సాహిత్యం ఒక ఆయుధం.! - గిద్దలూరు సాయి కిషోర్,రాయదుర్గం.

sahityam oka ayudham

చిన్నప్పుడు నుండి కథలు,కవితలు రాస్తున్నాడు సాయి. నడుస్తూ నడుస్తూ వాళ్ళ గ్రామం నుండి పట్టణానికి వచ్చాడు. పట్టణానికి వచ్చినట్టు కూడా తెలిదు సాయికి. పట్టణం నుండి రాష్ట్రం border కూడా వచ్చేసింది.

ఎవరో ఎదో అన్నారని తను రాలేదు. బయలుదేరుతూ తను దారిలో ' జీవించడం చాలా కష్టం ' అనే నినాదాలతో హోరెత్తించాడు.అక్కడ ఉన్న జనాభా మొత్తం ఎగాదిగా చూశారు.తను ఏ మాత్రం పట్టించుకోకుండా మార్గాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాడు.వెళ్తూ, వెళ్తూ ఓ ఋషి కనిపిస్తూ నాయన నీవ్వు మహా వ్యక్తివి నాకు తెలుసు కానీ దిగులు చెందాకు అని ఆశీర్వాదం ఇచ్చాడు కానీ గుర్తుంచుకో కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఫలితం ఖచ్చితంగా ఫలిస్తుంది.సాయి అదే కదా సామి జీవించడానికి నాలుగు సూత్రాలు ఉన్నాయి ఒకటి మనం చేసే పనులు, రెండు మనకు మనమే ద్వేషించుకోవడం, మూడు బ్రతకాలంటే డబ్బు ఉండాలి ,నాలుగు నలుగురితో మంచిగుండాలి ఎందుకంటే నాలుగురు మోయడానికి కావాలి కనుక.అలేగా ధన్యుడా నీకు కావాల్సిన ఆలోచన దొరికే వరకు వేళ్ళు తథస్తు అని అన్నాడు స్వామి. తాను ఆలోచిస్తూ చిన్నప్పుడు గతాన్ని నేమరుసుకుంటూ వెళ్తున్నాడు.

రాసిన కవితను పాఠశాలలో వినిపించాలనుకున్నాడు.గుండె రాయిగా మారింది.అదేంటో తెలియదు.కానీ తొలకరి జల్లు కురిసెలోగా గుండె మొత్తం తనంతకు తాను పని చేసుకుంటుంది..అప్పుడే అనిపించింది నా మనసుకు ఏదో తెలియని మనోవేదన కాబోలు అందుకే వర్షం కురిసెలోగా రాయి కాస్త స్పాంజ్ వలె ఉంది.మరుసటి రోజు పాఠశాలలు తెరుచుకుంటున్నాయి వరసగా ఒక్కొక్కరిని లేపి వాళ్ళ లక్ష్యాన్ని చెప్తున్నారు.ఒకరు పోలీస్ , మరొక విద్యార్థి టీచర్, అలాగే ఎంతో మంది వారి లక్ష్యాన్ని చెప్పుకుంటూ ఒక విద్యార్థి మాత్రం“రచయిత,కవి”అని చెప్పాడు. వాళ్ళ సార్ ఎందుకు నువ్వు సాహిత్యాన్ని ఎన్నుకున్నవు? బయట చాలా దుష్ఫలితాలు జరుగుతున్నాయి సార్..నా అక్షరంతో సమాజాన్ని మార్చుతాను.

నీకు ఏదైనా అర్థాలకు సమాధానాలు తెలుసుకొనుటకు మన తెలుగు ఉపాధ్యాయుడిని కలువు సాయి. సాయి చెప్పిన వాక్యాలు వాళ్ళ స్నేహితులు హేళన చేసేవారు.కానీ సాయి స్నేహితులను ఏమీ అనలేదు.అలాగే తన రచన శైలితో ముందుకు పోతూ మన్ననలు పొందుతున్నాడు.సాయి తెలుగు ఉపాధ్యాయుడు శిక్షణతో కవితా వసంతం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను అని తన మనసులో అనుకున్నాడు.సాయికి అలాగే కథ విశ్లేషణ ఎలా రాయాలో నేర్పించేవారు.సాయి గ్రామంలో సాహిత్య సదస్సు కార్యక్రమం జరుగుతుంది ఎవరికైనా సాహిత్యంపై మక్కువ ఉంటే రావచ్చు అని వేదిక అధ్యక్షులు కోరారు.సాయి వేదిక మీదకు వెళ్ళి కవిత అంటే ఉదయం నుండి రాత్రిలోపు జరిగే దుష్ఫలితాలు కావచ్చు అలాగే మంచిని కోరే ఫలితాలు కావచ్చు అని కంఠాన్ని ఉర్రూతలూగించాడు.“దేహం కాస్త చలనంలేని దేహంగా మారుతుంది ఎప్పుడంటే మనం మరణించినప్పుడే”.అని వారి తెలుగు ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలిపాడు.సాహిత్యం ఒక వస్తువు కాదు ఒక ఆయుధం అని గుర్తించుకోవాలి అని రచయిత సాయి తెలియజేశాడు.

మరిన్ని కథలు

Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం