
మధ్యాహ్నం 1 pm అయింది.. టీవీ సీరియల్ ముగించుకొని రుక్మిణి ఇంకా భోజనం చేద్దాం అని కిచెన్ వేపు వెళతోంది ఇంతలో
"ట్రింగ్ ట్రింగ్ " మంటూ 🤔 కాలింగ్ బెల్ మొగటం తో ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ లేచింది..
చూస్తే శ్రీవారు.. హృదయ్ గారు
"ఏంటండీ మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వచ్చేసారు పని ఎక్కువ లేదా?" అడిగింది రుక్మిణి...
" ఎం లేదు లే కానీ త్వరగా.. భోజనం పెట్టు.. సినిమా కి వెళ్దాం.. అన్నాడు హుషారు గా " అన్నాడు హృదయ్.. లాప్టాప్ బ్యాగ్ చేతికి ఇస్తూ
" ఏంటండీ విశేషం.. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఏంటి? "
"అబ్బా ఎక్కువ ప్రశ్నలు వేయక త్వరగా తెములు " అన్నాడు విసుగ్గా...
"ఏదైనా ఈయన గారి ఫేవరెట్ హీరో సినిమా కూడా ఏమి లేదే " అనుకుంటూ... బయలుదేరింది రుక్మిణి
పిల్లలు వస్తే కీస్ ఇవ్వమని చెప్పి పక్క ఇంట్లో కీస్ ఇచ్చి బయలుదేరారు
***** ***** ****
ఇద్దరు సినిమా హల్లో కూర్చున్నారు...
ఎప్పుడు లేంది... ఈలలు వేస్తూ చూస్తున్నారు అయన...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న రుక్మిణి... పది ఏళ్ళు గా చూస్తోంది... ఎప్పుడు లాప్టాప్ వైపు దిష్టి బొమ్మ లాగా ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చోటమే.... కానీ ఉలుకు పలుకు,మాట మంతి.,...తక్కువే హృదయ్ కి...ఇవాళ ఇంత ఆనందానికి కారణం ఏంటో అంతు పట్టట్లేదు మేడం కి...
మావయ్య వాళ్లేమన్నా ఊరుణించి వస్తున్నారా.. లేకపోతే చుట్టాలు ఎవరైనా పెళ్ళికి పిలిచారా...
లేకపోతే ఆ మాయదారి మేన మరదలు ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి కావ్వించిందా...
లేక ఏ పాత గర్ల్ ఫ్రెండ్ అయినా ఫేస్బుక్ లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా...
ఏంటో రకరకాల ఆలోచనలు రుక్మిణి ని అవహించాయి...
"హ హ హ... " స్క్రీన్ వైపు చూస్తూ మళ్ళీ గట్టిగా నవ్వాడు హృదయ్...
"ఏమిటి ఈయన వాలకం... నాకు మాత్రం ఒక క్వశ్చన్ పేపర్ వదిలేసి ఆయన మాత్రం హాయిగా నవ్వుకుంటున్నాడు...." అనుకుంది...
రుక్మిణికి బొత్తిగా సినిమా బుర్రలోకి ఎక్కట్లేదు...
సినిమా అయిపోయింది .....
సినిమా అయ్యాక.. ట్యాంక్ బండ్ అంతా నడిచారు... ఇద్దరు... హృదయ్ ఏవేవో చెప్తున్నాడు కానీ రుక్మిణి కి మాత్రం ఎం ఎక్కట్లేదు... పోనీ అడుగుదామా అంటే కసురు కుంటాడని మానుకుంది.... టైం ఆరు అయింది ఇంకా ఇంటికి వెళ్దామా అంటే లేదు పారడైస్ బిర్యానీ తిని వెళ్దాం అన్నాడు..
మరి పిల్లలు అంటే " సరే పార్సెల్ తీసుకెళ్దాం " అని పెద్ద ఫ్యామిలి ప్యాక్ తీసుకున్నాడు.,
******* *******
ఇంటికి వెళ్లేసరికి పిల్లలిద్దరు టీవీ చూస్తున్నారు... బిర్యానీ వాసన పిల్లలు వెంటనే ప్లేట్స్ తెచ్చుకుని వడ్డించుకున్నారు...
భోజనం అయ్యాక... బెదురూమ్ లో ఫోన్ లో ఏవో వీడియోలు చూసుకుంటున్నాడు... హృదయ్
ఇప్పటికైనా చెప్తారా మీ ఆనందానికి కారణం...
ఇప్పుడోద్దులే... రేపు పిల్లలు స్కూల్ కి వెళ్ళాక చెప్తా అని పడుకున్నాడు..
******* *******
తెల్లారి పడింటికి లేచి కాఫీ తెచ్చుకుని సోఫా లో పేపర్ చదువుతున్నాడు హృదయ్
"ఏంటి ఇంత లేట్ గా లేచారు... ఆఫీస్ కి సెలవ్ పెట్టారా " అడిగింది రుక్మిణి
"ఆ ఇక ఒకటే సెలవు "
"అర్ధం కాలేదు "
"ఆఫీస్ లో ప్రాజెక్ట్స్ లేవట రిజైన్ చేయమన్నారు... చేసాను..."
"ఏంటి రిజైన్ చేసారా... " అని అరిచినట్టుగా అడిగింది రుక్మిణి..
మళ్ళీ తానే అనింది
" మరి అంత తాపీగా ఎలా ఉన్నారు అండీ రాత్రి నుంచి..."
"మరి ఎం చేయమంటావ్...
ఇన్ ఫాక్ట్ నేనే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. పది ఏళ్ల నుంచి ఒకటే ఆఫీస్..
ఒకటే పని... ఒకే బాస్ చూసి చూసి బోర్ కొట్టేసింది... కాసేపు ఎక్కువ పడుకోవాలన్నా బాస్ పర్మిషన్... కాస్త లేట్ గా రావాలన్నా పర్మిషన్.... లీవ్ పెట్టాలన్నా పర్మిషన్.. పోనీ ఏమైనా జీతం పెంచుతాడా అంటే అది లేదు... ఎవరో పీక నొక్కుతున్నట్టు గా కలలు వచ్చేవి... ఇపుడు టోటల్ రిలాక్స్ అవుతాను... అలా వన్ మంత్ నాకు కావాల్సినంత నిద్ర పోతాను ఫస్ట్.. తర్వాతి సంగతి తర్వాత..."
"మరి జాబ్ లేకపోతే.."
"మరి మనిషే పొతే పర్లేదా...?"
" .. "
" విరామం లేకుండా బండి నడిపితే ఆక్సిడెంట్ ఎలా అవుతాయో... అలాగే విశ్రాంతి లేకుండా జాబ్ చేసినా ఉత్సాహం ఉండదు.....
నాకున్న అనుభవానికి ఖచ్చితంగా ఇంకో జాబ్ వస్తుంది లే కానీ.. నన్ను మళ్ళీ లంచ్ కి లేపు... "
అనేసి మళ్ళీ వెళ్ళి రూమ్ డోర్ వెస్కొని పడుకున్నాడు హృదయ్
---- సమాప్తం -----