నీలాంబరి - రాము కోలా దెందుకూరు.

Neelambari

పేద,ధనిక తారతమ్యం లేని కర్మభూమిలో మరో కొత్త సభ్యుడు చేరాడేమో! చకచకా నిర్మాణం జరిపించి క్రొత్తగా రంగులు వేసారు.రాత్రికి రాత్రికే.. మూడునాళ్ళ ముచ్చటే ఇది జనాల మెప్పు కోసం. అని వారికి తెలిసికూడా. ఇలా జరగడం,నేను చూడడం నాకు కొత్త కాదు.. ఎందరో వస్తున్నారు,సమూహం నిండిపోతుంది. సర్దుకు పోవడం అలవాటు చేసుకుంటున్నా. వేసిన రంగులు నాశి రకమేమో ! ఒక రకమైన వాసన ,ఊపిరి సలపనివ్వడం లేదు. కాస్త గాలి పీల్చుకోవాలి అనిపించిందేమో బాహ్య ప్రపంచం లోనికి వచ్చింది నీలాంబరి , తను ఉంటున్న ఆరు అడుగుల ఇరుకు స్థలం నుండి. దూరంగా ఆకులు రాలి తన లాగే మోడు వారిన చెట్టు దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తూన్న గంగమ్మను చూసి గుర్తు పట్టినట్లుగా .... "నువ్వు నువ్వు గంగమ్మవు కదు" ...అడగలేక అడిగింది నీలాంబరి. ఎన్ని రోజులు అవుతుంది .నువ్వు ఇక్కడికి వచ్చి, మనిషి కంటే అప్యాయంగా పలకరించింది నీలాంబరి "వారం అవుతుంది. అదిగో దూరంగా సాగిపోతున్నాడే వాడే నా గారాల సుపుత్రుడు .. ఉన్న ఆస్తి మొత్తం వాడి చేతిలో పెట్టాను. నన్ను అనాధశరణాలంలో పెట్టాడు. అక్కడ ఎలుకలు కొరికి,ఇదిగో ఇలా ఇక్కడికి చేరాను. నిట్టూర్పు వదిలింది గంగమ్మ. "నిన్ను ఆశ్రమంలో నైనా చేర్చారుసంతోషించాల్సిన విషయం. నా కూతురు అది కూడా చేయలేదు, వీధిలోకి గెంటి వేసింది,ఏ దిక్కు లేక ఊరు బయట రావి చెట్టు నీడన తల దాచుకుంటూ తనువు చాలించా. మున్సిపాలిటీ వారు కనికరించి ఇక్కడ జాగా చూపించారు సర్దుకుంటున్నా పిల్లల్ని కనగలమే కానీ! వృద్దాప్యంలో ఎందుకు మిమ్మల్ని పోషించ లేరని అడగ లేము కదా... ఆస్తులు పంచినా అస్థికలు కూడా కలపలేక పోతున్నారు. మనకు విముక్తి లేదు. ఎన్ని రోజులు ఇలా ఆత్మ రూపంలో ఇలా గడపాలో " నిట్టూర్చింది నీలాంబరి. దూరంగా మేళా తళాలతో ఎవరినో మోసుకొస్తున్నారు. మరుభూమిలో కాస్త జాగా కావాలంటూ...

మరిన్ని కథలు

Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్