రామచిలుక - ఎం..కీర్తన

రామచిలుక

పుస్తక సమీక్ష

" రామచిలుక "ఇది ఒక పిల్లల కథల పుస్తకం.ఇందులో 19 కథలు ఉన్నాయి.ఈ పుస్తకాన్ని రాసినది " శ్రీ చెన్నూరి సుదర్శన్ " గారు.1952 ఆగస్టు 18న చెన్నూరి లక్ష్మయ్య మరియు లక్ష్మి లకు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ గ్రామంలో జన్మించారు.సుదర్శన్ గారు 1969లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్య హెచ్.ఎస్.సి చదువుకున్నారు.1974లో ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సుబేదారి గ్రామం హనుమకొండ జిల్లాలో పి.యు.సి చేశారు.1976లో ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ &గ్రాడ్యుయేషన్ సెంటర్ సంస్థలో టెలిఫోన్ ఆపరేటర్‌ లాగ పని చేసారు.ఈయన రాష్ట్ర ఉత్తమ టెలిఫోన్ ఆపరేటర్ గా అవార్డు అందుకున్నారు.1982 -2008లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ గా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు.1984లోఎం ఫిల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో చేశారు.1999లో డిప్లమా అడ్వాన్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ సీఎంసీ చేశారు.
2008- 2010 లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేశారు.సుదర్శన్ గారికి హాస్య కవి,యువ కవి గా సన్మానాలు కూడా చేశారు.
శ్రీ వాకాటి పాండురంగారావు గారు స్మారకపురస్కారం చేశారు.
" రామచిలుక "
ఈ రామచిలుక కథ లో చిలుక కి మాటలు వస్తాయి. రామచిలుక ప్రజలకు నీతులు చెబుతూ ఉండేది.ఈ కథ చదువుతుంటే నిజంగా చిలుక మాట్లాడుతుంది అనిపిస్తుంది.
" కోతి చేష్టలు "
కోతి చేష్టలు అనే ఈ కథలో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా ఉంచకుండా చెత్త వేయడం లాంటివి చేస్తారు. కాబట్టి, వారి మీద కోపం పడొద్దు అనేది రచయిత ఈ కథలో వివరంగా చెప్పారు.
" న్యాయఅవస్థ "
ఈ కథలో తన తండ్రి ఒక జడ్జి లంచం తీసుకొని పని చేయడం తన కొడుక్కి నచ్చదు.తన తండ్రికి ఒకరోజు ఇలా అని చెప్పాడు లంచం తీసుకోకుండాన్యాయాన్ని గెలిపిద్దాం.
" స్నేహం "
ఈ కథలో, స్నేహానికి చిన్న పెద్ద ధనవంతులు బలవంతులు బలహీనుల ఉండకూడదు మంచి మనసుంటే చాలు అని ఈ కథలో రచయిత వివరంగా చెప్పారు.
" పాఠం "
ఈ కథలో ఉపాధ్యాయులను గౌరవించాలి,ఎందుకంటే వారు ఆస్తులను విద్యార్థుల రూపంలో చెప్పుకుంటారు. ఉపాధ్యాయులు మన‌‌ ఉన్నతి చూసి గర్వపడతారు అందుకే ఉపాధ్యాయులను గౌరవించాలని‌ ఈ కథలో రచయిత గారు చెప్పారు.
" పుట్టినరోజు జే జే లు "
ఈ కథ లో, పుట్టిన రోజు ఒకరికి సహాయం చేయాలి.
అనేది రచయిత ఈ కథలో వివరంగా చెప్పారు.
" బద్ధకం "
ఈ కథలో, బద్ధకం ఉండాలి కానీ,మరొకరి ఇంటిని కిరాయి తీసుకుని ఉండాలి అనుకోవద్దు. సొంతంగా ఇల్లు కట్టుకుని ఉండాలి.కష్టపడితే దానికి ప్రతిఫలం దక్కుతుంది. అని రచయిత ఈ కథ ద్వారా చెప్పారు.
" ద్రోహం "
ద్రోహం అనే ఈ కథలో మనకు సహాయం చేసిన వారికి ద్రోహంచెయ్యద్దు అనేది ఈ కథ ద్వారా రచయిత గారు వివరంగా చెప్పారు.
" వస్తు భద్ర శాల "
ఈ కథలో ప్రజలు అందరూ వస్తువులు భద్రశాలగా ఉండే సర్పంచ్ ఇంట్లో డబ్బులు బంగారం ఇంకా ఎన్నో భద్ర పరచమని ఇచ్చేవారు.ఆ సర్పంచ్ ప్రజలు చదువుకోని వారు అని తెలిసి, వారి సొమ్ము దొంగతనం చేసేవాడు. అది ప్రజలకు తెలియదు. అందుకే అందరికీ చదువు చాలా అవసరం .అందుకే చదువు లేని వాడు వింత పశువు అని రచయిత అన్నాడు.
" వారసుడు "
వారసుడు అనే ఈ కథలో రచయితలు చాలా తగ్గి పోతున్నారు .ఆ రచయితె తన మనుమనికూడా ఒక రచయిత గా మార్చాలి అన్నదే ఈ కథలో రచయిత గారు చెప్పారు.
" చదువు సంస్కారం "
ఈ కథలో మనం ఎక్కడ ఉన్నా మన ఉపాధ్యాయులను గౌరవించాలి కానీ, వారిని చూసి చూడనట్టుగా ఉండకూడదు అనేది చదువు సంస్కారం అనే ఈ కథలో మనకు రచయిత గారు చెప్పారు.
" బోధన "
ఈ కథలో,మనం ఎప్పుడూ నిజం చెప్పాలి ఆ తప్పు చేసింది మన సొంత వాళ్ళు అయినా సరే, భయపడకుండా నిజం చెప్పాలి అనేది ఈ కథలో రచయిత మనకు చెప్పారు.
" అమ్మ సంతకం "
అప్పటి కాలంలో ఎవరికీ సంతకం రాదు. అందరికి వేలి ముద్ర వేయడమే వచ్చు .అందుకే మనమే అమ్మకు సంతకం నేర్పించాలి అని ఈ కథలో రచయిత చెప్పారు.
" అమ్మమ్మ తాతయ్య "
ఈ కథలో, చిన్న పిల్లల ముందు దోంగతనంలాంటివి చెయ్యొద్దు ఎందుకంటే వారు ఏమి చూస్తే అది నిజం అనుకుంటారు అని ఈ కథలో రచయిత గారుచెప్పారు.
" చిన్నారి "
ఈ కథలో వేసవికాలంలో పక్షులకు నీళ్లు పెట్టాలి.
పక్షులకు మనం మంచి చేస్తే అవి తిరిగి మనకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాయి అని ఈ కథలో మనం నేర్చుకోవచ్చు.
" వికాసం "
ఈ కథలో, ఎప్పుడు బద్ధకంతో ఉండకూడదు ,పేదలకు సాయం చేయాలి అనే ఈ కథ ద్వారా నేర్చుకుంటాం.
" కప్పల పెళ్లి "
ఈ కథలో, ఊరు కరువుకాటకాలతో అల్లాడిపోతూ ఉంది అదే సమయంలో రెండు కప్పలకు పెళ్లి చేసే వర్షం వస్తుందని అనుకుంటారు.
" జ్ఞాన సంపద "
ఈ కథలో, ఎవరైనా అమ్మానాన్నలు వారు ముసలివారు కాగానే అనాధాశ్రమంలో ఉంచుతారు అలా చేయకుండా వారిని బాగా చూసుకోవాలి అని ఈ కథ ద్వారా మనకు రచయిత గారు వివరంగా చెప్పారు.
" చిలుక కీనుక "
ఈ కథలో ప్రజలు గుడ్డిగా చిలక జోస్యం చెప్పే వారిని నమ్ముతారు అందుకే మనం ఈ కథ ద్వారా చిలకజోస్యం చెప్పేవారిని నమ్మవద్దని తెలుసుకున్నాం.
ముగింపు
ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది.నిజంగా పక్షులు జంతువులు మాట్లాడుతున్నట్టు గా అనిపిస్తుంది.ఈ పుస్తకం ద్వారా నేను ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకున్నాను.ఈ పుస్తకంలో అన్ని కథలు చాలా బాగా అర్థమయ్యాయి. ఏవి అర్థం కాకుండా లేవు.రచయిత గారు ఈ పుస్తకం ఎంతో బాగా రాశారు.ఈ పుస్తకం చాలా బాగా అర్థమైంది. ఈ పుస్తకం నుండి మనం చాలా నీతిని నేర్చుకోవచ్చు.