Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
reddygaru poyaru eppudo

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌చరణ్‌ డ్యాన్సేస్తే ఇంకేంటి?

Ramcharan dance

‘ఓ మై గాడ్‌’ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌ నటించబోతున్నారు. ఈ వార్త ఇటు పవన్‌ అభిమానుల్ని, అటు వెంకీ అభిమానుల్నీ ఫుల్‌ ఖుషీ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.

అదేంటంటే, ‘ఓ మై గాడ్‌’ సినిమా కోసం ప్రభుదేవా, సోనాక్షి సిన్హా ప్రత్యేక గీతంలో కన్పించగా, అలాంటిదే ఈ సినిమాలోనూ ఒకటి వుంటుందట. బాబాయ్‌ కోసం అబ్బాయ్‌ రామ్‌చరణ్‌ ‘ఓ మై గాడ్‌’ తెలుగు రీమేక్‌లో స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నాడు. ఇంకేం, పవన్‌ సినిమాలో చరణ్‌.. ఇంతకన్నా మెగా న్యూస్‌ ఏముంటుంది అభిమానులకి.

చిరంజీవి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో పవన్‌కళ్యాణ్‌ కాస్సేపు కన్పించాడు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లోనూ ఓ పాటలో పవన్‌ జస్ట్‌ కన్పిస్తాడంతే. ‘ఓ మై గాడ్‌’ రీమేక్‌ విషయానికొస్తే, చరణ్‌ ` కాజల్‌ కలిసి డాన్స్‌లో దుమ్ము రేపేయబోతున్నారట. వీరిద్దరిదీ సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌ అని అందరికీ తెలుసు.

ఇకనేం, బాబాయ్‌ సినిమాలో అబ్బాయ్‌.. దానికి తోడు చరణ్‌ ` కాజల్‌ డాన్స్‌.. ‘ఓ మై గాడ్‌’ తెలుగు రీమేక్‌కి కావాల్సినంత హైప్‌ వచ్చేస్తుంది. ఈ సినిమాకి ‘ఓరి దేవుడా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam