సఫారీ కూలీ - మద్దూరి నరసింహమూర్తి

Safari kooli

"శుభాభివందనాలు వేణూ, మన ఎం.డి. సెక్రటేరియట్ లో నీకు లైజన్ ఆఫీసర్ గా పోస్టింగ్ వచ్చింది అని తెలిసింది. చాలా సంతోషం. మంచి పార్టీ ఇవ్వాలి మరి. నువ్వు హ్యాపీ కదా" అంటున్న హరి మాటకి అడ్డు వస్తూ --

"సంవత్సరానికి మూడు సఫారీ సూట్లు, రెండు ఉలెన్ సూట్లు, మూడు జతల బూట్లు, రెండు రెయిన్ కోట్లు మాత్రమే కాక ఐ ఫోన్, ఆఫీస్ లో పని చేసుకుందికి కంప్యూటర్, లాప్టాప్ కూడా ఆఫీస్ ఇస్తుంది. అన్నింటికన్నా రెండు కార్లు అతని చేతిలోనే ఉంటాయి. మనం ఎం.డి. ని కలవడం మాట దేముడెరుగు చూడడమే అరుదు. అటువంటిది మన వేణు ఎం.డి. ని రోజులో ఎన్నిసార్లు కలుస్తాడో లెక్కేలేదు. అలా రెండేళ్లు పని చేస్తే, ప్రమోషన్ గ్యారంటీ. ఇన్ని సదుపాయాలూ ఉంటూంటే, ఎందుకు హ్యాపీ ఉండదూ" అన్నాడు గోపి.

"ఏమోరా - ఆ పోస్ట్ కి నా పేరు ఎవరు ప్రొపోజ్ చేసేరో కానీ, ఒక పక్క ఆనందంగా మరో పక్క భయంగా ఉంది" అన్న వేణు భుజం తడుతూ ఇద్దరు స్నేహితులూ --

"భయం ఎందుకురా, బాస్ చెప్పిన పని చక్కగా త్వరగా చేస్తావు అని నీకు చాలా పేరుంది కదా. అందుకే మన పర్సనల్ డిపార్ట్మెంట్ వారు నిన్ను అక్కడ వేసేరు. హాయిగా రెండేళ్లు గడిపేసి మాకే బాస్ గా వస్తావేమో నువ్వు, ఎవరు చూడొచ్చేరు"

"పొండిరా మీరు మరీను"

ముగ్గురూ హాయిగా నవ్వుతూ దగ్గరే ఉన్న హోటల్ లోకి వెళ్ళేరు.

వేణు తన క్రొత్త ఉద్యోగంలో చేరడానికి మర్నాడు ఎం.డి. సెక్రటేరియట్ కి వెళ్ళేడు.

అక్కడున్న ఎం.డి. ప్రైవేట్ సెక్రటరీ, వేణుని ఎం.డి. సెక్రటేరియట్ లో చేర్చుకొని, వేణు రాకతో బదిలీ అవబోయే శేఖర్ ని పిలిచి -

"శేఖర్ ఇగో ఇతనే వేణూ, మీ సీట్ లోకి వచ్చేరు. మీ పనులన్నీ రెండు రోజులలో అతనికి నేర్పి మూడో రోజు లేదా నాలోగో రోజు మీరు బదిలీ మీద వెళ్ళిపోవొచ్చు. ఈరోజు ఎం.డి. గారు లేరు. కాబట్టి, రేపుదయం వేణుని తీసుకొని వెళ్లి ఎం.డి. గారికి పరిచయం చేసి మిమ్మల్ని బదిలీ మీద ఏరోజు వెళ్ళిపోవొచ్చంటారో కనుక్కొని నాకు చెప్తే, మీ బదిలీ కాగితాలు తయారు చేస్తాను. వేణూ, ఇతనితో వెళ్లి త్వరగా మీ పని నేర్చుకోండి" అని వేణుని శేఖర్ తో పంపించేడు.

శేఖర్ తో వెళ్తున్న వేణుకి ఆ క్షణంలో ఎందుకో పులి బోనులోకి వెళ్తున్నట్టుగా అనిపించి తెలియని భయం ఆవహించింది.

ఆరోజు శేఖర్ వేణుకి అతను చేయవలసిన పనులన్నీ భోధపరచి వేణుకి వచ్చిన సందేహాలన్నీ తీర్చేడు. దాంతో వేణుకి కొంత ధైర్యం వచ్చింది.

ఆరోజు సాయంత్రం వేణు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు శేఖర్ –

-2-

"ఎం.డి. గారు లేనప్పుడు మాత్రమే ఈ సమయానికి మీరు ఇంటికి వెళ్లగలిగేది. ఆఫీస్ కి వచ్చే ముందర చేయవలసిన పనులే కాక ఆయన ఆఫీస్ నుంచి వెళ్లిన తరువాత చేయవలసిన పనులు కూడా ఉంటాయి.

కాబట్టి నా సీట్ లో మీరు కూర్చున్న దగ్గర నుంచి మీరు ఏ సమయంలో ఏ పని చేయాలి అన్నదే తప్ప ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా అని ఆలోచన ఉండకూడదు. బై ది బై మీకు పెళ్లయిందా"

"లేదండీ, ఎందుకలా అడిగేరు"

"పెళ్ళికాలేదు కాబట్టి అదృష్టవంతులే. పెళ్ళైతే, మీ భార్యకి మీకోసం ఎదురు చూడవద్దని బోధపరచాలి"

"అంత పని ఒత్తిడి ఉందంటారా"

"ప్రతీదీ ఇలా ఉంటుంది అని మీకు ముందుగా ఇప్పుడే చెప్పడం కుదరదు. మీకు అన్నీ అనుభవం మీద తెలుస్తాయి"

"సరే"

"రేపుదయం ఎనిమిదో గంటకే మీరు నా సీట్ దగ్గర ఉండాలి"

"మన ఆఫీస్ 10 కి కదండీ"

“అటువంటి నియమం ఆదివారం సెలవురోజు పండుగరోజు లాంటివి మన సీట్ కి లేవు, గుర్తుంచుకోండి. గుడ్ నైట్" అని నవ్వుతూ వెళ్లిపోయిన శేఖర్ వేపు చూస్తున్న వేణుకి ఒక్క క్షణం ఈ పనిలో ఎలా నెగ్గుకు రాగలగానా అన్న భయం వేసింది.

ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకుందికి ఉపక్రమించిన వేణుకి నిద్ర రాకుండా తన క్రొత్త ఉద్యోగం గురించి శేఖర్ కి తనకి మధ్యన జరిగిన మాటలు జ్ఞాపకం రాసాగేయి.

"లైజన్ ఆఫీసర్ కి ఇతరులు చేసే ఆఫీస్ పనిలాంటివి ఏవీ ఉండవు. ఎం.డి. గారి కుటుంబ సభ్యులను, ఆయనను కలవడానికి వచ్చే ఆఫీస్ వ్యక్తులే కాక, ఆయన స్వంత మనుషులు అనగా స్నేహితులు మరియు బంధు జనం -- వీరందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి", అన్న శేఖర్ తో ---

"జాగ్రత్తగా చూసుకోవాలి అంటే - కొంచెం విడమరచి చెప్తారా" అడిగేడు వేణు.

"నేను చెప్పినవారిలో ఎవరేనా ఈ ఊరికి వచ్చినప్పుడు, వారు వచ్చే ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ వచ్చే సమయానికంటే ముందుగా చేరుకొని వారిని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి, వారితో పాటూ వారు తెచ్చే సామాను ముఖ్యం. ఆ సామానులు పైకి తేవడానికి ఏదేనా కారణం చేత కూలీ దొరకకపోతే, మనమే తేవాలి. వారిని వారి సామానులని వారి గమ్యంకి క్షేమంగా చేర్చాలి. అక్కడ వారు సౌఖ్యంగా ఉండే ఏర్పాట్లు ముందుగానే చేసి ఉంచాలి. వారు ఉన్నన్నాళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. వారు ఈఊరిలోకాని పైఊరిలోకానీ ఎక్కడికైనా తిరిగిరావాలనుకుంటే, తగిన ఏర్పాట్లు చేయాలి. వారిని వెంటంటే ఉండి, అవసరమైనప్పుడు కూలీగా అవతారం ఎత్తుతూ, వారు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దిగపెట్టాలి"

-3-

"మనం కూలీగా మారడమేమిటి"

"వారందరూ ఎం.డి. గారి మనుషులు కాబట్టి, ఎం.డి. గారికి సేవ చేసినట్టే భావించాలి. ఏ మాత్రం తేడా వస్తే, వారు మన మీద ఎం.డి. గారికి పిర్యాదు చేస్తే, మన పని అంతే"

"ఇన్ని పనులు చేయడానికి ఒక్క మనిషికి ఎలా వీలవుతుంది"

"తప్పదు మరి. ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి ఎవరి మీద ఆధార పడవచ్చు అన్నది మనమే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఖర్చుకి వెనకాడ కూడదు. అలాగని దుబారా చేయకూడదు. చేసే ప్రతీ ఖర్చు తప్పనిసరిగా చేయవలసి వచ్చినట్టుగా కనబడాలి"

"మీరు ఇప్పుడు చెప్పినవన్నీ వింటూంటే మనల్ని ‘లైజన్ ఆఫీసర్’ అనడం కంటే ‘సఫారీ కూలీ’ అంటే సరిపోతుందేమో" అన్నాడు వేణు నవ్వుతూ.

"అలా మనల్ని మనమే దిగజార్చుకుంటే పైవారు ఇంకా చులకనగా చూస్తారు. కాబట్టి ఎంత పని చేస్తు న్నా చిరునవ్వుతో ఇష్టంతో చేస్తే మనకి ఎటువంటి బాధా ఉండదు"

"మీ అనుభవం చూస్తూంటే నేను ఈ పనిలో ఫెయిల్యూర్ గా మిగిలిపోతానేమో అని భయం వేస్తోంది"

"నాకు కూడా కొత్తలో అలాగే అనిపించింది. పోను పోనూ, అందరూ మనల్ని గౌరవంగా చూస్తుంటే చేసే పని తేలికగా అనిపించింది. మీకు అలాగే ఉంటుంది భయపడకండి"

*****

మరిన్ని కథలు

Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు
Ee tappevaridi ?
ఈ తప్పెవరిది ?
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varaahavataram
వరాహావతారం
- చెన్నూరి సుదర్శన్