నీటి విలువ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Neeti viluva

అమరావతిరాజ్యాన్ని చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఒకరోజు రాజసభలో ప్రవేసించిన ఆ రాజ్య ప్రజలు "మహరాజుగారికి ప్రణామాలు .అయ్య మననగర పొలిమేరలలోని గ్రామాలలోనికి అడవిజంతువులు ప్రవే సించి భీభత్సం చేస్తున్నాయి. ప్రజలు బహిరంగంగా తిరగడానికి తమ పొలాలలో వ్యవసాయ పనులుచేసుకోవడం చాలా యిబ్బంది కరంగామారింది, కనుక అడవిజంతువుల నుండి మమ్మల్ని మాపంటలను కాపాడండి"అని విన్నవించారు. " ఏమిటి ఎన్నడూ లేనిదే అడవి మృగాలు నగరంలోనికి ప్రవేసిస్తున్నాయా, మంత్రివర్య వెంటనే మనం వేటకు వెళుతున్నాం దానికి కావలసిన ఏర్పాట్లు చేయించండి" అన్నాడు రాజుగారు. మరుదినం తనసైన్యంలోని కొందరు విలువిద్య నైపుణ్యం కలిగినవారితో కలసి తన నగరపొలిమేరలలోని అడవిలో ప్రవేసించి ప్రజలను భయపెట్టే జంతువులను తరుముతూ అడవి లో పలకు చాలాదూరం తన పరివారాన్ని వదలి వెళ్ళాడు రాజు . ఎండవేడికి దాహం వేయడంతో చుట్టు పక్కల ఎక్కడా నీటి జాడలేకపోవడంతో నీరసంతో ఒ చెట్టుకింద చల్లదనానికి సేదతీరాడు. రాజుగారు బాగా అలసి ఉండటంతో చెట్టుకింద ఉన్న చల్లదనానికి వెంటనే నిద్రపట్టింది.కొంత సమయం తరువాత మెలకువ రావడంతొ ఎదురుగా ఉన్నకోతిని చూసి ఆశ్చర్యపోయాడు. పలురకాల మధుర ఫలాలు రాజుగారికి అందించినకోతి ఆకు దోనెలో చల్లనినీరు తెచ్చి అందించింది.పండ్లు ఆరగించి మంచి నీళ్ళుతాగిన మహరాజు ఆకలి దాహం ఎండవేడినుండి తేరుకున్నాడు."మహరాజా ఆహారం నీరు సమస్త ప్రాణ కోటి ఎంతఅవసరమో తెలుసుకున్నరు కదా, మీప్రజలు తమ అవసరాలకు వ్యవసాయానికి, ఇళ్ళు నిర్మించుకోవడానికి యిష్టానుసారంగా అడవులను నరికివేస్తున్నారు. మాకు యిక్కడ నీరు,ఆహారం లభించక పోవడంతో మీరాజ్యంలోని గ్రామాలలో నికి వస్తున్నాం.మాఅడవులను హరించివేస్తున్నారు మీరు, గ్రహించండి తప్పు ఎవరిదో .మీకుతెలియదా వృక్షాలు ఎక్కువఉంటే అంతాక్షేమం లేకుంటే ఎంతో క్షామం అని .ప్రకృతి తనధర్మంపాటించి సకాలంలో వర్షలు కురవాలి అంటే చెట్లేకదా ఆధారం. సమస్తభూమండలం లోని ఋతువులను నిర్దే సించేది చెట్లే .నేడు మీరు మేము యింత ఎండలు అనుభ వించడానికి కారణం మనుషులుకాదా.ఈభూమండలంపై ముడు వంతులు చెట్లు ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మీకు లేదా మనిషి ఆరోగ్యాన్ని నిర్ధారించేది. మీకు కావలసిన ప్రాణవాయువును అందించేది చెట్లేకదా, రాళ్ళతొకొట్టినా తీయని ఫలాలు అందించేది.వాటి ద్వారా ఆరోగ్యాన్ని పొందు తున్నాము అన్న విశ్వాసం మీకు లేకుండా నిర్దాక్షణ్యంగా చెట్లను నరకడం తప్పుకాదా.అనుక్షణం ప్రాణభయంతో నిత్యం ఆహార అన్వేషణలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ జీవించే మమ్మల్ని వేటాడే అధికారం మీకు ఎవరు యిచ్చారు .యిదిఅన్యాయం అనిపించడంలేదామీకు మీరు మాఅడవు లలోని వచ్చిమాజీవన విధానాన్ని ఛిన్నాభిన్నం చేయడం తప్పుగా మీకు తెలియ లేదా.మీరు మీరాజ్యంలోని భాగాన్ని పొరుగు దేశంవాళ్ళు ఆక్రమణ చేస్తే అంగీకరిస్తారా ,మరిమాఅడవులను ఎందుకు ఆక్రమించుకుంటున్నారు.మను షులు అడవిని ఆక్రమించు కున్న అనంతరమే, మేము నగరంలోని గ్రామాలలో ప్రవేసించాం ,మాఅడవి మాకు వదిలేయండి యిలా దురాక్రమణ చేయడంతప్పు అని మీప్రజలకు తెలియజేయండి. పదండి మీరు రాజధాని చేరుకునేమార్గంచూపిస్తాను. "అనిఅడవి వెలుపలకు దారితీసింది.తనరాజ్యం చేరినమహరాజు అడవులు నరకరాదని ,వేటఆడటం నిషేదిస్తూ ఆజ్ఞలు జారిచేసాడు. తనరాజ్యం చేరువగా ప్రవహించే కృష్టానది నీటి పాయను అడవిలోనికిమళ్ళించిజంతువుల దాహార్తిని తీర్చాడు.

మరిన్ని కథలు

Anakonda
అన”కొండ”
- రాపాక కామేశ్వర రావు
Cheekati pai yuddham
చీకటి పై యుద్ధం
- హేమావతి బొబ్బు
Mokkalu naatudam
మొక్కలు నాటుదాం!
- చెన్నూరి సుదర్శన్
Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి
అహల్య
అహల్య
- సుమ సావి3
Viswasa pareeksha
విశ్వాస పరీక్ష!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి