అవంతిని పాలించే గుణశేఖరుడు,భువనగిరిని పాలించే జయంతుడు బాల్యమిత్రులు ఇరువురు సదానందుని ఆశ్రమంలో విద్య నేర్చిన వారే.
ఒకరోజు గుణశేఖరునినుండి వర్తమానం వచ్చింది అందులో వచ్చేపౌర్ణమిరోజు తను సదానందుని ఆశ్రామానికి వెళుతున్నానని నువుకూడా వస్తే కలసివెళ్ళి సదానందుని ఆశీర్వాదం పొందివద్దాము అని ఉంది.
పౌర్ణమి నాడు మిత్రులు ఇరువురు సదానందుని ఆశీర్వాదం పొంది ,ఆశ్రమ నిర్వాహణకు పెద్దమొత్తింలో ధనం అందజేసిన అనంతరం " గురు దేవా తమకు మరేదైనా కోరిక ఉంటే తెలియజేయండి మేము తప్పక తీరుస్తాము "అన్నాడు గుణశేఖరుడు.
"గురు దేవ మాతల్లితండ్రి దేహన్ని మాత్రమే ఈచ్చారు తమరు జ్ఞానాన్ని బోధించారు మీకోరిక ఎటువంటిదైనా తప్పక తీరుస్తాం " అన్నాడు జయంతుడు. " నాయనాలారా మీపరిపాలనలో పొదుపు బాట నాకు కనిపించడంలేదు, ధనం ఎంతోవృధా చేస్తున్నారు. విందులు ,వినోదాలకు ప్రజల ధనం వృధాచేయడం తప్పు,మరో ముఖ్యవిషయం మీరు బాల్యమిత్రులు మీమధ్య ఎన్నడు శత్రుత్వం రాదు కదా మీఇరువురికి చాలాపెద్ద సైన్యం ఉంది ,అంతసైన్యం అవసరం ఏముంది? మీసైన్యాలను అవసరం మేరకు తగ్గించుకుని తద్వారా మిగిలేధనంతో మీరాజ్యాలను అభివృధ్ధిచేసుకోవచ్చు,
మీఇరువురి వీరత్వం లోక విదితమే ,కత్తియుధ్ధంలో మిమ్ము గెలవగలిగే వారులేరు ,అవంతిపై ఎవరైనా దాడికి వస్తే జయంతుడు తను అండగా వస్తాడు,జయంతునిపై దాడిజరిగితే గుణశేఖరుడు అండగా వస్తాడు. ఇరువురిపై ఒకేసారి దాడి చేసే ప్రమాదం ఉంది కనుక మీరాజ్యాంలోని ఉత్సహవంతులైన యువకులకు యుధ్ధశిక్షణ ఇవ్వండి ఆపదసమయంలో అవసరాన్నిబట్టి వారిసేవలు మీరు వినియోగించుకోవచ్చు. మరోవిషయం అవంతి,భువనగిరి రాజ్యాలు పక్కపక్కనే ఉంటాయికనుక ,భువనగిరిలో బాగాపండే కందులు, మినుములు,పెసలు,ఉలవలు వంటి చిరుధాన్యాలు అవంతిలో అమ్ముకునేలా,అలాగే అవంతిలో పండే ధాన్యం,పత్తి,మిర్చి వంటి పంటలు భువనగిరిలో అమ్ముకునేలా ఏర్పాటు చేయించండి,వెంటనే రెండు రాజ్యాలమధ్య విశాలమైన ధృఢమైన రహదారి నిర్మించండి, అలాచేయడం వలన వ్యాపారం అభివృధ్ధి చెందుతుంది,ప్రజలకుఅన్నిరకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోనికి వస్తాయి ,మీరు తీర్చగలిగిన గురువు గారి కోరిక ఇదే "అన్నాడు సదానందుడు.
సమ్మతించిన గుణశేఖరుడు,జయంతుడు తమసైన్యాన్ని తగ్గించడంవలన ప్రతిమాసం ధనం పెద్దమొత్తంలో మిగలసాగింది. ఆలామిగిలన ధనంతో పంట కాలువలు,రహదారులు వంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టసాగారు మిత్రులు ఇరువురు.వారి పాలనలో రెండు రాజ్యాల ప్రజలు ప్రజలు సుఖంగా జీవించ సాగారు.

