బహుమతి - Shyamkumar chagal

Bahunathi

కాలేజీ ల్యాబ్ లో ఉపయోగించే పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీ అది. అందులో అసిస్టెంట్ సైంటిస్ట్ గా మూడు నెలల కిందట రాజశేఖర్ ఉద్యోగం మొదలుపెట్టాడు. దాదాపుగా పది సంవత్సరాల కిందట నలుగురితో మొదలైన ఆ ఫ్యాక్టరీ ప్రస్తుతం 200 మందికి ఉపాధి కల్పిస్తోంది. దాని యజమాని'మధుసూదన్ 'గారు. చాలా మంచివాడు అని పేరు ఉందాయానికి . ఉదయాన్నే ఆఫీసు తెరిచిన కాసేపటికి ఉద్యోగులందరికీ వేడివేడిగా టీ పంపించబడడం అక్కడ రివాజు . భోజన సమయంలో ఉద్యోగస్తులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లు అన్నీ కూడా కడిగి ఎవరి టిఫిన్ డబ్బాలు వారికి ,వారి వారి టేబుల్ మీదికి పంపించే సౌకర్యం యాజమాన్యం కల్పించింది. అన్నింటికంటే విచిత్రమైన, ఎక్కడా చూడని ఒక పద్ధతి ఈ కంపెనీలో ఈ యాజమాన్యం అనుసరించింది. అదేమిటంటే ప్రతి ఉద్యోగి వారి వారి అవసరాలు, ఖర్చులు ,బాధ్యతలను బట్టి వారికి ఇచ్చే జీతం నిర్ణయించబడుతుంది. ఈ కారణంగా కొన్ని సార్లు చిన్న ఉద్యోగి కి పెద్ద స్థాయిలో ఉండే ఉద్యోగి కంటే జీతం ఎక్కువ గా పొందే సందర్భాలు కూడా కనపడతాయి. దీని యజమాని చాలా కష్టజీవి. జీవితంలో ఎంతో కష్టించి పనిచేసి తన శ్రమ తో, ప్రతిభ తో ఆ కంపెనీని ఈ స్థాయికి తీసుకు వచ్చాడని అందరూ చెప్పుకుంటా రు . ఉద్యోగస్థులకు మంచి మంచి సౌకర్యాలు కల్పించే ఇంత మంచి కంపెనీలో యజమాని తో కలిసి మొదటి నుంచి పనిచేస్తున్న చారి గారు మాత్రం అందరి కీ ఏదోరకంగా ఇబ్బందులు సృష్టిస్తూ,ఇబ్బందులు పెడుతూ, కంటిలో నలుసులా మారాడు. యజమానికి కుడిభుజం లాంటి వ్యక్తి కనుక ఈ విషయం యజమాని వరకూ తీసుకెళ్లడానికి ఎవరు ధైర్యం చేసేవారుకాదు. ఒక రోజు పనిలో నిమగ్నమయి కూర్చున్న రాజశేఖర్ దగ్గరికి చారి గారు వచ్చి కాలేజీ రికార్డ్ బుక్ ఒకటి చేతికిచ్చి "ఇది మధుసూదన్ గారి కొడుకు కు సంబంధించిన కాలేజీ ప్రాక్టికల్ బుక్. దీంట్లో నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, అన్ని పేజీలలో దానికి సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తిచేసి నోట్స్ రాసి పెట్టాలి" అని సూచనలు చేసాడు. " ఇదేంటి సార్? ఇది ఆ..అబ్బాయి చేయవలసిన అసైన్మెంట్! దీనిని నేను పూర్తి చేయడం ఏమిటి? ఇది సబబుగా లేదు . ఆఫీసు పని చేయడం నా ఉద్యోగ ధర్మం అంతే కానీ ఇవన్నీ కాదు!" అంటూ నిర్మొహమాటంగా ఆ పుస్తకాన్ని వెనక్కి చారి చేతికి ఇచ్చేశాడు రాజశేఖర్. "సరే మీ ఇష్టం! ఈ విషయం ఎండి గారికి తెలిస్తే నీకే మంచిది కాదు" అంటూ దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు చారి. ఈ తతంగమంతా చూస్తున్న పక్కనున్న ఉద్యోగస్తులు అందరూ రాజశేఖర్ దగ్గరికి వచ్చి "చాలా తప్పు రాజశేఖర్ .మధుసూదన్ గారు చాలా మంచివారు. వారి అబ్బాయి రికార్డు బుక్ పూర్తి చేసి ఇవ్వటంలో మనం వారికి సహాయం చేసినట్టే కదా! ఇందులో తప్పేముంది.?పైగా మన యజమాని అందరి లాంటి వారు కాదు. మన బాగోగులు వ్యక్తిగతంగా చూస్తూ ఉంటారు" అంటూ మందలించారు. రాజశేఖర్ ఏమి మాట్లాడకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి అందరూ అనుకున్నట్లు గానే ఎండి దగ్గర నుంచి పిలుపు వచ్చింది రాజశేఖర్ కి. 'అనవసరమైన చిక్కుల్లో పడ్డాడు రాజశేఖర్' అని. ఎండి,మధుసూదన్ గారి క్యాబిన్ వైపు వెళుతున్న రాజశేఖర్ ను చూసి అందరూ జాలి పడ్డారు. 'మంచి కుర్రాడు లేనిపోని చిక్కుల్లో పడ్డాడు' అని మరి కొందరు అనుకున్నారు . ' ఈరోజు తో వీడి ఉద్యోగం ఆఖరు !' అనుకొని బాధ పడ్డారు ఇంకొందరు. "మే ఐ కమిన్ సర్ "అంటూ తలుపు కొద్దిగా తెరిచి బయటే నిలబడి ఉన్న రాజశేఖర ను చూసి మధుసూదన్ గారు, కళ్ళతోటి అతడిని లోనికి రమ్మని సైగ చేశాడు. " ప్లీజ్ టేక్ యువర్ సిట్ "అంటూ రాజశేఖర్ కి తన ముందున్న కుర్చీ చూపించి చేతిలో ఉన్న ఫైలును చదువు తూ కూర్చున్నాడు. అలాగే ఐదు నిమిషాలు గడిచిపోయింది. మౌనంగా యజమానిని చూస్తూ కూర్చున్నాడు రాజశేఖర్. కంటికి ఉన్న కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ ఒకసారి రాజశేఖర్ ని చూసి "ఏంటి బాబు, ఏంటి నీ ప్రాబ్లం ?" అన్నాడు. రాజశేఖర్ కు విషయం అర్థమై ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న కాలేజ్ రికార్డ్ బుక్ చేతిలోకితీసుకుని" ఇది మా అబ్బాయి రికార్డ్ బుక్. దీనికి కాస్త సహాయం చేసి పూర్తి చేయమని నీకు పంపించాను .చారి గారు వచ్చి ఇప్పుడు చెప్పారు. నువ్వు ఇది చేయనని, మొండిగా తలబిరుసు గా సమాధానం చెప్పావ్ అని తెలిసింది. ఎందుకని ?" కాస్త నిండుగా ఊపిరి తీసుకుని, చిన్న చిరునవ్వు నవ్వి " సర్ మీరు కోపం తెచ్చుకుంటే నేను మాట్లాడలేను". "సరే ,ఇట్స్ ఓకే చెప్పండి ." అన్నాడు రాజశేఖర్ ను నిశితంగా చూస్తూ. "సర్! కాలేజీలో రోజు ఇచ్చే అసైన్మెంట్ అన్నది మీ అబ్బాయికి పాఠం నేర్పించే విధానాలలో ముఖ్యమైనది. సాధారణంగా క్లాస్ లో ఏదైనా ఒక విషయంలో వెనకబడిన ఆ విద్యార్థికి ఇలాంటి అసైన్మెంట్స్ ఇచ్చి ఆ సబ్జెక్టులో ఆ విద్యార్థిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగం ఇది. ఇలాంటివి విద్యార్థులు చేయటం మూలాన వారికి ఆ విషయ పరిజ్ఞానం లో అవగాహన పెరిగి ఆ తర్వాత జరిగే పరీక్షలలో అవలీలగా ఉత్తీర్ణులు అవుతారు. వీటిని సాధించడానికి మనం సహాయపడాలి లేదా ప్రోత్సహించాలి అంతేగాని ఈ విధంగా వేరే వారితో చేయించడం మూలాన అసలు దాని ఉద్దేశ్యమే దెబ్బతిని విద్యార్థికి చెందవలసిన, , అందవలసిన విజ్ఞాన జిజ్ఞాస దొరకదు. మీ అబ్బాయికి అర్థంకాని విషయాలలో, మీకు అభ్యంతరం లేకుంటే, అప్పుడప్పుడు నేను నేర్పించటానికి ప్రయత్నిస్తాను. మీ అబ్బాయి స్వయంగా విద్యను సముపార్జించి మీకంటే ఉన్నతమైన స్థానాలకు పోటీ పడే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు తగిన సౌలభ్యాన్ని మీరు సమకూర్చి తే చాలు, మీరు న్యాయం చేకూర్చినట్లే. ఈ విషయంలో నాకు అవగాహన లోపం ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఇక తర్వాత మీ ఇష్టం సర్." అని చాలా నిజాయితీగా సమాధానం చెప్పాడు. ' చెప్పవలసిన విషయాన్ని ఎంత సమర్థవంతంగా, ఎంత బాగా చెప్పాడు, పైగా చదువు విషయంలో మంచి అవగాహన ఉంది. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు గ్యారెంటీ' అని మనసులో అనుకున్నాడు యజమాని మధుసూదన్. " ok. వెరీ నైస్ రాజశేఖర్! సరే మీరు చెప్పినట్టే చేద్దాం. గుడ్. " అని మళ్ళీ కాసేపు ఆలోచించి "ఆదివారం నాడు మీరు మా ఇంటికి రాగలిగితే బాగుంటుంది. వారానికి ఒకసారి వీలు చేసుకొని మా అబ్బాయితో మాట్లాడుతూ ఉండండి. అది చాలు. ఓకే. . థాంక్యూ". అంటూ లేచి నిలబడి రాజశేఖర్ మీద కలిగిన అభిమానంతో కుడి చెయ్యి ముందుకు సాచి కరచాలనం చేశాడు మధుసూదన్ గారు. మరుసటి నెల అందరూ అనుకున్నట్లుగా రాజశేఖర్ ఉద్యోగం పోలేదు సరికదా, అతడిని క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జిగా ఉన్నతమైన స్థానంలో నియమించారు. దీనికి కారణమేంటో ఏం జరిగిందో, సాటి ఉద్యోగస్తుల కి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఆ తర్వాత చారి గారు తన యజమాని దగ్గరికి వెళ్లి "ఇదేం సార్ !ఎందుకు ఇలా చేశారు? నాకు అర్థం కావట్లేదు "అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా "చారి! ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది .మన లాంటి చిన్న కంపెనీలో అబ్బాయి ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం తనను సరి అయిన రీతిలో ఉపయోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో విద్య మీద ఇంత మంచి అవగాహన ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఇంతకంటే ఎక్కువ చెప్పినా నీకు అర్థం కాదులే వెళ్ళు!" అని నవ్వేశాడాయన. ******************************************* ఆ తర్వాత కొద్దీ నెలల లోనే రాజ శేఖర్ కంపెనీ లో జరిగే వ్యవహారాలన్నీ సునిశితంగా పరిశీలించి ఎన్నో లోటు పాట్లను ఎండి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని సరి చేయించాడు. అతడి ఆసక్తిని, నిజాయితిని గమనించిన ఎండి రాజశేఖర్ ను మార్కెటింగ్ ఇంచార్జి గా నియమించాడు. తన తెలివి కృషి ని పూర్తిగా వినియోగించి కంపెనీ టర్నోవర్ ను ఒక సంవత్సరం లోగా రెట్టింపు చేసాడు రాజశేఖర్ . ఒక రోజు ఆఫీస్ కేబిన్ లో రాత్రి తొమ్మిది గంటలకు చాలా ముఖ్య మైన పనిలో నిమగ్నమైన రాజశేఖర్ కు ఇంటర్కం ద్వారా ఎండి నుండి కలవమని పిలుపు వచ్చింది. రాజశేఖర్ వెళ్లే సరికి మధుసూదన్ గారు కాస్త టెన్షన్ తో ఉన్నట్టు అర్థం అయ్యింది. "చెప్పండి సర్ , రమ్మన్నారుకదా!" "వూరికే సరదాగా రమ్మన్నాను రాశేఖర్., ఇంత కీ మీ అమ్మ నాన్న లు ఎక్కడ.,?" "తెనాలి లో వుంటారు సర్". "సరే రేపు ఆదివారం తెనాలి కి ఒక చిన్న పనిమీద వెళ్తున్నాను. వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను. నీకు ఓకేనా?" "థాంక్యూ సర్, నేను అక్కడే వుంటాను, తప్పకుండా రండి "అని స్నేహపూర్వకంగా న వ్వాడు శేఖర్. మరుసటి రోజు సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు రాజశేఖర్ ఇంట్లోకి అడుగు పెట్టారు మధుసూదన్ దంపతులు. వారిరువురికి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు రాజశేఖర్ . "వీరు మా అమ్మా నాన్న" అంటూ తల్లిదండ్రులను పరిచయం చేసాడు రాజశేఖర్ . కాస్సేపు మధుసూదన్ గారు తన భార్యతో కలిసి శేఖర్ ఇల్లంతా చూసాడు. చుట్టూ పచ్చని పొలాల మధ్యలో శేఖర్ ఇల్లు. అది పూర్తిగా రైతు కుటుంబం . రాజశేఖర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎదురుగా కూర్చున్న తరువాత మధుసూదన్ గారు నవ్వుతూ" నేనొక ముఖ్య మైన పని మీద ఇక్కడికి వచ్చాను. అయితే అది కంపెనీ ఎండి గా కాకుండా ఒక ఆడ పిల్ల తండ్రిగా వచ్చాను. మీకు అందరికి నచ్చితే మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకొనమని అడగటానికి మంచి సమయం చూసుకుని వచ్చాను. రాజశేఖర్ మా అమ్మాయి ని చాలా సార్లు చూసాడు. నాకు ఒక్కతే కూతురు. మీరు ఆలోచించుకుని నాకేవిషయం తెలపండి" అంటూ నమస్కారం పెట్టి లేచాడు. కాసేపటి దాకా ఎవరు తేరుకోలేకపోయారు,ఆయన ఆటలకు. "అరెరే , అన్నయ్య గారు కూర్చోండి , లేస్తున్నారు ఎందుకని? నోరు తీపి చేస్తాను వుండండి " అంటూ పట్టలేని సంతోషం తో లోనికి వెళ్ళింది శేఖర్ అమ్మ. "చాలా సంతోషం , మా అబ్బాయికి నచ్చితే మాకేం అభ్యంతరం లేదు "అని రాజశేఖర్ వేపు తిరిగి" ఏరా నీ విషయం ఏంటి ?"అన్నారు శేఖర్ తండ్రి. "మీ ఇష్టం నాన్నగారు ", అని మధుసూదన్ గారి వేపు చూసి "సర్ మీరు మా ఆర్థిక తాహతు , స్తోమత తెలుసుకుని మరొక్క సారి అలోచించండి" అన్నాడు. "అవన్నీ అమ్మాయి తల్లి తండ్రులకు ముఖ్యమే గాని, మా కు అబ్బాయి గుణ గణాలు కూడా ముఖ్యం శేఖర్. మాకు నువ్వు పూర్తిగా నచ్చావు. నీకు మా అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు". అప్పుడే అమ్మ పట్టుకొచ్చిన స్వీట్ ఒకటి తీసి మధుసూదన్ గారి చేతిలో పెట్టి అందరికీ పాదాభి వందనాలు చేశాడు శేఖర్. "శీఘ్ర మేవకల్యాణ ప్రాప్తి రస్తూ ...." అని దీవించారు అక్కడున్న పెద్దలందరు. *** ------శ్యామ్ కుమార్.చాగల్ నిజామాబాద్. ---------- Forwarded message --------- From: Prasad Klv Date: Thu, 16 Sep 2021, 14:34 Subject: చిన్న కథ* To: బహుమతి ..!! (కథ) కాలేజీ ల్యాబ్ లో ఉపయోగించే పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీ అది. అందులో అసిస్టెంట్ సైంటిస్ట్ గా మూడు నెలల కిందట రాజశేఖర్ ఉద్యోగం మొదలుపెట్టాడు. దాదాపుగా పది సంవత్సరాల కిందట నలుగురితో మొదలైన ఆ ఫ్యాక్టరీ ప్రస్తుతం 200 మందికి ఉపాధి కల్పిస్తోంది. దాని యజమాని'మధుసూదన్ 'గారు. చాలా మంచివాడు అని పేరు ఉందాయానికి . ఉదయాన్నే ఆఫీసు తెరిచిన కాసేపటికి ఉద్యోగులందరికీ వేడివేడిగా టీ పంపించబడడం అక్కడ రివాజు . భోజన సమయంలో ఉద్యోగస్తులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లు అన్నీ కూడా కడిగి ఎవరి టిఫిన్ డబ్బాలు వారికి ,వారి వారి టేబుల్ మీదికి పంపించే సౌకర్యం యాజమాన్యం కల్పించింది. అన్నింటికంటే విచిత్రమైన, ఎక్కడా చూడని ఒక పద్ధతి ఈ కంపెనీలో ఈ యాజమాన్యం అనుసరించింది. అదేమిటంటే ప్రతి ఉద్యోగి వారి వారి అవసరాలు, ఖర్చులు ,బాధ్యతలను బట్టి వారికి ఇచ్చే జీతం నిర్ణయించబడుతుంది. ఈ కారణంగా కొన్ని సార్లు చిన్న ఉద్యోగి కి పెద్ద స్థాయిలో ఉండే ఉద్యోగి కంటే జీతం ఎక్కువ గా పొందే సందర్భాలు కూడా కనపడతాయి. దీని యజమాని చాలా కష్టజీవి. జీవితంలో ఎంతో కష్టించి పనిచేసి తన శ్రమ తో, ప్రతిభ తో ఆ కంపెనీని ఈ స్థాయికి తీసుకు వచ్చాడని అందరూ చెప్పుకుంటా రు . ఉద్యోగస్థులకు మంచి మంచి సౌకర్యాలు కల్పించే ఇంత మంచి కంపెనీలో యజమాని తో కలిసి మొదటి నుంచి పనిచేస్తున్న చారి గారు మాత్రం అందరి కీ ఏదోరకంగా ఇబ్బందులు సృష్టిస్తూ,ఇబ్బందులు పెడుతూ, కంటిలో నలుసులా మారాడు. యజమానికి కుడిభుజం లాంటి వ్యక్తి కనుక ఈ విషయం యజమాని వరకూ తీసుకెళ్లడానికి ఎవరు ధైర్యం చేసేవారుకాదు. ఒక రోజు పనిలో నిమగ్నమయి కూర్చున్న రాజశేఖర్ దగ్గరికి చారి గారు వచ్చి కాలేజీ రికార్డ్ బుక్ ఒకటి చేతికిచ్చి "ఇది మధుసూదన్ గారి కొడుకు కు సంబంధించిన కాలేజీ ప్రాక్టికల్ బుక్. దీంట్లో నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, అన్ని పేజీలలో దానికి సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తిచేసి నోట్స్ రాసి పెట్టాలి" అని సూచనలు చేసాడు. " ఇదేంటి సార్? ఇది ఆ..అబ్బాయి చేయవలసిన అసైన్మెంట్! దీనిని నేను పూర్తి చేయడం ఏమిటి? ఇది సబబుగా లేదు . ఆఫీసు పని చేయడం నా ఉద్యోగ ధర్మం అంతే కానీ ఇవన్నీ కాదు!" అంటూ నిర్మొహమాటంగా ఆ పుస్తకాన్ని వెనక్కి చారి చేతికి ఇచ్చేశాడు రాజశేఖర్. "సరే మీ ఇష్టం! ఈ విషయం ఎండి గారికి తెలిస్తే నీకే మంచిది కాదు" అంటూ దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు చారి. ఈ తతంగమంతా చూస్తున్న పక్కనున్న ఉద్యోగస్తులు అందరూ రాజశేఖర్ దగ్గరికి వచ్చి "చాలా తప్పు రాజశేఖర్ .మధుసూదన్ గారు చాలా మంచివారు. వారి అబ్బాయి రికార్డు బుక్ పూర్తి చేసి ఇవ్వటంలో మనం వారికి సహాయం చేసినట్టే కదా! ఇందులో తప్పేముంది.?పైగా మన యజమాని అందరి లాంటి వారు కాదు. మన బాగోగులు వ్యక్తిగతంగా చూస్తూ ఉంటారు" అంటూ మందలించారు. రాజశేఖర్ ఏమి మాట్లాడకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి అందరూ అనుకున్నట్లు గానే ఎండి దగ్గర నుంచి పిలుపు వచ్చింది రాజశేఖర్ కి. 'అనవసరమైన చిక్కుల్లో పడ్డాడు రాజశేఖర్' అని. ఎండి,మధుసూదన్ గారి క్యాబిన్ వైపు వెళుతున్న రాజశేఖర్ ను చూసి అందరూ జాలి పడ్డారు. 'మంచి కుర్రాడు లేనిపోని చిక్కుల్లో పడ్డాడు' అని మరి కొందరు అనుకున్నారు . ' ఈరోజు తో వీడి ఉద్యోగం ఆఖరు !' అనుకొని బాధ పడ్డారు ఇంకొందరు. "మే ఐ కమిన్ సర్ "అంటూ తలుపు కొద్దిగా తెరిచి బయటే నిలబడి ఉన్న రాజశేఖర ను చూసి మధుసూదన్ గారు, కళ్ళతోటి అతడిని లోనికి రమ్మని సైగ చేశాడు. " ప్లీజ్ టేక్ యువర్ సిట్ "అంటూ రాజశేఖర్ కి తన ముందున్న కుర్చీ చూపించి చేతిలో ఉన్న ఫైలును చదువు తూ కూర్చున్నాడు. అలాగే ఐదు నిమిషాలు గడిచిపోయింది. మౌనంగా యజమానిని చూస్తూ కూర్చున్నాడు రాజశేఖర్. కంటికి ఉన్న కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ ఒకసారి రాజశేఖర్ ని చూసి "ఏంటి బాబు, ఏంటి నీ ప్రాబ్లం ?" అన్నాడు. రాజశేఖర్ కు విషయం అర్థమై ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న కాలేజ్ రికార్డ్ బుక్ చేతిలోకితీసుకుని" ఇది మా అబ్బాయి రికార్డ్ బుక్. దీనికి కాస్త సహాయం చేసి పూర్తి చేయమని నీకు పంపించాను .చారి గారు వచ్చి ఇప్పుడు చెప్పారు. నువ్వు ఇది చేయనని, మొండిగా తలబిరుసు గా సమాధానం చెప్పావ్ అని తెలిసింది. ఎందుకని ?" కాస్త నిండుగా ఊపిరి తీసుకుని, చిన్న చిరునవ్వు నవ్వి " సర్ మీరు కోపం తెచ్చుకుంటే నేను మాట్లాడలేను". "సరే ,ఇట్స్ ఓకే చెప్పండి ." అన్నాడు రాజశేఖర్ ను నిశితంగా చూస్తూ. "సర్! కాలేజీలో రోజు ఇచ్చే అసైన్మెంట్ అన్నది మీ అబ్బాయికి పాఠం నేర్పించే విధానాలలో ముఖ్యమైనది. సాధారణంగా క్లాస్ లో ఏదైనా ఒక విషయంలో వెనకబడిన ఆ విద్యార్థికి ఇలాంటి అసైన్మెంట్స్ ఇచ్చి ఆ సబ్జెక్టులో ఆ విద్యార్థిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగం ఇది. ఇలాంటివి విద్యార్థులు చేయటం మూలాన వారికి ఆ విషయ పరిజ్ఞానం లో అవగాహన పెరిగి ఆ తర్వాత జరిగే పరీక్షలలో అవలీలగా ఉత్తీర్ణులు అవుతారు. వీటిని సాధించడానికి మనం సహాయపడాలి లేదా ప్రోత్సహించాలి అంతేగాని ఈ విధంగా వేరే వారితో చేయించడం మూలాన అసలు దాని ఉద్దేశ్యమే దెబ్బతిని విద్యార్థికి చెందవలసిన, , అందవలసిన విజ్ఞాన జిజ్ఞాస దొరకదు. మీ అబ్బాయికి అర్థంకాని విషయాలలో, మీకు అభ్యంతరం లేకుంటే, అప్పుడప్పుడు నేను నేర్పించటానికి ప్రయత్నిస్తాను. మీ అబ్బాయి స్వయంగా విద్యను సముపార్జించి మీకంటే ఉన్నతమైన స్థానాలకు పోటీ పడే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు తగిన సౌలభ్యాన్ని మీరు సమకూర్చి తే చాలు, మీరు న్యాయం చేకూర్చినట్లే. ఈ విషయంలో నాకు అవగాహన లోపం ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఇక తర్వాత మీ ఇష్టం సర్." అని చాలా నిజాయితీగా సమాధానం చెప్పాడు. ' చెప్పవలసిన విషయాన్ని ఎంత సమర్థవంతంగా, ఎంత బాగా చెప్పాడు, పైగా చదువు విషయంలో మంచి అవగాహన ఉంది. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు గ్యారెంటీ' అని మనసులో అనుకున్నాడు యజమాని మధుసూదన్. " ok. వెరీ నైస్ రాజశేఖర్! సరే మీరు చెప్పినట్టే చేద్దాం. గుడ్. " అని మళ్ళీ కాసేపు ఆలోచించి "ఆదివారం నాడు మీరు మా ఇంటికి రాగలిగితే బాగుంటుంది. వారానికి ఒకసారి వీలు చేసుకొని మా అబ్బాయితో మాట్లాడుతూ ఉండండి. అది చాలు. ఓకే. . థాంక్యూ". అంటూ లేచి నిలబడి రాజశేఖర్ మీద కలిగిన అభిమానంతో కుడి చెయ్యి ముందుకు సాచి కరచాలనం చేశాడు మధుసూదన్ గారు. మరుసటి నెల అందరూ అనుకున్నట్లుగా రాజశేఖర్ ఉద్యోగం పోలేదు సరికదా, అతడిని క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జిగా ఉన్నతమైన స్థానంలో నియమించారు. దీనికి కారణమేంటో ఏం జరిగిందో, సాటి ఉద్యోగస్తుల కి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఆ తర్వాత చారి గారు తన యజమాని దగ్గరికి వెళ్లి "ఇదేం సార్ !ఎందుకు ఇలా చేశారు? నాకు అర్థం కావట్లేదు "అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా "చారి! ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది .మన లాంటి చిన్న కంపెనీలో అబ్బాయి ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం తనను సరి అయిన రీతిలో ఉపయోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో విద్య మీద ఇంత మంచి అవగాహన ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఇంతకంటే ఎక్కువ చెప్పినా నీకు అర్థం కాదులే వెళ్ళు!" అని నవ్వేశాడాయన. ******************************************* ఆ తర్వాత కొద్దీ నెలల లోనే రాజ శేఖర్ కంపెనీ లో జరిగే వ్యవహారాలన్నీ సునిశితంగా పరిశీలించి ఎన్నో లోటు పాట్లను ఎండి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని సరి చేయించాడు. అతడి ఆసక్తిని, నిజాయితిని గమనించిన ఎండి రాజశేఖర్ ను మార్కెటింగ్ ఇంచార్జి గా నియమించాడు. తన తెలివి కృషి ని పూర్తిగా వినియోగించి కంపెనీ టర్నోవర్ ను ఒక సంవత్సరం లోగా రెట్టింపు చేసాడు రాజశేఖర్ . ఒక రోజు ఆఫీస్ కేబిన్ లో రాత్రి తొమ్మిది గంటలకు చాలా ముఖ్య మైన పనిలో నిమగ్నమైన రాజశేఖర్ కు ఇంటర్కం ద్వారా ఎండి నుండి కలవమని పిలుపు వచ్చింది. రాజశేఖర్ వెళ్లే సరికి మధుసూదన్ గారు కాస్త టెన్షన్ తో ఉన్నట్టు అర్థం అయ్యింది. "చెప్పండి సర్ , రమ్మన్నారుకదా!" "వూరికే సరదాగా రమ్మన్నాను రాశేఖర్., ఇంత కీ మీ అమ్మ నాన్న లు ఎక్కడ.,?" "తెనాలి లో వుంటారు సర్". "సరే రేపు ఆదివారం తెనాలి కి ఒక చిన్న పనిమీద వెళ్తున్నాను. వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను. నీకు ఓకేనా?" "థాంక్యూ సర్, నేను అక్కడే వుంటాను, తప్పకుండా రండి "అని స్నేహపూర్వకంగా న వ్వాడు శేఖర్. మరుసటి రోజు సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు రాజశేఖర్ ఇంట్లోకి అడుగు పెట్టారు మధుసూదన్ దంపతులు. వారిరువురికి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు రాజశేఖర్ . "వీరు మా అమ్మా నాన్న" అంటూ తల్లిదండ్రులను పరిచయం చేసాడు రాజశేఖర్ . కాస్సేపు మధుసూదన్ గారు తన భార్యతో కలిసి శేఖర్ ఇల్లంతా చూసాడు. చుట్టూ పచ్చని పొలాల మధ్యలో శేఖర్ ఇల్లు. అది పూర్తిగా రైతు కుటుంబం . రాజశేఖర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎదురుగా కూర్చున్న తరువాత మధుసూదన్ గారు నవ్వుతూ" నేనొక ముఖ్య మైన పని మీద ఇక్కడికి వచ్చాను. అయితే అది కంపెనీ ఎండి గా కాకుండా ఒక ఆడ పిల్ల తండ్రిగా వచ్చాను. మీకు అందరికి నచ్చితే మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకొనమని అడగటానికి మంచి సమయం చూసుకుని వచ్చాను. రాజశేఖర్ మా అమ్మాయి ని చాలా సార్లు చూసాడు. నాకు ఒక్కతే కూతురు. మీరు ఆలోచించుకుని నాకేవిషయం తెలపండి" అంటూ నమస్కారం పెట్టి లేచాడు. కాసేపటి దాకా ఎవరు తేరుకోలేకపోయారు,ఆయన ఆటలకు. "అరెరే , అన్నయ్య గారు కూర్చోండి , లేస్తున్నారు ఎందుకని? నోరు తీపి చేస్తాను వుండండి " అంటూ పట్టలేని సంతోషం తో లోనికి వెళ్ళింది శేఖర్ అమ్మ. "చాలా సంతోషం , మా అబ్బాయికి నచ్చితే మాకేం అభ్యంతరం లేదు "అని రాజశేఖర్ వేపు తిరిగి" ఏరా నీ విషయం ఏంటి ?"అన్నారు శేఖర్ తండ్రి. "మీ ఇష్టం నాన్నగారు ", అని మధుసూదన్ గారి వేపు చూసి "సర్ మీరు మా ఆర్థిక తాహతు , స్తోమత తెలుసుకుని మరొక్క సారి అలోచించండి" అన్నాడు. "అవన్నీ అమ్మాయి తల్లి తండ్రులకు ముఖ్యమే గాని, మా కు అబ్బాయి గుణ గణాలు కూడా ముఖ్యం శేఖర్. మాకు నువ్వు పూర్తిగా నచ్చావు. నీకు మా అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు". అప్పుడే అమ్మ పట్టుకొచ్చిన స్వీట్ ఒకటి తీసి మధుసూదన్ గారి చేతిలో పెట్టి అందరికీ పాదాభి వందనాలు చేశాడు శేఖర్. "శీఘ్ర మేవకల్యాణ ప్రాప్తి రస్తూ ...." అని దీవించారు అక్కడున్న పెద్దలందరు. ***

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ