Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
short films tiyocchuga

ఈ సంచికలో >> సినిమా >>

రాహుల్‌గాంధీపై గాయకుడి జోక్‌

rahul gandhi pai singer joke

కాంగ్రెసు పార్టీ ఆశాదీపం రాహుల్‌గాంధీపై ఓ జోక్‌ వేశాడు తెలుగు సినీ గాయకుడొకరు. సందర్భం మిస్‌ హైద్రాబాద్‌ పోటీలు. ఈ పోటీల్లో విజేతలైనవారిని ప్రశ్నించారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన అనూజ్‌ గురువారా, హర్షవర్ధన్‌ రాణే. వీరిలో అనూజ్‌ గురువారా తెలుగు సినీ నటుడు, గాయకుడు కూడా.

‘ఆనంద్‌’ సినిమాలో హీరో రాజా కాకుండా, హీరోయిన్‌ని ప్రేమిస్తాడే అతడే ఈ అనూజ్‌. ‘మగధీర’ సినిమాలోని ‘పంచదారా బొమ్మా బొమ్మా..’ పాటతో గాయకుడిగా సత్తా చాటుకున్న అనూజ్‌, అందాల పోటీల్లో విజేతలకు కొన్ని ప్రశ్నలు వేశాడు. మహిళల్లో లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ తల్లయ్యాక వస్తాయా? ముందే వస్తాయా? అనేది అందులో ఒకటి.

తన బిడ్డను సరైన మార్గంలో నడిపించి, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే క్రమంలో తల్లికి లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ వస్తాయని ఓ ‘మిస్‌’ సమాధానమిచ్చింది. ఆ సమాధానం విన్న అనూజ్‌, ‘ఈ మాట రాహుల్‌ విని వుంటే బావుండేది’ అని అన్నాడు. దాంతో అంతా ఫక్కున నవ్వుకున్నారు. ఎందుకూ? అనడక్కండి.

మరిన్ని సినిమా కబుర్లు
reddygaru poyaru eppudo