Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
'Basanti' Release

ఈ సంచికలో >> సినిమా >>

మార్చి 7న జెండా పై కపిరాజు..

Janda Pai Kapiraju on March 7

నాని,అమలాపౌల్‌ జంటగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జెండా పై కపిరాజు మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌ పై వాసన్‌ విజువల్స్‌తో కలిసి నిర్మాత రజత్‌ పార్దసారధి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి తొలివారంలో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సందర్బంగా నిర్మాత రజత్‌పార్ధసారధి మాట్లాడుతూ... వైవిధ్యమైన కధాకదనాలతో, అద్బుతమైన టెక్నికల్‌ వాల్యూస్‌తో నాని హీరోగా దర్శకుడు సముద్రఖని తీస్తోన్న జెండాపై కపిరాజు సినిమా అతి త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. నాని కెరీర్‌లోనె నెంబర్‌వన్‌ మూవీగా నిలిచిపోయే ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్దమయింది. తమిళ్‌ వెర్షన్‌ ఆల్రెడీ సెన్సార్ సభ్యుల ఎక్లెమ్‌ను అందుకొని టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అయింది. తెలుగులోనూ ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఎట్టిపరిస్ధితుల్లోనూ జెండా పై కపిరాజు అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అయి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకోవటం ఖాయం. మార్చి 7న తెలుగు, తమిళ బాషల్లో ఒకేమారు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ అందించిన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తప్పకుండా జెండా పై కపిరాజు ఈ యేటి మేటి చిత్రంగా నిలుస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు.

శరత్‌ కుమార్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భరణి, రాగిణి ద్వివేది తదితరులు నటించిన ఈ సినిమాకు చాయాగ్రహణం: సుకుమార్‌, జీవన్‌.. సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌.. కూర్పు: ఎస్‌.ఎన్‌.ఫాజిల్‌.. నిర్మాత: రజత్‌ పార్ధసారధి, దర్శకత్వం: సముద్రఖని.

మరిన్ని సినిమా కబుర్లు
lakshmi raave maa intiki