Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lakshmi raave maa intiki

ఈ సంచికలో >> సినిమా >>

శాస్త్రిగారికి నాటా పురస్కారం

sastrigariki nata award

తెలుగు సినీ పాటల ప్రపంచంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి ప్రత్యేకమైన స్థానం వుంటుంది ఎల్లప్పుడూ. ఆయన తెలుగు సినీ పాటలపై వేసిన ముద్ర అలాంటిది. అద్భుతమైన పాటల్ని ఎన్నో రాసిన శాస్త్రిగారికి అనేకరకాలైన పురస్కారాలతో సత్కారాలు జరిగాయి. అలాంటి సత్కారాల జాబితాలోకి మరో సత్కారం చేరబోతోంది.

నాటా జీవిత సాఫల్య పురస్కారం వరించనుంది అతి త్వరలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి. అట్లాంటాలో రానున్న జులైలో జరగనున్న ఉత్సవాలలో ఈ పురస్కారాన్ని శాస్త్రిగారికి అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపున్నారట. ప్రతి ఏడాది, గత ఏడాదికి మించేలా ఉత్సవాలు చేయడంలో ‘నాటా’ ప్రత్యేకతే వేరు.

ఉత్సవాలు చేయడం, ఆ ఉత్సవాలలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటడంతోపాటుగా గొప్ప గొప్ప వ్యక్తులను సత్కరించడం ద్వారా నాటా తన ఉనికిని బహు గొప్పగా చాటుకుంటోంది. ఆందుకనే నాటా సేవల్ని అభినందించకుండా వుండలేరు తెలుగువారెవరూ.

మరిన్ని సినిమా కబుర్లు
short films tiyocchuga