ఆతప్పు నాదే !. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Aa tappu naade

చాకిచర్ల గ్రామంలో శివయ్య,మురళి లు పాఠశాల సెలవులు ఇవ్వడంతో తమ ఇంటిలోని పసువులను మేపుకు రావడానికి ఊరికి చేరువగా ఉన్న రైల్వే లైను వద్దకు వెళ్ళారు. వస్తు,వెళుతున్న రైళ్ళపై రాళ్ళు విసురుతూ

ఆనందించసాగాడు శివయ్య. ఆదే దారిన వెళుతున్న ధనుంజయ మాస్టారు రాళ్ళు విసురుతున్న శివయ్యను చూసి ' నాయనా శివయ్య ఇలారండి ' అన్నాడు .చెంతకు వచ్చిన మురళి,శివయ్య అనుచూస్తు ' రైల్వే ఆస్తులు ధ్వంస పరచడం, రైలు పట్టాలపై రాళ్ళు, ఇనుము తీగలు ఉంచడం సంఘ విద్రోహచర్యగా పరిగణించబడుతుంది. పట్టలపై మనం ఉంచిన రాళ్ళవలన రైలుకు ప్రమాదం జరిగితె ఎంతోమంది మరణిస్తారు. వేలకోట్ల నష్టంతోపాటు రైల్వేసంస్ధకు ఎంతో శ్రమించవసివస్తుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవలసింది ప్రభుత్వ ఆస్తులన్ని మనవే వాటివలన వచ్చే లాభ,నష్టాలు మనమే అనుభవిస్తాము. కొందరు సంఘవిద్రోహుల ప్రేరణతో రైళ్ళు,బసులు వంటి ప్రభుత్వ వాహనాలు తగులబెడుతుంటారు అది చాలా తప్పు కొందరు తమ స్వలాభం కొరకు చేసిన ఆ పనివలన సంభవించిన నష్టం మనమే భరించాలి తగులబడిన వాహనాలు కొత్తవి కొనుగోలు చేయలంటే పన్నులు,టిక్కెట్ల ధరలు పెంచడం వంటి వాటి ద్వారా తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాయి ప్రభుత్వాలు .ఇక్కడ తెలిసో,తెలియకో కొందరు చేసిన తప్పుడు పనికి అందరం శిక్ష అనుభవించవలసి వస్తుంది. అసలు ప్రభుత్వనికి ఆస్తి అంటూ ఉండదు ఉన్నదంతా ప్రజల సొమ్మే అంటే మనం పన్నుల రూపంలో చెల్లించే ధనంతోనే ఈవాహనాలు కొనుగోలు చెయడం, ప్రభుత్వాలు నడుస్తాయి. మరెన్నడూ ఇటువంటి తప్పుడు పనులు చేయకండి ' అని వెళ్ళిపోయాడు.

' ఒరే శివయ్య ఊరి నుండి మీనాన్న వచ్చి ఉంటాడు పదరా పోదాం ' అని తమ పసువులను తోలుకుని ఊరిలోనికి వెళ్ళరు. ఇల్లు చేరే సరికి శివయ్య తండ్రి తలకి కట్టుతో మంచంపై పడుకుని ఉన్నాడు. " నాన్నాగారు తలకు ఆ కట్టు ఏమిటి ?" అన్నాడు శివయ్య ఆదుర్దాగా. " ఉదయం నేను వస్తున్న రైలు మన ఊరి దగ్గరకు రాగానే ఎవరో ఆకతాయి పిల్లలు రాళ్ళువేసారు అది నాతలకు తగిలి గాయం అయింది " అన్నాడు. " నాన్నాగారు ఆతప్పు చేసింది నేనే క్షమించండి మరెన్నడు తప్పుడు పనులు చేయను ' పెద్దల మాట చద్ది మూట ' అన్ననిజం నా అనుభ పూర్వకంగా తెలుసుకున్నాను "అన్నాడు శివయ్య కాళ్ళపై ఉన్న శివయ్య లేవనెత్తి తల నిమురుతూ "నాయనా చేసిన తప్పు ఒప్పు కొని పశ్చాతాప పడటం ఉత్తమ లక్షణం " అని శివయ్యను దగ్గరగా తీసుకున్నాడు అతని తండ్రి.

మరిన్ని కథలు

Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ