కొక్కుపంది . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kokku pandi

" అల్లుడు ఇంకా నిద్రలేవ లేదా ? "అన్నాడు కుందేలు. " నిన్నటి నిద్ర పోతున్నా రాత్రి నిద్ర ఈరోజు రాత్రికి పోవాలి. కాల్చిన గనిసి గడ్డలు ఉన్నాయి తిందాం ఉండు " అన్నాడు కోతి. "అల్లుడు అలాగే కొద్దిగా ఉప్పు తీసుకురా "అన్నాడు కుందేలు.కోతి అందించిన ఉప్పు తన నోట్లో వేసుకుని చప్పరించి కిందపండుకుని నాలుగు సార్లు అటు ,ఈటూ పొర్లాడు కుందేలు. " ఎందుకు మామా ఉప్పుతిని నేలపైన అలా దొర్లుతున్నావు "అన్నాడు కోతి . " రాత్రి మీ అత్త పెట్టిన తిండిలో ఉప్పు తగ్గింది అది ఇప్పుడు నావంట్లోకి ఆఉప్పు కలిసేలా చేసా " అన్నాడు కుందేలు.

" ఉంది బాగా దొందే దొందూ, ఒకరు తక్కెడ ఈసుక,మరొకరు తక్కెడ పేడ "అన్నది పిల్లరామచిలుక .చేతిలోని దుంపను కోపంతో విసిరాడు కోతి. " ఉంటా సర్లే కొక్కుపంది " అని వెళ్ళిపోయింది పిల్ల రామచిలుక. " మామా ఈపిల్లరామచిలుక తన మాటల్లోని పదలను వెనుకముందు వేసి మాట్లాడుతుంది దీని మాటలే కాదు. తిట్లుకూడా అర్ధం కావు "అన్నకోతి "

" రామచిలుక నిన్ను పందికొక్కు అన్ని అన్నాడు కుందేలు.

" మామా దానం వలన ప్రయోజనం తెలిసే కథ చెప్పు అన్నాడు కోతి .

" అల్లుడు మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

చతుర్విధ దానాలు అంటే మరణ భయంతోఉన్నవానికి అభయం యివ్వడం, వ్వాధిగ్రస్తునకు సరియైన చికిత్స చేయించడం, విద్యాదానం, అన్నదానం.ప్రత్యుపకారం ఆశించకుండా చేసేదానాన్నిసాత్విక దానం అని,తిరిగి ఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానం అని,తృణీకార భావంతొ చేసేదానాన్ని తామస దానం అని అంటారు.

మూడు రకాలుగా విభజించవచ్చు. తనకుఉన్నదంతా దానంయిచ్చేవాడు దాత. తనవద్దఉన్నదంతాయిచ్చియింకా యివ్వలేక పోయానే అని బాధపడేవారిని ఉదారుడు తనవద్ద లేకున్నా యితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని వదాన్యుడు అంటారు. శిబిచక్రవర్తి.బలిచక్రవర్తి.కర్ణుడు వంటి మహనీయులు మన చరిత్రలో దానమహిమతెలియజేసారు.అటువంటి కథ విను ....

అవంతి రాజ్యాన్నిచంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తూ అడిగినవారికి లేదనకుండా దానం చేస్తు దానం స్వీకరించేవారి పొగడ్తలకుపొంగి గర్విస్ఠిగా మారాడు .ఒకరోజు తనమంత్రి సుబుద్దితొ " మంత్రివర్య నేడు నాలాదానం చేసేవారు ఈభూమండలంలో ఎవరైనా ఉన్నారా ?"అన్నాడు. " ప్రభూ శ్రద్దయాదేయం దానం శ్రద్దతొయివ్వాలి. హ్రియాదేయం గర్వంతోకాక

అణుకువతొ దానం యివ్వాలి.శ్రీయాదేయం ఈదానం వలన నేనేమి కోల్పోను అనుకొవాలి.అశ్రద్దయా దేయం అశ్రద్దతతో దానంచేయరాదు అని పెద్దలు చెపుతారు.ఈరోజు మీకు అటు వంటి దానం చేసేవారిని చూపిస్తాను అని రాజుగారు తను మారువేషాలలో గుర్రాలపై బయలుదేరి చాలాదూరం ప్రయాణం చేసాక నాలుగు రహదారులు కలిసే చోట ఓపెద్ద చెట్టుకింద ఆకలి దాహంతో ఆగారు.అదేచెట్టుకింద కూర్చొనిఉన్నవృద్దుడు తనవద్ద గంపలోని గుగ్గిళ్ళు ఆకులో పెట్టి రాజు మంత్రికి యిస్తూ రెండు ముంతల చల్లటి మంచినీరు వారికి అందిచి " ఆరగించండి బాటసారులు, మీలాంటి వారిఆకలి తీర్చడం కోసమే నేను ఈఉచిత సేవచేస్తున్న " అన్నాడు. ఆకలిదాహం తీరిన రాజు " తాతా నీవు పేదవాడిలా ఉన్నావు యిలా దానం చేయడానికి నీకు ధనం ఎలా వస్తుంది'' అన్నాడు రాజు.

' అయ్య ఆకలికి కులం,మతం,జాతి,భాషా భేదాలు ఉండవు, మాఉరిలో వారం వారం సంత జరుగుతుంది అక్కడ యాచన ద్వారా వచ్చిన ధనాన్ని యిలా సద్వినియోగం చేసుకూంటాను ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే నేను బాగా ఆకలి బాధ అనుభవించిన వాడిని కనుక " అన్నాడు.

ఆయాచకుని దానగుణం చూసిన రాజు గర్వం అణగిపోయి అతనికి కొంతధనం యిచ్చి రాజధాని వస్తుండగా, ఓభిక్షగాడు తను తింటున్న అన్నాని కొంత తన దగ్గరకు వచ్చిన కుక్కకు పెట్టడం చూసి రాజు " మంత్రివర్యా మీరు చెప్పింది నిజమే కుడి చేతితో చేసేదానం

ఎడమ చేతికికూడా తెలియకూడదు ,దానం ఎప్పుడు మూడో వ్యక్తి తెలియకూడదు. దానం డాంబికానికి కాదు అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా" అన్నాడు.

మరిన్ని కథలు

Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ
Mana oudaryam
మన ఔదార్యం
- సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
Swardha poorita pani
స్వార్ధపూరిత పని
- మద్దూరి నరసింహమూర్తి
Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు