కురుక్షేత్ర సంగ్రామం.3. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.3

కురుక్షేత్రసంగ్రామం-3.

షడ్గుణాలుగాచెప్పబడేవి.ఆరు,అవి.....1)సంధి 2)విగ్రహం 3)యానం 4)ఆసనం 5)ద్వెైదీభావం, 6)సమాశ్రయం.శత్రువుకుఉన్నబలం తనకులేనప్పుడు శత్రువుతో సఖ్యం చేయడాన్ని'సంధి'అంటారు. శత్రువుకన్న తనకు ఎక్కువబలం ఉన్నప్పుడు యుధ్ధం ప్రకటించడాన్ని'విగ్రహం'అంటారు.బలంఅత్యధికంగా ఉన్నప్పుడు దాడి చేయడాన్ని'యానం'అంటారు.సమానబలంకలిగి యుధ్ధం చేయడానికి నిరీక్షించడాన్ని'ఆసనం'అంటారు.ఇతరరాజుల సహయం పొందడాన్ని 'ద్వెైదీభావం'అంటారు.బలంకోల్పోయినపుడు శత్రుధనాన్ని పీడించడాన్ని'సంశ్రయం'అంటారు.

మూడవ రోజు యుద్ధంలో భీష్ముడు గరుడ వ్యూహాన్ని రచించాడు. వ్యూహపు అగ్రభాగాన భీష్ముడు స్వయంగా తానే ఉండగా, వెనుక భాగాన్ని దుర్యోధనుడు ససైన్యంగా కాపు కాసాడు. దీనికి ప్రతిగా పాండవులు అర్థచంద్ర వ్యూహాన్ని రచించారు. వ్యూహపు రెండు కొనలను భీమార్జునులు రక్షిస్తున్నారు. కౌరవులు అర్జునునిపై దాడిని కేంద్రీకరించారు. అర్జునుడి రథం శత్రువుల బాణాలు, బల్లేల వర్షంలో మునిగిపోయింది. ఆ దాడిని ఎదుర్కుంటూ అర్జునుడు తన బాణాలతో రథం చుట్టూ కోట నిర్మించాడు. అభిమన్యుడు, సాత్యకి కలసి శకునికి చెందిన గాంధార సేనలను ఓడించారు. భీముడు, అతడి తనయుడు ఘటోత్కచుడు కలిసి కౌరవసేన వెనుక భాగంలో దుర్యోధనుని ఎదుర్కొన్నారు. భీముడి ధాటికి దుర్యోధనుడు తన రథంలో మూర్ఛిల్లాడు. వెంటనే అతడి సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయి, దుర్యోధనుని ప్రమాదం నుండి తప్పించాడు. దుర్యోధనుడి రథం యుద్ధభూమి నుండి వెళ్ళిపోవడం గమనించిన అతడి సేనలు చెల్లాచెదురు కాసాగాయి. భీష్ముడు అక్కడికి చేరుకుని తిరిగి వారిలో విశ్వాసం నెలకొల్పాడు. దుర్యోధనుడు కూడా కొద్ది సేపటికి తిరిగి అక్కడికి చేరుకున్నాడు. పాండవుల పట్ల భీష్ముడు మృదువుగా వ్యవహరిస్తున్నాడనే భావనతో కినుకతో ఉన్న దుర్యోధనుడు అదే విషయాన్ని భీష్మునికి చెప్పాడు. ఈ అసత్య ఆరోపణతో బాధపడ్డ భీష్ముడు మరింత క్రోధావేశంతో పాండవసేనపై విరుచుకుపడ్డాడు. యుద్ధభూమిలో అనేక మంది భీష్ములు ఉన్నట్లుగా తోచింది. పాండవసేనలో కలకలం మొదలై వారు వెనక్కి తగ్గారు.

తమ సేనలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు కృష్ణార్జునులు భీష్ముని ఎదుర్కొన్నారు. అర్జునుడు, భీష్ముడు తీవ్రమైన ద్వంద్వ యుద్ధం చేసారు. స్వయానా తన తాతపై చేస్తున్న యుద్ధం కావడంతో అర్జునుడు యుద్ధంపై మనసు నిలుపలేకపోయాడు. భీష్ముని ధాటికి అర్జునుడు ఆగలేకపోతున్నాడని గ్రహించిన కృష్ణుడు ఆగ్రహించి, భీష్ముని సంహరించేందుకు స్వయంగా తానే రథం దిగి, చక్రధారియైనాడు. వెంటనే భీష్ముడు కృష్ణుడి పాదాలపై పడి ఆ పరమాత్ముడి చేతుల్లో మరణించడం కంటే మహర్దశ మరొకటి లేదని చెబుతూ తనను సంహరించమని వేడుకున్నాడు. కృష్ణుడు శాంతించి వెనక్కి మరలగా, భీష్మార్జునుల యుద్ధం తిరిగి మొదలైంది. వారిద్దరూ శత్రుసైన్యంలోని అనేకమంది వీరులను సంహరించారు.

మహభారత యధానికిముందుసంధి ప్రయత్నాలు ఫలించలేదు.కృష్ణుడు-అర్జునునికి,అభిమన్యునికి-సుమిత్రుడు,కర్ణునికి-శల్యుడు,భీమునికి-విశోకుడు,ధర్మరాజుకు-ఇంద్రసేనుడు.రథసారధులుగా ఉన్నారు.యుధ్ధలో

మూర్చితులైన ప్రద్యుమ్నుడు ,రుక్మరధుడు, దుర్యోధనుడు,శల్యుడు , ద్రుపదుడు,సాత్యకి,భీముడు,దుశ్యాసనుడు,సోమదత్తుడు,విరాటుడు,అశ్వత్ధామ,ఉత్తమౌజుడు,శకుని వంటివారలను,వారిరధసారధులే రక్షించారు.

కురు,పాండవులుతమ, తమ సైన్యంలో ,మౌలబలం,భృతబలం, శ్రేణీబలం,సుహృద్ బలం,ద్విషద్ బలం, అటవీబలాలతోపాటు, రథ,గజ,తురగ,పదాతులైన చతురంగబలాలను, కురు,పాండవులు సమీకరించుకున్నారు. భీష్ముడు గరుడవ్యూహంతో ద్రోణాచార్యుడు, కృతవర్మ నేత్రస్ధానాలలో, కృపాచార్యుడు, అశ్వధ్ధామ శీర్షభాగంలో, భూరిశ్రవ, శల్య,భగదత్త,సౌధవుడు కంఠసీమలో, సోదరసమేతుడైన రారాజు పృష్టభాగంలో,మగధ,కళింగయోధులు దక్షణపక్షంలో, నాసికాభాగాన భీష్ముడు నిలిచాడు.ఇంకా గర్బభాగాన, కాంభోజరాజు సుధక్షణుడు, బాహ్లీకునిపుత్రుడు సోమదత్తుడు,త్రిగర్తరాజు సుశర్మ,శకుని, అవంతీయులు విందానవిందులు,శల్యునిపుత్రుడు రుక్మరధుడు, మహిష్మతిరాజు నీలుడు,కర్ణునికుమారుడు చిత్రసేనుడు, దశార్ణరాజు సుధన్వుడు,శకునితమ్ముడు వృషకుడు, అచలుడు, అశ్మీకుడు,ధృవుడు, బుధ్ధుడు,జయరాతుడు,పౌరవుడు,ఉగ్రుడు, చంద్రకేతుడు,దండధారుడు, దీర్ఘాయువు,బలాధ్యుడు,సౌవీరుడు కుంజరుడు మొదలగు కౌరవ వీరులు నిలిచారు.

అర్ధేందు వ్యూహంతో పాండవ సేనలు నిలువగా,దానిదక్షణాన భీముడు మహరథులతో నిలిచాడు.వామపక్షన అర్జనుడు నిలిచాడు.ఇంకా అభిమన్యుడు,విరాటుడు,ఘటోత్కజుడు,చేకితానుడు,శతానీకుడు,సత్యజిత్తు,ప్రద్యమ్నుడు,ప్రతివింధ్యుడు,శ్రుతకీర్తి,శతానీకుడు,శ్రుతసేనుడు,

కేయరాజులు ఐదుగురు,శ్రుతశోముడు ,దుష్టకేతు ,సాత్యకి,ఉత్తమౌజుడు, శిఖండి,వృకుడు,వసుదాసు,నీలుడు,సేనాబిందుడు,ఉగ్రాయుధుడు,వార్ధక్షేమి,జయుడు,ద్రుమసేనుడు,సూర్యదత్తుడు,ముదిరాక్షుడు,శంఖుడు,వీరకేతుడు, యుగంధరుడు వంటివీరులు నిలిచారు. అర్జునుడు తన శంఖం దేవదత్తంపూరించాడు. ప్రళయకాలరుద్రునిలా కౌరవ సేనలను తురమసాగాడు.అర్జునుని చక్రరక్షకులుగా (రథాన్నికాపాడుతుండేవారు) .మహరథులైన'యుధామన్యుడు' 'ఉత్తమౌజుడు'ఉన్నారు. ద్రోణ,భీష్మ, శల్య, శకుని,సౌధవులధాటికి పాండవసేనలు కంపించసాగాయి .ఘటోత్కజుని ధాటికి దుర్యోధనుడు మూర్చపోయాడు.అర్జనునితో పోరాటానికి వచ్చిన,ద్రోణ ,కృతవర్మ, జయద్రధ,కృపాచార్యులను వైతోలగమని భీష్ముడు అర్జునునిపై శరవర్షం కురిపించగా, భీష్ముని చేతిలో ధనస్సులు వరుసగా ఛేదించసాగాడు అర్జునుడు,భీష్ముని శరాలకు కృష్టార్జనులు మందారపుష్పాలవన్నెలో కనిపించారు.ఆనిటి యుధ్ధంలో. సాత్యకి,అభిమన్యులు శకునితో,పోరాడుతున్న సమయంలో సూర్యుడు పడమటి కనుమల్లోకి వెళ్ళాడు.

అలా యుద్ద విరామం ప్రకటించారు.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి