_1634109883.jpg)
హరికథ చెప్పిన కోతిబావ.
"పిల్ల ఎలాఉంటదో"అన్నాడు కాలుమీద కాలువేసుకుంటూ కోతిబావ. "పిల్ల కోతిలా ఉంటుంది"అన్నిది పిల్లరామచిలుక." అదే వద్దనేది కోతిపిల్ల కోతిలా ఉంటదని నాకు తెలియదా? ఇంకా ఏమిస్తారో?" "పిల్లను ఇస్తారు"అంది తల్లిరామచిలుక."అది మాకుతెలుసు పిల్లతోపాటు నాకు ఇంకేం ఇస్తారు అని"అన్నాడుకోతిబావ. "దున్నఈనిందిరా అంటే దూడను కట్టెయ్యరా అన్నాడంట, అసలు నీకు పెళ్ళెందుకు కోతిబావ"అన్నది పిల్లరామచిలుక.
ఉరిమి చూసాడు పిల్లరిమచిలుకను కోతిబావ." చెడ్డికూడా లేకుండా తిరిగే నీకు సుక్మా అడివోళ్ళు కాబట్టి పిల్లను ఇస్తున్నారు ఈచుట్టుపక్కల నీసంగతి తెలిసినవాళ్ళు ఎవ్వరూ పిల్లనుకాదుకదా గుక్కెడు మంచినీళ్ళుకూడా ఇవ్వరు."అంది తల్లి రామచిలుక.
"ఊళ్ళోవాళ్ళంతా వడ్లు ఎండబెట్టుకుంటే నక్క తన తోక ఎండ బెట్టుకుందం ట అలా ఉంది నీకథ"అన్న"మీకు తెలియదు విజయదశమికి మన అడవి లో సమస్త జంతుజాలం ఎదుట రాజు రాణి గారి సమక్షంలో నేను హరికథ చెప్పబోతున్నాను మీకు,నాకు పిల్లను ఇవ్వడాని వచ్చేవారికి,మనఅడవి లోని వారందరికి నేనంటే ఏమిటో,నాతెలివి తేటలకు అబ్బురపడతారు చూసుకొండి,రాజుగారి అనుమతికూడా తీసుకున్నా"అన్నాడు కోతిబావ.
ఇందుమూలముగా తెలియజేయడమేమనగా దసరా పండుగ సందర్బంగా విజయదశమి రోజున మనకోతి బావగారు రామాయణాన్ని హరికథ రూపంలో చెప్పబోతున్నారు కావున ఈ అడవిలోని పిల్లజంతువులు,తల్లి జంతువులు,తండ్రిజంతువులు పెళ్ళికానివారు పక్షులు,పిట్టలు జలచరాలు అందరూ ఈ హరికథా విని తరించవలసినదాగా తెలియజేయడమైనది అహా'అంటూ తన తప్పెటపై దరువు వేయసాగాడు కుందేలు.
దసరా పండుగ ఆయుథపూజ రోజు అడవిజంతువుల పిల్లలు తమ పుస్తకాలు,జంతువులు తమ వేట ఆయుథాలు పెట్టిపూజ ముగించాయి.
సాయంత్రం అందరు ఎత్తుగా ఉన్న సింహరాజుగారి గుహముందు బారులు తీరి కూర్చున్నాయి.
మెడలో పూమాలతో ప్రవేశించిన కోతిబావను చూసిన పిల్లజంతువులన్ని ఘోల్లున నవ్వాయి.అందరూ తెచ్చిన ఫలహారాలు ఆరగించి,మేకపాలు కడుపునిండా తాగిన కోతిబావ"భక్తులారా మీలో రామాయణం గురించి ఎంతమందికి తెలుసు"అన్నాడు. అక్కడ ఉన్న జంతువులలో సగం మాకు తెలుసు అని చేతులు ఎత్తాయి. "ఇంకేం రామయణం తెలిసినమీరు తెలియని వారికి,ముఖ్యంగా పిల్లలకు చెప్పండి.అన్నాడు.
అందరూ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను లంకాదహనం సన్నివేశాన్ని సహజంగా ప్రదర్శించబోతున్నాను" అని గుడ్డలు చుట్టి నూనెలో ముంచిన తనతోక చివరి భాగానికి నిప్పంటించుకుని "నాటి మా హనుమంతుడు ఈవిధంగా నిప్పంటిచుకుని లంకాదహనం చేసాడు"అని గెంతులు వేస్తు ఆడుతూ పొరపాటున సింహరాజు జూలుకు తనతోక తగిలించాడు.ఆమంటల బాధ తప్పించుకోవడానికి పక్కనే ఉన్న నీళ్ళగుంత లోనికిదూకాడు,మండుతున్న తోక బాధ తట్టుకోలేని కోతిబావ ఎగిరీ సింహరాజు పైన దూకాడు.'ఓర్ని ఈడకి తగలడ్డావా'అని లాగి తన్నాడు సింహరాజు.అసలే ఎర్రగా ఉండే ప్రదేశంలో రాజుగారు బలంగా అక్కడే తన్నడంతో మరింత ఎర్రబడింది ఆమంట,బాధఎవరికి చెప్పుకోవాలో తెలియని కోతిబావ గిజగిజలాడాడు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.