మాంగళ్యంతంతునా... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Maangalyam tantunaa

తొలిరోజు ఉద్యోగంలో జాయిన్ కావడంతో టికెట్ బుకింగ్ కర్కుగా సీట్లో కూర్చుంటూ పక్కనే రిజర్వేషన్ కౌంటర్ లోని యువతిని చూస్తూ
' హాయ్ అయామ్ విభీ 'అన్నాడు అతను.
' హల్లో అయామ్ సరమ 'అన్నది ఆయువతి.
పనివత్తిడిలో ఉంటూ,అప్పుడప్పుడు ఒకరికి ఒకరు చిల్లరనోట్లు ఇచ్చి పుచ్చుకోవడం తప్ప పెద్దగా మాటలు జరగలేదు తొలిరోజు.
పదిరోజుల్లో ఇద్దరికి పరిచయం బాగాపెరిగింది.లంచ్ బాక్సులు షేర్ చేసుకునే అంతటి చనువు ఏర్పడింది.
ఒకరోజు డ్యూటీ ముగిసిన అనంతరం' కాఫీ తాగుదాము వస్తారా ' అన్నాడు విభీ.
కాఫీ తాగుతూ 'విభీ మీపేరు విచిత్రంగా ఉందే! 'అన్నది సరమ.
'అవును మాతాతగారికి పురాణాలపై మంచి అభిమానం ఉండేదట , అందుకే తన సంతానంతో పాటు వారిపిల్లలకు పురాణణ పాత్రల పేర్లు పెట్టారు నాపేరు విభీషణుడు. విభీషణుని భార్యపేరు నీకు తెలుసా ? ' అన్నాడు.
ఎరుపెక్కిన బుగ్గలతో 'తెలుసు అది నాపేరే 'అన్నసరమ,'రేపు నేను ఊరు వెళుతున్నా.నాన్న వెంటనే రమ్మన్నారు పైగా సంక్రాంతి పండుగ కదా నాలుగురోజులు సెలవు పెట్టాను 'అన్నది సరమ.
భారంగా నిట్టూరుస్తూ బైక్ తీసి సరమను లేడిస్ హస్టల్ వద్దవదలి,తను ఇంటికి వెళ్ళిపోయాడు విభీ.
సెలవులు ముగిసిన అనంతరం డ్యూటిముగించి తనతో కాఫీకివచ్చిన సరమ ముఖభావంగా ఉండటం గమనించిన విభీ ' ఏంజరిగింది ఊరిలో ఏదైన సమస్యా? 'అన్నాడు.
'కళ్ళనుండి జలజల నీళ్ళు రాలుస్తూ 'నన్ను మన్నించు విభీ. మొన్న మానాన్న నాకు చెప్పకుండా ఎవరో నెల్లూరు వాళ్ళ అతను సాఫ్ట్ వేర్ ఇంజనీయర్ అట,పేరు రంగనాథ్ నన్ను చూడటానికి వచ్చాడు. నేను మనవిషయం మానాన్నకు చెప్పి, ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేసాను, నేను ఈపెళ్ళి చేసుకోకపోతే తన ప్రాణాలతో ఉండను అన్నాడు. మాదికోటీశ్వరుల కుటుంబం మానాన్నకు నేను ఒక్కదాన్నే సంతానం. బాల్యంనుండి మేము తండ్రి కూతురులా ఉండలేదు మంచిస్నేహితులుగా మెలిగాం మానాన్న మాటకు ఎదురు చెప్పలేకపోయాను.మనం ఈజన్మకు మంచిమిత్రులుగా ఉండిపోదాం! 'అంటూ హేడ్ బ్యాగ్ లోని వెడింగ్ కార్డు అతని చేతికి అందించింది.
' సరమా నిన్నుచేపట్టబోయేవాడు నాబాల్య స్నేహితుడే, అలాగే నువ్వయిన సంతోషంగా ఉండు 'అన్నాడు విభీ.
కళ్ళు తుడుచుకుంటూ అటుగావెళుతున్న ఆటో ఎక్కివెళ్ళింది సరమ.
ఉసూరుమంటూ ఇల్లుచేరిన విభీనిచూస్తూనే 'ఏమిట్రా అలాదిగాలుగా ఉన్నావు'అన్నది విభీ అమ్మమ్మ.
' నాతోపాటు పనిచేసే సరమా అనే అమ్మాయి పెళ్ళికి వెళ్ళవలసి వస్తుంది నాలుగురోజులు సెలవు పెట్టాలి' అన్నాడు విభీ.
'సరమానా వాళ్ళ నాన్నపేరు శైలూషుడు అవునా?' అన్నది అమ్మమ్మ.
శుభలేఖ చూసిన విభీ 'అవును వీళ్ళు నీకు ఎలాతెలుసు' అన్నాడు.
బోసినోటితో నిండుగా నవ్విన అమ్మమ్మ అత్యంత రహస్యమైన ఆ విషయాన్ని విభీకి చెప్పింది.
ఉరుకు పరుగులతో వచ్చి కదులు తున్న రైలు చివరి జనరల్ కంపార్ట్ మెంట్ లోనికి ఎక్కాడు విభీ. నెమ్మదిగా వెదకగా కూర్చునే సీటు దొరికింది, ఎందుకో తెలియదు రైలు ఆగింది.పనులవత్తిడిలో మధ్యాహ్ననం భోజనం చేయకపోవడంతో,ఆకలివేయసాగింది, అమ్మమ్మ ఇచ్చిన పెరుగు అన్నం బాక్సు మూతతీసి అందులోని ఆవకాయగుజ్జు చూపుడు వేలుపైకి తీసి నాలుకపై రాసుకోబోయాడు,అప్పటివరకు ఆగిఉన్నరైలు ఒక్కఉదుటున కదలడంతో ఆ ఊపుకు ఆపుకోలేని విభీ చూడువేలిపైనున్న ఆవకాయ గుజ్జును ఎదురుగా ఉన్న బామ్మ కంటికి కాటుకలా తగిలించాడు.
శోకాలుపెడుతూ లేచింది కంటినిండా కారంతో ఆబామ్మ.
ఊహించని ఆసంఘటనకు అదిరిపడిన విభీ పెరుగు అన్నం బాక్స్ ఆమె ఒడిలో పెట్టి,చెంగున గెంతుతూ పరుగు పరుగున ఏ.సి కంపార్ట్ మెంట్ లో వెళ్ళికూర్చున్నాడు. తెల్లవారుతూనే రైలు తను దిగవలసినఊరు చేరింది. అటోలు ఏవి అందుబాటులో లేకపోడంతో మట్టిరోడ్డుపై ఊళ్ళోకి నడకసాగించాడు .
కొంతదూరం నడిచినతరువాత చిలకకొట్టుడు కొడితే చిన్నదాన, అనేపాటవినిపించడంతో వెనుతిరిగి చూసాడు విభీ.
జడలు విరబోసుకున్న తాటకిలా రోడ్డంతా గడ్డితో ఆక్రమించుకున్న ట్రాక్టర్ కనిపించింది.
'ఓయ్ మడిసో కూకో 'అని ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి కేకలు వేయసాగాడు.
కూర్చున్నవిభీకి ట్రాక్టర్ వెళ్ళక చూసుకుంటే తెలిసింది తను బురద గుంతలో ఉన్నానని. బట్టలబ్యాగు ఒడ్డున ఉండటం అదృష్టం.
అప్పడే పొలానికి నీళ్ళు పెట్టడానికి వచ్చిన ఓపెద్దాయన 'రాబాబు పంపుసెట్ వేస్తాను స్నానం చేయి అని ఆహ్వానించాడు.
ఆరినబట్టలు బ్యాగులో పెట్టుకుని భోజన సమయానికి మగపెళ్ళివారి విడిది ఇల్లు చేరాడు.విభీని చూస్తూనే పెళ్ళికొడుకు రంగనాథ్ ' ఇప్పుడా వచ్చేది' అని దూరంగా తీసుకువెళ్ళి 'ఓరేయ్ ఈపెళ్ళి నాకు ఇష్టం లేదురా,మానాన్న పది ఎకరాల మామిడితోట,పది ఎకరాల చెరుకుతోట అమ్మాయి పేరిట ఉన్నాయి అనగానే వెంటనే ఒప్పుకున్నాడు.
ఎలాగైనా ఇదే ఊరిలో ఉన్న నామామ కూతురు దేవితో నాపెళ్ళి అయ్యేలా ఏదైనమార్గంచెప్పరా, అదిగో మనదగ్గరకు వస్తుంది చూడు అపిల్లే దేవి పెళ్ళికూతురు స్నేహితురాలు 'అన్నాడు.
'భోజనాలకు అందరు రావలని చెప్పమన్నారు 'అని దేవి వెళ్ళిపోయింది.
క్షణకాలం ఆలోచించిన విభీ 'ఈపెళ్ళి ఆపడమే కాదు నీమరదలు దేవితో నీపెళ్ళిజరిపిస్తాను,నేచెప్పినట్లు చేస్తావా 'అన్నాడు.
'రేయ్ నువ్వు దూకమంటే గంగలోనైనా దూకుతాను, చెప్పు నన్ను ఏంచేయమంటావో 'అన్నాడు రంగనాథ్ .
రంగనాథ్ చెవివద్ద గుస గుసలాడాడు విభీ.
ఆనందంతో విభిని కౌగిలించుకున్నాడు రంగనాథ్ .
సరమకి ఫోన్ చేసి ఏంచేయాలో వివరించాడు విభీ.
' అబ్బ ఎంత నాటకం ఆడుతున్నరండి,అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను ' అన్నది.
'ఇదంతా నిన్ను నాదానిగా చేసు కోవడానికేగా 'అన్నాడు విభీ.
సరమ మాటలువిన్న దేవి భోజనాలవద్ద రంగనాథ్ నుచూసి సిగ్గుతో మెలికలు తిరగ సాగింది. మనవాడు రంగనాథ్ కూడా డిటో డిటో .
తెల్లవారుఝూమన పెళ్ళి ' భజంత్రీలు భజంత్రీలు 'అరుస్తూ రంగనాథం చేతికి తాళి అందించాడు పురోహితుడు.
సిగ్గుతో వలవంచుకు కూర్చున్న సరమ జడ ఎత్తిపట్టుకుంది దేవి.
ఎవ్వరూ ఊహించని విధంగా దేవి మెడలో తాళి దారంతో మూడుముళ్ళు వేసాడు రంగనాథం.
'అయ్యో ఎంపనిరా అప్రాచ్యుడా తీయి ముందా పిల్లమెడలో కట్టిన తాళి తీయి' అన్నాడు ముందుగా తేరుకున్న రంగనాథ్ తండ్రి.
'ఏంటి కట్టిన తాళితీస్తారా? ఎవడో అంతదమ్మున్న మగాడు రమ్మనండి, తలతీస్తాం, మీవాడేమన్న తెలయక తాళికట్టాడా లేదే వాడి మరదలు వాడికి కావాలి అనుకున్నాడు,నీలా వాడు డబ్బుకు అమ్ముడు పోలేదు. రేయ్ అబ్బాయి భయపడమాకురా నువ్వు తాళికట్టిన పిల్ల చేయి పట్టుకుని మాదగ్గర కూర్చో' అన్నారు ఆఊరి పెళ్ళిపెద్దలు.
' ఏమిటయ్యా అందరుకలసి నాబిడ్డకు అన్యాయం చేస్తూన్నారే 'అన్నడు సరమ తండ్రి.
' నీబిడ్డను నేను న్యాయం చేస్తాను.నన్ను అడగండి మామయ్య,నేను నీచెల్లెలు ప్రద్వేషిణి కుమారుడిని ,ఇంకాచెప్పలంటే నువ్వు అనుభవిస్తున్న ఆస్తికి వారసుడిని' అన్నాడు విభీ.
' నాన్న నేను చెప్పానే నాతోపాటు పనిచేసేది, నేను ప్రేమించింది ఇతన్నే'అన్నది సరమ.
'పాపిష్టి ధనంకోసం బంధుత్వాలను వదులుకున్నాను, ఏమేవ్ మన షష్టిపూర్తికి అని నీకోసం తెప్పించిన తాళిబోట్టు తీసుకురా అమ్మాయి కోరుకున్నవాడు,నామేనల్లుడు దానిమెడలో ఆతాళితో మూడుముళ్ళు వేస్తాడు 'అన్నాడు సరమ తండ్రి.
అతనిమాటలకు పళ్ళిపందిట్లోని వారంతా కరతాళ ధ్వనులు చేసారు.

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి