" చెప్పు రఘూ ఈ సినిమా లో నాకు రోల్ ఉందా లేదా ?" ఆవేశం గా అడిగింది నళిని "నిర్మాత ఏదో ముంబయి హీరోయిన్ అని గొణుగుతున్నాడు.మళ్ళి చెప్పి చూస్తాను .ముంబయి వాళ్ళయితే బడ్జెట్ పెరుగు తుందని " అని మాట్లాడుతూ,డైరక్టర్ రఘు నళిని భుజం మీద చెయ్యి వేస్తూ. చెయ్యిని తీసేసి " ముందు నిర్మాత తో మాట్లాడు " అంది. ********** "సారీ నళిని , నిర్మాత ఒప్పుకో లేదు.ఆ ముంబయి హీరోయిన్ ని ఫిక్స్ చేసాడు.ఈ సారి చూద్దాం " ముంబయి హీరోయిన్ నిర్మాత కు రాత్రి సుఖాన్ని ఇచ్చింది మరి ! "ఏం చూస్తావు నిన్ను నమ్మి నా MBA కెరీర్ వదులుకొని,నీకు రాత్రి అవసరాలు తీరిస్తే ,ఇదా నువ్వు చేసేది " అని ఏడుస్తూ అడిగింది "డోంట్ గెట్ ఇమోషనల్ " అన్నాడు భుజం మీద చెయ్యి వేస్తూ నళిని దూరం గా జరిగింది "నాకు డబ్బు అవసరం ఉంది ,ఓ పాతిక వేలు ఇవ్వు " "అదెలా కుదురుతుంది ? ఒక పని చెయ్యి ఈ సినిమా లో చిన్న వేషం ఉంది.అదేమిటంటే మోసం చేసిన హీరోను చివర్లో మొదటి సారి మోసపోయిన అమ్మాయి పిస్తోలు తో కాలుస్తుంది.ఆ వేషం వేస్తావా ?" అన్నాడు రఘ. "సరే" **********"" ఆ రోజు షూటింగ్. అంతిమ పోరాటం సినిమా ఆఖరి సీన్ ! రఘ చెప్పాడు. లైట్స్,కెమెరా,యాక్షన్ " నీచుడా,నా యవ్వనాన్ని దోచుకొని తప్పించుకుని ఇప్పుడు దొరికావు.నిన్ను వదలను " అని హీరో వైపు పిస్తోలు పెట్టి అంది. "డైలాగ్ డెలివరీ బాగుంది .హీరో వైపు తిరిగి పిస్తోలు ట్రిగ్గర్ నొక్కు " అన్నాడు రఘు ! అప్పుడు జరిగింది అనూహ్య క్షణం నళిని రఘు వైపు తిరిగి నాలుగు సార్లు కాల్చింది. అవి డమ్మీ బుల్లెట్లు కావు ! రఘు నేలకొరిగాడు.నళిని కి రఘ కి యవ్వనాన్ని ఆపాత్ర దానం చేసిన ఆ కాళ రాత్రి గుర్తుకు వచ్చింది END