అమ్మమ్మ ఇంటికి దారి. 4వ భాగం - రాము కోలా.దెందుకూరు.

Ammamma intiki daari.4

# నిష్కల్మషమైన మనసున్న మా అమ్మమ్మ. సీతారవమ్మ.(చెన్నూరి/మోటా) కొందరికి తల్లిదండ్రులు వలన ,మరి కొందరికి ఇంటి పేరుతో గుర్తింపు వస్తుంది., మరి కొందరికి తాము చేసే వృత్తి తో గుర్తింపు వస్తుంది ,అలా గుర్తింపును తెచ్చుకున్న వారిలో మా అమ్మమ్మ ఒక్కరు. అమ్మమ్మ "నాన్న గారు సాధనాల నర్సింహారావు గారు .వీరి ప్రథమ పుత్రిక సాధనాలు సీతారవమ్మ. మా అమ్మమ్మ ," అమరావతి ప్రాంతం నుండి వలస వచ్చిన వారే. అమ్మమ్మకు 18వ సంవత్సరం వివాహం జరిగింది, తాతగారి పేరు "చెన్నూరి సుబ్బారావు గారు. కృష్టా జిల్లా , కొండపల్లి దగ్గరి కట్టుబడిపాలెం." కానీ వివాహం. జరిగిన రెండు సంవత్సరాలకు తాత గారిని వదిలి తన పుట్టింటికి వచ్చేసింది అమ్మమ్మ.. కారణం తాత గారికి .ముందుగానే మరో వివాహం జరిగిందని,మొదటి భార్యకు కాస్త పళ్ళు ఎత్తుగా ఉన్నాయే కారణంతో తనని పుట్టింటిలో వదిలేసి,ఆ విషయం దాచి అమ్మమ తో పెళ్ళి కుదుర్చుకున్నారని,ఇప్పుడు మొదటి భార్యకు ఒక కుమారుడు కలగడంతో తాతగారి మనసు వంశోద్దారకుడి కోసం తపిస్తుందని తెలిసి,మొదటి భార్యకు తన వలన ఇబ్బందులు కలగకూడదని. కోర్టులో కేసు వేసి "మా అమ్మ వెంకట్రావమ్మను(మా అమ్మను)" తీసుకుని దెందుకూరు వచ్చేసింది. తన తండ్రి గారు అయిన "సాధనాల నరసింహ రావుగారి" అండతోనే విడిగానే స్వతంత్రంగా జీవిస్తూ. బావి నీటిని చేది పోస్తూ వ్యవసాయం చేస్తూ ఉల్లిపాయలు,గనుసు గడ్డలు,దోసకాయలు, పండించేది.యడ్ల బండి పైన తన నాన్నగారితో కలిసి తిరిగి అమ్మకాలతో జీవనం సాగిస్తూ. అమ్మకు గుంటుపల్లి గోపవరం వాస్తవ్యులు "కోలా చెలమయ్యగారి రెండవ కుమారుడైన నరసింహారావుతో(నాన్న)" వివాహం జరిపించింది పెళ్ళికి మాత్రమే మా తాతగారిని చూసి వెళ్ళడానికి పిలిచింది .అంతవరకే బంధుత్వాలు అంటూ, ,వారి ఆస్తిని కూడా వదులుకుని,ధైర్యంగా జీవించిన ఒక విలక్షణమైన మనస్తత్వం అమ్మమ్మది అమ్మమ్మ తనకు సంక్రమించే ఆస్తిని తీసుకుని ఉంటే మేము నేడు కోటీశ్వరులుగా మిగిలేవాళ్ళం. కానీ పరాయి వారి సంపదతో ఎదిగారు అనే మాట తరతరాలుగా ఉండిపోయేది. మోటతో వ్యవసాయం చేయడంతో అమ్మమ్మ పేరు "మోటా సీతరావమ్మగా" స్థిర పడింది. అమ్మ పేరు వెంకట్రావమ్మ.చిన్న అమ్మమ్మ పేరు వెంకట్రావమ్మ కావడంతో అమ్మ పేరు తన ఇంటి పేరు "చెన్నూరు "తన పేరుగా మారింది. మా అమ్మకు మొదటి సంతానం అన్నయ్య కలిగిన తరువాత అమ్మ దెందుకూరు లోనే ఉంది.కారణం అమ్మమ్మకు రైలు బండి యాక్సిడెంట్.అదృష్టం కొలది బ్రతికింది.అమ్మమ్మకు అమ్మ ఒక్కతే కూతురు కావడంతో తనకు తోడుగా ఉండడం కోసం నాన్న గోపవరం నుండి దెందుకూరు రావడం జరిగింది. కొన్ని రోజులు మధిర హోటల్ నందు వంట మాష్టర్ గా పని చేసి .దెందుకూరు లో స్వతహాగానే హోటల్ పెట్టి అక్కడే సెటిలై పోయాడు. ప్రభుత్వ భూమి ,నేడు దెందుకూరు లో NTR గారి విగ్రహాం దగ్గర మా చిన్న హోటల్ ఉండేది. పది పైసలకు టీ అమ్మిన రోజులు బాగా గుర్తునాకు మేము నలుగురం సంతానం.అన్నయ్య కోలా శ్రీనివాసరావు.. దెందుకూరు ( సెల్ఫ్ ఎంప్లాయ్),తరువాత నేను రాము (గ్రానైట్ లో వర్కు)తమ్ముడు రాధాకృష్ణ పోలీస్ డిపార్ట్మెంట్,చెల్లి రాజేశ్వరి(హెల్త్ డిపార్ట్మెంట్).నాన్న 1994హార్ట్ సమస్యతో చనిపోయాడు , పెద్దనాన్నలు,బాబాయిలు.ఎవ్వరూ మమ్మల్ని చెంతకు పిలిచింది లేదు.అమ్మమ్మే మాకు కొండంత అండగా,ధైర్యం తోడూగా నిలిచింది. ప్రేమ వివాహాలు అంటే గౌరవం, నాకు మా అమ్మ చేయాలనుకుంది.వీలు కాలేదు.అన్నయ్య వేరే కాపురం వలన. అమ్మ ఆలోచనకు అనుగునంగా.తమ్ముడుకు,మరియూ చెల్లికి వారికి నచ్చిన వారితో లవ్ మ్యారేజ్ ,ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు జరిపించాను.ఇది నచ్చని అన్నయ్య కాస్త దూరంగా ఉంటాడు మాకు. మాకు అన్నీ అమ్మమ్మె... అమ్మమ్మ 2007నవంబర్ 11న. నాలుగు రోజులు జ్వరంతో బాధపడుతు ,మా హోటల్ దగ్గరగు వచ్చి,చివరకు నా చేతుల్లోనే ప్రాణం విడిచింది. బహూశా అలా జరగాలని తాను కోరుకుందేమో అమ్మ కూడా 2008, నవంబర్ 14న హార్ట్ సమస్యతో చని పోయింది. ఇలా ఇంటి పెద్దలను అందరిని కోల్పోయిన నేను ఖమ్మం వచ్చి స్థిరపడ్డాను,తమ్ముడు కూడా ఖమ్మం లోనే,చెల్లి, మధిర దగ్గర మడుపల్లి,అన్నయ్య మాత్రం అమ్మమ్మ ఇంట్లో దెందుకూరు లోనే.. మేము ఇలా సంతోషంగా జీవిస్తున్నామంటే మా అమ్మమ్మ ప్రేమ.ఆధరణే ముఖ్యం. అందుకే ఆమెకు నా అక్షరాలతో జ్ఞాపకాలు ఇలా.. ....... ... శుభం.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి