కురుక్షేత్ర సంగ్రామం.17 - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kurukshetra sangramam.17

కురుక్షేత్ర సంగ్రామం(17) .

కర్ణుడు మరణించడంతో ఎంతో నిరుత్సాహపడ్డాడు దుర్యోధనుడు. అశ్వత్ధామ,కృపుల సలహను తీసుకుని శల్యుని తన సర్వ సైన్యాధ్యక్షుడుగా చేసాడు.

శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు, సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు, సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్ళి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా పాండురాజునే పెళ్ళి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు, యుద్ధ వీరుడు.

శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధమున సాయం చేయుటకు వచ్చుచుండగా దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యునికి, అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి యధిష్టురుడు అనుకుని యుద్ధమున సాయం చేతునని దుర్యోధనునికి మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక దుర్యోధనుని తరపున కౌరవులతో కలసి యుద్ధం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు యధిష్టురుని కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రథసారథి అని తెలిసిన యధిష్టురుడు దుర్యోధనుడు అతనిని కర్ణునికి రథసారథిగా నియమించునని ఊహించెను. అలా అయినచో కర్ణుని యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.

శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి అర్జునునితో యుద్ధము చేయునపుడు రథసారథిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం అనంతరం ....

శల్యుడు కౌరవసేనలను సర్వతో భద్రమైన వ్యూహం రచించాడు.పాండవసేనలు మూడు మొనలుగా కౌరవులను ఢీకొన్నారు.తొలుత నకులుడు కర్ణపుత్రులను యమపురికి పంపాడు. కృపుడు ధృష్టద్యుమ్నునితో పోరాడసాగాడు.శల్యుడు భీముని రథ అశ్వాలను కూల్చడంతో భీముడు రథం దిగాడు, అంతలో డేగాలా రివ్వున వచ్చిన సహదేవుడు భీముని తన రథంపై ఎక్కించుకుని, అడ్డువచ్చిన శల్యుని కుమారుని శిరస్సు తుంచాడు.అదిచూసిన శల్యుడు తనగధతో భీముని ఢికొన్నాడు.కొంత పోరాట అనంతరం మూర్చపోతున్న శల్యుని కృపుడు తన రథంపై దూరంగా తీసుకువెళ్లాడు.కొంతసేపటికి మరలా రణరంగంలో శల్యుడు ధర్మరాజును మూర్చాగతుడిని చేసాడు . భీమ,సాత్యకి,నకుల,సహదేవులు ఉమ్మడిగా ఎదుర్కొన్నారు,అందరిని తన అస్త్రాలతో శల్యుడు నిలువరించాడు.

అశ్వత్ధామ అర్జునునితో పోరాటం సాగించసాగాడు.అటుగా వచ్చిన

పాంచాల సుతుడు సురధుడు అశ్వత్ధామపై విల్లు ఎక్కుపెట్టాడు. మరుక్షణం అతని తలను నేలపై దొర్లించాడు అశ్వత్ధామ.శిఖండి అశ్వత్ధామను ఎదుర్కొన్నాడు.ధర్మరాజు శల్యుని తాకగా,కృపుని చేతిలో ధర్మరాజు సుతుడు మరణించాడు.అదిచూసి ధర్మరాజు కోపంతో ఊగిపోతూ శక్తి ఆయుధాన్ని శల్యునిపై ప్రయోగించగా అది శల్యుని గుండెను బద్దలు చేస్తూ తాకింది.క్షణలో ప్రాణాలు కోల్పోయాడు శల్యుడు.యిదిచూసిన సాల్వుడు తనఏనుగుతో పాండవ సేనలను తరమసాగాడు.క్రోధంతో సాత్యకి సాల్వుని తలతుంచాడు.సాత్యకిని ఎదుర్కోన్న కృతవర్మ ప్రాణాపాయ సితిలో ఉండగా కృపుడు రక్షించాడు. సహదేవునితో శకుని తన అశ్వక దళంతో ఢీకొన్నాడు.గాయపడిన సహదేవుని ధృష్టద్యుమ్నుడు ఆదుకున్నాడు.దొరికిన ప్రతి పాండవ వీరులను దుర్యోధనుడు చంపసాగాడు భీముడు దుర్యోధనుని ఎదుర్కొన్నాడు.తేరుకున్నసహదేవుడు శకుని,అతనికుమారుడు

ఉలూకుని ఎదుర్కొన్నాడు.భీమ, నకులులు సహదేవునికి బాసటగా వచ్చారు. ఓదివ్యాస్త్రంతో ఉలూకుని తల నేలపై దొర్లించాడు సహదేవుడు. అదిచూసిన శకుని సహదేవునిపై శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు,దాన్ని గాలిలోనే నిరోధించి ,మరోదివ్యాఅస్త్రంతో శకుని ని నేలకూల్చివిజయ సూచకంగా తనశంఖా రావంతో రణ భూమిని కంపింపచేసాడు సహదేముడు.అనంతరం...

అశ్వత్ఢామను సర్వసైన్యాధ్యక్షుడుగా నియమించాడు దుర్యోనుడు .కొద్దిపాటి కౌరవసేనలను అర్జునుడు తురమసాగాడు.ఆదృశ్యచూసిన దుర్యోధనుడు విషాధ వదనుడై యుధ్ధరంగంనుండి,ఏకాకిగా తన గధను భుజంపై ఉంచుకుని ఉత్తరదిశగా సాగి పోసాగాడు.

అక్కడకు వచ్చిన సంజయునిచూసి 'సంజయ మహాశయా యుధ్ధరంగం లో మనవాళ్లు ఇంకా ఎవరుఉన్నారు'అన్నాడు దుర్యోధనుడు. 'గధ్ధస్వరంతో, సంజయుడు 'రారాజా కృప అశ్వత్ధామ,కృతవర్మలు మాత్రమే మిగిలారు'అన్నాడు.'నేను ద్త్వెపాయనం అన్న నీటి మడుగులో 'జలస్ధంబన విద్య'తో కూర్చుండి అనంతరం పాండవులపై పగ తీర్చుకుంటానని నాతండ్రికి తెలియజేయండి' అని మడుగులోనికి వెళ్లిపోయాడు.అలానే యుధ్ధ రంగంలోనికి వెళ్లిన సంజయుడు,కృప అశ్వత్ధామ,కృతవర్మలకు దుర్యోధనుని విషయం వివరించి వెళ్లిపోయాడు. జాలరుల ద్వారా దుర్యోధనుని జాడతెలుసుకున్న పాండవులు ,బలరామ దేవుడు,శ్రీకృష్ణుడులతో,దుర్యోధనుడు దాగి ఉన్న నీటి మడుగు వద్దకు చేరి " మాపాండవులలో నీయిష్టం వచ్చిన ఒకరితో, యుద్ధంచేసి జయిస్తే నీకు రాజ్యం లభిస్తుంది యుధ్ధానికి రా'' ఆహ్వానించాడు ధర్మరాజు.

'' అలాగే నాకు సరిజోడు న్యాయంగా భీముడే '' అంటూ మడుగు వెలుపలకు వచ్చి భీముని తొ తలపడ్డాడు దుర్యోధనుడు. వారి గధా యుధ్ధం చూడటానికి బలరాముడు వచ్చాడు.

హోరా హారిగా సాగిన ఆపోరాటంలో ,భీముడు అధర్మంగా నాభి దిగువున గధతో మోదడంతో కూలిపోయాడు దుర్యోధనుడు.

అదిచూసి ఆగ్రహించిన బలరాముని ఉరడించి,కౌరవుల దురాగతాలు అన్ని తెలియజేసాడు శ్రీకృష్ణుడు.విరక్తిగా అక్కడనుండి వెళ్లి పోయాడు బలరాముడు.పాండవులు అంతా కృష్ణుని తోసహా ఓఘనది తీరం చేరుకున్నారు.

మరిన్ని కథలు

Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.