నిజమైన నివాళి . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Nijamaina nivaali

శివయ్య, రంగనాథం బాల్యమిత్రులు. డిగ్రీ దాకా కలసి చదువుకున్నారు.

వ్యాపారంలో అడుగుపెట్టిన రంగనాధం అంచలు అంచలుగా ఎదిగాడు. శివయ్య వదలని పేదరికంలో అలానే గుమ్మస్తా గిరితో ఉండి పోయాడు.

ప్రతిరోజు సాయంత్రం తిక్కన పార్కులో కలుసుకుని కొద్ది సేపు చదరంగం ఆడిన అనంతరం శివయ్య కొన్ని దుకాణాలలో పద్దులు రాయడాని , రంగనాథం వ్యాపారం చూసుకోవడానికి వెళతారు. అరవై ఏళ్ళ స్నేహం వారిది,మరో చిత్రమైన విషయం ఏమిటి అంటే వీళ్ళకి మరెవ్వరు స్నేహితులు లేకపోవడం.

ఎప్పటిలా సాయంత్రం పార్కులో కలసిన శివయ్యను చూసిన రంగనాథం

" శివా రేపు రాత్రి కి అమెరికాలోని మాఅబ్బాయి దగ్గరకు వెళుతున్నా, అక్కడే బైపాస్ సర్జరికి అన్ని ఏర్పాట్లు మావాడు చేసాడు, నీకు ఫోన్ చేస్తుంటాను రావడానికి ఆరునెలలు నేలలు పట్టవచ్చు'' అన్నడు రంగనాధం.

'' రంగా ఆరోగ్యం జాగ్రత్త '' అన్నాడు శివయ్య.

ఇంతలో చెక్కెరలేని కాఫీ చేరోకప్పు అందించి వారిముందు ఉన్న చదరంగ పావులను పెట్టెలో సర్ధుకుని కారుదగ్గరకు వెళ్ళాడు రంగనాధం డ్రైవర్.

మిత్రులు ఇరువురు తిక్కన పార్కునుండి వెలుపలకు వచ్చారు, గోడుగు సహయంతో నెమ్మదిగా తను లెక్కలు రాసే బట్టల దుకాణాలవైపు నడవసాగాడు శివయ్య.

వెళుతున్న తన బాల్యమిత్రుడను చూస్తూ కారు లోకూర్చున్నాడు రంగనాధం.

కాలచక్రం ఎవరి కొసము ఆగదు. నాలు నెలలు గడిచాయి .

ఒకరోజు రంగనాధం నికి శివయ్య చిన్నకుమారుడు నుండి పోన్ వచ్చింది. ' మామయ్య రాత్రి నాన్నగారు గుండె పోటుతో చనిపోయారు ' అని . బావురుమన్నాడు రంగనాధం .

నెల్లూరు రావడానికి ఎంతప్రయత్నించినా రంగనాధానికి మూడు రోజులు పట్టింది.

విమానాశ్రయం నుండి నేరుగా రంగనాధం శివయ్య ఇంటికి వెళ్ళాడు. అప్పటికే శివయ్యకు చేయవలసిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

రంగనాధాన్ని చూస్తూనే తలుపుచాటు నుండి ' అన్నయ్య ' అని కన్నీరు పెట్టుకుంది శివయ్య భార్య.

శివయ్య పెద్దకుమారుడు,రెండోకుమారుడు తమ లగేజ్ తొ వెళ్ళడానికి సిధ్ధంగాఉన్నారు.

" నాయనా మీరువెళ్ళిపోతున్నారు, నాన్నగారు కొన్ని అప్పులుచేసారు సొంత ఇల్లుకూడా లేదు,ఇప్పుడు మీఅమ్మగార్ని మీరే పోషించాలి చిన్నవాడు మీలాగ పెద్దగా చదువుకోలేదు, అతను రైస్ మిల్లులో పనిచేస్తూ భార్యా ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి, కనుక మీఇద్దరిలో ఎవరుమీ అమ్మగారిని తీసుకువెళతారు, అప్పులు ఎలాతీరుస్తారు " అన్నాడు రంగనాధం.

" మావయ్య అమ్మను నాతో తీసుకువెళ్ళడానికి వీసా ప్రాబ్లం,అప్పులతో నాకు ఎలాంటి సంబంధంలేదు అవి ఎందుకు చేసారోకూడా నాకు తెలియదు " అన్నాడు శివయ్య పెద్దకుమారుడు.

" మావయ్య బొంబాయివంటి మహానగరాలలో ఇరుకు గదుల్లో మేము జీవిస్తున్నాం. మాఆదాయం పెద్దగా ఉండదు అందుచేత అమ్మను నేను తీసుకువెళ్ళలేను,అప్పులు అంటారా అవిమాకోసం చేసినవి కావు కనుక నాకు సంబంధంలేదు " అన్నాడు శివయ్య రెండోకుమారుడు.

మూడవ కుమారునికేసిచూసాడు రంగనాధం.

" మామయ్య అమ్మ ఒకరిదగ్గర ఉండటం ఏమిటి? నేనే అమ్మదగ్గర ఉంటాను " అన్నాడు శివయ్య మూడవ కుమారుడు.

" బాబాయ్ అనాధనైన నన్ను తనకోడలిగా కోరితెచ్చుకున్న మనసున్నమనిషి మామయ్య, నాకు ఇంకో బిడ్డఉంటే పెంచుకోనా నాబిడ్డే అనుకుంటిను . వయసు పైపబడిన అత్తయ్య నాకు బిడ్డవంటిదే,ఆమె మాకు పెద్దదిక్కు,ఆయన చెప్పినట్లు అత్తయ్య ఒకరి దగ్గర ఉండటంకాదు, మేమే ఆమెదగ్గరఉంటాం! ఉన్నదే తింటాం ,అప్పులు అంటారా నెమ్మదిగా తీర్చుకుంటాం , నేనుకూడా ఏదైనా పనికివెళతాను అన్నది "శివయ్య మూడో కోడలు.

దీర్ఘంగా నిట్టూర్చిన రంగనాధం " మీఇద్దరిని చదివించి,మీతమ్ముడిని ఆర్ధిక పరిస్ధితుల కారణంగా చదవించలేకపోయాడు మీనాన్నగారు.

వయోభారంతో వైద్యనిమిత్తం అప్పులు చేసింది మీకు తెలుసు, మీరు వెళ్ళిన తరువాత ఎప్పుడైనా మీనాన్న గారికి డబ్బు పంపారా ? ఆత్మాభిమానం కలిగిన వాడు మీనాన్న ఏనాడు నానుండి ధనసహాయం పొందలేదు.మీకు అందరికి తెలియని రహస్యం ఒకటి చెపుతాను వినండి.దాదాపు నలభై ఏళ్ళక్రితం నేనువ్యాపారం ప్రారంభించిన తొలినాళ్ళలో కొంత డబ్బు అవసరపడింది అప్పుడు ఆడబ్బు సర్దుబాటు కాకుంటే కట్టుబట్టలతో రోడ్డున పడేపరిస్ధితి నాది,మీనాన్నగారు మీఅమ్మగారి నగలు అమ్మి ఆడబ్బుతో నన్ను ఆదుకున్నాడు. అప్పటినుండి ఎన్నోసార్లు ఆడబ్బు ఇచ్చే ప్రయత్నం చేసాను. నీవద్దే ఉంచరా వాటి అవసరం ముందుఉందిలే అనేవాడు,ఆడబ్బును నావ్యాపారంలో పెట్టి గత నలభైఏళ్ళుగా మీ అమ్మపేర దాస్తూ వచ్చాను నేడు అది రెండుకోట్ల ఎనభై లక్షలుగా ఉంది.

మీఅమ్మ మీకు అవసరంలేదు కనుక మీఅమ్మపేరిట ఉన్న డబ్బుమీకు రాదు,మరోవిషయం ఏమిటంటే నేను అమెరికాలో మాఅబ్బాయి దగ్గర స్ధిరపడబోతున్నా, మీఅమ్మను తన బిడ్డగాభావించే భావన తెలిపిన మీమరదలికి, తిండికిలేని పేదరికంలోఉండికూడా అమ్మ ఒకరిదగ్గర ఉండటం ఏమిటి నేనే అమ్మదగ్గర ఉంటా అన్న మీతమ్ముడికి ఆడబ్బుతో పాటూ, నా బంగ్లా, బట్టల దుకాణ వ్యాపారం, కారు సమస్తం మీతమ్ముడికే ఇస్తున్నా, మీనాన్నకు చిన్నతనంనుండి ఎందుకో గ్రంథాలయం అంటే ప్రాణం. బాల్యంనుండి మేము గ్రంథాలయం స్ధాపించాలి అనుకునేవాళ్ళం. చిన్నబజారులోని ఉన్న నామరో ఇంటిని శివయ్య గ్రంధాలయంగా మార్చబోతున్నాను.నా ప్రాణ మిత్రుడు అయిన మీనాన్నకు నేను ఇచ్చే నిజమైన నివాళి ఇదే " అన్నాడు రంగనాథం.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి