kuch karona - Krishna Kasavaraju

kuch karona

తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్ని రోజులుంటుంది అన్నట్టు..రెండు తుమ్ములు మూడు దగ్గులు తగ్గితే మూల కూర్చోబెట్టి ...మూతి మీద శానిటైజర్ కొట్టి చేస్తున్నారు కుంకలు.. రాత్రి ఉసిరిగా పచ్చడి తిన్నందువల్ల వచ్చిన తుమ్ములు రా అంటే...నీకేం తెలీదని గాంధీ ఆసుపత్రి కి పోయి చేరమంటున్నారు ..ఇడ్డెక్కడి విడ్డురం ఆపకుండా విరోచనాలు వచ్చినప్పుడు కూడా ఇంత విచారించాలా ! తుమ్మాలంటే భయం గా ఉంది..మనసారా తుమ్మలేక పోతే ఎందుకు బ్రతుకు...ముక్కు మీద దురదపెడితే గోక్కోడానికి లేదు...నోరారా దగ్గడానికి లేదు...కరీనా కుచ్ కరో..

నిన్న ఎవరో ఇంగువ ఇచ్చారు అని బాగా దట్టించి చారు పెట్టింది ...తిరగమాత వేస్తుంటే ఆ ఘాటుకు కోర బోయింది ఈలోపల మా పక్కింటి పళ్ళ పంకజం అమ్మాయి మీ వారు ఈ మధ్య పూణే వెళ్ళొచ్చాడు కదూ...అంటూ మూతిని మూర పొడుగు లాగింది...నీకెందుకే రాలి పోయే పువ్వు కి రాగాలెక్కువ అని ...తొంబయిళ్ళకి అంత యావ అవసరమా !

సరే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆఫీస్ లో లిఫ్ట్ ఎక్కగానే ..వేసుకున్న యాలక్కాయి అడ్డుపడి కాస్త కళ్ళు కళ్ళు అంన్నామంటే చాలు ..ఏడో ఫ్లోర్ లో దిగాలన్న వాడు ఒకటవ ఫ్లోర్ లో దిగి పరారవుతున్నాడు .. ఇంకో అక్కాయి అయితే...ముఖానికి గుడ్డ కట్టుకోకూడదు అని సలహా ఒకటి....నీ దుంపతెగా నాకేమన్నా కుష్టు వ్యాధి వచ్చి చచ్చిందా..కాస్త కోరబోయింది అంతే. ..మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆ ఏవోయ్ ..కృష్ణ మోహన్ అంత బాగున్నారా అనేవాడు.....ఇప్పుడు ఏమయ్యా మీ చుట్టుపక్కల అందరు బాగున్నారు కదా ఒకవేళ ఏదైనా ఉంటె ఇంటికి తగలడు ఇక్కడ ఉండమాక అంటున్నాడు.....ఇంట్లో చచ్చేంత పని వుంది బోస్ ఒక్కరోజు నాకు వర్క్ ఫ్రొం హోమ్ ఇవ్వు అంటే...సణిగి సణిగి .....సరే చావు అనేవాడు ..ఇప్పుడు వస్తానన్న వద్దు అంటున్నాడు.

హాయిగా మా కావలి లో ... ఆనందం గ స్వామి హోటల్ ఎర్రపచ్చడి వేసుకొని ఇడ్లీ తింటూ ఉండేవాడిని ...ఈ గోల ఏమి లేకుండా...ఇక వాట్సాప్ తెరిచామో ..తుమ్మినోడు దగ్గినాడు..తుమ్మబోతున్నవాడు ...దగ్గబోతున్నవాడు ...తుమ్మినా తరువాత వాడి రియాక్షన్ ...ఇలా నిమిషానికి ఒకటి....అలాంటి మెసేజ్ చూసినప్పుడు కడుపులో కదలికలు మొదలు ఉంటామో పోతామో అని...ఒక వైపు ఏమి భయం లేదంటూ అన్ని మాల్ మూసేసం...అన్ని ......బంద్ చేసాం అని....ఎందుకో..

ముందు జాగర్త మంచిదే ..కానీ..ఇలా మనుషుల మనో భావాలతో ఆడుకోకండి రా...పోయే ప్రాణం ఎలాగూ పోతుంది..కాస్త ప్రశాంతం గ కూడా చావా నిచ్చేలా లేరు చచ్చినోళ్ళు.. ఇదిగో ..అదిగో అని....మనశాంతి లేకుండా చేసి...దగ్గోస్తే చస్తాం అనే దాకా తెచ్చి తగలడ్డారు..

పులిహోర తిందామంటే భయం....ఆవకాయ ముక్కాలా పచ్చడి మింగుదామంటే భయం..ఎక్కడ జలుబు చేసి దగ్గోస్తే ఐసోలేటె చేసి చేస్తారేమో అని.. ఎవడైనా మందు కనుక్కోండి రా త్వరగా ..లేకపోతే ఈ భయానికి సగం జనాభా చచ్చేలా ఉన్నారు. బ్రతికినన్ని రోజులు హాయిగా బ్రతకనివ్వరా

ఆకాశం లో ఆశల హరివిల్లు అని పాట వేస్తారు ....ముక్కుకు గుడ్డ కట్టుకోండి అని యాడ్....టీవీ లో వంటలక్కకి కూడా లేవు ఇన్ని కష్టాలు.. ఓ పార్టీ కి పోదామంటే భయం ఓ పేరంటానికి ఎవరన్నా వస్తున్నారంటే భయం...ఇంత బ్రతుకు బ్రతికి ముక్కుకు గుడ్డకట్టుకు తిరిగి చస్తున్నాం.. ప్రతి వాడు సైంటిస్ట్ లా వెల్లుల్లి రెమ్మలు తిను...వేప ఉండలు తిను....పాలల్లో పసుపేసుకో....నెత్తిన గుడ్డేసుకో అని ఒకటే సలహాలు....అసలు జాగర్తలు చెప్పాల్సింది డాక్టర్ లకి ..వాళ్ళేమి మాట్లాడకుండా సేవలు చేస్తుంటే...ఇంట్లో ని బయటకు రాని ...ముష్టి వెధవలు గుడ్డకట్టుకొని వాట్సాప్ లు పంపించడం.. హాట్స్ ఆఫ్ టు డాక్టర్స్ మీరే నిజమైన దేవుళ్ళు..
ఈ గుడ్డలు కట్టుకు తిరగడం కాదు గని మొన్న మా ఆవిడనుకొని ఒకావిడని బెండకాయలు తీసుకున్నావ్ అని అడిగా ....తరువాత ఏమైందో గుర్తులేదు ఎవరో ఇంటి దగ్గర వదిలిపెట్టారట జారీ పడ్డానని..

ఈ పిశాచం త్వరగా దూరం గ పోవాలని ఆసిస్తూ...హాఆఆఆఆ ................చ్హ్హ్..

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి