శానిటరీ ప్యాడ్స్.(యథార్థ కథనం) - రాము కోలా.దెందుకూరు.

Sanitory Pads

"వెళ్ళవమ్మా!. ప్రొద్దున్నే నాకు విసుగును తెప్పించకు ". ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ షాపు దగ్గరకు వచ్చేవారిని ఎంతో మందిని చూస్తుంటాను ప్రతిరోజు. ఇలా చెప్పేసే కథలతో మహాగ్రంథమే వ్రాసేయోచ్చు. ఉదయాన్నే నీ నస భరించేంత ఓపికా, సౌమ్యం రెండూ లేవు..ఇక నువ్వు వెళ్తే మంచిది. నేను షాపు సర్దుకోవాలి". అనేసి తన పనిలో తాను మునిగి పోయాడు షాపులో పట్టుమని పాతికేళ్లు వయస్సు లేని యువకుడు. "అదికాదు బాబు.! సాయింత్రం ఇటుగానే వస్తాను. తప్పకుండా వచ్చేటప్పుడు ఇచ్చేసి వెళ్తాను. నన్ను నమ్మండి.ఇక్కడికి దగ్గర్లోనే రోజు పనికి వస్తుంటాను. మీరును చాలాసార్లు చూసే ఉంటారు. నా కుతుర్ని బడికి తీసుకువెళ్తుంటాను ఈ దారిలోనే." అతనికి వివరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది రత్తాలు. "రోజూ ఎందరో షాపుకు వస్తుంటారు పోతుంటారు అలాగని అందరినీ గుర్తుపెట్టుకోలేను కదా? అందరికీ ఇలాగే సహాయం చేస్తూనే కూర్చుంటే వ్యాపారం చేసినట్లే. . వ్యాపారం దగ్గర చాలా కచ్చితంగా ఉండడం. నా పాలసీ." అతని ప్రతి మాటలోను ఛీత్కారాలు వినిపిస్తుంటే,. వింటున్న రత్తాలు కన్నీరు వరదలా మారుతుంది. కాస్త దూరంగా రత్తాలు కూతురు మాలచ్చిమి, రత్తాలు కోసం ఎదురు చూస్తుంది.. చెట్టు దగ్గర. ********* ఆధునిక జీవనశైలికి అలవాటు పడిన నేటి యువతకు ప్రతీకలా ఉందామె. ఆమెను చూస్తూనే "నమస్తే మేడమ్!ఏం కావాలి?ఎంతో వినయంగా అడిగాడు షాపులోని యువకుడు. తనకు కావలసింది "శానిటరీ ప్యాడ్స్" చెప్పి, డబ్బులు అందించిందా యువతి. ఆమె అడిగిన "శానిటరీ ప్యాడ్స్" పేపర్ లో ప్యాక్ చేసి,తగిన చిల్లర తిరిగిస్తూ, చిరునవ్వు చిందిస్తున్న అతన్ని అంతగా పట్టించుకోవాలనే ఆసక్తి లేకుండానే యువతి షాపు మెట్లు దిగుతుంది. కురుస్తున్న చినుకులకు తలపై పవిట చెంగును కప్పుకుని ,కాస్త పక్కగా నిలుచున్న రత్తాలు,యువతిని సమీపించి ధైర్యం చేస్తూ.. "అమ్మగారు "ఐదు రూపాయలుంటే ఇస్తారా", అడగలేక అడిగింది. షాపు మెట్లు దిగుతున్న యువతి ఒక్క క్షణం వెనుతిరిగి చూస్తూఏమనుకున్నాదో. పది రూపాయలు రత్తాలు చేతిలో పెట్టి మరో మెట్టు దిగింది. "అమ్మగారు నాకు ఐదు రూపాయలు చాలు". అంటున్న రత్తాలు వైపు చూసిందా యువతి. "పర్వాలేదు ఉంచేసుకో" అనేలా! యువతి ఔదార్యానికి నిలువెల్లా కరిగిపోయింది రత్తాలు. జలజలా రాలుతున్న కన్నీటిని ఆపుకోలేక "అమ్మగారు.అదిగో దూరంగా చెట్టు దగ్గర నిల్చున్నదే అదే నా కూతురు మాలచ్చిమి." ఒక్కగానొక్క కూతురు. నేను పనిచేస్తూ తనని చదువుకు పంపుతున్నా.. కాస్త ఒంట్లో నలతగా ఉందని ఈ రోజు బడికెళ్ళలే" ఇంట్లో ఒంటరిగా వదిలేసి పనికి రాలేక తనని వెంటేసుకొచ్చిన. దారిలో నెలసరి వచ్చిందమ్మగారు. తిరిగి ఇంటికి పోదామంటే,రోజూ కూలిపని చేస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. అందుకే తిరిగి ఇంటికివేల్లక ,నాతో పని దగ్గరికే తీసుకుపోతున్నా. కానీ అక్కడ చుట్టు మగాళ్ళు పని చేస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తను నా దగ్గర ఉండాలంటే "ప్యాడ్స్"అవసరం కదమ్మా. అందుకే తీసుకోవాలి అనుకుంటే ఐదు రూపాయలు తక్కువైనాయ్. సాయంత్రం ఇటుగానే వస్తాను, అప్పుడిస్తానంటే,షావుకారు కుదరదంటుండు. నా బిడ్డ నలుగురు మధ్యన సిగ్గు పడుతుంటే కన్న ప్రాణం తట్టుకోలేదమ్మా. అందుకే మిమ్మల్ని అడిగానమ్మగారు. తప్పుగా అనుకోకండి. కారణం వివరిస్తుంది రత్తాలు.. కన్నీరు తూడ్చుకుంటూ. ఆప్యాయంగా రత్తాలు భుజం తట్టింది నవతరం యువతి. రత్తాల్లోని మాతృహృదయాన్ని. షాపులో ఉన్న యువకుడిలో మానవత్వంలేని మృగాన్ని చూస్తుంది . స్వాతంత్ర్య భారతావనిలో నిలువు దొపిడి ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నందుకు ఎవరిని నిందించాలో అర్థంకాని పరిస్థితి. "శానిటరీ ప్యాడ్స్" ను తమ వ్యాపార దృష్టితో చూస్తున్న సమాజంలోని కొందరి ప్రవర్తన.. స్వాతంత్ర్య భారతావనిలో అన్నీ ఉచ్చితాలనే ప్రభుత్వాలు.కనీసం వీటిపై పన్నులు తగ్గించి, అసలు ధరలకే అందించాలని ఎందుకు అనుకోరో? మనసులోనే ప్రశ్నించుకుంది నేటి తరం యువతి.

మరిన్ని కథలు

Mister Vinayak
మిస్టర్ వినాయక్
- యిరువంటి శ్రీనివాస్
Window seat
విండో సీటు
- ఎం వి రమణారావ్
Swayam vupadhi
స్వయం ఉపాధి
- మద్దూరి నరసింహమూర్తి
Neelambari
నీలాంబరి
- రాము కోలా దెందుకూరు.
Indradyumnudu
ఇంద్రద్యుమ్నుడు
- కందుల నాగేశ్వరరావు
Vyapari telivi
వ్యాపారి తెలివి
- ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల
Sundaramidi palle
సుందరామిడి పల్లె
- సి.లక్ష్మి కుమారి
Snehadharmam
స్నేహ ధర్మం
- భానుశ్రీ తిరుమల