ఈసారి మాత్రం అనాటమీ లో నాకే ఎక్కువ మార్కులు వచ్చ్చాయి చూసావా.." అంటూ తన గుండ్రని కన్నులను తిప్పుతూ నవ్వుతూ పారిజాత తో అంది అరుణ. పారిజాతకు చిర్రున కోపం వచ్చింది .." సరేలే వచ్ఛే సంవత్సరం చూస్తావుగా ..నేను నీకంటే ఎక్కువ మార్కులే తెచ్చుకుంటా.." అంది ఎరుపెక్కిన బుగ్గలతో .." ఎందుకో అంత కోపం .." అంటూ గల గలా నవ్వింది అరుణ. పారిజాత అరుణ ఒకే క్లాసులో ఉండే వాళ్ళు స్కూల్లో . ఇద్దరూ మంచి స్నేహితులైనా ఇద్దరి ఆలోచనల్లో తేడా ..మాట తీరులో తేడా.. కానీ ఇద్దరూ మాత్రం బాగా చదివేవారు.. అందుకేనేమో ఇద్దరికీ ఒకే కాలేజిలో మెడిసిన్లో సీట్లు వచ్చ్చాయి.. పారిజాత చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది ..కానీ దుడుకు స్వభావం కలది. అరుణ సాధారణంగా ఉంటుంది కానీ చాలా నెమ్మది, ఓపిక ఎక్కువ. అందరితో మంచి స్నేహంగా ఉండేది. చూస్తుండగా ఇద్దరూ ఫైనల్ కు వచ్చారు. ఇద్దరూ హౌస్ సర్జరీ అయ్యాక ఎం బి బి ఎస్ డిగ్రీ అందుకున్నారు.
ఇక ప్రాక్టీస్ పెట్టడానికి హాస్పిటల్లో జాబ్ దొరకడానికి ఇద్దరూ కష్టపడుతున్నారు. పారిజాత కు ఎక్కవ మార్కులే వచ్చాయి. పారిజాత చాలా మంది ముందే చుట్టాలు డాక్టర్స్ అవ్వడంతో పారిజాతకు త్వరగానే జూనియర్ డాక్టర్ గా హాస్పిటల్ జాబ్ దొరికింది. కానీ అరుణ కు ఇలా ఎవ్వరూ లేక, సరైన గైడెన్స్ లేక తగిన ధన సహాయం లేక, కేవలం పేపర్ లో వచ్చే జాబ్స్ కు మాత్రమే అప్లై చేసేది. పారిజాత వాళ్ళు ధనవంతులు. వాళ్ళకి నాలుగైదు వ్యాపారాలున్నాయి. అందుకే పారిజాత చాలా దర్పంగా ఉండేది. తన మెడిసిన్ అయ్యాక తన ఫ్రెండ్స్ ను అందరినీ పిలిచి పెద్ద హోటల్ లో పార్టీ ఇచ్చింది. అరుణ మధ్యస్థ కుటుంబం నుండి వచ్చింది. అరుణ తండ్రి ఒక గుమాస్తా. అరుణకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు.. వారి బాధ్యత అంతా అరుణదే. దానితో తన చదువు ఫీజులు కట్టడానితే చూసుకోవాలది వచ్చ్చేది. పారిజాతకు అన్నీ త్వరగా సులభంగా దొరికేసరికి చాలా తాపీగా హాయిగా తన ఉద్యోగం చేసుకునేది. హాస్పిటల్కు కారులో వచ్చేది. ఇంటికి చేరగానే కుక్ వంట చేసి పెట్టేవాడు. అలా పారిజాతకు హాయిగా ఉండేది జీవితం. అరుణ ప్రతీదానికి ఇబ్బంది పడేది. డబ్బు సహాయం దగ్గర నుండి, ఉద్యోగం చేయడం, చెల్లెళ్లకు తమ్ముడికి చదువు చెప్పడం, తన తల్లికి చేదోడుగా ఉండడం ..ఇలా చాలా స్ట్రెస్ ఉండేది అరుణకు. ఇలా కష్టపడడంతో అరుణకు కష్టం అలవాటై పోయింది.
ఒకరోజు పారిజాత హాస్పిటల్ కు ఒక కష్టమైన కేసు పేషెంట్ వచ్చింది. దానికి కొంత రీసెర్చ్ చేసి, ఎక్కువ సేపు హాస్పిటల్ లో ఉండి, పేషెంట్ కు తగిన ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. పారిజాత దానికి చాలా గాభరాపడింది. ఏంచేయాలో తోచడం లేదు. ఎక్కువ సేపు పని చేయడం ఇష్టం లేదు. తన వల్ల కాదని అరుణకు రెఫెర్ చేసింది. అరుణ రాత్రిoబవళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసి తగినా వైద్యం చేసింది. ఇదంతా సీనియర్ డాక్టర్స్ గమనించారు. హాయిగా కారునుండి పారిజాత దిగగానే హాస్పిటల్ బోర్డు లో అరుణకు అవార్డు బెస్ట్ డాక్టర్ గా వచ్చిందని చూడగా పారిజాత కు కొద్దిగా ఈర్ష్య కలిగింది. ఆ కోపం కొద్దీ అరుణను కలిసి "నేను రెఫెర్ చేస్తేనే నీకు అవార్డు వచ్చింది కదూ ..లేకపోతె ఎలా వచ్చేది .." అంది గేలిగా.. అది విన్న మిగిలిన డాక్టర్ లు " అదేమీ కాదు..దాని వల్లనే కాఫు..అరుణ ఈ పేషెంట్ గురించి ఎంత కష్టపడిందో మేము చూసాము. అరుణ నిజంగా మంచి డాక్టర్. డాక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు ఓపిక, తెలివితేటలు అన్నీ ఉన్నాయి.. డాక్టర్లందరికీ అరుణ రోల్ మోడల్ ..” అనగా పారిజాత కు అప్పుడు అర్థం అయింది డాక్టర్ అంటే సేవ భావము తత్పరత ఉండాలని. డాక్టర్ లుగా తమ మనసులను సేవకు తగ్గట్టుగా తీర్చుకోవడం లోనే తమ గెలుపని తెలుసుకుంది. ఇలా ఆలోచించగానే తన బాల్య స్నేహితురాలు ఇంతగా తన వృత్తిలో అభివృద్ధి పొందినందుకు సంతోషపడి తృప్తిగా అరుణను అభినందించింది.

