Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rahul gandhi pai singer joke

ఈ సంచికలో >> సినిమా >>

‘‘రెడ్డిగారు పోయారు’ ఎప్పుడో?

reddygaru poyaru eppudo

వచ్చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలు. గట్టిగా ఓ నలభై ఐదు రోజుల సమయం వుందంతే ఎన్నికలకి. ఏ క్షణంలో అయినా ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావొచ్చు. ఎన్నికల గొడవ ఇప్పుడెందుకంటే, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, ‘రెడ్డిగారు పోయారు’ అనే సినిమా అనౌన్స్‌ చేశాడు. ఎన్నికలకు ముందు అనే సంకేతం కూడా ఇచ్చాడు సినిమా పోస్టర్‌లో.

ఎన్నికలొచ్చేస్తున్నాయ్‌ కాబట్టి, సినిమా ఈపాటికే షూటింగ్‌ పార్ట్‌ చాలావరకు పూర్తయిపోయి వుండాలి ఎన్నికల్లోగా విడుదల కావాలంటే. రాజకీయ నేపథ్యం వున్న సినిమా కావడంతో ఎన్నికలకు ముందు సినిమా వస్తే, ఆ సినిమాకి వుండే క్రేజ్‌ చాలా ప్రత్యేకం. అయితే సినిమా మాత్రం ఇంకా సెట్స్‌పైకి రాలేదు.

అయినా వర్మ తలచుకుంటే సినిమా చకచకా నిర్మాణం అయిపోతుంది. కానీ అందుకు వర్మ సిద్ధపడాలి. సిద్ధం కాకుండా పోస్టర్‌ రిలీజ్‌ చేయడు కదా. ప్రతిష్టాత్మకంగా వర్మ రూపొందించనున్న సినిమా ఎన్నికలకు ముందు విడుదలవుతుందా? అన్న అనుమానాలకు వర్మ ఏం సమాధానమిస్తాడో, ఎలా సమాధానమిస్తాడో?

మరిన్ని సినిమా కబుర్లు
Ramcharan dance