Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

మహా శివరాత్రి కానుకగా 'బసంతి' విడుదల

'Basanti' Release

తీవ్రవాదం నేపధ్యంలో సాగే వైవిధ్యమైన చిత్రమిది. 'బాణం' తరువాత నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కధ, కధనం, సంభాషణలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకముందని అన్నారు దర్శకుడు చైతన్య దంతులూరి. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై ఈ 'బసంతి' రూపొందుతోంది.

కధానాయకునిగా తాను 'బసంతి' లో పోషిస్తున్న పాత్ర కొత్తగా ఉంటుందని, నటునిగా తనకు విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు 'రాజా గౌతమ్'. కధానాయకుడు గా  'రాజా గౌతమ్' నటిస్తుండగా, ఆయన సరసన 'అలీషా బేగ్' నటిస్తున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 'మణిశర్మ' సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదల అయిన పాటలు ప్రజాదరణ పొందటం ఈ చిత్రం సాధించబోయే విజయం పై మానమ్మకాన్నిమరింత  పెంచిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే, మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత,దర్శకుడు చైతన్య దంతులూరి తెలిపారు.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో 'తనికెళ్ళ భరణి,షాయాజీ షిండే,రణధీర్ గట్ల, నవీన్ జాక్సన్, డా.కే.ఎస్.ఐ.ఆనంద్, ధన్ రాజ్, మణికిరణ్, దయ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు కృష్ణ చైతన్య, శ్రీమణి: కెమెరా: అనిల్ భండారి, మాటలు. శ్రీకాంత్ విస్సా, కూర్పు: మార్తాండ్.కె. వెంకటేష్.

సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల
కధ-కధనం-నిర్మాత-దర్శకత్వం: చైతన్య దంతులూరి

మరిన్ని సినిమా కబుర్లు
Janda Pai Kapiraju on March 7