Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Janda Pai Kapiraju on March 7

ఈ సంచికలో >> సినిమా >>

లక్ష్మీ రావే మా ఇంటికి

lakshmi raave maa intiki

‘ఉయ్యాల జంపాల’ ఫేం అవికా గోర్‌ మరో తెలుగు సినిమాకి కమిట్‌ అయ్యింది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకున్న అవిక, ప్రముఖ పాత్రికేయుడు గిరిధర్‌ నిర్మాతగా మారి రూపొందిస్తోన్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే సినిమాలో నటిస్తోంది. గతంలో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన నంద్యాల రవి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తొలి సినిమాలానే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని, నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెడ్తుందని అవికా గోర్‌ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమలో తనకు ఆప్తులు చాలామంది వున్నారనీ, నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా వుందని నిర్మాత గిరిధర్‌ అన్నారు.

ప్రముఖ నిర్మాత రామానాయుడు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు, సినిమా యూనిట్‌కి విషెస్‌ అందజేశారు. ఈ చిత్రంలో శౌర్య హీరోగా నటిస్తున్నాడు. ‘ఉయ్యాలా జంపాలా’ టైటిల్‌లాగానే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అంటూ మరోమారు అందమైన టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది ఇంకా సెట్స్‌ మీదకు వెళ్ళకుండానే.

మరిన్ని సినిమా కబుర్లు
sastrigariki nata award