అతను మరణించాడా? - రాము కోలా.దెందుకూరు.

Atanu maraninchaada

"ఒక్క నిమిషం ఉండండలా! " "వచ్చేస్తున్నాను !మీరు ఇంత త్వరగానే వచ్చేస్తారని అనుకోలేదు,సుమండీ!" "అలసటగా ఉండి ఉంటుంది! ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలకు వచ్చేయండి , మీరు వస్తారని వేడి నీళ్ళు ,టవల్ సిద్దంగా ఉంచానులేండి .సబ్బు కూడా పక్కన పెట్టాను చూడండి ." "జాగ్రత్త నీళ్లు బాగా వేడిగా ఉన్నట్లు ఉన్నాయి' పక్కన బక్కెట్లో చల్లని నీళ్ళు పెట్టానో లేదు? మరోసారి చూసుకోండి! .ఎందుకైనా మంచిది! ఈమధ్యనే కాస్త మతిమరుపు నాకు ఎక్కువ ఉన్నట్లుగా ఉంటుంది.." "అనుకున్నా సమయానికి త్వరగానే వచ్చినట్లున్నారే?" "కొత్త బాస్ వచ్చాడన్నారుగా?" "కలుపుగోలు మనస్తత్వమేనా అతడిది.?" "మీతో సరదాగా ఉన్నారా?" "లేక కోపంతోనే రుసలాడుతూ ఉన్నారా?" "హా...ఎవ్వరు వస్తే ఏమిటిలే,మీ పని మీరు చేసుకు పోతూనే ఉంటారు కదా!." "ఎక్కడా చిన్న తప్పు దొరకనివ్వరు లేండి! నాకు తెలుసులేండి ?" "ముపై ఏళ్ల వైవివాహిక జీవితంలో ,నేనే మీ దగ్గర చిన్న తప్పు దొరకబుచ్చుకోలేక పోయానే!, ఇక మీ బాసుకి సాధ్యమా! చెప్పండి ." "అవును మర్చిపోయాను?" "మీ చెల్లాయ్ ఏదో అవసరం ఉంది !డబ్బులు పంపించమని చేసినట్టుగా ఉంది?" , "మర్చిపోకండి! రేపు ఉదయం తన పేరున బ్యాంకులో చేసేయండి" "ఎంత అవసరం వచ్చిందో ఏమో ?లేకుంటే నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతుందా.!" పిచ్చి పిల్ల నేనేమైనా అనుకుంటాను అనుకుందేమో? మెసేజ్ చేసి వెంటనే డిలీట్ చేసింది." "పెళ్లయిన తర్వాత మొదటి సారి అడుగుతుంది, వదినా నువ్వైనా కాస్త అన్నయ్యకు గుర్తు చేయవచ్చు కదా? అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి." అంతగా మీదగ్గర ఉన్నవి చాలకుంటే నా నగలు బ్యాంక్ లో పెట్టిన తనకు సర్దేయండి. ***** "ఇలా కూర్చోండి!" "ఒకటే పరుగులు మీకు,నేమ్మదిగా నాలుగు ముద్దలు కూర్చుని తృప్తిగా తినరుకదా! " ఆఫీసు పనులు వత్తిడి ఎప్పుడూ ఉన్నదేకదా!" "సరిగ్గా నిద్ర కూడా పోతున్నట్లుగా లేదు,చూడండి కనురెప్పల క్రింద నాల్లని చారలు వచ్చేసాయి.అప్పుడే." "అదిగో!మీకు ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కూర,కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పచ్చడిచేసా,మజ్జిగ చారు చేసా."వేడివేడిగా తినేయండి." "మీ అమ్మగారు చెప్పేవారు!" "చూడమ్మా ! కోడలు పిల్లా !మావాడు బహు భోజనం ప్రియుడు ,వాడికి ఎలా వంటలు చేసి పెడతావో? నన్ను మరిపించాలి నువ్వు! " "ఇన్ని రోజులు అమ్మా అమ్మా అంటూ ,నా కొంగు పట్టుకొని తిరిగేవాడు, రేపటి నుండి నీ కొంగు పట్టుకుని తిరిగేలా వంట చేసి పెట్టాలి" అని పదే పదే చెప్పేవారు అత్తయ్య గారు." "నాకు అంతగా వంట రాకున్నా !ఏదో మా అమ్మగారు నేర్పిన దానితో ,మీకు నచ్చుతుందో నచ్చదో అన్నట్లుగా వంట చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా" "నచ్చకపోతే చెప్పండి నేర్చుకుంటాను, కానీ అలకమాని భోజనం మాత్రం మానకండి.. ***** "ఉండండి తలగడ సర్దుతాను! మీకు తలగడ‌ సరిగా లేకుంటే నిద్రపట్టదు,ఉదయమే నీరసంగా నిద్ర లేస్తారు." "ఫ్యాన్ మూడు మీదే ఉంచాను,మీకు అవసరమైతే కాస్త పెంచుకొండి." "బయట మంచు కురుస్తుంది ,అందువలనే కాస్త తగ్గించాను". అలా కిటికీ లోనుండి చూడండి,మీకు జోలపాడేందుకు మేఘాలు కదలి వస్తున్నాయి. "చేతికి అందుబాటులో మంచినీళ్ళు పెట్టాను,ఇంకా ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి,మీరు రాత్రి పూట లేచి ఇబ్బంది పడకండి." "కాళ్ళు చాపుకోండి ,రగ్గు కప్పుతాను.. గుడ్ బోయ్..అలా పడుకోవాలి..." తలుపు శబ్దం కావడంతో తల తిప్పి చూసింది .దమయంతి. "అమ్మా!నాన్నగారు నిద్రపోయారు,ఇక నువ్వుకూడా త్వరగా పడుకోవాలి, ఉదయం నాన్నగారికి తలంటు స్నానం చేయించాలి కదా!" అవును!ఉదయమే త్వరగా నిద్రలేవాలి.పదా!త్వరగా పాడుకుందాం! ఉదయం కాస్త ఆలస్యమైనా మీ నాన్నకు చెప్పలేనంత కోపం వస్తుంది." గదిలోనుండి దమయంతిని చంటి బిడ్డలా బయటకు తీసుకు వస్తుంది ,వినమ్ర. తండ్రి యాక్సిడెంట్స్ లో చనిపోయిన తరువాత తన కన్నతల్లి తనకు పసిపాపలా మారింది.ఇలా 🙏శుభం🙏

మరిన్ని కథలు

Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి
Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్
Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు