మోసపోయిన రాజు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Mosapoyina Raju

అమరావతి నగరంలో విశ్రాంత అటవీశాఖాధికారి రాఘవయ్య గారిఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలు అందరు చేరారు.అందరికిమిఠాయిలు పంచినతాతయ్య"బాలలు మీకు ఈరోజు ఓక కథచెపుతాను అల్లరి చేయకుండా వినండి. పూర్వం మన రాజ్యాన్నిచంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.నగర పొలిమేరలలో శివయ్య అనేవ్యక్తి ఎంత తెలివైనవారినైనా,పందెంకడితే మోసగించేవాడు.అందుకని అతనితో ఎవరూ కలిసేవారుకారు.

ఈవిషయం రాజుగారి తెలియడంతో,మారువేషంధరించి తన పంచకల్యాణి గుర్రంపై బయలు దేరాడు.నగరం వెలుపల కొంతదూరం ప్రయాణించాక, అక్కడపొలంలో కొందరు పనిచేస్తూ కనిపించారు.వారిలో ఒకరిని దగ్గరకు పిలిచాడు రాజుగారు,కుంటుకుంటూ వచ్చినఆవ్యక్తినిచూసి , " అయ్య ఇక్కడ పందేలు కాసే శివయ్య ఎక్కడ ఉంటాడు " అన్నాడు. " నేనే ఆశివయ్యను తమకు నాతో ఏంపని "అన్నాడు శివయ్య.

" నీగురించి అందరు చెప్పుకుంటుంటే నిన్నుచూడాలనివచ్చాను ,నువ్వు ఎంతటివారినైనా పందెంకడితే మోసగిస్తావని తెలిసింది.అందుకే నువ్వు ఎలామోసగిస్తావో తెలుసుకుందామని వచ్చాను.నేను పందెంకాస్తాను నన్ను మోసగించగలవా " అన్నాడు రాజుగారు.

ఉత్తమజాతి పంచకల్యాణి గుర్రం పైఉన్నది తమ రాజుగారేనని గ్రహించాడు శివయ్య. " అయ్య బాటసారి నన్ను అందరు మోసకారి అంటారు నేను ఎవరివద్దకు వెళ్లి పందెంకాయండి అనను వారుగా వస్తేవద్దు అనను, దాన్ని నేను మోసం అంటే ఒప్పుకోను. అవినా తెలివితేటలు అంటాను. మంత్రకంకణం మహిమతో నేను ఇలా చేయగలుగు తున్నాను, దాన్నిధరిస్తే ఎంతటివారైనా నాముందు ఓడి పోవలసిందే. నామంత్రకంకణానికి ఓటమి లేదు " అన్నాడు శివయ్య.

ఆశ్చర్యపోయిన రాజు " ఏమిటి మంత్రకంకణమా ఏది చూపించు " అన్నాడు." అంతవిలువైన మంత్రకంకణం ధరించి ఇలా పొలంలో ఎవరైనా మట్టిపని చేస్తారా,దాన్ని నాఇంటిలో భద్రపరిచాను, తమరు చూడాలి అనికుతూహలపడుతున్నారు కనుక మీగుర్రాని ఇవ్వు, కొంత దూరంలోని నాయింటికివెళ్లి కంకణం తెచ్చిచూపిస్తాను " ఆన్నాడు శివయ్య.

కంకణం చూడాలి అనే ఆత్రుతలో తన గుర్రాని శివయ్యకు అప్పగించాడు రాజుగారు." బాటసారి నేవచ్చేదాక కొద్దిదూరంలో కనిపించే ఆధర్మసత్రంలో విశ్రాంతి తీసుకొండి.ఆది పేరుకే ధర్మసత్రం అందులో అన్నింటికి, అందరి వద్ద ధనం వసూలు చేస్తుంటారు జాగ్రత్త " అనివేగంగా గుర్రంపై వెళ్లిపోయాడు.

ధర్మసత్రం చేరిన రాజుగారు అక్కడ జరుగుతున్న మోసాలను తెలుసుకోసాగాడు.

రాత్రికావడంతో మంత్రి మారువేషంలో గుర్రంపై ధర్మసత్రం వద్దకు వచ్చాడు.అతని వెంట తన పంచకల్యాణిని చూసి ఆశ్చర్యపోయాడు రాజుగారు." మహరాజా శివయ్య అంతాచెప్పాడు అందరిని పందెంకట్టి మోసగిస్తుంటే, మిమ్మల్ని పందెం కట్టకుండానే మోసగించి మీగుర్రాని తీసుకువచ్చి నాకు అప్పగించి వెళ్లాడు "అన్నాడు మంత్రి. శివయ్య ఆఊరి ధర్మసత్రంలో జరిగే అక్రమాలను యుక్తిగా తనకు తెలియజేసినందుకు అతని తెలివితేటలకు మెచ్చుకున్నరాజుగారు అతనికి సుఖంగా బ్రతికేందుకు జీవనోపాధి కలిగించాడు.

బాలలు కథ విన్నారుగా రాజుగారి మంచితనంవలన,తనవద్దకువచ్చి పందెంకట్టిన వారినే మోసగించే శివయ్య తానుగా వెళ్లి ఎవరిని మోసగించడంలేదు కనుక శిక్షపడకుండా తప్పించుకున్నాడు.కనుకమీరు ఎదటివారిని మోసగించకూడదు అనితెలుసుకొండి అన్నాడు రాఘవయ్యతాత.బుద్ధిగా తలలు ఊపారు పిల్లలు.

మరిన్ని కథలు

Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి
Naalugu taraala katha
నాలుగు తరాల కథ
- హేమావతి బొబ్బు
Marina manishi
మారిన మనిషి
- శ్రీమతి లతా మూర్తి
Baamma cheppina bhale kathalu
బామ్మ చెప్పిన భలే కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bandham Anubandham
బంధం అనుబంధం
- కందర్ప మూర్తి
Aaradhana
ఆ'రాధ'న
- కొడాలి సీతారామా రావు
Pagavadiki koodaa ee anubhavam vaddu
పగవాడికి కూడా ఈ అనుభవం వద్దు
- మద్దూరి నరసింహమూర్తి