అంతా మంచికే - కొడాలి సీతారామా రావు

Antaa manchike

ఆర్టీసీ కధలు 4 అంతా మంచికే -కొడాలి సీతారామా రావు మారుతీ రావు గారు ఇరవయ్యేళ్ళ కిందట డిపో మేనేజరుగా ఆర్టీసీలో చేరారు. చేరిన నాటి నుంచి తను పనిచేసిన ప్రతి డిపోలో తన ప్రతిభతో లాభాలతో నడిపించటం, అనేక సార్లు చాలా విషయాలలో ఆ డిపోలకు బహుమతులు,అవార్డులు అందుకోవటం జరిగింది. ఏ డిపోలో పనిచేసినా ప్రయాణీకుల అవసరాలకి తగినట్టు బస్సు సౌకర్యం కలిగించటం. ఇంధనం పొదుపు, వాహన వినియోగం,వాహనాలు శుభ్రంగా వుండటం, ప్రయాణీకుల సంఖ్య పెరిగేలా చేయటం, డిపో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటం వగైరా విషయాలలో శ్రధ్ధ తీసుకునే వారు. బస్ స్టాండ్ లో, గేరేజీలో చక్కటి మొక్కలు పెంచటం ద్వారా ఒక ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత డివిజనల్ మేనేజరుగా ప్రమోషన్ పొంది ఆ డివిజన్ లో వున్న అన్ని డిపోలు శ్రధ్ధగా గమనించడమే కాక లోటు పాట్లు ఏమైనా వుంటే చక్కటి సూచనలు చేస్తూ వుండేవారు. కార్మికులు, డిపో మేనేజర్లు అనేక రంగాలలో బహుమతులు అందుకోవటం జరిగింది.

అలా రెండేళ్ళు పనిచేశాక ఆయనని కాకినాడ డివిజన్ కి పంపారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో డ్రైవర్ల నియామకం చేయవల్సి వచ్చింది. నైపుణ్యం ఆధారంగా వారి ఎంపిక జరిగింది. ఐతే అక్కడి స్థానిక మంత్రి వారికి చెప్పాడు తనకి సంబంధించిన వారిని ఎంపిక చేయమని. మారుతి రావు గారు అంగీకరించలేదు.మంత్రి గారు చెప్పిన వారికి డ్రైవింగ్ సరిగా రాదు అని చెప్పారు. అలా డ్రాఫ్ట్ లిస్ట్ తయారైంది. ఆ లిస్ట్ స్టెనో, అసిస్టెంట్ మేనేజరు తనికీ చేసి ఆయనకి చూపారు. మొత్తం 100 మంది. మరునాడు ఫైనల్ లిస్ట్ సంతకం పెట్టారు ఆయన. ఐతే అందులో రెండు పేర్లు ముందున్న లిస్టులోవి తీసేసి వేరే రెండు పేర్లు కలిపారు. మారుతి రావు గారు తన సూపర్ వైజర్ల మీద నమ్మకంతో సంతకం పెట్టారు. అందరికీ నియామక ఉత్తర్వులు పంపారు. ఆ లిస్ట్ ఇతర అధికారులకి వెళ్లింది. అప్పుడు తప్పించిన పేర్ల వారు ఫిర్యాదు చేశారు. అప్పుడు గమనించారు ఆయన. వెంటనే స్టెనోని,అసిస్టెంట్ మేనేజరుని సస్పెండ్ చేశారు. ఐతే స్థానిక మంత్రిగారు ఆ విషయం పెద్దదిగా చేసి కొందరు వ్యక్తులతో ఆందోళన చేయించారు. ఎం డీ గారు మారుతి రావు గారిని వివరణ అడిగారు. ఆయన చెప్పిన సమాధానం వారికి నచ్చినా తప్పని పరిస్థితులలో వారిని రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఆయనకి పూనాలోని ట్రాన్స్ పోర్ట్ అకాడెమీలో ప్రిన్సిపాల్ గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఆ తరువాత ఆయన జీవితమే మారి పోయింది. ఆ నియామకానికి కారణం తమ ఎం డీ గారే అని తరువాత తెలిసింది. ఆ సంస్థలో పనిచేస్తున్నపుడు ఆయన అనేక పరిశోధన పత్రాలు ప్రచురించారు. అలా ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా అనేక యూనివర్శిటీల నుంచి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆహ్వానాలు అందాయి. అలా అనేక దేశాలకి వెళ్లారు రిటైర్ అయ్యాక కూడా. ఆ తరువాత రవాణా శాఖ సలహా దారుగా భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలు కొనసాగించింది. చివరికి ఆయనే సచ్చందంగా ఆ పదవులని వదులుకున్నారు. ఆయనకి ద్రోహం చెయ్యాలనుకున్న వారి ఆలోచనలు ఆయనకి మేలే చేకూర్చాయి@

మరిన్ని కథలు

Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్
Grahanam pattina chandrudu
గ్రహణం పట్టిన చంద్రుడు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Ante..Nenu?
అంటే!... నేను!?.
- రాము కోలా. దెందుకూరు
Prajaswamyanike naa Otu
ప్రజాస్వామ్యానికే నా ఓటు
- రాపాక కామేశ్వర రావు
Srivarante maavare
శ్రీవారంటే మా వారే
- సి.హెచ్.ప్రతాప్
KOusikuniki Gnanodayam
కౌశికునికి జ్ఞానోదయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Saswathamainadi?
శాశ్వతమైనది ??
- సి.హెచ్.ప్రతాప్