కోవిడ్ వ్యాక్సిన్ - Kanuma YellaReddy

Kovid vaksin

సమయం రాత్రి 10గంటలు దాటింది.టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.కరోన ఉధృతికి అగ్రరాజ్యం ఆగమం అని,అదే దారిలో మిగతా దేశాలు,కరోన కట్టడిలో భారత్ అనే వార్త పదే, పదే చూపుతున్నారు.మూర్తి అద్దాలు సరి చేసుకుని కళ్ళు ముసుకున్నాడు.కళ్ళ ముందు కూతురు,అల్లుడు,మనవరాలు మెదిలారు.మనవరాలిని చూడ్డానికి వెళ్ళింది రాధ.ఆమె వెళ్ళగానే కరోన వచ్చింది.ముఖ్యమైన ఆపరేషన్లు ఉండి మూర్తి ఆగిపోయాడు." తాతయ్య" అని మనవరాలు పిలిచినట్లు అయితే కళ్ళు తెరిచాడు.ఎవరూ లేరు."ఎలా ఉన్నావ్ చిన్ని"అనుకున్నాడు తనలోనే.మనవరాలు మెదలుతుంటే వీడియో కాల్ చేశాడు.కూతురు ఆ ఫోన్ చూసి "అమ్మా ..నాన్న ఫోన్ చేశాడు"అంది.కూతురు ,అల్లుడు అమెరికాలో ఉన్నా మమ్మీ..డాడీ అని పిలిచే కల్చర్ రాలేదు.అదే గర్వపడతాడు మూర్తి.మనవరాలు అంతే తాతయ్య అని చక్కగా,ముద్దుగా పిలుస్తుంది."అమ్మ ..నాన్న"
అంటూ వీడియో కాల్ చుపిస్తోంది ."ఎలా ఉన్నారండి"అంది ."నేను బాగానే ఉన్నను చిన్ని ఎలా ఉంది."అన్నాడు."మిమ్ములను ఎక్కువగా కలవరిస్తుంది ,తాతయ్య ఎప్పుడు వస్తాడు "అంటోంది.ఆ మాటకు అతని కళ్ళలో కన్నీటి చుక్క జారింది."మీరు జాగ్రత్త బైటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుని వెళ్ళండి ,అవసరం ఉంటేనే బైటకు వెళ్లవద్దు"అన్నాడు. "నాన్న మీరే జాగ్రత్త పేషంట్లు ,ఆపరేషన్లు అంటూ హడావుడిగా ఉంటారు"అంది కూతురు జాగృతి. "లేదు ఇప్పుడు ఈ కరోన వల్ల నా క్లినిక్ బంధ్ అయింది,సరే చిన్ని ఏదీ నాతో మాట్లాడమను అన్నాడు మూర్తి." అమ్మా.. చిన్ని "కేక వేసింది అమ్మమ్మ."వస్తున్న అమ్మమ్మ"అంటూ చేతిలో కుందేలు బొమ్మతో వచ్చింది."తాతయ్య మాట్లాడు చున్నాడు చూడు "అంది జాగృతి.
"హలో తాతయ్య"
"హాయ్ చిన్ని"అన్నాడు.
"అమెరికా ఎప్పుడు వస్తావు"అంది.
"ఇప్పుడు రాలేను నాన్న, కరోన ఉందిగా" అన్నాడు.
"తాతయ్య నేను ఒకటి చెప్పనా అంది"
"చెప్పు నీ మాట కాదంటానా " అన్నాడు.
"కరోనాకు నువ్వే మందు కని పెట్టు తాతయ్య అని తాతయ్య బైటకు వెళ్ళితే మాస్క్ వేసుకుని వెళ్ళు " అంది పెద్ద ఆరిందానిలా.తాతయ్య గట్టిగా నవ్వి "నేను సరే,నువ్వు ఎక్కడికి వెళ్లకు ,కరోన తగ్గాక వస్తాను లే"అంటే మధ్యలో కల్పించుకుని "కరోనాకు మందు నువ్వే కనుక్కో తాతయ్య"అంది.దానికి "ఓకే చిన్ని కనుకుంటాను బై.. బై "అన్నాడు.
తన చిన్ని అన్న మాట "కరోనాకు మందు కనుక్కో తాతయ్య"అని పదే పదే చెవుల్లో మారు మ్రోగుతుంటే అవును కరోనాకు మనమే మందు ఎందుకు కనుక్కోకూడదు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు అనుకుని తన సహచర మిత్రులతో చర్చించి కరోనాకు వ్యాక్సిన్ కనుగొనాలని ఆలోచించాడు. మరుసటి రోజు డాక్టర్ మూర్తి ఇంటిలో సహచర డాక్టర్లు నలుగురు సమావేశమైనారు.వారిని ఉద్దేశించి "ఈ రోజు నుంచి మనం కారోనా కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేయాలి,మనం తలచుకుంటే సాధించ లేనిది ఏమి లేదు.ఈ ప్రయత్నం లో మనం సక్సెస్ అవుతాం ధీమాగా"అన్నాడు.
"ఓ.కె సర్ మీరు ముందుండి సలహాలు,సూచనలు ఇవ్వండి.మన పరిజ్ఞానం తో వ్యాక్సిన్ చేద్దాం అన్నాడు డాక్టర్ కృష్ణ.మిగతా వారు "ఎస్" అన్నారు.
"ఈరోజే ప్రయత్నం మొదలు పెడదాం"అన్నాడు డాక్టర్ మూర్తి.అందరూ సరే అని మూర్తి గారి ఇంటిలోనే ఓ గది ల్యాబ్ గా మార్చుకున్నారు.వివిధ రకాల ద్రావకాలు,సిరంజులు,ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.బతికిన ఐదు ఎలుకలు బోనులో ఉంచారు.బైటకు వెళ్లకుండా అహర్నిశలు శ్రమిస్తునే వున్నారు. డాక్టరు కృష్ణ హాలు లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు. కరోన వ్యాక్సిన్ కు డాక్టరు మూర్తి బృందం ముందడుగు అనే వార్త వచ్చింది.ఆ వార్త మరింత పట్టుదలను పెంచింది.సమయం తెలియడం లేదు ,అన్ని సలహాలు ఇస్తున్నాడు మూర్తి.రాత్రి,పగలు ల్యాబ్ లోనే గడువు తున్నారు.ఆ బృందంలో డాక్టరు రామ్ "రేపు ఉదయం ఓ ఎలుక పై ప్రయోగం చేస్తే మొదటి దశ పూర్తిఅవుతుంది అన్నాడు."ఒకే " అన్నాడు డాక్టరు మూర్తి.ఆ రోజు రాత్రి ల్యాబ్ లో అందరూ మాస్క్ వేసుకుని వున్నారు.డాక్టర్ రామ్ ఎలుక బోను దగ్గరకు వచ్చి ఓ ఎలుకకు వ్యాక్సిన్ ఇచ్చాడు. అది కాసేపటికి గిల..గిల తన్నుకుని కళ్ళు తేలేసింది. నిరాశ పడ్డాడు రామ్."డోంట్ వర్రీ రామ్ ఓటమి విజయానికి సూచిక ఇంకా మనం తీవ్రంగా ప్రయత్నం చేద్దాం"అన్నాడు.
డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ"రేపు దీనికి ఓ రూపు తీసుకు వస్తాను "అన్నాడు.అలా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు.అన్ని విఫలం అయ్యాయి. బోనులో ఉన్న ఐదు ఎలుకలు మరణించాయి. ప్రతి రోజు మీడియా
ల్యాబ్ లోకి వచ్చి వార్తలు సేకరించేది.ఆ రోజు డాక్టర్ మూర్తి బృందం విచారం లో వున్నారు.మీడియా తన పని చేసింది."కరోన వ్యాక్సిన్ చేయడంలో డాక్టర్ మూర్తి బృందం విఫలం" పదే.. పదే వార్త వచ్చింది. డాక్టర్ మూర్తి బృందంలో కసి పెరిగింది.ఆ రోజే మనవరాలు చిన్ని ఫోన్ చేసి ,వ్యాక్సిన్ నువ్వే చేయాలి తాతయ్య అల్ ద బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది.డాక్టర్ మూర్తి బృందం హాలులో కూర్చొని వివిధ సంకేతాలు ఇచ్చుకుని ల్యాబ్ లోకి నడిచారు."ఈ సారి మన ప్రయత్నం కోతుల పై ఇది సక్సెస్ అయితే నూరు శాతం విజయం వచ్చినట్లే"అన్నాడు డాక్టరు కృష్ణ.
"ఓ.కె కృష్ణ ప్రొసీడ్"అన్నాడు మూర్తి.ఆరోజు రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా శ్రమించారు.డాక్టర్ రామ్ మాట్లాడుతూ "రేపు ఆటో ఇటో తేలుతుంది "అన్నాడు. "ఓ.కె గుడ్ రామ్ "అన్నాడు మూర్తి భుజం తడుతూ. కృష్ణ,తదితర డాక్టర్లు " డన్" అన్నారు. తెల్లవారు జామున 4గంటల సమయం లో
" యాహూ "అని గట్టిగా అరిచాడు డాక్టర్ కృష్ణ.మిగత డాక్టర్లు అతని చుట్టూ చేరారు."రేపు నూరు శాతం ఫలితం వస్తుంది."
అన్నాడు.మీడియా లో వార్త మాములే "వ్యాక్సిన్ చేయడంలో తలమునకలుగా ఉన్న డాక్టర్ మూర్తి బృందం" అనే వార్త వస్తోంది.
డాక్టరు మూర్తి "అరగంటలో వస్తానని " వెళ్ళాడు.ల్యాబ్ లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్లు. అర గంటలో డాక్టరు మూర్తి రెండు మర్కటాలను బోను లో వేసుకుని వచ్చాడు."వాటిని చూడగానే "గుడ్ ఐడియా సర్"అన్నారు డాక్టర్లు. మూర్తి బోను ప్రక్కన పెట్టి ,డాక్టర్ రామ్, కృష్ణ,మిగతా ఇద్దరిని ఒక చోట సమావేశ పరచి,"ఆ తెల్ల ద్రావకంలో కొంత మోతాదు తగ్గించు,మరో దానిలో కొంచం పెంచు వీటిని ఓ సీసా లో పోసుకుని ఎక్కువ మందు ఉన్నది ఒక మర్కటానికి,తక్కువ మోతాదు ఉన్నది మరో మర్కటానికి ఇద్దాం.రెండింటిలో ఏది ఉషారుగా ముందు పైకి లేస్తుందో అది కరెక్ట్ వ్యాక్సిన్"అన్నాడు డాక్టరు మూర్తి.రెండింటికి మత్తు ఇచ్చారు.వాటి శ్వాస ఆడుతోంది. డాక్టర్ మూర్తి స్టార్ట్ అనగానే డాక్టర్ కృష్ణ ఒకదానికి,డాక్టర్ రామ్ మరో దానికి ఇంజెక్టు చేశారు.ఊపిరి బిగ పట్టి చూస్తున్నారు డాక్టర్లు.
పదే.. పది నిముషాలలో మందు ఎక్కువగా ఉన్న మర్కటము లేచి ఉషారుగా ఉంది.తరువాత మర్కటము 20 నిముషాలలో లేచి ఉషారుగా ఉంది."సక్సెస్.. గ్రాండ్ సక్సెస్'అన్నారు డాక్టర్లు, వారి ఆనందానికి అవధులు లేవు.డాక్టర్ మూర్తి ఆ వానరాలను చూసు "మొదట వానరానికి ఇచ్చిన ఇంజెక్షన్ కరోన ఎక్కువగా ఉన్న వాళ్లకు,ఇప్పుడిప్పుడే మొదలైన వారికి రెండవది పని చేస్తుంది.మన ప్రయత్నం సక్సెస్ అని ఒకరిని ఒకరు అభినందించు కున్నారు.ఆ రోజే మీడియా లో ఈ వార్త కోడై కూసింది." కరోన కు వ్యాక్సిన్ సిద్ధం,భారత్ డాక్టర్ల విజయం,డాక్టరు మూర్తి బృందానికి ప్రశంసలు"టీవీలో అన్ని ఛానళ్లు లో వార్త మారు మోగిపోతోంది.వెంటనే ప్రభుత్వం డాక్టర్ మూర్తి బృందాన్ని అభినందించింది.వ్యాక్సిన్ సిద్ధానికి యుద్ద ప్రాతి పదికగా చర్యలు చేపట్టింది.భారత్ మొత్తానికి వ్యాక్సిన్ అందుబాటులో కి వచ్చింది.అంతటా మెరుగైన ఫలితాలు వచ్చాయి.ఒక్కమారణం కూడా లేదు.ఈ వార్త ప్రపంచ దేశాలకు తెల్సి భారత్ తో సంప్రదించి కోవిడ్ వ్యాక్సిన్ దిగుమతి చేసుకున్నారు.అద్భుతం ప్రపంచ వ్యాప్తంగా కరోన అంతం అయింది.వ్యాక్సిన్ అద్భుతంగా పని చేసింది.
ప్రభుత్వం ఆ డాక్టర్ల బృందాన్ని అభినందించడానికి ఓ సభ ఏర్పాటు చేసింది.
డాక్టర్ మూర్తి మాట్లాడుతూ"ఈ వ్యాక్సిన్ మా బృందం తీసుకు వస్తుందని నేను ఊహించలేదు.నా మనవరాలు నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టు తాతయ్య అని చెప్పడం,ఆ చిన్నారి స్పూర్తితో మా బృందం అహర్నిశలు శ్రమించి పని చేశాము.ఈ క్రెడిట్ అంతా అమెరికాలో ఉన్న నా మనవరాలు కు దక్కుతుంది అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.అప్పుడే మెసేజ్ వచ్చింది డాక్టర్ మూర్తి సెల్ కు "హార్టీ కంగ్రాట్స్ తాతయ్య"అని
ఆ మెసేజ్ చూసు కుని తాను కూడా ఆనందంతో చప్పట్లు కొట్టాడు. చప్పట్ల తో ఆ సభ మారు మోగిపోయింది.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి