ధ్రువ నక్షత్రం - శ్రీపతి. లలిత

ధ్రువ నక్షత్రం

రవీంద్ర భారతి కళ , కళ లాడుతోంది. ఒక పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న

" గ్రేట్ సింగర్ " ఫైనల్ పోటీ .

ఫైనల్ పాటల పోటీలో పాల్గొననున్న పిల్లల తల్లి తండ్రులే గాక , చాలామంది లైవ్ లో పాటల పోటీ చూడడానికి వచ్చారు.

దానికి జడ్జెస్ ,ఒక గాయకుడు , ఒక సంగీత దర్శకుడు .

ఫైనల్ చూడడానికి , గెస్ట్ జడ్జెస్ గా పాల్గొనడానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు, గాయకులూ కూడా వచ్చారు.

వాళ్ళని చూడడానికి , పాటలు వినడానికి వచ్చిన జనం తో హాల్ కిక్కరిసి పోయింది.

ఇదంతా టీవీ లో చూడడానికి లైవ్ టెలికాస్ట్ కి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఆరోజు ఫైనల్ లో పాడబోయే పిల్లలు ముగ్గురు. అందరూ పది ఏళ్ళ లోపు పిల్లలే.

ఒక అబ్బాయి ధ్రువ , ఇద్దరు అమ్మాయిలు గీత ఇంకా ఉష.

3 గంటలపాటు సాగిన ఆ పోటీలో 4 రౌండ్స్ తరవాత విజేత గా ధ్రువ నిలిచాడు.

ఆతరువాత గీత, ఉష నిలిచారు.

ఆ ముగ్గురి తల్లి తండ్రులు పిల్లలతో ఫోటోలు , లైవ్లో ఇంటర్వూస్ అయ్యాయి.

ధ్రువ ,తండ్రి రమేష్ , తల్లి జయంతి , చెల్లి ప్రణతి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు.

ఛానల్ వాళ్ళ ఇంటర్వ్యూ లో అబ్బాయి కి శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నామని , దానిని కంటిన్యూ చేయమని జడ్జెస్ చెప్పారని అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

ఇంటికి వెళ్ళగానే రమేష్ వాళ్ళ అమ్మ అందరిని నించోపెట్టి దిష్టి తీసింది.

" ఏమిటో ? ఎక్కడో వాడి రక్తం లో ఆ సంగీతం ఉంది .

లేపోతే మన ఇంట్లో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సరిగమ లు రావు. "

"ఏ తల్లి వదులుకున్న వజ్రమో " కాస్త గట్టిగానే నిట్టూర్చింది.

" అమ్మా" అని రమేష్ " అత్తయ్యా " అని జయంతి గట్టిగా అన్నారు.

" వాడి ముందు ఇలా అనద్దన్నానా " కోపం గా అన్నాడు రమేష్.

" అమ్మని కోప్పడటం కాదు రా , పిల్లవాడు పెద్ద అవుతున్నాడు. ఉన్న నిజం మీరే చెపితే మంచిది. బయట వాళ్ళ నుంచి తెలిసేకన్నా " రమేష్ నాన్నగారు గట్టి గానే అన్నారు.

అప్పుడు ఏమి అనకపోయినా తండ్రి చెప్పింది కరెక్ట్ అనిపించింది రమేష్ కి.

జయంతి తో మాట్లాడాలి అనుకున్నాడు.

రమేష్ , తల్లి , తండ్రి చెప్పిన విషయం జయంతితో కూర్చుని ఆలోచించాడు.

జయంతి కూడా అత్త , మామలు చెప్పిందే కరెక్ట్ అనుకుంది.

ధ్రువ కి నిజం వేరే ఎవరి ద్వారా నో తెలిసే కన్నా తాము చెప్పడమే బెటర్ అనుకున్నారు.

వెంటనే ,జయంతి ఫ్రెండ్ డాక్టర్ మాధురి కి ఫోన్ చేశారు. ఎందుకంటే డాక్టర్ మాధురి వల్లనే ధ్రువ వీళ్ళ జీవితం లోకి వచ్చాడు.

మాధురి కి ఫోన్ చేసి ,ధ్రువ కి ఇంక అసలు విషయం తాము చెబుతామని నిశ్చయించినట్లు చెప్పారు.

మాధురి, వీళ్ళని తన ఫ్రెండ్ ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారని , ముందు ఆయనని వీళ్ళు కలిసాక ,

అప్పుడు ధ్రువ ని తీసుకొని అక్కడికి వెళితే ఆయన సలహా ఇస్తారు అని.

ఎలా చెపితే ధృవ్ ఫ్యూచర్ లో కూడా, ఎటువంటి

నెగటివ్ ఫీలింగ్ లేకుండా లైఫ్లో హ్యాపీ గా ఉండగలడో ,అలా చెప్పటం బెటర్ అని చెప్పింది.

రమేష్, జయంతి వెంటనే ఆయన ని కలిసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు.

ఆయన వీళ్ళతో ఏమి మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో చెప్పి , 2 రోజుల తరవాత ధ్రువ ని తీసుకొని రమ్మన్నారు.

ఆయన చెప్పిన రోజు న ధ్రువ తో ఆయన దగ్గరికి వెళ్లారు.

ఆయన ధ్రువ ని కొన్ని చిన్న ప్రశ్నలు అడిగి , ఏ క్లాస్ చదువుతున్నావు , పాటలు బాగా పాడతావు కదా ? ఏ పాటలు ఇష్టం ? లాంటివి అడిగి ,

కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు నెమ్మదిగా అసలు విషయం లోకి వచ్చారు.

" ధృవ్ ! నీకు శ్రీ కృష్ణుడి కధ తెలుసా ? అడిగారు. "

"ఆ ! తెలుసు. అన్నాడు ధృవ్. " మరి చెప్పు చూద్దాం.

ధృవ్ నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టాడు.

" కృష్ణుడు , దేవకీ , వసుదేవుల కొడుకు . కానీ యశోద , నందుల దగ్గర పెరిగాడు "

అనగానే "నువ్వు కూడా శ్రీకృష్ణుడి లాంటివాడివే నీకు తెలుసా " అన్నారు.

ధృవ్ ఆశ్చర్యం గా చూసాడు.

"అవును ధృవ్ , నీకు అసలు అమ్మ , నాన్న వేరు , కానీ వాళ్ళ లైఫ్

లో కూడా కంసుడు లాంటి ఒక డేంజర్ వచ్చింది.

వాళ్ళు భయపడి ఎలా తప్పించాలి ఈ చిన్న బాబు ని అని ప్రే చేశారు. "

"అప్పుడు దేవుడు మీ మమ్మీ ఫ్రెండ్ మాధురి ఆంటీ ని పిలిచి

"మీ ఫ్రెండ్స్ ఈ యశోద, నందా లాంటి రమేష్ , జయంతి చాలా మంచివాళ్ళు.

వాళ్లే ఈ చిన్న బాబు ని ఎవరూ చూసుకోనంత బాగా చూసుకుంటారు.

వాళ్ళకి ఇస్తే ఆ అబ్బాయి చాలా హ్యాపీ గా ఉంటాడు. "

"నేను మురళి వాయిస్తే ఈ అబ్బాయి పాటలు పాడతాడు అని చెప్పాడు. "

"అప్పుడు మాధురి ఆంటీ ,మీ మమ్మీ, డాడీ ని పిలిచి నిన్ను వాళ్ళకి ఇచ్చారు ."

"ఇప్పుడు నాకు దేవుడు చెప్పాడు. "

"చాలా రోజులు అయింది ధృవ్ ఎలా ఉన్నాడు కనుక్కో అని ,

సో , నువ్వు ఎలా ఉన్నావు మీ మమ్మీ డాడీ నిన్ను ఎలా చూస్తున్నారు? "

సీరియస్ గా అడిగారు.

ధృవ్ కొద్దిగా ఏడుపు మొహం పెట్టాడు. " మమ్మీ , డాడీ ,నేను మీ బేబీ కాదా ? "

" ఎందుకు కాదు నాన్నా , నువ్వు మాకు దేవుడు ఇచ్చిన స్పెషల్ బేబీ " అంది జయంతి

"నేను, మమ్మీ, మాకు స్పెషల్ , క్యూట్ బేబీ కావాలని 5 ఇయర్స్ ప్రే చేసాము .

అప్పుడే నువ్వు మాకు దొరికావు. మాధురి ఆంటీ స్పెషల్ గా మాకు ఇచ్చారు. "

"నువ్వు ఇంట్లో ఆడుకోవడానికీ కావాలంటే ప్రణతి తెచ్చాము ఆంటీ దగ్గర నుంచి. "

" మరి చెల్లిని దేవుడు ఇవ్వలేదా ? " అడిగాడు ధృవ్.

"దేవుడు ఇచ్చాడు , కానీ నీలాగా స్పెషల్ కాదు "అన్నాడు రమేష్.

ధృవ్ మోహంలో కొంచెం ధైర్యం వచ్చింది.

" మరి నన్ను కృష్ణుడు లాగ మళ్ళీ మా రియల్ అమ్మా, నాన్న దగ్గరికి పంపుతారా? "

అన్నాడు.

" నీకు ఇక్కడ మాతో ఉండడం కావాలా , రియల్ అమ్మా, నాన్న దగ్గరికి వెళ్లడం కావాలా ?

నీ ఇష్టం " అడిగింది జయంతి .

" నేను వెళ్ళను , నాకు మీరే కావాలి " అన్నాడు ధృవ్.

" థాంక్యూ నాన్నా , ఐ లవ్ యు. " అంది జయంతి.

"ఐ లవ్ యు మమ్మీ " అందుకే నేను వెళ్ళను. " అన్నాడు ధృవ్.

" దేవుడు వచ్చి అడిగినా మేము నిన్ను పంపము "అన్నాడు రమేష్.

" థాంక్ యు డాడీ " అన్నాడు ధృవ్.

"సో ,నువ్వు ఎంత గ్రేట్ చూసావా ?ఎవరికి ఇలాంటి ఛాయస్ ఉండదు , ఈవెన్ కృష్ణ కి కూడాలేదు. నువ్వు చాలా స్పెషల్ అవునా?" అన్నారు ఆయన

మొహం చాలా గర్వం గా పెట్టి

" అవును , " అన్నాడు ధృవ్.

"మరి ఇప్పుడు ఎవరైనా నువ్వు వీళ్ళ బేబీ కాదు ,నిన్ను వీళ్ళు హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నారు ,అంటే ఏమి చెపుతావు ?. "అడిగారు.

" నాకు మమ్మీ, డాడీ ని చూస్ చేసుకోవడానికి ఛాయస్ ఉంది ,మీకు లేదు ఎందుకంటే

నేను స్పెషల్ అంటాను "మొహం పైకి ఎత్తి చెప్పాడు గొప్పగా .

" వెరీగుడ్. మీ అమ్మ, నాన్న, నీకు ధృవ్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా?

నువ్వు ధ్రువ నక్షత్రం లాగా కలకాలం వెలగాలి " ఆశీర్వదించారు అయన

"సో , రమేష్ అండ్ జయంతి కంగ్రాట్స్ ఎందుకంటే

ధృవ్ ,మిమ్మలిని అమ్మా , నాన్నగా సెలెక్ట్ చేసుకున్నాడు. "

"ఇంక రియల్ అమ్మా , నాన్న ల దగ్గరికి వెళ్ళడు , కనక వాళ్ళు ఎవరు అని కనుక్కునే అవసరం కూడా మనకి లేదు. బి హ్యాపీ " అని లేచారు.

ఎలా డీల్ చెయ్యాలి ఇంత సున్నితమైన విషయాన్నీ, అని టెన్షన్ పడుతున్న వీళ్ళకి ,

అంత తేలికగా ధృవ్ కి చెప్పినందుకు వాళ్ళు కూడా ఆయనకి థాంక్స్ చెప్పి బయటకు వచ్చారు.

నువ్వు మమ్మల్ని ఎంపిక చేసుకున్నందుకు నీకు ట్రీట్

అని డిన్నర్ కి తీసుకెళ్లారు.

ఇంట్లో బామ్మా, తాత ,చెల్లికి కూడా పార్టీ అని ఐస్ క్రీం ప్యాక్ చేయించాడు ధృవ్.

పాపం ధృవ్ కి కొంత అర్ధమయ్యి, కొంత అర్థం కాక ,అయోమయం లో ఉన్నాడు.

డాక్టర్ కూడా చెప్పారు కొంతకాలం రకరకాల ప్రశ్నలు అడుగుతాడు.

కొంచెం ఓర్పు తో ఉండండి అని.

ఇంటికి వచ్చాక "నేను మమ్మీ దగ్గర పడుకుంటా అని ధృవ్ రాగానే , ప్రణతి కూడా నేనూ అంటూ వచ్చింది.

ఇద్దరి మధ్యలో పడుకున్న జయంతి పాత జ్ఞాపకాల లోకి వెళ్ళింది.

రమేష్ , జయంతి ల పెళ్లి అయ్యి 5 ఏళ్ళు గడిచినా ఇంకా పిల్లలు పుట్టక పోయేసరికి ఇరు వైపులా కంగారు మొదలు అయింది.

పెద్దల గోల పడలేక , వాళ్ళు జయంతి తన ఫ్రెండ్ డాక్టర్ మాధురి దగ్గరకు వెళ్లారు.

ఆవిడ అన్ని టెస్ట్స్ చేసి ,రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనీ ,ఒకసారి వస్తే కొన్ని జనరల్ మందులు రాసిస్తాను హాస్పిటల్ కి రమ్మంటే ఇద్దరూ వెళ్లారు.

అక్కడ వెళ్లేసరికి అంతా గందరగోళం గా ఉంది. ఒకరు , ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మాధురి రూమ్ లో లేదు.

అక్కడ రిసెప్షన్ లో అమ్మాయి " మేడం ఇప్పుడే రారు ,మీరు మళ్ళీ రండి "అంది.

అసలు ఏమైంది అనేలోగా మాధురి ఇటుగా వచ్చింది.

" సారీ జయా , ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చింది "అంది.

" ఏమిటి , పేషెంట్ సీరియస్ గా ఉందా ? అంటే "

"కాదే , ఒక అమ్మాయి 3 రోజుల క్రితం డెలివరీ కి వచ్చింది. నార్మల్ డెలివరీ. "

"కానీ ఇవాళ డిశ్చార్జ్ అయి మొత్తం అమౌంట్ కట్టి ,వెళ్లేప్పుడు బేబీ ని వదిలి వెళ్ళిపోయింది.

ఆ అమ్మాయి ఇచ్చిన ఫోన్ ,అడ్రస్ ,అన్ని ఫేక్.

అందుకే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. " అంది.

బేబీ ని చూద్దామని వెళ్లిన జయంతి , రమేష్ లు ఆ మూడు రోజుల బాబు ని చూసి పాపం అనుకున్నారు.

దగ్గరికి వెళ్లి చేత్తో వాడి బుగ్గ నిమిరింది జయంతి , ఆమెను చూసి వాడు బోసి గా నవ్వి, చేయి గట్టిగా పట్టుకున్నాడు.

జయంతి వాడిని వదల లేక పోయింది.

వీళ్ళు అక్కడ ఉండగానే కానిస్టేబులు వచ్చి ఆ పేషెంట్ కొన్ని పేపర్స్ ఉన్న కవర్ రిసెప్షన్ లో ఇచ్చిందని , ఎవరైనా బాబుని లీగల్ అడాప్ట్ చేసుకోవడానికి ఆ పేపర్లు పనికి వస్తాయి అన్నాడు.

జయంతి వెంటనే" మాధురి బాబు ని మేము అడాప్ట్ చేసుకుంటాము. " అంది

రమేష్ బిత్తరపోయాడు .

"జయంతి , ఏమిటి అంటున్నావు ?" అన్నాడు.

" అవునండి , నాకు వీడు కావాలి " లీగల్ గా ప్రొసీజర్ ఏదైనా మనం పెంచుకుందాము. "

అంది.

పోలీస్ వాళ్ళు కూడా ,అన్ని సెటిల్ అయేదాకా బాబు హాస్పిటల్ లో ఉండేట్టు , లీగల్ గా అడాప్షన్ ఇవ్వడానికి ప్రొసీజర్ చెప్పి వెళ్లిపోయారు .

మాధురి కూడా" అడాప్షన్ అంటే పిల్లాడిని బొమ్మ ని తీసుకెళ్లినట్టు కాదు జయంతి,

చాలా ఆలోచించాలి. మీరు ఇంటికెళ్లి మీ పెద్ద వాళ్ళతో మాట్లాడండి.

రేపు మీకు ఇంకో బేబీ పుడితే పరిస్థితి కూడా ఆలోచించండి.

కొన్ని రోజులు , రోజూ బాబు దగ్గర గడపండి. " అని చెప్పింది.

ఎందుకో గాని రమేష్ కూడా బాబు ని చూస్తే ఏదో పూర్వజన్మ సంబంధం లా అనిపించింది.

ససేమిరా, అన్న రమేష్ తల్లి తండ్రి కూడా వాడిని చూసి తెగ సంబర పడ్డారు.

మొత్తం మీద 2 నెలల తరవాత లీగల్ గా బాబు ని ఇంటికి తెచ్చారు.

ప్రతి రోజు జయంతి హాస్పిటల్ కి వెళ్ళేది , తనతో ఎవరో ఒకరు వెళ్లేవారు.

బాబు కూడా వీళ్ళని చూసి నవ్వుతుండేవాడు.

మరో రెండు సంవత్సరాలకి ప్రణతి పుట్టింది.

అయినా ధృవ్ ని చూసే పద్దతి లో మార్పు లేదు.

వాడు దేవుడు ఇచ్చిన బిడ్డ గా నే చూసారు.

అత్తగారు, మామగారు కూడా ఏతేడా చూపేవాళ్లు కాదు.

అసలు వాడికి నిన్ను పెంచుకున్నాము అని ఎలా చెప్పాలి , చెపితే ఎలా రియాక్ట్ అవుతాడు అని భయపడ్డారు.

సైకియాట్రిస్ట్ ఎంత తేలికగా , చక్కగా డీల్ చేశారు."

మనసు తేలికపడి , పిల్లలమీద చేయి వేసి చాల రోజుల తరవాత హాయిగా నిద్రపోయింది

రోజులు చాలామటుకు సాఫీ గా గడిచి పోతున్నాయి.

మొదట్లో ఏవో ప్రశ్నలు అడిగిన ధృవ్ ,రాను రాను అదీ మానేసాడు.

చదువు , సంగీతం తో ,బిజీ అయ్యాడు .

ధృవ్ కి శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం రెండూ నేర్పించారు.

రమేష్ కానీ , జయంతి కానీ ,రోజు ధృవ్ ని సంగీతం పాఠాలకి తీసుకెళ్లేవారు.

అన్నను అందరు పొగుడుతుంటే , నేను నేర్చుకుంటా అని , ప్రణతి పియానో మొదలు పెట్టింది.

ధృవ్ చెల్లి అంటే ప్రాణం గా ఉండేవాడు. చిన్న పిల్లాడు అయినా ఎంతో భాధ్యత గా , పెద్దరికం గా ఉండేవాడు.

బయటికి ఏమి అనకపోయినా ఈ కుటుంబం అంటే మనసులో ఎంతో కృతజ్ఞత ఉండేది.

వీళ్ళు తనని ఎంతో ప్రేమతో చూడడటమే గాక ,తనకి ఇష్టమైన సంగీతాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు అని.

ఒకోసారి కొంత మంది పేరెంట్స్ వాళ్ళ సొంత పిల్లలకి నేర్పించాడు కూడా విసుక్కోవడం , డబ్బులు దండగ అనుకోవడం చూసాడు.

అమ్మా , నాన్నా, అన్నని పొగిడితే మొదట్లో ఏడ్చేది. "నేను మీ సొంత బేబీ కాదు , మీరు నన్ను హాస్పిటల్ నుంచి తెచ్చారు అన్నే మీ బేబీ అని, అలాంటప్పుడు ధృవ్ చెల్లిని చాలా ఓర్పుగా ఓదార్చేవాడు.

కొద్దిగా పెద్ద అయ్యాక ప్రణతి కూడా అన్న అంటే ప్రాణం గా ఉండేది. మా అన్నయ్య గొప్ప సింగర్ అవుతాడు అని అందరికి చెప్పేది.

ఎంత మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ ఉంది, అదే ప్రొఫెషన్ కింద అనుకున్నా ,మినిమం డిగ్రీ పూర్తి చేయాలనీ తరవాతే పాటలు అని రమేష్ , జయంతి గట్టిగా చెప్పారు.

ధృవ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి , సంగీతం మీద దృష్టి పెట్టాడు.

సినిమాల్లో పాడాలని అతని కోరిక.

అది తీరాలంటే , అందరి దృష్టి లో పడాలంటే, కొన్ని పాటల పోటీల్లో పాల్గొనడమే మంచిమార్గం ,అని టీచర్స్ కూడా చెప్పడం తో వాటి కోసం ఎదురు చూసాడు.

అదృష్టం కలిసి వచ్చినట్టు అదే టైం లో "సింగర్ ఆఫ్ ఇండియా "

పోటీ అనౌన్స్ చేశారు.

దేశం మొత్తం నుంచి ఆ పోటీకి లక్ష ల్లో వస్తారు.

అందులోనించి 16 మందిని సెలెక్ట్ చేసి కొన్నివారాలు పోటీలు అయ్యాక

ఫైనల్స్ అవుతాయి.

ఇదంతా ముంబై లో అవుతుంది.

దేశమే కాదు ,విదేశాల లోనుండి భారతీయులు అందరు చూస్తారు .

మొత్తానికి ధృవ్ టాప్ 16 లో వచ్చాడు.

ఆడిషన్స్ నుంచి దేశం మొత్తం ఇతని పాట కి ఫిదా అయ్యారు.

ప్రతి ఎపిసోడ్ లోను ఇతని పాటే టాప్.

మామూలుగా ఉండే జడ్జెస్ కాక ప్రతి వారం ఒకో సెలబ్రిటీ ని పిలిచేవారు.

ఒకసారి సీనియర్ సింగర్ కం డైరెక్టర్ రాజా ని పిలిచారు .

ధృవ్ రాగానే యాంకరింగ్ చేస్తున్న అతను రాజా తో ఇలా అన్నాడు.

" సర్ , మీరు రెగ్యులర్ గా చూస్తారా ? మీకు ఎవరి పాటలు నచ్చుతాయి. "

అందరూ మంచి సింగర్స్ , కాని , నాకు పర్సనల్ గా ధృవ్ పాట చాలా ఇష్టం. " అన్నాడు రాజా ధృవ్ వేపు నవ్వుతూ చూస్తూ.

" సర్, మీకు ఇంకొకటి తెలుసా ?

ధృవ్ పాడితే అందరూ మీరు పాడినట్లే ఉంటుంది అంటారు. "

అన్నాడు యాంకర్

" అవును. నాకు ధృవ్ పాడుతుంటే ఆ వయసులో నేను పాడినట్టే అనిపిస్తుంది , కానీ ధృవ్ ఎవరిని ఇమిటేట్ చెయ్యడు .

నాకంటే చాలా బాగా పాడతాడు. నిజానికి నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు నాకు సంగీతం రాదు. తరవాతే నేర్చుకున్నాను.

కానీ ధృవ్ ముందు నుంచి సంగీతం నేర్చుకున్నాడు. ఆ తేడా తెలుస్తుంది.

ధృవ్ పాట మొదలు పెట్ట గానే స్టేడియం అంతా నిశ్శబ్దం గా అయింది.

పాట అవగానే రాజా " శభాష్ "అని చప్పట్లు కొట్టి వచ్చి ధృవ్ ని కౌగిలించుకున్నాడు.

ధృవ్ అతని కాళ్ళకి దణ్ణం పెట్టాడు.

" ధృవ్ , చాలా బాగా పాడావు . ఈ స్టేజి మీద చెపుతున్నాను. టైటిల్ వచ్చినా, రాకున్నా,

నా నెక్స్ట్ సినిమా కి పాటలు అన్ని ధృవ్ పాడతాడు. " అన్నాడు ధృవ్ భుజం మీద చేయి వేసి.

మళ్ళీ స్టేడియం లో పది నిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు .

రాజా ఆపమని చేయి చూపించి. " ధృవ్ మీ పేరెంట్స్ వచ్చారా ? అడిగాడు.

వచ్చారు సర్ " అని ఇద్దరినీ చూపించాడు .

రమేష్, జయంతి లేచి నించోగానే ,

రాజా "మీరు చాలా అదృష్టవంతులు. మీకు సరస్వతీ పుత్రుడు పుట్టాడు. మామూలుగా తల్లి నుంచో , తండ్రి నుంచో ఈ సంగీతం వస్తుంది. మీలో ఎవరు పాడతారు? "అడిగాడు.

రమేష్ నవ్వుతూ "మాకు ఇద్దరికీ సంగీత జ్ఞానం శూన్యం " అన్నాడు.

ధృవ్ ,రాజా తో " సర్ , ఈ స్టేజి లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను.

మీరు పెర్మిషన్ ఇస్తే " అన్నాడు.

రాజా " తప్పకుండా"

ధృవ్ , రమేష్ ని ,జయంతి ని ,స్టేజి మీద కి పిలిచాడు.

ఇద్దరినీ చెరోవైపు పట్టుకుని

"సర్ , వీళ్ళు నా కన్న తల్లి తండ్రులు కారు.

నన్ను నా తల్లి కని హాస్పిటల్ లోనే వదిలి ఎవరికైనా దత్తత కి ఇమ్మని లెటర్ రాసి వెళ్ళిపోయింది.

వేరే పని మీద హాస్పిటల్ కి వచ్చిన వీళ్ళు, నన్ను పెంచుకున్నారు. "

"ఒకవేళ వీళ్ళు నన్ను వద్దు అనుకుంటే , నేను రోడ్ మీద అడుక్కుంటూ పాటలు పాడుకునే వాడినేమో ?

కానీ అలా జరగకుండా వీళ్ళు నన్ను కాపాడారు. "

"అమ్మా ,నాన్నా మళ్ళీ జన్మ ఉంటే మీ కడుపున పుట్టాలి ,

నేను ఏమి చేసినా మీ ఋణం తీరదు. " ఏడుస్తూ అన్నాడు ధృవ్.

ఆ మాటలు వింటున్న రమేష్ జయంతి ఇద్దరు కూడా కళ్ళలోంచి నీళ్లు కార్చారు.

వాళ్లే కాదు అక్కడ ఉన్న వాళ్ళ అందరి కళ్ల లోంచి నీళ్లు కారాయి.

ఇది చూసిన రాజా ". ఐ అయామ్ సారీ , మీ అందరిని బాధ పెట్టాను " అన్నాడు .

"లేదు సర్ , నేను ఎప్పుడు అమ్మ, నాన్న కు నా మనసులో ఉన్న కృతజ్ఞత చెప్పలేదు . మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాలి "

మంచి trp రేట్ పెంచే అవకాశం వచ్చినందుకు హుషారు పడుతూ యాంకర్ ధృవ్ ని అడిగాడు.

" ధృవ్ నేను ఇలా అడిగినందుకు మరోలా అనుకోకు. సపోజ్ ఇప్పుడు నీ కన్న తల్లింతండ్రులు వచ్చారనుకో? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది ?

"ఎలా ఉంటుంది ? మర్యాద గా ఉంటుంది. "

"వాళ్ళు నన్ను వదిలేయబట్టి, నేను ఇలాంటి దేవుళ్ళ దగ్గర పెరిగాను. అందుకు వాళ్లకు థాంక్స్ చెప్తాను ,ఇంకా గుడ్ బై చెప్తాను " అన్నాడు నవ్వుతూ.

అందరూ ఊహించినట్టు ధృవ్ టైటిల్ గెలుచుకున్నాడు.

టైటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ పేరెంట్స్ ని స్టేజి మీదకు పిలిచారు.

వాళ్లతోపాటు ప్రణతి కూడా వచ్చింది. "మీ అబ్బాయి గూర్చి ఒక్క మాట లో చెప్పండి అంటే

ఏమి చెప్తారు " అడిగాడు యాంకర్.

" మా అబ్బాయి ధృవ్, ధ్రువ నక్షత్రం "అంది జయంతి

స్టేడియం చప్పట్ల తో దద్దరిల్లింది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి