శ్రవణానందం - ఘాలి లలితా ప్రవల్లిక

sravanaanamdam

"ఏమేవ్ అయ్యిందా ? ఏమిటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నావ్ ? ఎక్కడున్నావేంటి .....? "అంటూకేకేస్తూ వంటింట్లోకి వచ్చాడు ఆంజనేయులు . "అబ్బబ్బబ్బా విసిగించేస్తున్నారండి ... మీ ప్రయాణము కాదుగానీ నా తల ప్రాణం తోకకు వచ్చేస్తోంది . రాత్రి 12 ఇంటికి మొదలుపెట్టా వంట చేయటం ఇంకా తెమలలేదు . నూనె లేకుండా నే నన్ను డీప్ ఫ్రైచేసేస్తున్నారు .

ఒక్క చేతి మీద చేయొద్దూ . ఎవర్నన్నా మనిషిని పెట్టండి అంటే ... వినరు .... కరోనా ...కాకరకాయ అంటూ కబుర్లు చెబుతారు .... అయినా మీ పిచ్చి గాని ..... మన చేతి వంట వారు మాత్రం తింటారు టండీ ....!?!" అంది ఆంజనేయులు భార్య సువర్చల . "తినడం తినకపోవడం అనేది తరువాత విషయం . మన ధర్మం మనం నిర్వర్తించాలి . అతిధి దేవోభవ అన్నారు పెద్దలు . కబుర్లతో కాలక్షేపం చేయక త్వరగా బయలుదేరు . "అంటూ చెప్పి బయటికి వచ్చేశాడు ఆంజనేయులు . "భలే వారే నేను తెమలొద్దూ" అంది సువర్చల .

"నీకేం పెళ్లి చూపులు ఏర్పాటు చేయలేదు . ఆ వండిన పదార్ధాలన్నీ కారు లో పెట్టి బయలుదేరు "అంటూ హడావిడి చేశారు ఆంజనేయులు . ఇంతకీ మన ఆంజనేయులు గారి ఈ హడా విడికి కారణం మీకు చెప్పనే లేదు కదూ ! కథలు రాసేవారు అందరూ అథామృతం అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు . కార్తీకమాసం వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన రావడంతో ..... అర్జెంటుగాఎప్పుడూ నిర్వహించుకునే ముఖాముఖి కార్యక్రమానికి పులిస్టాప్ పెట్టేసి దేవీపురం పిక్నిక్ ప్లాన్ చేసారు నిర్వాహకులు .

అసలు దేవిపురం ఎందుకు వెళ్లాలనుకుంటున్నారం టే .....దానికో పేద్ద కథే ఉందండి బాబూ .... సబ్బవరం దగ్గరున్న ఈ దేవిపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు . దక్షుని వాకిట్లో అవమానానికి గురైన పార్వతి దేవి శరీరం 18 ఖండికలు అయిందని ,అందులోఅమ్మవారి మర్మాంగం అక్కడ పడిందని అంటారు .

శ్రీ చక్రం పై నిర్మితమైన ఆ గుడి ,అక్కడున్న శిల్పసౌందర్యం కనుల విందు చేస్తుంది . పోకిరీ గాళ్ళకుఆ దేవాలయంలోని శిల్పాలు బూతు బొమ్మలు గా కనపడితే ..... ఆధ్యాత్మికవేత్త లకుఅమ్మవారి దివ్యమంగళ స్వరూపం గా కనిపిస్తాయి . చూసే దృష్టిని బట్టి ఉంటుందన్నది వేరే విషయం . ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటేఅక్కడ జీడిమామిడి , పెద్ద ఉసిరి , మామిడి , అరటితోటలు ఉన్నాయి . దైవ దర్శనం , వనభోజనం రెండు విధాల ఉపయుక్తం ఇక్కడైతే నని నిర్వాహకులు ఆ ఊరిని ఎన్నుకున్నారు . "ఓ పాలిమా అనకాపల్లి వాళ్ళకు కూడా నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే మా సత్తా చూపించుకుంటాం "అనిపాణిగారు అడగడంతో అక్కడ ఏర్పాట్ల బాధ్యత పాణీ గారికి ఇవ్వడం జరిగింది . వంటా వార్పు అక్కడే పెట్టుకుందామని ముందే అనుకున్నారు .

అందుకే కట్టెలు , బెడ్డలు , టెంట్లు ,డ్రమ్ములు అన్ని ఏర్పాట్లు చేశారు పాణిగారు . వేరే ఊర్ల నుంచి వచ్చేవారికి లోకల్ గా ఉన్న ఇంద్రావత్ , కామేష్ , వాణిశ్రీ , తాతోపాఖ్య , మాణిక్యం , హేమ తదితరులు వారి వెహికల్స్ ని రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర రెడీగా ఉంచారు . అయితే పాపం వారి శ్రమ వృధా అయింది . అందరూ ఎవరి కార్లలో వాళ్ళు బయలుదేరి గూగుల్ మ్యాప్ సహాయంతో పిక్నిక్ స్పాట్ కి వచ్చేసారు . లోకల్ గా ఉన్న వాళ్లు కూడా ఆదరాబాద రా అందరూ అక్కడికి చేరుకున్నారు . అందరికీ ఆకలి ....

గ్యాస్ స్టవ్ మీద ఒకరిద్దరికి వంట చేసేది అలవాటైన మన రైటర్స్ కి ఆ పొయ్యలూ అవీ చూసేసరికి పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్లైంది . "ఏం చేద్దాం ? మనకు ఎలాగో పొయ్యిపై వంట రాదు కాబట్టి కబుర్లతో కడుపు నింపే సుకుందామా అనుకున్నారు వాళ్ళు . . పది అయింది టిఫిన్ లేదు టీ లేదు . ఏమైందా అని మిగిలినవాళ్ళు వచ్చి చూసేసరికి . అందరూ కబుర్లలో పడి వాళ్ళకు వచ్చిన అవార్డులు వాళ్ళు రాసిన కథలు చెప్పుకుంటూ ...కనబడ్డారు . "చెల్లాయిలూ హైదరాబాద్ నుంచి వచ్చా .. టీ తాగందే మూడ్ రాదు నా మొహనా గుక్కెడు ఛాయ్ నీళ్ళు అయినా పోయిరా! ? అన్నాడు ఇషేరా అన్నయ్య . "అన్నోయ్ నువ్వు హైదరాబాద్ అయితే నేను మహబూబ్ నగర్ నుండివచ్చేసా ....

మరి నా సంగతేంటి . ఇదో అమ్మాయిలు ఆ చేత్తో నా మొహాన్న కూడా " అంది సుందరక్క . "ఆగండాగండి నానా అగచాట్లు పడి నేను హైదరాబాదు నుండి వచ్చా మీ బాబాయ్ గారికి అసలే షుగరు . నీరసం వచ్చేసింది . ఏదో కాస్త వండి మామొహాన కొడితే తెప్పరిల్లుతుంది మా ప్రాణం ."అంది రాగి అరుణ . అదే ప్రయత్నంలో ఉన్నామని . కట్టెలు రాళ్ళమీద పెట్టాలో రాళ్ళకింద పెట్టాలో అర్థం కాలేదు ....అంది వాణీ . "గిన్నె పైన పుల్లలు అంటించి పెడితే అదే ఉడికిపోతుంది"అంటూ ఓ ఉచిత సలహా పడేసింది సుజాత . "నేను కూడా ఓ చేయి వేద్దాం అనుకున్నాను .కానీ నేనుగరిట తిప్పి చాలాకాలమయింది . నేను పెన్ ని పట్టుకున్న కాడినుంచీ మా వారు గరిట పుచ్చుకున్నారు . అందుకే ఆలోచిస్తున్నాను" అంది విజయవాడ నుంచి వచ్చిన జమున . "పాపం వారిని ఎందుకండీ ఇబ్బంది పెట్టడం . మనమే ఓ చేయి వేసేద్దాం రండి అన్నారు బెంగళూరు నుంచి వచ్చిన లక్ష్మణ్ జి . "అంతే కదా పాపం వాళ్ళను చేయమంటే ఏం చేస్తారు ?

అలవాటు తప్పింది కదా కాఫీలో పంచదార బదులు ఉప్పు వేసినా వేస్తారు మనమే ఓ పట్టుపడదాం రండి" అన్నారు ఉదయ్ శివ గారు . అసలు ఈ వంటల కార్యక్రమం లేకుండా క్యాటరింగ్ చేద్దాము అంటే విన్నారా ? పాణి గారు ఇప్పుడు చూడండి నీరసాలు చూరు పట్టుకుని వేలాడుతున్నాయి . పొయ్యిలో పిల్లి లేవలేదు . నీరసంగా అన్నారు ఇంద్రావత్ గారు . " మీరు మరీ నండి నాకేం తెలుస్తుంది .

మన వాళ్ళకి వంటలలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుందని . జ్యోతి గారు చేసే కాకినాడ కాజాలు తిందామని ఆశ పడ్డాను . సత్యమ్మ గారిచెన్నై సాంబారు రుచి చూద్దాం అనుకున్నా . జమున గారి గుత్తి వంకాయ కూర .... హేమ గారి పూతరేకు లు ఇలా అందరి చేతి వంటలు రుచిచూద్దాం అని ఆశపడ్డాను . సంజాయిషీ ఇచ్చారు పాణి గారు . " నన్ను సాయంత్రం వీణ క చేరి చేయమన్నారు లక్ష్మణ్ జి" మా మనవరాలు వల్ల ప్రాక్టీస్ చేయలేదు . అందుకే ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను . మా ఊరావిడే మీనా గారున్నారు . ఆవిడ ని అడగండి ." అంటూ తప్పుకుంది జ్యోతమ్మ . "ఏమండోయ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి . అసలే ఆరోగ్యం బాగోక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను . ఇప్పుడు ఏమన్నా అయిందంటే నా కొడుకులు నన్ను చంపేస్తారు . ఇప్పటికే భూతద్దాలు పెట్టుకున్నాను" అంది మీనమ్మ . అసలు అనకాపల్లిలో పెట్టమన్నాను ప్రోగ్రాం . అంచక్కా సత్యనారాయణ మూర్తి కొండ దగ్గర తోటల్లో ఎంత బాగుంటుందో ....

ఈ పాణి సార్ వినలేదు . అక్కడైతే మావాళ్ళే బోలెడంతమంది . ఎడం చేత్తో వండి పెట్టేసేవారు మనందరికీ ను కల్పించుకుంటూ అంది కీర్తి జ్యోతి . "అసలు వాడ్రాపల్లిఅయితే ఎంత బాగుండేదో ! అంచక్కా ఆవలో .... తాటి దోనెలో ప్రయాణం చేసేవాళ్ళం ... ఆవ చేపలు ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళం .ప్రతి సంవత్సరం పెరిగే లింగం కథ తెలుసుకొని తీర్థయాత్రల కి ఒక వ్యాసం రాసేవాణ్ని ఇక్కడ పెట్టారు నిష్టూరంగా అన్నారు రాధా హనారా గారు . "ఏమండోయ్ ...చాగంటి గారు ... ఇక్కడ పెద్ద డిస్కషన్ జరుగుతుంటే మీరు భూతద్దం పెట్టి వెదుకుతున్నారు దేనికొరకు " అంటూ పిలిచాడు రాజేష్ . "ఏం లేదు రాజేష్ వాస్తు ,శిల్పాల గురించి రీసర్చ్ చేస్తున్నాను . నెక్స్ట్ నా నవలా అంశం అదే దాని కొరకే ఈ ప్రయత్నం "అన్నారు చాగంటి వారు . "నేను దేవి కోన అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్ నవల రాయబోతున్నాను" అన్నారు

అప్పుడే అక్కడికి వచ్చిన కస్తూరి నాగేశ్వర రావు గారు . 'జీడి మామిడి తోటా 'ని దేవిపురం నేపద్యంలో నేను ఒక కథ రాసేసాను ఏనాడు "అన్నారు భాష్యం గారు . "ఏవండోయ్ టాపిక్ ని పక్కదారి పట్టిం చేస్తున్నారు . మాపొట్టల గతి ఏంగాను అంటూ వచ్చారు జంజరి గారు . "ఏవండీ పాపం ఆకలేస్తోంది అంట మనం తెచ్చినవి పెడదాం అండి అంది ఆ గోలంతా చూస్తున్న ఆంజనేయులు భార్య సువర్చల ఆంజనేయుని చెవి దగ్గర సన్నగా . పిచ్చిదానా అప్పుడే బయటపెడితే సస్పెన్స్ ఏముంటుంది నేను చెప్పే వరకు ఆ ప్రస్తావన తేక" అన్నారు ఆంజనేయులు . సురపల్లి కమలజచెవి న పడ్డాయి వీరి మాటలు "ఏవండోయ్ మీరందరూ శ్రమపడనక్కర్లేదు" "అందికమల జ . " ఏమిటమ్మాయి నువ్వు గాని వండేసావా ఏమిటి ?" ఆశ్చర్యంగా అడిగాడు సద్గుణ రావు . "నేను వండలేదు బాబాయ్ వండిన వాళ్ళని చూపిస్తాను ." అంది కమలజ .

"అబ్బేవేరే వాళ్ళు వండింది మనం కలబడి తింటం ఏం బాగోదు వాళ్లను వండనీ నీవు కూడా సాయం చెయి " అన్నారు వెంకట్ . " ఆ అమ్మాయి చెప్పేది పూర్తిగా వినండి అన్నారు ." శాంతస్వరంతో విహంగ గారు . ఆంజనేయులు గారి సంగతి బయట పెట్టేసింది కమలజ . "ఏమండీ ఆంజనేయులు గారు ఇదేం పద్దతి అండి మీ హాస్యచతురత నకనకలాడే మా ఉదరాల మీద చూపించాలా .... అమ్మా సువర్చలమ్మా పుణ్యమంతా నీదే తల్లీ . రామ్మా వడ్డించు"అన్నారు శర్మ గారు . ఆంజనేయులు గారు అందరికీ విస్తర్లు పరిచారు . సువర్చల గారు అందరికీ వడ్డించారు . అందరూ కడుపారా కార్తీక వనభోజనాలు ఆరగించి . విరామ సమయంలో కథామృతాలు కురిపించారు .

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల