేకపొయే. తమరు ఏటనుకోక పోతే.పెద్దమనసుతో చిల్లరిస్తారేమోనని.."అంటున్న అతని వైపు.. "ఎక్కడ దొరికావురా! నా ఖర్మకొద్ది . నా వెంట పడుతున్నావు.." "వస్తానన్న ప్రేండ్ ఇంత వరకు రాలేదు!.

గంటన్నర నుండి ఎదురు చూస్తున్నా.! మధ్యలో విసిగించడానికి నువ్వొడివి అగోరించావా" ...అని పైకే అనేసి కోపంగా చూసాడు. "క్షమించండి బాబు " "మీకు ఇబ్బంది కలిగించినానేమో" అని ప్లాట్ ఫామ్ చివరకు వెళ్ళి చిరుగుల బొంత వంటి నిండుగా కప్పుకుని కూర్చున్నాడు పల్లెటూరి ఆసామి.

"సమయం పదకండు దాటింది.వస్తానన్న ప్రేండ్ రాలేదు. రూమ్ చేరుకోవడం మంచిదేమో." అనుకుంటూ లేచి నడుస్తూ పల్లెటూరు ఆసామి దగ్గర ఆగిపోయాడు వసంత్. "ఇదిగో పెద్దాయనా! కాఫీ తాగడానికి వెళుతున్నా, నాతో రా నీకు చిల్లర ఇప్పిస్తాను"అంటుంటే

"సరే బాబు "అని వసంత్ వెంట నడిచాడు పెద్దాయనా. **** నెమ్మదిగా కన్నులు తెరచిన వసంత్ కు మెడికల్ వాసన ,గుప్ప్ న ముక్కుకు తాకడంతో తను ఏదో హాస్పిటల్లో ఉన్నాననే విషయం అర్దం అవుతుండగా. కాస్త దూరంగా అదే పల్లెటూరి ఆసామి. కన్నులు నిండుగా ఏదో చెప్ప లేనంత ఆందోళనతో తననే చూస్తున్నాడు. రాత్రి ఏం జరిగిందో కొద్ది కొద్దిగా గుర్తుకు రాసాగింది.

పెద్దాయన దగ్గర డబ్బులు తీసుకుని చిల్లర తెస్తానని చెప్పి,తనని తప్పించుకుని బార్ లో పుల్ గా ముందు తాగి రోడ్డు దాటుతుండగా ఏదొ తనని గుద్దెసింది . రోడ్ మీద పడి పోవడం తెలుస్తుంది. ఒకటే ట్రాఫిక్ శబ్దం. లీలగా ఎవ్వరో పిలుస్తున్నట్లు గా వినిపించింది.

కానీ తనని ఇక్కడికి ఎవ్వరు తీసుకు వచ్చారు. ఈ పెద్దాయనా ఇక్కడే ఎందుకున్నాడో అర్దం కాలేదు వసంత్ కు. కన్నులు తెరిచిన వసంత్ ,దగ్గరగా వచ్చిన పెద్దాయన కన్నుల్లో కి చూడలేక పోయాడు "బాబు !నెప్పిగా ఉందా!" "ఇది నా వలనే జరిగింది." "నాకు చిల్లర తేవాలని వెళ్ళి తిరిగి వస్తుంటే ఇలా జరిగింది." "నన్ను మన్నించండి బాబు"అంటూ చేతులు పట్టుకున్న పెద్దాయన ముందు , తాను చేసిన తప్పు బయటకు చెప్పలేక.

నిజం నిప్పులా ఎదను కాల్చి వేస్తుంటే.. కన్నీటి పర్యంతం అయ్యాడు వసంత్. పెద్దాయనా చేతుల్లో ముఖం దాచుకుంటూ... నన్ను క్షమించండి అనేమాట గొంతుదాకా వచ్చి ఆగిపోతుంది పలక లేక పెద్దరికాన్ని చులకనగా చూసినందుకు తనలో తానే పశ్చాతాపం చెటందుతున్నందుకం నిదర్శనంగా కంటి నుండి కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి..

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి