బాల శిల్పి ధర్మపాద ప్రాణత్యాగం - కోణార్క్ సూర్య దేవాలయం - కుందుర్తి నాగబ్రహ్మచార్యులు

Baalasilpi dharmapada pranatygam-Konark Suryadevalayam

దేశ విదేశస్తులను సైతం ఆశ్చర్యపరుస్తున్న విశ్వకర్మ వంశీయుల నిర్మాణ కౌశల్యం అయిన కోణార్క సూర్య దేవాలయ నిర్మాణ చరిత్ర. బాల శిల్పి ధర్మ పాద త్యాగ ఫలం - కోణార్క సూర్య దేవాలయ నిర్మాణము గంగ వంశపు రాజు అయిన మూడవ అనంగ భీమదేవుడు క్రీస్తు శకం 13 వ శతాబ్ద ఆరంభమైన పిదప కళింగ సింహాసనమున రాజు అయ్యాడు.అతని కుమారుడైన నరసింహ దేవుడు రాజ్యము నకు రాజు అయ్యి క్రీ. శకం.1238 నుంచి 1264 వరకు పరిపాలించాడు. ఒకరోజు వేకువ ఝాము కలలో సప్త సప్తినులు పూంచిన రధము పైన దివ్య మంగళ రూపము తో తేజో విరాజమానుడైన సూర్య భగవానుడు దర్శనం జరిగినది.ఆరోగ్య ప్రదాత అయిన ఆదిత్య స్వరూపములో సూర్య భగవానుడు ఒక అపూర్వ మందిరం నిర్మించమని ఆజ్ఞాపించాడు.ఆ స్వప్నము నుంచి మేల్కొనిన రాజు పట్టపు దేవిని మేల్కొలిపి స్వప్న విషయము తెలిపి సామంత రాజులతోటి, ప్రధాన మంత్రి శిబిసాన్త్ర , మధ్వాచార్యులు శిష్యులైన నరహరి తీర్థుల, పండిత కవుల , పురోహితులు తోటి రాజ సభను ఏర్పాటు చేసి తన యొక్క స్వప్న వృత్తాంతము తెలిపి చర్చ జరిపిన పిదప రాజు పూరి సమీపము నందలి గోపా గ్రామ వాస్తవ్యులైన తన ఆస్థాన రాజ శిల్పాచార్యులు,వాస్తు స్థపతి వర్యులు అయిన బ్రహ్మ శ్రీ విషుమహారాణ కు పురాణ ప్రశస్తీ కలిగిన చంద్ర భాగ నదీ తీరమున ద్వాదశ ఆత్మ స్వరూప సూర్యమందిర నిర్మాణమును చేయవలసినదిగా పురస్కాపూర్వ ఆజ్ఞాపన చేసినారు.రాజుగారి ఆజ్ఞ తీసుకున్న స్థపతి వర్యులు మిత్ర వనం నందు బాల భానుడి ప్రధమ కిరణం పడిన చోటును ఆలయ నిర్మాణమునకు తగిన స్థలముగా రాజు గారికి , మంత్రి బృదం నకు తెలిపినారు.ఈ విషయము జరిగే సందర్భానికి విషుమహారాణ భార్య గర్భవతి.రాజాజ్ఞ అయిన సూర్య దేవాలయ నిర్మాణము గురించి భార్యకు తెలిపి చేతివేలికి తన గుర్తుగా ఉంగరము తొడిగి నిర్మాణ సమయములో క్షేమ వార్తలు తెలియజేస్తాను అని చెప్పినాడు అంత ఆ ఇల్లాలు కర్పూర నీరాజనం తోటి నిర్మాణమునకు పంపినది.కుశ భద్ర నది , చంద్రభాగ నది కలిసే ప్రదేశ ప్రాంతము అయిన మిత్ర వనం.కులదేవత అయిన రామ చండీ దేవత పూజ చేసి,విషు మహారాణ తాత ముత్తాతలు నిర్మించిన విరజ ఆలయ , లింగరాజ, జగన్నాధ దేవాలయములు నిర్మాణ శైలి జ్ఞప్తికి తెచుకొని పునాదులు తీయించి శిలాన్యాసం మొనర్చినాడు.పన్నెండు వేల మంది శిల్పులు,శిల్ప కుమారులు రేయింబవళ్లు నిర్మాణపని చేస్తున్నారు.దేవాలయ నిర్మాణం యొక్క విమాన శిఖర శిల అమర్చు వరకు పూర్తి అయ్యినది.అప్పటికి నిర్మాణం ఆరంభించి 16 సంవత్సరములు అయ్యింది.పద్మ శిల శిఖర భాగమునకు జేరుట మాత్రము మిగిలియున్నది. ఒకే శిలను ఉపయోగించి దధి కుంభము 30 అడుగుల ఎత్తు 56 వేళా మణుగుల భారము కలిగిన ఆ శిల సరిగా అమర్చుట కుదరటం లేదు. ప్రధాన శిల్పి ఎంత ఆలోచించిన రోజులు గడిచిపోవుతున్నాయి కానీ సరిగా అమర్చుట కుదరటం లేదు.ప్రతిష్టాపన శుభ ముహూర్తము దగ్గరపడుతుంది. ఆ ముహూర్తం దాటి పోయిన అట్టి ముహూర్తం చాలా కాలం వరకు దొరకదని రాజ పురోహితులు రాజును తొందర చేయసాగిరి. పద్మ శిల అమర్చు పని పక్షము రోజులలో పూర్తి కాక పోయిన యెడల 12 వేల మంది శిల్పులు శిరస్సులు ఎగురును అని ఉత్తర్వులు ఇచ్చెను. 15 రోజులల్లో ఎదో ఒక ఉపాయం ద్వారా దానిని అమర్చవచ్చు అని నమ్మకంతో ఉండి ఒక భటుని పిలిచి గోప గ్రామమున తన రాక కై ఎదురుచూచున్న ఇల్లాలికి వార్త తెలిపెను.ఇలా నిర్మాణము జరుగుతున్న సమయములో అప్పటికే ఒక మగ శిశివును ప్రసవించెను.ఆ బాలునికి విషు మహారాణ తాను నిర్మిస్తున్న ధర్మ దేవత పేరు తో ధర్మపాద అని పేరు పెట్టాడు.పుట్టినది మొదలు ఆ పిల్లవాడు తండ్రిని సరిగా ఎరుగడు. తల్లిదగ్గరనే తమ వాస్తు శిల్ప కళా సాంప్రదాయ విషయములు నేర్చుకున్నవాడై షోడశ వర్షములకే నిర్జీవ శిల ఖండములకు జీవం పోయుచున్నాడు. భటుని వార్త విన్న ఆ బాల శిల్పి తన తండ్రి యాజమాన్యమున నిర్మించబడుతున్న సూర్య దేవాలయము యొక్క శిల్పచాతుర్యమును కన్నులార ఎప్పుడు చూచి ఆనందింతునా అని పలురకాల ఆలోచన చేస్తూ తండ్రి దగ్గరకి వెళ్ళటానికి అనుమతించాలి అని ప్రతిరోజూ మారం చేయసాగెను.ఒక నాడు విషు మహారాణ తనకు జ్ఞాపకంగా ఇచ్చిన ఉంగరమును ఇచ్చి పంపెను.ధర్మ పాద చాల సంతోషం తో తన సహా పాటి అయిన స్వరయు తో తల్లి అనుమతి తీసుకొని దేవాలయం నిర్మాణం జరిగే ప్రాంతమునకు వెళ్లెను. అల్లంతలో దధి కుంభ సూన్య మందిరం కనిపించింది.ఆరోజు కూడా దధి కుంభం పైకి చేర్చలేక పోయారు.శిల్పులు ఆనాటి పనిని ఆపి తమ తమ నెలవులకు వెళ్లారు.ఆనాటి ఆ వెన్నెల వెలుగు లో శిల్ప ఆకృతులు శైలిని గమనిస్తున్నాడు ధర్మపాద. అంతలో అక్కడికి విషు మహారాణ అక్కడికి వచ్చి ఆ బాలుని పోలికలు చూసి ఎంతో ఆప్యాయత కలిగింది . ఈనాటికి నా కుమారుడు కూడా ఇంత అయ్యేవాడు అని ఆలోచన చేసాడు విషు మహారాణ.ధర్మపాద దగ్గరికి వెళ్లి ఈ పండు వెన్నెలలో ఒంటరిగా ఎం ఆలోచిస్తున్నావు అని అడిగాడు.అప్పడు ధర్మ పాద పెద్దలకి నమస్కారములు నేను మాటల తో వివరించలేని ఈ దేవాలయ నిర్మాణ శిల్పచాతుర్యమును కన్నులతో ఆనందిస్తున్నాను అన్నాడు. దధి కుంభము సంఘటితం ఎందుకు చేయలేక పోతున్నారో మధ్య ఆకర్షణ బిందువును ఏర్పరుచుటలో ఎందుకు శిల్పులు చాల కష్టపడుతున్నది తెలియడం లేదు అని అన్నాడు ధర్మ పాద.దేవాలయం యొక్క కేంద్ర బిందువునకు మధ్య ఆకర్షణ బిందువును ఏర్పాటు చేస్తే దధి కుంభం సరిగ్గా అమరుతుంది అని శాస్త్రం చెబుతున్నది కదా అని ఘన కేంద్ర స్తానం సరిగా లేని కారణం చేత సరిగా కేంద్ర బిందువునకు మధ్య ఆకర్షణ బిందువు ను సరిగా లెక్క కట్టలేక పోతున్నారు అని ధర్మపాద చెప్పాడు. ఎన్నో గొప్ప దేవాలయము లు నిర్మించిన ఇంత మంది శిల్పులు పనిచేస్తున్న ఈ నిర్మాణము సరిగా లేదు అనినీ కుర్ర తనము తో ఇంత రీతిన పెద్దలు అయినవారిని నిరసించి పలుకుట నీకు శ్రేయస్సు కాదు అని అన్నాడు విషు మహారాణ. అప్పుడు బాల శిల్పి ధర్మపాద పెద్దలు అయినవారికి కూడా కొన్ని సార్లు పొరపాటు పడవచ్చు నా పైన కారాలు మిరియాలు నూరకుండా మధ్య ఆకర్షణ బిందువు సరిగా ఉన్నది లేనిది పరిశీలించమని ధర్మపాద అన్నాడు ఇలా వాదోప వాదముగా జరుగుతున్నా చర్చ నుంచి ఆలోచన చేసి తమ లోపము ఎత్తి చూపుతున్న ఆ బాలుని నింద చేస్తూ గర్వంగా అక్కడ నుండి విషు మహారాణ గారు వెళ్ళిపోయారు.కొంత సేపటికి శాంతించిన విషు మహారాణ అందరు నిద్రస్తున్న సమయములో కొద్దీ మంది ముఖ్య శిల్పులు తో చివరగా శిఖర శిలను అమర్చడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు.ఆ సమయములో మేల్కొని ఉన్నఆ బాల శిల్పి ధర్మపాద అవ్వని పనిని మరల మరల ఎందుకు యత్నించెదరు అని అనగా ఆ మాటలు విసిగి పోయి ఉన్న ఆ శిల్పుల మనస్సుకు మరింత ఇబ్బంది అనిపించాయి. ఆ శిల్పులలో ఒకరు కోపించి ఓరి డింభకా నీకు చేతనైన ప్రయత్నించు . మాకు ఇక దీని తో పనిలేదుఈ పని అవ్వదు కాబట్టి మేము ఎలాగూ రాజు యొక్క ఆజ్ఞ వలన మేము తెల్లవారినాక ఎలాగూ బ్రతుకము అని పలికి కొద్దీ మందిని తీసుకొని వెల్లిపోయెను. ధ్రువుడు, అభిమన్యుడు,శంఖచూడుడు వలె మనకి అసాధ్యము అయ్యినది ఆ పిల్లవానికి సాధ్యం కావచ్చు అని ఒక వృద్ధ శిల్పి మాటలకు మిగిలిన శిల్పులు అందరు సమ్మతించిరి. నాయక శిల్పి అయిన విషుమహారణా ఏమి మాట్లాడలేక మౌనము వహించెను. ఆ సమస్య తీర్చుటకు ధర్మపాద కు అనుమతి ఇచ్చిరి. కులదేవతకు,వంశ శ్రేష్ఠులకు,మాత పితరులకు నమస్కరించి నిర్మాణము పరీక్షించి దధి కుంభ ము అమర్చుటకు అడ్డముగా ఉన్న ఇనుప కమ్మీని ఊడబీకి మధ్యకర్షణ బిందువు యొక్క వాలయమునకు కేంద్రమును సరిచేసినాడు.కొందరు శిల్పుల సహాయముతో చిటికెలో పద్మ శిలను అమర్చి మించిన సంతోషముతో పక్కన ఉన్న శిలా ఖండం పైన ఆనందము తో నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ ఆ సందర్భములో ఎటుచూసినా కోలాహలం గా వాతావరనము తయారు అయ్యింది. చిన్న బాలుడు మేటి శిల్పులము అయిన మనం చేయలేని కార్యము చేయుట ఏమి అని ఇది ఎలా సాధ్యము అయ్యింది. ఒక పిల్లవాడి చేతిలో ఈ నిర్మాణము విషయములో ఇలా చేసిన పని విషయములో ఇలా అవమానం పొందాము అని భావన చేసి , ఈ విషయము ఆనోటా ఈనోటా పడి రాజు చెవిలో పడిన ఇంత కాలము నిర్లక్ష్య వైఖరితో నిర్మాణము లో చిన్న మార్పు చేయలేక ఇంత కలం వృధా కాలయాపన ఖర్చు చేసినారు అని అంటారు ఈ అవమానం కన్నా రాజు చేతిలో శిరస్సుచ్చేదనం ద్వారా చని పోవుట మేలు కదా అని భావన చేసినారు.ప్రధాన శిల్పికి ఈ అపకీర్తి వస్తుంది కదా అని అట్లు రాకూడదు అని ఇప్పుడే ఈ బాలుని ఈ ప్రాంతము దాటిపోక మునుపే అంతము చేస్తే నిర్మాణ విషయములో జరిగిన పొరపాటు రాజుకు తెలియకుండా ఉంటుంది కదా నాయక శిల్పిని ప్రోత్సహించెను.అంత ఆ నాయక శిల్పి మిగతా శిల్పుల ప్రలోభానికి లొంగి ఒక కత్తి తీసుకొని ఆ పిల్లవాడు వెళ్లే మార్గమున ఆగి నిన్ను అభినందించ లేకుండా ఉన్నాను అని నీ యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రజ్ఞ నీ ప్రాణములనే బలి కోరనున్నది అని పలికినాడు.ఆ మాటల సంఘటన కి ఆశ్చర్య పోయిన ధర్మపాద తాను గోపా గ్రామము నుంచి తన తండ్రి ని వేడుకుతు వచ్చిన విషయము తెలిపినాడు. పుట్టినది మొదలు నా తండ్రి మొహం కూడా తెలియదు. అని దీనంగా చెప్పెను. అసంపూర్ణం అయిన కార్యమును సంపూర్ణము చేసి కులప్రతిష్ఠ చేసితిని. అందులకు నాకు ఈ ఫలం దక్కినదా అని తండ్రిని తలుచుకొని ఏడవ సాగెను.ఒక్కసారి గా ఎత్తిన కత్తిని అట్లే పారవేచి ఒకనాడు పిల్లవాని పోలికలు గుర్తించిన విషమహరాణ అది ఈనాడు నిజం అయ్యెను అని తన భార్యకు జ్ఞాపకంగా ఇచ్చిన ఉంగరము అతని వద్ద చూసి పుత్ర వాత్సల్యముతో ఒడిలోకి తీసుకొని సేద తీర్చి ఆలింగనం చేసుకున్నాడు.పిల్లవాడికి జరుగనున్న ఆపద తెలిపి భాద పడుతూ సురక్షిత ప్రాంతమునకు చేరవేసినాడు. దూరం నుంచి ఈ విచిత్ర సన్నివేశం చుసిన మిగతా శిల్పులు విషుమహారణా పుత్ర ప్రేమ స్వార్ధ బుద్ది తో మన అందరి ప్రాణములు తో చెలగాటం ఆడుతున్నాడు అని గ్రహించి ఈ బాలుడు నీ పుత్రుడు అయినా సరే వదించాల్సిందే అని , వేరే వారి పుత్రుడు అయితే నీవు ఇట్లా విడిచి పెడతావా అని నీకు ఈ 1200 శిల్పులు కావలెను ఈ బాలుడు కావలెనా తేల్చుకోమని అన్నారు. పాపం విషు మహారణా యొక్క ధర్మ సంకట స్థితిని అర్ధం చేసుకున్న బాల శిల్పి ధర్మపాద శిల్పుల నుద్దేశించి నా ఒక్కని ప్రాణమునకు 1200 మంది శిల్పుల ప్రాణం బాలి అగుట భావ్యము కాదు అని నా తండ్రికి వంశమునకు అప్రదిష్ట రాకూడదు అని తలచి మందిరం యొక్క చివరి భాగమునకు చేరి దివాకర , కర్మ సాక్షి నా చివరి నమస్కారం అందుకొనుము అని, చంద్రభాగ నదీలో దుమికి తన తల్లికి తన మరణ వార్త తెలుపమని చెప్పి ఆత్మార్పణ చేసుకున్నాడు. స్వార్ధ పిశాచులైన శిల్పుల పైన కోప్పడుతూ హృదయ విదారకము అయిన ఈ సంఘటన వలన విషు మహారాణ మూర్ఛ పోయాడు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి