పునర్జన్మ నిచ్చిన దేవత - లత పాలగుమ్మి

goddess as mother

ర్నవ్ కి శరీరం అంతా దూదిపింజలా అయి ఎక్కడో గాలిలో విహరిస్తున్నట్లుగా ఉంది. చాలా హాయిగా ఉన్న ఫీలింగ్. ఈ అనుభవం కోసమే అక్కడున్న అందరు వద్దు అనుకుంటూనే ఈ వ్యసనానికి బానిస అయిపోతూ ఉంటారు. అక్కడున్న అందరూ ఎవరి ప్రపంచంలో వాళ్లున్నారు. కొందరు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కొందరు శూన్యం లోకి చూస్తూ నవ్వుకుంటున్నారు.

అస్తవ్యస్తముగా ఎటు పడితే అటు పడి పోయి అర మోడ్పు కనులతో డోలాయమానంగా ఉన్నారు.

మామూలు మనుషులకు ఏమీ అర్థం కాదు అక్కడి వాతావరణం.

ఒకతను జాకెట్ హుడి తల పైన వేసుకొని తనను ఎవరూ గుర్తు పట్టకుండా గబా గబా లోపలికి వస్తున్నాడు. ఆర్నవ్ ఫ్రంట్ లోనే ఉండబట్టి అతన్ని తీసుకుని ఈ రోజుకు గండం గడిచిందని బయట పడ్డాడు. ఆర్నవ్ సిస్టర్ సాధన బయట కారులో టెన్షన్ తో వెయిట్ చేస్తోంది. గత ఆరు నెలలుగా రోజూ చేసే పనైనా రోజూ టెన్షనే ఇద్దరికీ, సాధనకి, ఆమె బాయ్ ఫ్రెండ్ కి. వాళ్లిద్దరూ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్. తెలిసిన వాళ్లు ఎవరైనా చూస్తే పరువు పోతుందని భయం, అమ్మ, నాన్న గారు వచ్చేలోగా తమ్ముడిని జాగ్రత్త గాఇంటికి చేర్చడమే ఆమె ధ్యేయం.

రోజూ తమ్ముడి గురించి వాళ్ళు పడే బాధ చూస్తుంటే నరకం లోఉన్నట్లు ఉంది. కాని ఏమి చేయలేని పరిస్థితి.

ఆర్నవ్ వాళ్ళ డాడి ప్రకాష్ పెద్ద బిజినెస్ మాగ్నెట్, అమ్మ సుగంధ. పేరుకి తగ్గట్లుగానే డాడి ఇల్లంతా మంచితనమనే వెలుగు నింపితే, అమ్మ సంస్కారమనే సుగంధ పరిమళాలు వెదజల్లినట్లుగా ఉంటుంది మా ఇల్లు. బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ అందరం కలిసి చేయాల్సిందే. రోజూ మా ఇల్లు నవ్వులతో హోరెత్తిపోతూ ఉండేది. అందరం చాలా డిస్సిప్లైన్డ్ గా ఉంటాము.

ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసి సాల్వ్ చేసుకుంటాము.

నీట్ ఎంట్రన్స్ ఎక్జాం బాగా రాయలేదనే డిప్రెషన్ లో ఉన్న ఆర్నవ్ మెల్లగా హెరాయిన్ లాంటిడేంజరస్ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు.

ఆర్నవ్ పాకెట్ మనీ అంతా అయిపోయి, మెడలో ఉన్న చైన్, చేతికున్న రింగ్, వాచ్ అన్ని మాయమై పోయినాయ్ ఈ వ్యసనానికి.

ఆర్నవ్ కి ఈ వ్యసనం ఎవరి ద్వారా వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీలేదు. మాకు తెలిసేటప్పటికే చేయి దాటిపోయింది పరిస్థితి.

"ఆర్నవ్, లే త్వరగా, కాలేజీకి టైం అవుతోంది" అని అమ్మ లేపుతోంది. ఆర్నవ్ కి లేవాలని ఉంది కానీ మెలుకువ రావడం లేదు. చాలా వీక్ గా ఉంది. తెల్లవారుతోంది అంటే భయం ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయాలంటే.

రూమ్ లోంచి బయటకి వస్తూ అమ్మ వాళ్ళ మాటలు విని ఆగి పోయాను.

" ఆర్నవ్ చిక్కి శల్యం అయిపోతున్నాడు, మనం ఏదో ఒక డెసిషన్ త్వరగా తీసుకోక పోతే పిల్లాడు మనకు దక్కడు" అని అమ్మ ఏడుస్తూ అంటోంది. డాడి, అక్క కూడా ఆ డెసిషన్ కి అంగీకరించారు. నానీని ఇంటికి పిలవడమా, లేకపోతే నన్నే హోంకు పంపించటమా నాతో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు.

ఇది వరకు ఎప్పుడు నవ్వులు, జోక్స్ తో కేరింతలు కొట్టే ఇల్లు, నా వలన ఎప్పుడూ చికాకులు, ఆర్గుమెంట్స్, నా ఈ బాడ్ హ్యాబిట్ ని ఎలా మాన్పించాలి అనే వాళ్ళ తపన అన్నీ అర్ధం అవుతున్నాయి. నేను కూడా మానాలని చాలా ప్రయత్నిస్తున్నాను.

సాయంత్రం అవుతూనే నరాలు తెంపేసే బాధ ఆ డోస్ పడేంత వరకు. నా మీద నాకు కంట్రోల్లేదు. ఎప్పుడూ కోపం, యాంగ్జైటీ, డిప్రెషన్, ముఖ్యంగా కాలేజీలో గ్రేడ్స్ పడిపోవడం, ఇంట్లో నా గురించి అమ్మ పడే ఆందోళన ఇవన్నీ నన్ను కలచి వేస్తున్నాయి.

నన్ను చూసి డాడీ “రా ఆర్నవ్, నీ గురించే వెయిట్ చేస్తున్నాము” అనడంతో ఆలోచనలలోంచి బయట పడ్డాను. డాడీ నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఎంతో ప్రేమగా “ ఏం చేద్దాం నాన్నా! నువ్వే చెప్పు, అంతా విన్నావు కదా” అని అడిగారు.

“దిస్ ఈజ్ థ మోస్ట్ ఎంబరాస్సింగ్ సిట్యుయేషన్ ఇన్ మై లైఫ్”.

నిన్న కాలేజీలో జరిగిన సంఘటన నన్ను భయ భ్రాంతుడిని చేసింది. డ్రగ్ ఓవర్ డోస్ కావడంతో కాలేజీలో ఫైంట్ అయి పడిపోయిన నన్ను ఎమెర్జెన్సీకి తరలించారు. హెరాయిన్ డోస్ ఇంకొంచెం ఎక్కువ ఐతే శ్వాస తీసుకోవడం కష్టం అయి ప్రాణం పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ, కొంచెంలో తప్పి పోయిందని డాడీకి డాక్టర్ చెప్పింది విని నాకు వెన్ను లోంచి వణుకు పుట్టుకు వచ్చింది. ఎలాగైనా ఈఊబి లోంచి బయట పడాలని నిశ్చయించుకున్నాను.

చెడు అలవాట్లు ఎంత త్వరగా ఏర్పడతాయో వాటిని వదిలించుకోవడం అంత కష్టం.

అది సాయంత్ర సమయం. వీణ మీటినట్లుగా ఉన్న సున్నితమైన గొంతు విని విండో లోంచి బయటకి చూశాను. ఒక అందమైన అమ్మాయి ఆటో దిగి “ప్రకాష్ గారి ఇల్లు ఇదేనా” అనిఅడుగుతోంది మా మాలిని. మెల్లిగా లోపలి వస్తోంది ఆమె. అన్నీ మరచి పోయి ఆమెనే చూస్తుండి పోయాను. నాకు తెలియని రిలేటివ్ ఎవరా? అని అనుకుంటూ ఉండగా అమ్మ దగ్గర నుండి పిలుపు రానే వచ్చింది.

"ఆర్నవ్! ఈ అమ్మాయి ధరణి అని నా ఫ్రెండ్ డాటర్, తను ఒక ఎంజీఓ లో పని చేస్తోంది, టెంపరరీ పని మీద వచ్చింది, కొద్దీ రోజుల పాటు ఇక్కడే ఉంటుందని” అని పరిచయం చేసింది.

ఆమె నాకంటే ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ పెద్దదనుకుంటా. ఆమె నన్ను చూసి స్నేహ పూరితంగా ఒకచిరునవ్వు నవ్వింది. ఆ చల్లని నవ్వు నా మనసులో నిండు వెన్నెల కురిపించినట్లు అయింది. ఆమె పరిచయం బీడు బారిన నా హృదయానికి తొలి వర్షపు జల్లులా ఉంది. ఆమె నాతో పెద్దగా ఏమి మాట్లాడ లేదు. మీకు క్యారంస్ ఆడటం ఇష్టమేనా? అనడిగింది, అక్కడే గోడకి పెట్టి ఉన్న బోర్డు చూసి. నా ఫేవరెట్ గేమ్ ఒకప్పుడు అని చెప్పాను.

ఇద్దరం ఆడటం స్టార్ట్ చేసాము. నా చెయ్య వణుకుతోంది. అది ఆమె నోటీసుకి రాకుండా జాగ్రత్త పడుతున్నాను. కొంచెం సమయం గడిచింది. నేను కాన్సన్ట్రేట్ చేయ లేక పోతున్నాను. నరాల్లో ఒణుకు, శరీరంలో అలజడి ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ గా నేను డోస్ తీసుకునే సమయమది. ఎలా అయినా రూమ్ లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. మెల్లగా మాటలలోకి దింపింది. ఆమె స్వరం ఎంతో మధురంగా వీణ మీటుతున్నట్లు ఉంది. వింటూ కూర్చున్నాను. కొంత సమయం గడిచింది.

ఇంట్లో అందరు రావడం, ధరణితో పరిచయం చేసుకుని కబుర్ల లో పడటంతో చాలా రాత్రి అయిపోయింది. నేను బయట పడలేక పోయాను. రాత్రి అతి కష్టం మీద గడిచింది. నిద్రే లేదు, తల నరాలు చిట్లి పోతాయేమో అనేంత తల నొప్పి. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసాను.

మరునాడు ఉదయమే నేను హడావిడి గా బయట పడేలోగా ధరణి నన్ను తనతో ప్రక్క గ్రామానికి తోడుగా రమ్మని అడిగింది. నన్ను ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నేను అస్సలు నో అనలేను. తను అడిగిన విధానానికి ఎవ్వరు నో చెప్పలేరు. ఎందుకో నాకు తనకి హిప్నటైజ్ చెయ్యడం వచ్చేమో అన్పించిందిఆ క్షణంలో. లైట్ పింక్ కలర్ సారి, పెద్ద వాలు జడతో ఎంతో సింపుల్గా, మరెంతో అందంగా ఉందామె.

మెల్లగా బయలు దేరాం. ఆమే మాట్లాడుతోంది. అమె మాటల మీద కాన్సంట్రేట్ చెయ్యలేకపోతున్నాను. అమె మీద కోపం కూడా వస్తోంది. ఇంట్లో ఇంకెవరినైనా తోడుగా తీసుకువెళ్ళవచ్చు కదా! నన్నే అడగాలా అనిపించింది.

కారులో కొంత దూరం, ఆ తర్వాత కాలినడకన అసలే ఎండాకాలం. నడవలేక నడుస్తున్నాను. ఆయాసం కూడా వస్తోంది.. హెరాయిన్ తీసుకోవడం వలన నేనెంత వీక్ గా అయ్యానో ఆ రోజే తెలిసింది నాకు. కానీ ఆమె ముందు బయట పడటం నాకు ఇష్టం లేదు. ఆమె పని చేసేఎం.జీ.ఓ సంస్థ నుండి కొందరు వచ్చారు. వాళ్లతో ఆమె హుందాగా నడుస్తూ వెళుతోంది. సడన్ గానాకు చెమటలు ఎక్కువ అయిపోయి కూలబడ్డాను అక్కడికక్కడే. పల్లెటూరు కావడంతో చల్లని మజ్జిగతో చక్కని సపర్యలు చేశారు.

మొత్తానికి మధ్యాహ్నం వేళయింది మేము వెళ్లాల్సిన గమ్యం చేరడానికి.

మిమ్మల్ని ఒకేసారి చాలా దూరం నడిపించేశానా?? అని ఆమె చాలా ఫీల్ అయింది.

ఆమె అలా అంటుంటే నాకు చాలా ఎంబరాసింగ్ గా అనిపించింది. గత ఆరు నెలలుగా నేను స్పోర్ట్స్ ఏమి ఆడటం లేదని, డాడీ తో జాగింగ్గ్ కి వెళ్లి యుగాలు ఐపోయినట్లుగా అప్పుడే రియలైజ్ అయ్యాను నేను.

అదొక అనాధాశ్రమం. అంత మండుటెండలో ఇంత కష్టపడింది ఈ అనాధాశ్రమానికి రావడానికా?? అని విస్తుపోయాను నేను.

అక్కడి పిల్లలకి డ్రాయింగ్ క్లాస్, పెయింటింగ్ క్లాస్ తీసుకుంది ధరణి. నాకు తెలీకుండానే వాళ్ళకి హెల్ప్ చేయడం ప్రారంభించాను. పెయింటింగ్ లో చాలా అవార్డ్స్ వచ్చాయి నాకు. పిల్లలతో గడపడం వలన చాలా హాయిగా, ఎంతో సంతృప్తిగా అనిపించింది.

ఓపెన్ ప్లేసులో చెట్ల కింద ధరణి టీచర్స్ కి అడ్వాన్స్డ్ మెథడ్స్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ ప్లెయిన్ చేస్తోంది. ఆమెలో ఎలాంటి అలసట కనిపించటం లేదు. ఆమెని అలాగే చూస్తూ నిలబడ్డాను, ఇంత ఎనర్జీ ఎక్కడ నుండి తెస్తుందో అర్ధం కాలేదు నాకు.

సాయంత్రం అయిదు కావస్తోంది. “ఇంక ఇంటికి వెళ్దామా ఆర్నవ్” అనడిగింది ఆమె. దాని కోసమే ఎదురు చూస్తున్న నేను బ్రతుకు జీవుడా అని బయలు దేరాను. రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి చేరాము. ఎంతగా అలసి పోయానంటే రోజూ కన్నా డబుల్ తిన్నాను. అమ్మ చాలా సంతోషంతో కొసరి కొసరి వడ్డించింది. రాత్రికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీలేదు.

మరునాడు కూడా అమ్మ తనతో సాయానికి వెళ్ళమంది. నేను ‘నో‘ చెప్పే లోగానే డాడీ కూడా “వెళ్ళమ్మా, ఆ అమ్మాయికి కొత్త కదా ఇక్కడ” అని చెప్పడంతో సరేనన్నాను. నాకు కూడా వెళ్లాలనే ఉంది మనసులో అనుకుంటా.

ఇలా మూడు నెలలు గడిచి పోయాయి. ఎన్నో అనాధాశ్రమాలు, వృద్హాశ్రమాలు, మెంటల్లీ డిస్ఏబుల్డ్ స్కూల్స్ అన్ని విజిట్స్ అవుతున్నాయి ధరణితో. ఒక రకంగా నేను అసిస్టెంట్ అయిపోయానని చెప్పొచ్చు తనకి. ప్రతి వీకెండ్ పిక్నిక్ లాగా ఉంది మా అందరికి ఈ మూడు నెలలుగా. పాట్ మేకింగ్, గేమ్స్, మూవీస్ అని రక రకాల యాక్టివిటీస్ తో అందరిని బిజీ చేసేసింది. ఒక్క మనిషి వల్ల ఇంత మార్పా? అని ఆశ్చర్య పడేలా చేసింది తను.

నాలో చాలా మార్పు వచ్చింది. డ్రగ్స్ జోలికి వెళ్ళటమే లేదు. “మళ్ళీ ఇది వరకటి ఆర్నవ్ లా ఉన్నావోయ్” అన్నారు మా ఇంటి పక్కన అంకుల్ నన్ను చూసి. చాలా హ్యాపీ గా అనిపించింది. డైట్ ఇంప్రూవ్ అవ్వటం, క్లీన్ షేవ్ వలన మనిషి లాగా కనపడుతున్నాను.

మెంటల్లీ డిజబుల్డ్ పిల్లలని కలిశాక నాకు మనసంతా కలచి వేసినట్లు ఉంది. నాలో పూర్తిగా మార్పు రావడానికి కారణం అదే. ఎన్నో అవయవ లోపాలు ఉండి కూడా ఏదైనా సాధించాలనే వాళ్ళ తపన నన్ను ప్రభావితుడిని చేసింది.

గ్రుడ్డివాళ్ళు బ్రెయిలీ లిపి ద్వారా, చెవిటి వాళ్ళు సైన్ లాంగ్వేజ్ తో, కాళ్లు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో. వాళ్ళు తమ అవయవ లేమిని అతిక్రమించి నేర్చుకోవాలనే తపనతో ఎంత కష్ట పడుతున్నారో అక్కడికి వెళ్ళి స్వయంగా వాళ్ళతో గడిపితే కానీ తెలీదు. ఏ అవయవ లోపం లేకుండా పుట్టడం కూడా ఎంతో అదృష్టం కదా అనిపించింది.

అన్ని ఆధునిక సదుపాయాలు ఉండి, తల్లితండ్రుల అండ ఉండి, ఎంట్రన్స్ ఎక్జాం బాగా వ్రాయలేదనే చిన్న విషయానికి హెరాయిన్ లాంటి ప్రాణాంతకమైన వ్యసనానికి బానిస అయినందుకు చాలా సిగ్గుగా అనిపించింది నాకు. ఈ మూడు నెలలలో ఒక జీవిత కాలానికి సరి పడినంత అనుభవం సంపాదించుకున్నట్లుగా ఉంది.

ధరణి ట్రైనింగ్ పూర్తి అవ్వడంతో వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఆమెతోనే సందడి అంతా వెళ్ళిపోతోందా? అనిపించింది మా అందరికీ.

నాకు ఇంక నానీ అవసరం లేదని అమ్మతో అంటే ఆమె పడీ పడీ నవ్వింది ధరణినే నానీ అని అమ్మ చెప్పడంతో అవాక్కవడం నా వంతు అయింది. నానీ అంటే ఓల్డ్ గ్రమ్పి లేడీ అనుకున్నాకానీ, ఇంత అందమైన అమ్మాయి ఈ ప్రొఫెషన్ ఎంచుకుందా? అని ఆశ్చర్యపోయాను.

ధరణీయే నానీ అని ముందే తెలిస్తే నాలో ఈ మార్పు ఇంత త్వరగా వచ్చేది కాదేమో. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో చక్కగా నాకు ఇసుమంత కూడా అనుమానం రాకుండా నాలో మార్పుకి సహాయ పడ్డారో అర్ధమైంది నాకు.

జీవితాన్ని ఎలా గడపాలి అనేది మన చేతులలోనే ఉంది అని తెలియ చెప్పిన ధరణికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకున్నాను.

పునర్జన్మనిచ్చిన దేవతగా ధరణి నా మదిలో ఎప్పటికి నిలిచి పోతుంది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి