దేశభక్తి - సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు

Deshabhakthi

“మీ అమాయకత్వానికి నా జోహార్లు. గొర్రె తోక బెత్తుడు చందంగా మీ సంపాదన. కానీ దేశభక్తి అనే భ్రమలో…’ “ఎంతసేపూ 'ఈ దేశం నాకేమిచ్చింది?' అంటావేమిటి? అసలు దేశానికి నువ్వేం చేసావని?..." “నాన్నా! ముందు అమ్మ అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. దబాయింపు వద్దు.” “ఐతే విను.

ధార్మిక కార్యక్రమాలకు నేను వ్యతిరేకం కాదు. అందుకే నేను ఎప్పుడూ మిమ్మల్ని…” “పుణ్యం, పురుషార్ధం అన్నారు విజ్ఞులు. ఉన్న దానిలో దానం చేయడం మన ధర్మం. మేం చేసేది అదే.కానీ మీ లాగా ప్రధానమంత్రి నిధికో, ప్రకృతి వైపరీత్య బాధితుల కోసమో చేసే ఆర్ధిక సహాయం ఒకటే అవుతాయా?” “ఏ లోతుపాతులు తెలుసని ఆలా అంటున్నావు? బాగా ఆలోచించి అప్పుడు మాటాడు…”

“అంత కోపం ఎందుకు నాన్నా! ఆలోచించే మాట్లాడుతున్నాం. కానీ నువ్వే…”

“కోపం కాదు. ఒక విషయం అడుగుతా. బాగా ఆలోచించి చెప్పండి” “సరే అడగండి.” “అగ్నివీర్ వీరుడు మురళి నాయక్ గారి వీర మరణం గురించి…” “విన్నాం. ఆ మహనీయుని దేశభక్తి నిరుపమానం. ఆయన ధైర్యసాహసాలు జాతికి ఆదర్శం…” “అవును. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ ఒక విషయం తెలుసు కోవాలి మీరు…” “ఏమిటా సంగతి? చెప్పండి నాన్నా! కొంపతీసి నన్ను కూడా వెళ్లి యుద్ధం చేయమంటారా?” “నువ్వెంతటి ఘనుడువో తెలియదా నాయనా. అంత అవసరం లేదు.” “మరి!” “కుటుంబం కంటే, ధనం కంటే, వ్యక్తిగత జీవితం కంటే దేశం గొప్పదని భావించి, ప్రాణత్యాగానికి సిద్ధ పడటం…” “నిస్సందేహంగా అసాధారణ విషయం. దేశభక్తి లేకపోవడం మహాపాపం” “నిజమే. ఇప్పుడు చెప్పండి, అంతటి త్యాగం మనం చేయలేము. ఉడతా భక్తిగా ఆర్థిక హార్దిక సహాయం చేయడం మన కనీస విధి కదా!....”

“నిజమే నాన్న గారు. మీ మనసు అర్థమయ్యింది.” “మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. మన్నించండి.” “అంతే కాదు నాన్న గారు, సైనిక సోదరులకి ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలి. ప్రజాసేవకులకు జీత భత్యాలు, పెన్షన్లు రద్దు చేయాలి.” “బాగుంది. మంచి సూచన.” “మేధావులు, ప్రజా సంఘాలు కూడా ఇలాంటి ప్రతి పాదనలు చేయాలి.” “భారత్ మాతాకి జై.” “భారత్ మాతాకి జై.” ********

మరిన్ని కథలు

Aapanna hastam
ఆపన్న హస్తం
- కందర్ప మూర్తి
Vekuva velugu
వేకువ వెలుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Nischitardham
నిశ్చితార్థం
- కొడవంటి ఉషా కుమారి
Taatayya
తాతయ్య
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Malle malle raakoodani roju
మళ్ళీ మళ్ళీ రాకూడని రోజు
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Viramam
విరామం.
- Harish Babu
Prema viluva
ప్రేమ విలువ
- Lakshmi Priyanka