కురుక్షేత్ర సంగ్రామం(15).
రామాయణ,మహభారత యుధ్ధాలలో పలు అస్త్రాలు ప్రయోగించ బడ్డాయి. వాటిలో కొన్నింటి గురించి.......
1. పాశుపతాస్త్రం,2. నారాయణాస్త్రం,3. సుబ్రహ్మణ్యాస్త్రం,4. ఇంద్రాస్త్రం, 5. బ్రహ్మాస్త్రం,6. ఆగ్నేయాస్త్రం,7. వారుణాస్త్రం,8. వాయువాస్త్రం, 9. ఈశానాస్త్రం,10. గంధర్వాస్త్రం,11. నాగాస్త్రం,12. గరుడాస్త్రం, 13. అసురాస్త్రం,14. యమ్యాస్త్రం,15. కుబేరాస్త్రం,16. అంధకారాస్త్రం, 17. పర్వతాస్త్రం,18. అక్షాస్త్రం,19. గజాస్త్రం,20. సింహాస్త్రం, 21. మాయాస్త్రం,22. భైరవాస్త్రం,23. మోహనాస్త్రం, శక్తి ఆయుధం వంటివి... అసలు ఈ అకారణ యుధ్ధానికి మూలం
దుర్యోధనుడు. దుర్యోధనుని జననకాలములో నక్కలు ఊళలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్త వర్షాన్ని కురిపించాయి. ఇవి కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు, విదురుడు ధృతరాష్ట్రునికి "రాజా! దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతనివలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము " అని సూచించారు.
ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన. దుర్యోధనుడు అసూయకు మారుపేరు. అతడు పాండవులపై అకారణ శతృత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలము అతనికి భయాన్ని కలిగించింది. అతణ్ణి ఎలాగైనా తుదముట్టించాలనుకున్నాడు. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు, ఒకసారి సారధిచే విష్నాగులతో కాటు వేయించాడు, మరి ఒకసారి విషాన్నాన్నిఘ అక్కడే హతమార్చాలని పథకం వేసాడు. శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతములో లక్క ఇంట్లో ఉంచి వారిని దహించివేయాలని పధకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు. ద్రౌపతి స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జునుని వరించినందుకు కోపించి ద్రుపదునితో యుద్ధానికి దిగి భీమార్జునుల చేతిలో పరాజితుడై వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపొచ్చాలు సృష్టించి పాండవులను తుదముట్టించాలని తలపెట్టి, కర్ణుని సలహాతో వారిని తిరిగి హస్తినకు రప్పించాడు. భీష్ముని సలహా, కృష్ణుని ప్రోద్బలంతో రాజ్యవిభజన జరిగింది. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకుని కృష్ణుని సహాయ సలహాలతో రాజ్యవిస్తరణచేసుకొన్న పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేక పోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో పాండవులను మాయాజూదంలో ఓడించి వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభకు పిలిపించి ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుని నుండి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు.
ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి, తరువాత అజ్ఞాతవాసానికి పంపి వారిని కష్టాలకు గురిచేసాడు. మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడ పగుల కలదని అతడి శాపానికి గురయ్యాడు.
దుర్యోధనుని మరణం భీముని చేతిలో ఉన్నదన్న విషయం దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మీరుని వధ వృత్తాంతం విని, భీముని పరాక్రమానికి వెరచి, అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్ళాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమాన పరచాలన్న దురుద్దేశంతో వచ్చి గంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుంటుంబంగా బందీ అయ్యాడు. తుదకు ధర్మరాజు సౌజన్యంతో, భీముడి పరాక్రమంతో ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్నికూడా అవమానంగా ఎంచి ఆత్మహత్య తలపెట్టాడు. కానీ, రాక్షసుల సలహాననుసరించి ఆత్మహత్యను విరమించుకున్నాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాటరాజ్యం పై దండెత్తి అర్జునిని చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. యుద్దకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించి యుద్ధానికి కాలుదువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకుని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు.
మాయోపాయంతో శల్యుని తనవైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమైనాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుని అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. కౌరవకుల నాశనానికి దుర్యోధనుడు కారణమయ్యాడు. యుద్దప్రారంభంలో దుర్యోధనుడు ద్రోణుని రోషపరిచేలా మాట్లాడటంతో రౌద్రమూర్తిలా ద్రుపద సేనలను తురమసాగాడు.అది చూసిన విరాట ద్రుపదులు,ద్రుపదని పౌత్రులు ,పుత్రులు,కేకేయ పతులు ద్రోణుని పైకి అస్త్రవర్షం కురిపించారు.అసహనంతో ఊగిపోయిన ద్రోణుడు మెదట ద్రుపదుని ముగ్గురు పౌత్రులను,వెనువెంట కేకేయులను యమపురికి పంపాడు.
ఆవేశంగా వచ్చిన ద్రుపద విరాటుల తలలు నేలపాలుచేస్తూ విజయోత్సవంతో శంఖాన్ని పూరించాడు ద్రోణుడు చేతిలో తండ్రిమరణం చూసిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుని తో సమరం సాగించసాగాడు. నకులుడు దుర్యోధనుడు.సహదేవుడు దుశ్యాసనుడు.భీముడు కర్ణుడు.భీకరంగా పోరాడసాగారు.'అర్జునా ధర్మయుద్దంలో ద్రోణుని మనంగెలవడం అసంభవం.అశ్వత్ధామ మరణించాడు అనేవార్త ద్రోణునికి వినిపించేలా ధర్మరాజు చెప్పగలిగితే అప్పుడు ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు అప్పుడు తేలికగా అతన్ని జయించవచ్చు 'అన్నాడు ధర్మరాజు అర్జునుడు అందుకు సమ్మతించక పోయినా,'అశ్వత్ధామ అనే ఏనుగును మన భీముడు ఇందాక సంహరించాడు ద్రోణుడు వినేలా నీవు అశ్వత్ధామ ఏనుగు మరణించింది అను ఏనుగు అనే పదం చాలా చిన్నగా పలుకు నీకు అసత్యదోషం అంటదు' అన్నాడు
శ్రీకృష్టుడు.ధర్మరాజు అలానే ద్రోణుడు వినేలా పెద్దగా 'అశ్వత్ధామ హతః కుంజరః అని చిన్నగాఅన్నాడు. అదివిన్నద్రోణుడు అస్త్రాలువదలి నిశ్చతుడై,యోగనిష్టతో తేజోమయుడైనాడు. అదిచూసిన ధృష్టద్యుమ్నుడు తన చేతిలోని కరవాలంతో ద్రోణుని శిరస్సు ఖండించాడు. అది చూసిన అశ్వత్ధామ పాండవులసేనపై 'నారాయణాస్త్రం 'ప్రయోగించాడు. 'అందరు ఆయుధాలు వదలి నేలపై నిలబడండి' అన్నాడు శ్రీకృష్ణుడు . పాండవ సైన్యం అలానే చేసారు.ఆ అస్త్రం నిరాయుధులను ఏమిచేయలేక అదృశ్యం అయింది. కోపంతో ఆగ్నేయాది వంటి పలు దివ్య అస్త్రాలు ప్రయోగించగా వారిని అర్జునుడు ధీటుగా ఎదుర్కోన్నాడు. అప్పుడు రణభూమిలోనికి వచ్చిన వేదవ్యాసుడు అశ్వత్ధామకు హితం చెప్పి వెళ్లిపోయాడు.సూర్యుడు పడమటి కనుమల్లోచేరగా యుధ్ధవిరామ భేరిలు మోగాయి.యుధ్ధ ఆగిపోయింది.