భువనగిరి పట్టణంలోని కొమరయ్య ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పదిహేను వందల మంది బాల ,బాలికలు చదువుకుంటున్నారు.
అదే పాఠశాలలో పదవతరగతి చదువుతున్న అరుణ తన తరగతికి నిర్వాహణ ( లీడర్ ) గా ఉన్నది.
ఒకరోజు భోజనసమయంలో తనతొటి వారితో " మిత్రులారా మన తరగతిలో అరవై మంది ఉన్నాం మనం ఐకమత్యంగా ఉంటే ఎన్న సమాజహిత మైన పనులు మరియు పొదుపు చేయవచ్చు ఉదాహరణకు ప్రతి సోమవారం మనం తలా యాభై రూపాయల వంతున పొదుపుచేస్తే మూడువేల రూపాయలు అవుతాయి వాటిని లాటరీ పద్దతిలో ఇద్దరిని ఎంపిక చేసి వారికి చెరి పదిహేను వందలు అందచేద్దాం అలా ధనం పొందినవారు తమకు లభించిన మెత్తాన్ని తపాల కార్యాలయంలో ( పోస్టాఫీస్ ) లో చిన్నపొదుపు మొత్తాంగా దాచుకోవాలి ,నేటినుండి పెద్దవాళ్ళ ద్వారా వచ్చే ధనాన్ని అక్కడ దాచుకోవచ్చు రాబోఏకాలంలో ఊహించని అవసరాలు వస్తే మనం దాచుకున్న ధనం వినియోగ పడుతుంది మనం విహరయాత్రలకు వెళ్ళడానికి వినియోగించుకోవచ్చు మరోవిషయం మనమంతా మొదటి సోమవారం తలా వందరూపాయల వంతున సేకరించి ఆధనాన్ని దేశరక్షణ నిధికి మన ప్రధాన ఉపాధ్యుల ద్వారా పంపుదాం ,మనఇంటటిని ఎలా పరిశుభ్రంగాఅందంగా ఉంచుకుంటామో మనపాఠశాలను పరిసరాలను అందంగా,పరిశుభ్రంగా ఉంచుకోవాలి కనుక
మనం తలా ఓపూల మొక్కను తీసుకువచ్చి పాఠశాల ఆవరణలో నాటుదాం " అన్నది అరుణ.
" నిజమే మంచి ఆలోచన మనలో పదిమంది సమూహ సభ్యులుగా ఏర్పడదాం ప్రతి విషయం పై అందరం చర్చించి నిర్ణయం తీసుకుందాం అలాగే మనపాఠశాలలో ఆర్ధికంగా వెనుకపడిన వారికి సహయపడే విషయాన్ని పరిశీలిద్దాం , ప్రతిసోమవారం డబ్బులు వసూలు చేయడం లాటరీ తీసి పేరు వచ్చిన వారికి డబ్బులు అందజేసే బాధ్యత అరుణ అక్కకే అప్పగిదాం మనమంతా ఐకమత్యంతో అరుణక్కకు సహకరిద్దాం "అన్నడు మల్లేశం.
మొదటి సోమవారం రోజున వచ్చిన ధనంతో ,సమూహ సభ్యులతో కలసి ప్రధానోపాధ్యాయుని కలసి ఆధనం అందజేసి దేశరక్షణ నిధికి పంపవలసినదిగా కోరిన అరుణ తాము ప్రతి సోమవారం పొదుపు పధకం ప్రారంభించ దలచామని వివరించి అనుమతి కోరింది అరుణ .
అరుణను అభినందిచిన ప్రధానోపాధ్యుడు మరుదినం ప్రార్ధనా గీతం ఆలపించిన అనంతరం అరుణ చేపట్టిన చిన్న మొత్తాల పొదుపు ,దేశరక్షణ నిధికి మనవంతు సహయ కార్యక్రమాన్ని వివరించి ,ఈపాఠశాలలో పనిచేస్తున్నఉపాధ్యాలు అందరూ తాము తలా పదివేల రూపాయలు యిస్తూ ఆమొత్తాన్ని దేశరక్షణ నిధికి పంపారు.పలు మాధ్యామాల ద్వారా ఈవిషయం భారత దేశం అంతటా తెలిసిపోయింది,లక్షలాది విద్యార్ధులు,
విధ్యార్ధినీలు తపాలా కార్యాలయంలోచిన్నపొద్దుపు మొత్తాల ఖాతాలు ప్రారంభించారు,వేలకోట్ల రూపాయలు దేశం అంతటినుండి దేశరక్షణ నిధికి అందసాగాయి.
అరుణ తీసుకున్న నిర్ణయం వలన భారతదేశపు విద్యా వ్యవస్ధలలో పాఠశాలనుండి విశ్వవిద్యాలయాల వరకు మార్పులు సంభవించాయి .
ఈవిషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ,విద్యాశాఖామంత్రితోకలసి అరుణ పాఠశాలకు వచ్చారు. వందలాది ఫల పుష్పాలతో కళకళలాడుతున్న పాఠశాలను చూసి సంతోషించిన కలెక్టర్ అరుణను అభినందిస్తూ "ఈపాఠశాలకు ఏంకావాలి అని నువ్వు అనుకుంటున్నావు "అన్నాడు. "అయ్య గ్రథాలయం ,కూర్చోవడానికి మంచి బల్లలు,పాఠశాలకు రంగులు వేయించండి "అన్నది అరుణ .అరుణ కోరినవి అన్ని వెంటనే మంజూరు చేసారు కలెక్టర్ .కాలక్రమంలో అరుణ చదివే పాఠశాల రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా ఎంపిక ఐయింది.

