Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sastrigariki nata award

ఈ సంచికలో >> సినిమా >>

ఆ షార్ట్‌ ఫిలింస్‌ తీయొచ్చుగా

short films tiyocchuga

షార్ట్‌ ఫిలింస్‌.. ఎక్కడ విన్నా ఇదే మాట. చేతిలో కెమెరా వుంటే చాలు, షార్ట్‌ ఫిలింస్‌ చాలా తేలిగ్గా వచ్చేస్తున్నాయి. వందల కొద్దీ షార్ట్‌ ఫిలింస్‌ రూపొందుతున్నా, వాటిల్లో చాలా అరుదుగా ఒకటీ అరా ఆకట్టుకుంటున్నాయి. చాలావరకు ‘చెత్త’గానే మిగిలిపోతున్నాయి. కథల ఎంపిక ఇందులో కీలకం.

తక్కువ టైమ్‌లో అద్భుతం.. అన్పించేలా షార్ట్‌ ఫిలిం రూపొందించాలంటే నేర్పు కావాలి. దానికి మంచి కథ కావాలి. ఏవేవో కథల్ని ఎంచుకుంటున్నారు కొందరు. కానీ, అందుబాటులో వున్న కథాంశాల్ని, పుస్తకాల్ని లెక్కల్లోకి తీసుకోవడంలేదు. బాలగంగాధర్‌ తిలక్‌, చలం, కాళీపట్నం రామారావు వంటి మేటి వ్యక్తుల జీవితాల్ని కథాంశాలుగా ఎంచుకుంటే అద్భుతమైన షార్ట్‌ ఫిలింస్‌ వస్తాయి.

మహనీయుల జీవిత గాధల్లోంచి చాలా కథలు పుట్టుకొస్తాయిగానీ, ఆ కోణంలో ఎవరూ ఆలోచించడంలేదు. ఆలోచిస్తే విలువలతో కూడిన షార్ట్‌ ఫిలింస్‌ రూపొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి కథల్ని సైతం షార్ట్‌ ఫిలింస్‌లా తయారు చేయొచ్చు. ఔత్సాహికులు అలా ఆలోచిస్తే మంచిది.

మరిన్ని సినిమా కబుర్లు
rahul gandhi pai singer joke